Search
  • Follow NativePlanet
Share
» »మీ స్నేహితులతో కలిసి ఇక్కడ ట్రెక్కింగ్ వెళ్లారా?

మీ స్నేహితులతో కలిసి ఇక్కడ ట్రెక్కింగ్ వెళ్లారా?

భారత దేశంలో స్నేహితులతో కలిసి సందర్శించదగిన పర్యాటక ప్రాంతాల జాబితా ఇదే.

భారత దేశంలో పర్యాటక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క పర్యాటక ప్రదేశాన్ని కొందిరితో కలిసి సందర్శించడమే ఉత్తమం. ముఖ్యంగా ఉద్యానవనాలాంటివి మన పిల్లలతో కలిసి సందర్శిస్తే ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా దేవలయాలను మనం కుటుంబ పెద్దలతో కలిసి వెళ్లాలని అంటారు. ఇక బీచ్‌లు చిన్నచిన్న పర్వతాలు, అటవీ ప్రాంతాలైతే మన జీవిత భాగస్వామి లేదా స్నేహితులతో వెళ్లడం ఉత్తమం. ఈ నేపథ్యంలో స్నేహితులతో కలిసి సందర్శించడానికి అత్యంత అనుకూలమైన పర్యాటక ప్రాంతాల వివరాలు మీ కోసం....

చందార్ ట్రెక్

చందార్ ట్రెక్

P.C: You Tube

ట్రెక్కింగ్ అంటే ప్రస్తుతం యువతకు అమితమైన ఆసక్తి. ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది తమ స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ వెలుతూ ఉంటారు. సాధారణంగా అటవీ ప్రాంతం లేదా చిన్న చిన్న గుట్టల పైకి ఈ ట్రెక్కింగ్ సాగుతూ ఉంటుంది. అయితే గడ్గకట్టిన నది పై మీకు మీ స్నేహితలతో కలిసి ట్రెక్కింగ్ చేయాలనుకొంటే మాత్రం చందార్ వెళ్లాల్సిందే. లడక్‌లోని జస్కార్ వ్యాలీ గుండా ట్రెక్ సాగుతుంది.

మనాలీ-లేహ్ రోడ్ ట్రిప్

మనాలీ-లేహ్ రోడ్ ట్రిప్

P.C: You Tube

రోడ్ ట్రిప్పులంటే ఇష్టపడేవారికి మనాలి-లేహ్ మార్గం అత్యుత్తమ మార్గం. ఈ మనాలి-లేహ్ మార్గాన్ని మక్కా ఆఫ్ ఆల్ రోడ్ ట్రిప్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. స్నేహితులతో కలిసి ఈ మనాలీ-లేహ్ రోడ్ పై జమ్ అంటు ముందుకు సాగడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ఈ మార్గంలో కొత్త స్నేహితులు కూడా ఏర్పడుతారు.

రిషికేష్

రిషికేష్

P.C: You Tube

స్నేహితులతో కలిసి సందర్శించాల్సిన పర్యాటక కేంద్రాల్లో రిషికేష్ కూడా ఒకటి. ఇది ఆధ్యాత్మిక ప్రధాన పర్యాటక కేంద్రమే కాకుండా సహసక్రీడలకు కేంద్రం కూడా. ముఖ్యంగా ట్రెక్కింగ్, కయాకింగ్ తదితర ఎన్నో అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు కేరాఫ్ ఈ రిషికేష్. అందుకే ఇక్కడకు విదేశీ యువత కూడా ఎక్కువగా వస్తుంటారు.

స్పీటి వ్యాలీ

స్పీటి వ్యాలీ

P.C: You Tube

స్పిరిట్ వ్యాలీని లిటిల్ టిబెట్ అని కూడా పిలుస్తారు. ఈ స్పిటిల్ వ్యాలీ టిబెట్, ఇండియా మధ్య ఉంది. స్పిటీ అంటే మధ్యన ఉన్న ప్రదేశం అని అర్థం. హిమాచల్ ప్రదేశ్‌కు ఈశాన్య దిశలో ఈ స్పీటి వ్యాలీ ఉంటుంది.

రతమ్‌బోర్

రతమ్‌బోర్

P.C: You Tube

మీరు మీ స్నేహితులు ప్రక`తి ప్రేమికులు అయితే ఈ రతమ్‌బోర్ మీకు తప్పక నచ్చుతుంది. రతమ్‌బోర్ పులుల సంరక్షణ జాతీయ అభయారణ్యం. ఇక్కడ పులులతో పాటు అంతరించే స్థితికి చేరుకొన్న ఎన్నో జంతువులను, పక్షులను మనం చూడొచ్చు. అందుకే ప్రతి వీకెండ్‌కు ెంతోమంది స్నేహితులు ఇక్కడకు గుంపులు గుంపులగా వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X