Search
  • Follow NativePlanet
Share
» »'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

By Venkatakarunasri

నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట చెప్పడానికి ముందు, మీ పరిసరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఆ పరిసరాలే మిమ్మల్ని ప్రేమలో ముందుకు నడిపిస్తాయి, కిందకు దిగజారుస్తాయి కూడా. రొటీన్ ప్రదేశాల్లో చెప్పే ఐ లవ్ యూ అన్న మాట ఏదైనా మంచి ప్రదేశంలో చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అదే దో ఓ సినిమా ఆండీ ... ఆ గుర్తిచ్చింది నువ్వే ... నువ్వే అనుకుంటా ముంబై కి ఫ్లైట్ ఎక్కి, హీరొ హీరోయిన్ లు ముంబై బీచ్ లో రెండు కుర్చీలు వేసుకొని మూన్ లైట్ మధ్యలో కళ్ళకు ఆ ఇసుక, నీటి సవ్వడి తగులుతూ ప్రశాంత వాతావరణం మధ్యలో, వెంట తీసుకొచ్చిన క్యాండిల్స్ వెలిగించి ఆ క్షణంలో ఐ లవ్ యూ చెప్తే ఎలా ఉంటుంది గొప్ప థ్రిల్లింగ్ గా ఉంటుంది కదూ ..! మరి అలా చెప్తే ఆ ప్రేయసి లేదా ప్రియుడు ఒప్పుకుంటారా అనేగా మీ సందేశం. ఇక్కడ మీకు చెప్పబోతున్న ప్రదేశాలకు వెళ్లండి ఆ లవర్ నుండి పాజిటివ్ సమాధానం పొంది ఆనందించండి. మరి మనసులో ఉన్న ఆ తీయటి మాటను తెలిపే ప్రదేశాల జాబితాను పరిశీలించండి.

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

గోవా

ఒకవేళ మీ లవర్ కు అడ్వెంచర్ , బీచ్ వంటివి ఇష్టమైతే అందుకు గోవా సరైన ప్రదేశం. ఐ లవ్ యూ అన్న మాట తో అందమైన గోవా నుండి మీ ప్రేమ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇక్కడ ప్రశాంతమైన, ఏకాంతమైన బీచ్ లు చాలానే ఉన్నాయి. కనుక మీ లవర్ మిమ్మల్ని తప్పక ఇష్టపడుతుంది.

చిత్ర కృప : Ian D. Keating

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

ఊటీ

ఊటీ అందరికి హనీమూన్ ప్రదేశం గా మాత్రమే తెలుసు కానీ ఇదొక రొమాంటిక్ ప్రదేశం. ఉదయంవేళ పొగ మంచు కప్పుకొన్న ప్రదేశాల్లో ఇదొకటి. ఇక్కడ ఉన్న అందమైన రొమాంటిక్ స్థలాల్లో ఐ లవ్ యూ అన్న మాట చెబుతానంటే ఎవ్వరైనా ఒప్పుకోకుండా ఉంటారా ? సరస్సులు, గులాబీ తోటలు, తెయాకు తోటలు, పార్క్ లు, బొటానికల్ గార్డెన్ లు ఇలా ఎన్నో స్థలాలు ఇక్కడ ఉన్నాయి.

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

లక్షద్వీప్

లక్షద్వీప్ లో రొమాంటిక్ మూడ్ ను కలిగించే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. బీచ్ లని, ద్వీపాలని ఇలా ఎన్నో ఇక్కడ ఉన్నాయి. మీకిష్టమైన ద్వీపంలో గాని లేదా బీచ్ వద్ద కి గాని వెళ్ళి సినిమా స్టైల్ లో మోకాళ్ళ మీద కూర్చొని ఐ లవ్ యూ చెబుతూ వెంట తీసుకెళ్లిన గులాబీ పూవును అందించండి. ఆ లవర్ ఎంతో ఆనందపడిపోతుంది.

చిత్ర కృప : Aks

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

ఖజురహో

ఖజురహో ప్రేమకు నిలువెత్తు సాక్ష్యాలు, నిదర్శనాలు. అక్కడి ప్రదేశ అందాలను వార్ణించలేనివి. ఆలయ రాతి గోడలపై చెక్కిన ప్రేమ గాధలు మీ మనసులను ఆనందింపజేస్తాయి. మీ లవ్ ప్రపోజల్ పెట్టేందుకు ఇదొక సరైన ప్రదేశం.

చిత్ర కృప : Esther Moved to Ipernity

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

శ్రీనగర్

శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజధాని. ఇదొక అందమైన, శృంగార భరితమైన ప్రదేశం. ఎప్పటినుండో మనసులో దాగున్న ఐ లవ్ యూ అన్న మాట చెప్పటానికి ఈ ప్రదేశం అనువైనది. ఇక్కడి సరస్సుల్లో బోట్ లో వెళుతూ, షికార్లు కొట్టుతూ ఆ మాట వెల్లడించండి. మంచి సమాధానం పొంది మాధురానుభూతుల్ని ఆస్వాదించండి.

చిత్ర కృప : Vinayaraj

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

హేవ్ లాక్ ఐలాండ్

హేవ్ లాక్ ఐ లాండ్ భూలోక స్వర్గాన్ని తలపిస్తుంది. ఇక్కడున్న 5 బీచ్ లు గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉండి, ఏకాంతంగా ఉంటాయి. మీరు ఏదేని బీచ్ బీచ్ వద్దకి వెళ్ళి ఐ లవ్ యూ చెప్తే ఆమె అక్కడే మిమ్మల్ని కౌగిలించుకుంటుంది.

చిత్ర కృప : Vikramjit Kakati

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

పూవర్ ద్వీపం

పూవర్ తిరువనంతపురం జిల్లా కు చెందిన చిన్న గ్రామం. చూడటానికి ద్వీపంలా ఉంటుందనుకోండి. ఇక్కడి బ్యాక్ వాటర్స్ లో బోట్ షికారు చేస్తూ, చుట్టూ ఉన్న ప్రకృతిని తనివితీరా ఎంజాయ్ చేస్తూ ఐ లవ్ యూ చెప్తే ఆ లవర్ ఒప్పుకోకతీరదు. అన్నట్టు ఇక్కడ హౌస్ బోట్స్ అనగా పడవ ఇల్లు లు కూడా ఉంటాయి. సమయం ఉంటే వాటిలో ఒకరోజు గడిపేయండి.

చిత్ర కృప : amudhahariharan

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్

ఒకవేళ మీ లవర్ జంతువులను ఇష్టపడేవారైతే బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్ సరైన ప్రదేశం. సుమారు 400 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ పార్క్ మధ్య ప్రదేశ్ లో ఉన్నది. వివిధ జంతువుల మధ్య కలియతిరుగుతూ, వాటిని చూస్తూ మీ లవర్ కు ఐ లవ్ యూ చెప్పేయండి. మీ లవర్ మిమ్మల్ని తప్పక ఇష్టపడుతుంది.

చిత్ర కృప : Trekpedition.Com

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

జైసల్మీర్

బంగారు నగరం గా పేరుపొందిన జైసల్మీర్ ధార్ ఎడారి మధ్యలో ఉన్నది. ఇక్కడి ఎడారి ఇసుక తిన్నెలపై ఫిబ్రవరి మాసంలో జరిగే ఉత్సవాల సమయంలో స్థానిక గిరిజన తెగవారు సంగీత నృత్యలు ప్రదర్శిస్తారు. ఆ సమయంలో మీరు మీ లవర్ తో అక్కడ ఉండి, ఐ లవ్ యూ చెబుతె ఎందుకు సరేఅనదు. ఇసుక తిన్నెలపై గుడారాలు, రాత్రిళ్ళు చలి మంటలు, ఒంటెల మీద ప్రయాణాలు ఇలా ఎన్నో ఇక్కడ ఉన్నాయి.

చిత్ర కృప : dinesh babu

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

చెంబర శిఖరం, కలపెట్ట

సముద్ర మట్టానికి 2100 మీటర్ల ఎత్తున ఉన్న చెంబర శిఖరం వయనాడ్ జిల్లాల్లో కలదు. శిఖరానికి సమీపాన ఉన్న పట్టణం కలపెట్ట. శిఖరం పైన లవ్ గుర్తు తో ఉన్న సరస్సు వద్దకు వెళ్ళి ఐ లవ్ యూ అన్న తీయని మాట చెబితే ఆ లవర్ కూడా అంతే తీయగా సమాధానం చెబుతారు. ఇక్కడ వసతి కొరకై గుడారాలు కూడా ఉన్నాయి.

చిత్ర కృప : Tanuja R Y

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

సిమ్లా

సిమ్లా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని. సిమ్లా యాపిల్ పండ్లు ఎంత తీయగా ఉంటాయో ఐ లవ్ యూ అన్న మాట చెప్పిన తర్వాత వచ్చే సమాధానం అంతే తీయగా ఉంటుంది. ఇక్కడి మంచు ప్రాంతాల్లో మంచు ముద్దలు ఒకరిపై ఒకరు వేసుకొని ఆనందంగా గడిపెయ్యవచ్చు.

చిత్ర కృప : Rajeev Moudgil

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

కూనూర్

కూనూర్ లో వాతావరణం మనల్ని తక్షణం ప్రేమలో పడేటట్లు చేస్తుంది. మరి అలాంటి ప్రదేశంలో ఐ లవ్ యూ చెప్పాక ఊరుకుంటారా ?? ఎగిరి గంతెయ్యరు. ఇది సముద్రమట్టానికి 1850 మీ. ఎత్తున ఉండి, మీ ప్రేమ జ్ఞాపకాలకు తీపి గుర్తుగా ఉండబోతుంది.

చిత్ర కృప : Thangaraj Kumaravel

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

నైనిటాల్

నైనిటాల్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని, కుమావోస్ పర్వతాల మధ్యలో కలదు. నైనిటాల్ లో సరస్సులు ఎక్కువ. ఆ సరస్సు వద్ద చెప్పే ఐ లవ్ యూ అన్న మాట, ఎదుటివారి మనస్సును ఒప్పించకమానదు. సమయముంటే పక్కనే ఉన్న శిఖరాలను, తోటలను చూడవచ్చు.

చిత్ర కృప : sandeepachetan.com travel photography

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

జిరొ

జిరొ లోయ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. లోయలో ప్రతి అంశమూ సంతోషకరంగానే ఉంటుంది. ఐ లవ్ అన్న మాట చెప్పిన తరువాత వచ్చే జవాబూ సంతోషంగా ఉంటుంది. సాహస క్రీడలను ఇష్టపడే వారైతే అనేక క్రీడల్లో పాల్గొనవచ్చు కూడా.

చిత్ర కృప : Arpan Kalita

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

'ఐ లవ్ యూ' చెప్పే ప్రదేశాలు !

పెల్లింగ్

సముద్రమట్టానికి 2150 మీటర్ల ఎత్తున ఉన్న పెల్లింగ్ పట్టణం సిక్కిం రాష్ట్రంలో కలదు. ఈ కొండ పర్వతాల నుండి మంచుతో కప్పబడిన పర్వత దృశ్యాలను చూసి ఆనందించవచ్చు. ఆ సమయంలో మంచుతో చేసిన బొమ్మను బహుమతిగా ఇస్తూ ఐ లవ్ యూ చెబితే తప్పక అంగీకరిస్తుంది.

చిత్ర కృప : Heleen van Duin

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X