Search
  • Follow NativePlanet
Share
» »రూ. 20లకు చికెన్ ఫ్రై, రూ.200 వసతి ఎక్కడో తెలుసా?

రూ. 20లకు చికెన్ ఫ్రై, రూ.200 వసతి ఎక్కడో తెలుసా?

భారత దేశంలో తక్కువ బడ్జెట్ లో చూడదగిన పర్యాటక ప్రాంతాలు.

టూర్. వెళ్లడానికి చాలా సరదాగానే ఉంటుంది. అయితే పర్యాటకం అంటేనే ఖర్చుతో కూడుకొన్నది. దీంతో చాలా మంది కొత్త ప్రదేశాలను చూడాలని ఉన్నా కూడా వెళ్లలేరు. అయితే సరిగా ప్రణాళిక రచించుకొంటే మాత్రం తక్కువ బడ్జెట్ లోనే భారత దేశంలో కొత్త ప్రదేశాలను చూసి రావచ్చు. అటువంటి లో బడ్జెట్ పర్యాటక ప్రాంతాలు మీ కోసం...

కసోల్

కసోల్

P.C: You Tube

హిమాలయాల రాష్ట్రంగా పేరుగాంచిన హిమాచల్ ప్రదేశ్ లో కసోల్ కూడా అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడ ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థతో నడిచే బస్సులో ప్రయాణం చేస్తే పది రుపాయలతోనే ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లవచ్చు.

కొడైకెనాల్

కొడైకెనాల్

P.C: You Tube

కొడైకెనాల్ లో స్ట్రీట్ ఫుడ్ చాలా రుచిగా ఉండటమే కాకుండా చాలా తక్కువ ధరకే లభిస్తుంది. రూ.20 పెడితే ఫ్రైడ్ చికెన్ మీ సొంతం. ఇక వసతి కూడా చాలా తక్కువ రూ.200 చెల్లించి ఒక రోజు మొత్తం మీరు స్టే చేయవచ్చు. ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణం ద్వారా రోజంతా మీ ఖర్చు రూ.100 మించదు.

గోవా స్టేట్‌ మ్యూజియం

గోవా స్టేట్‌ మ్యూజియం

P.C: You Tube

గోవాలోని బీచ్ లలో చాలా వరకూ ఉచిత ప్రవేశం ఉంటుంది. అంతేకాకుండా అక్కడ బీర్ చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. రూ.30 చెల్లించి మీరు బీర్ తో పాటు స్నాక్స్ ను కూడా పొందవచ్చు. అయితే గోవాలో వసతి కొంత ఖర్చుతో కూడుకొన్నదే.

జైపూర్

జైపూర్

P.C: You Tube

ఢిల్లీ నుంచి జైపూర్ కు తక్కువ ఖర్చులో వెళ్లిరావచ్చు. ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లేవరకూ మాత్రమే మీరు ప్రయాణ ఖర్చును భరించాల్సి ఉంటుంది. జైపూర్ లో చాలా కోటలు, ప్యాలెస్ లను ఉచితంగా చూడవచ్చు. ఒక్కరోజులో వెళ్లిరావడానికి ఖర్చు చాలా తక్కువ.

అలప్పే

అలప్పే

P.C: You Tube

అలప్పే అంటే గూడు పడవల్లోప్రయాణమే గుర్తుకు వస్తుంది. ఒక రాత్రి మొత్తం అందులో స్టే చేయాలంటే కనీసం రూ.3 వేలు చెల్లించుకోవాల్సిందే. అయితే మీలో బేరమాడే లక్షణం ఉంటే రూ.100 లకు కూడా గూడు పడవలు దొరుకుతాయి. ప్రయత్నించండి.

ఊటి

ఊటి

P.C: You Tube

ఊటిలో ప్రక`తిలో తిరగడానికి ఎక్కువ ఖర్చే చేయాల్సిన అవసరం లేదు. రూ.10 చెల్లించి ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఊటి అందాలను చూడవచ్చు. ఇక ఊటీ చాకొలేట్స్ చాలా తక్కువ ధరకే మనకు లభిస్తాయి. రూ.100 ఇస్తే బోలెడన్నీ చాకొలేట్ లు మీ సొంతం.

ఈటానగర్

ఈటానగర్

P.C: You Tube

ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ ఖర్చుతో పర్యాటకాన్ని ముగించాలనుకొనేవారు ఎక్కువగా ఈటానగర్ కు వెలుతారు. ఇక్క హోమ్ స్టేలు అందుబాటులో ఉంటాయి. ఈ హోమ్ స్టేలు రూ.70 నుంచి మొదలవుతాయి. అంతేకాకుండా వాటిని అద్దెకు ఇచ్చేవారు చాలా మర్యాదగా కూడా మసలుతారు.

పుష్కర్

పుష్కర్

P.C: You Tube

పుష్కర్ లో లస్సీ మొదలుకొని ఒంటె పై ప్రయాణం వరకూ ప్రతి ఒక్కటీ తక్కువ ధరకే లభిస్తుంది. అందువల్లే పుష్కర్ కు వెళ్లిన వారు చాలా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆనందాన్ని సొంతం చేసుకొంటారు. వసతి కూడా చాలా తక్కువ ధరకే లభిస్తుంది. రూ.250 మించి ఉండదు.

డార్జిలింగ్

డార్జిలింగ్

P.C: You Tube

డార్జిలింగ్ లో ఖరీదైన హోటల్స్ తో పాటు రూ.100 మాత్రమే వసూలు చేసే హోటల్స్, లాడ్జీలతో పాటు హోం స్టేలు కూడా ఉన్నాయి. ఇక ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డార్జిలింగ్ టీ రూ.10 లకే దొరుకుతుంది.

పాండిచ్చేరి

పాండిచ్చేరి

P.C: You Tube

పాండిచ్చేరి అంటేనే చాలా మంది ఖర్చు ఎక్కువ అని భయపడి పోతూ ఉంటారు. అయితే అక్కడ ఉన్న అరబిందో ఆశ్రమంలో ఉచితంగా వసతి లభిస్తుంది. అదేవిధంగా శాఖాహార భోజనం కూడా చాలా తక్కువధరకే లభిస్తుంది. దీంతో వసతి భోజనం ఖర్చుదాదాపు నిల్. ఇక చుట్టు పక్కల ప్రదేశాలను చూడటానికి సైకిల్ పై ఫ్రీగా తిరిగేసి రావచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X