Search
  • Follow NativePlanet
Share
» »ముంబై నుండి అద్భుత రోడ్ ట్రిప్ ప్రయాణాలు !

ముంబై నుండి అద్భుత రోడ్ ట్రిప్ ప్రయాణాలు !

By Mohammad

రోడ్డు ప్రయాణాలు మనసుకు ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని ఒకేసారి ఇస్తాయి. ఏదైనా సెలవులు లేదా వీకెండ్ లు వస్తే ఎక్కడికైనా వెళ్ళి హాయిగా గడపాలనుకొనే ఎవ్వరికైనా ముంబై రోడ్ ట్రిప్ ప్రయాణాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

ప్రస్తుతం ఇక్కడ చెప్పబడుతున్న ప్రదేశాలన్నీ ముంబై నుండి ప్రసిద్ధి చెందిన రోడ్డు ప్రయాణాలే. పర్యాటకులు ఈ రోడ్ ప్రయాణాల సమయంలో ఎంతో సంతోషాన్ని అనుభవిస్తారు. అక్కడి దారి పొడవునా కనిపించే వివిధ రకాల అంశాలు పర్యాటకుల మతి పోగొడుతాయి.

ఇది కూడా చదవండి : ముంబై లో ఒక్కరోజు పర్యటన !

ముంబై నుండి ప్రసిద్ధి చెందిన రోడ్డు ప్రయాణాలు లోనవాలా, మతేరన్, పూణే మరియు ఆలీబాగ్. ఇవి కొన్ని మాత్రమే ... ఇంకా అనేక రోడ్డు ప్రయాణాలు ఎన్నో ముంబై తో ముడిపడి ఉన్నాయి. ఈ ప్రదేశాల యొక్క అద్వితీయమైన అందాలకు అక్కడి స్థానికులు, వచ్చి పోయే పర్యాటకులు మంత్ర ముగ్ధులైపోతున్నారు.

ఈ ప్రదేశాలకు మీరు స్నేహితులతో గాని లేదా ఒంటరిగా గాని లేదా కుటుంబ సభ్యులతో గాని లేక మీకిష్టమైన వారితో గాని బైక్ లేదా కారు వంటి సొంత వాహనాల్లో ప్రయాణిస్తే బాగుంటుంది. లేకపోతే ఏదేని క్యాబ్ లేదా ట్యాక్సీ అద్దెకు తీసుకొని ప్రయాణించిన ఈ ప్రదేశ అందాలనూ ఆస్వాదించవచ్చు.

ముంబై నుండి అద్భుత రోడ్ ట్రిప్ ప్రయాణాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారా ??

మతేరన్

మతేరన్

దూరం : 83 కిలోమీటర్లు (సిఒన్ - పన్వేల్ ఎక్స్‌ప్రెస్ వే)
అనువైన సమయం : అక్టోబర్ నుండి ఫిబ్రవరిమతేరన్ లో పర్యాటకులను

ఆకట్టుకొనే అనేక ప్రాకృతిక దృశ్యాలు ఉన్నాయి. ముంబై నుండి మతేరన్ కు వెళ్లే మార్గం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.

ఈ హిల్ స్టేషన్ లో ఎటువంటి వాహనాలను అనుమతించరు అంబులెన్స్ తప్ప. గుర్రపు స్వారీ లేదా చేతి తో లాగే రిక్షాలు మరియు జలపాతం వంటివి ఇక్కడి మైమరిపించే అనుభూతులు.

చిత్ర కృప : Omkar A Kamale

ఆలీ బాగ్

ఆలీ బాగ్

దూరం : 96 కిలోమీటర్లు( జాతీయ రహదారి 66)
సందర్శించు సమయం : నవంబర్ నుండి జూలై

ఆలీ బాగ్ పడమటి కనుమల్లో విస్తరించి ఉన్న ఒక బీచ్ పట్టణం. ముంబై నుండి ఆలీ బాగ్ చేరుకోవటానికి పట్టే సమయం 3 గంటలు.

సముద్ర తీర బీచ్ లు, ఆలయాలు, మఠాలు మరియు కోటలు ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి.

చిత్ర కృప : Ninad Chaudhari

మల్షెజ్ ఘాట్

మల్షెజ్ ఘాట్

దూరం : 127 కిలోమీటర్లు (జాతీయ రహదారి 3 మరియు జాతీయ రహదారి 333)

సందర్శించు సమయం : ఆగస్ట్ నుండి ఫిబ్రవరి

మల్షెజ్ ఘాట్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి, వర్షాకాలంలో పచ్చని ప్రకృతితో మరింత అందంగా కనిపిస్తుంది. పశ్చిమ కనుమల దీవెనతో వర్ధిళ్లుతున్న ఈ పర్వత ప్రాంతాన్ని చూసేందుకు దేశ, విదేశాల నుండి పర్యాటకులు వస్తుంటారు.

ముంబై నుండి మల్షెజ్ ఘాట్ ఒక ప్రసిద్ధి చెందిన రోడ్ ట్రిప్ ప్రయాణం. ఇక్కడ చేయవలసినవి ట్రెక్కింగ్ మరియు పక్షులను తిలకించడం లేదా అందమైన ఫోటోలు తీయటం.

చిత్ర కృప : Elroy Serrao

లోనావాలా

లోనావాలా

దూరం : 83 కిలోమీటర్లు( ముంబై - పూణే ఎక్స్‌ప్రెస్ వే)
సందర్శించు సమయం : జూన్ నుండి ఫిబ్రవరి

ఖండాలా మరియు లోనావాలా కు ప్రయాణమంటే ముంబై నగర వాసులు పడిచస్తారు. అక్కడి ప్రకృతి అందాలను చూడటానికి రెండు కళ్ళూ చాలవనుకోండి. ఎటు చూసిన చుట్టూ పచ్చదనమే కనిపిస్తుంది. కొండలు, గుట్టలు, పర్వతాలు అన్ని పచ్చదనంతో కప్పబడి ఉంటాయి.

ముంబై నుండి ఖండాల మరియు లోనావాలా కు చేరుకోవటానికి పట్టే సమయం 2 గంటలు. దారి పొడవునా ఎన్నో ఆసక్తి కలిగించే చిలిపి చిలిపి సన్నివేశాలు మీ కంట పడతాయి. ఒకసారి వెళ్ళి ప్రయతించండి.

చిత్ర కృప : Soham Banerjee

కౌస్ మైదానం మరియు సరస్సు

కౌస్ మైదానం మరియు సరస్సు

దూరం : 279 కిలోమీటర్లు (ముంబై - పూణే ఎక్స్‌ప్రెస్ వే మరియు జాతీయ రహదారి 4)
సందర్శించు సమయం : ఆగస్ట్ మరియు సెప్టెంబర్

భారత దేశంలో ఉన్న పూల లోయల్లో మరొకటి సతారా సమీపంలో ఉన్న కౌస్ మైదానం. ఈ అందమైన ప్రదేశం వరల్డ్ హేరిటేజ్ సైట్ గా ప్రకటించబడింది. ఋతుపవనాల కాలంలో, రంగురంగుల పూల సువాసనలు ఈ వాలీ అంతటా వ్యాపిస్తాయి.

ముంబై నుండి కౌస్ మైదానం కు వెళ్లే అద్భుత రోడ్ ట్రిప్ ప్రయాణంలో మీరు తప్పక సంతోషాన్ని పొందుతారు.

చిత్ర కృప : Ankur P

గణపతిపూలే

గణపతిపూలే

దూరం : 331 కిలోమీటర్లు (జాతీయ రహదారి 66)
సందర్శించు సమయం : నవంబర్ నుండి ఫిబ్రవరి

గణపతి పూలే కొంకణ్ తీరాన గల ఒక బీచ్ పట్టణం. ఈ ప్రదేశంలో తక్కువ జనం ఉంటారు కనుక ముంబై నుండి వారాంతంలో ప్రయాణించటానికి అనుకూలంగా ఉంటుంది.

సముద్రం ఒడ్డున ఉన్న తీరం లో విశ్రాంతి తీసుకోవటానికి అనేక రిశార్ట్ లు ఉన్నాయి. నాన్ వెజ్ పర్యాటకులు రుచికరమైన సముద్రపు ఆహారాలను భుజించవచ్చు.

చిత్ర కృప : vivek Joshi

గోవా

గోవా

దూరం : 609 కిలోమీటర్లు (జాతీయ రహదారి 4)
సందర్శించు సమయం : అక్టోబర్ నుండి ఏప్రిల్గోవా గురించి మీ అందరికీ తెలిసిందే ..! ఇక్కడ బీచ్ లు, సముద్రపు ఆహారాలు, చవకైన అల్కాహాలు మరియు విదేశీ వనితలు ఆకర్షణలు. ముంబై నుండి గోవా రోడ్ ట్రిప్ ను అస్సలు వదులుకోకూడదు.

దారి పొడవునా పశ్చిమ కనుమల అందాలు, జలపాతాలు, సంప్రదాయ దుస్తుల్లో స్థానికులు, ఆలయాలు వంటివి గమనించదగ్గవి.

ఇది కూడా చదవండి : గోవా ... నీ అందం ఆదరహో ..!

చిత్ర కృప : amruthp09

పూణే

పూణే

దూరం : 148 (ముంబై నుండి పూణే ఎక్స్‌ప్రెస్ వే)
సందర్శించు సమయం : అక్టోబర్ నుండి ఫిబ్రవరి

పూణే లో ప్రముఖంగా సందర్శించవలసినవి కోటలు, పర్వత ప్రాంతాలు, మత ప్రదేశాలు మొదలుగునవి.

పూణే లోని చాలా వరకు ప్రదేశాలు కాలాల ప్రకారం చూడాల్సినవి ఉన్నాయి. కొన్నేమో వర్షాకాలం, ఇంకొన్నేమో రుతుపవన కాలం మరోకొన్నేమో చలికాలం, వేసవి కాలం లో చూసేవి గా ఉన్నాయి. ముంబై నుండి ఒక్కరోజులో అలా వెళ్ళి ఇలా వచ్చే విధంగా ఉండే పూణే లో కొన్ని ప్రసిద్ద ప్రదేశాలను తప్పక సందర్శించాలి.

ఇది కూడా చదవండి : పూణే లో సందర్శించవలసిన ఆకర్షణలు !

చిత్ర కృప : Mukul2u

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X