Search
  • Follow NativePlanet
Share
» »భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భారత దేశపు దక్షిణ భాగం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఒక చిన్న గ్రామం. ఈ పట్టణం హైదరాబాద్ నగరానికి సుమారు 309 కి. మీ.ల దూరం లో వుంటుంది.

By Venkatakarunasri

భారత దేశపు దక్షిణ భాగం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఒక చిన్న గ్రామం. ఈ పట్టణం హైదరాబాద్ నగరానికి సుమారు 309 కి. మీ.ల దూరం లో వుంటుంది. భారత దేశం లో ఇది ఈశాన్య భాగం మరియు గోదావరి నది ఒడ్డున కలదు. ఈ ప్రాంతం శ్రీరాముడు మరియు ఆయన సాధ్వి సీతా నివసించిన ప్రదేశం గా దెస వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇది శ్రీరాముడు నివసించిన ప్రదేశం కనుక హిందూ యాత్రికులు దీనిని ఎంతో పవిత్ర భూమిగా భావిస్తారు. రాముడి పేరు చెపితే చాలు ఆంధ్రులకు భద్రాచలం గుర్తుకు వస్తుంది. ఈ పట్టణానికి భద్రాచలం అనే పేరు భద్ర గిరి నుండి వచ్చింది. భద్ర అంటే ఒక వరం కారణంగా మేరు కు మేనకకు పుట్టిన బిడ్డ అని చెపుతారు. రాముడి భక్తులకు అయోధ్య తర్వాత భద్రాచలం రెండవ స్థలం గా భావిస్తారు. లంక లో రావణుడిని వధించిన తర్వాత రాముడు చాలా కాలం పరిపాలన చేసాడు. భద్రాచలం గురించిన ఇతిహాస గాధలు భద్రాచలం ఒకప్పుడు దండకారణ్యంలో భాగంగా వుండేది.

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

రాముడు తన వనవాసం సమయంలో సీతా మరియు లక్ష్మణుల తో కలిసి ఇక్కడ కొంత కాలం నివసించాడు. వారు నివసించిన ప్రదేశం దేవాలయం నుండి సుమారు 32 కి. మీ. ల దూరం లో వుంటుంది. శ్రీరాముడు ఇక్కడ తన కుటుంబం కొరకు నివాసాన్ని నిర్మించాడు. ఆయన నిర్మించిన గుడిసె నుండే రావణుడు సీత ని లంక కు అపహరించుకు పోయాడని చెపుతారు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

మరో కధ గా విష్ణు భక్తుడైన భద్రుడు ఒక రుషి. రాముడు అంటే తెగ ఇష్టపడతాడు. రాముడు లంక కు వెళ్ళే సమయం లో ఈ రుషి ని కలిసి ఆయన నుండి ఆతిధ్యం పొందేందుకు తాను మరల సీత తో తిరిగి వస్తానని చెపుతాడు. కాని ఆయన తిరిగి రాక పోవటం తో భద్రుడు అనే ఆ రుషి ఎంతో కాలం ఎదురు చూస్తాడు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

తన భక్తుడు భద్రుడి ఎదురు తేన్నులకు మెచ్చిన విష్ణుమూర్తి, తానే రాముడి అవతారం లో , సీతా మరియు లక్ష్మణుడి తో కలసి దర్శనమిస్తాడు. ఈ సంఘటన రామ రాజ్యం బుగిసిన చాలా కాలానికి జరుగుతుంది. రాముడి భక్తుడైన భద్రుడి పేరుపై పట్టణం భద్రాచలం గా పిలువబడుతుంది.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

మరో కధగా శ్రీరాముడు పాకాల దమ్మక్క అనే మహిళకు కలలలో కనపడి, భద్రగిరి కొండల పై విగ్రహాలు కలవని చెప్పాడని, మరుసటి రోజు ఆమె ఆ కొండపై కొన్ని విగ్రహాలను చూచిందని, వాటి తో ఆమె ఒక చిన్న దేవాలయం ఏర్పాటు చేసి ఆ విగ్రహాలని పూజించిందని, తర్వాతి కాలం లో ఆ ప్రదేశం భద్రాచలం గా పిలువబడుతూవే లాది భక్తుల చే పూజించాబడుతూ వారి పాపాలని నసింప చేస్తోందని చెపుతారు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

ప్రకృతి దృశ్యాల మధురానుభూతులు భద్రాచలం పర్యాటకులకు ఎన్నో సుందర దృశ్యాల అనుభవాలని కలిగిస్తుంది. ప్రధానంగా, ఇక్కడ జటాయు పక్క, పర్ణశాల, దుమ్ముగూడెం , గుణదల కలవు. రెండు ఖ్యాతి గాంచిన దేవాలయాలు అంటే శ్రీ సీతా రామచంద్ర స్వామి గుడి మరియు భద్రాచల రాముడి గుడి కలవు. ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. రోడ్డు లేదా రైలు మార్గాలలో భద్రాచలం తేలికగా చేరవచ్చు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

ప్రపంచంలో ఏ రామాలయంలోనూ లేనివిధంగా భద్రాచలంలో శ్రీరామచంద్రుని యొక్క దివ్యవిగ్రహమూర్తి వుంటుంది. భద్రాద్రిలో భక్తులు స్వామిని దర్శించిన ఆనందంలో ఈ విషయాన్ని గుర్తించకపోవచ్చును. త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేసినప్పుడు పర్ణశాలలో వుంటాడు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

అక్కడే రావణాసురుడు సీతమ్మవారిని అపహరిస్తాడు.మరి ఆ సమయంలో భద్రుడు అనే మహర్షి ఆ కొండపై తపస్సుచేస్తూ వుంటాడు.అప్పుడు భద్రుడు శ్రీరామచంద్రుని భద్రాద్రికొండపై కొలువైవుండమని కోరుతాడు. శ్రీరాముడు సీతమ్మవారిని వెతికిన అనంతరం నీకోరికను తీరుస్తాను అని అభయాన్ని ఇస్తాడు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

కాని సీతమ్మవారిని విడిపించి రావణాసురుడిని వధించిన అనంతరం రాజ్యపాలనకోసం అయోధ్యకు వెళ్తాడు.తర్వాత రామావతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్తాడు.అప్పుడు భద్రుడు స్వామిఅనుగ్రహంకోసం ఘోరతపస్సు చేస్తాడు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

అప్పుడు శ్రీరామచంద్రునికి వైకుంఠంలో విష్ణుమూర్తిగా వున్న తనకి ఇచ్చిన మాట గుర్తుకివచ్చి రాముని అవతారంలో సీతాలక్ష్మణసమేతంగా భద్రాద్రికొండపై కోదండరాముడిగా, కళ్యాణ రాముడిగా, వైకుంఠరామునిగా భక్తులకోరికలను తీరుస్తున్నాడు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

మరి స్వామి వారు ఆ సమయంలో రామావతారంలోని విల్లు,బాణాలతో పాటు విష్ణుఅవతారంలోని శంఖుచక్రాలను కూడా తీసుకువస్తాడు.అందుకే ఈ ఆలయంలోని శ్రీరామచంద్రునికి నాలుగుచేతులు వుంటాయి.ఎప్పుడూ కుడివైపు వుండే లక్ష్మణుడు ఎడమవైపు వుంటాడు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

శ్రీరాముని కుడివైపుచేతిలో బాణం, శంఖం, ఎడమవైపు చేతిలో విల్లు, చక్రం వుంటాయి. మరి భద్రాచలంరోజు జరిగే శ్రీరామనవమిరోజు జరిగే కళ్యాణోత్సవంలో సీతారాములకు వేసే కోటితలంబ్రాలను చేతితో తయారుచేస్తారు.అంటే తలంబ్రాలకు అవససరయ్యే ధాన్యపుగింజలను దంచడమో,మిషన్ లో వేయడమో చేయకుండా భక్తులు స్వయంగా చేతితో తీస్తారు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

రాములవారి కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలు సమర్పించే ఆచారం ఎలా మొదలైంది అంటే భక్తరామదాసుద్వారా అంటే శ్రీరాముని మహిమను తెలుసుకున్న తానీషాకు ఆ శ్రీరామచంద్రుడు కలలో దర్శనమిస్తాడు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

అందుకు ఎంతో పొంగిపోయిన తానీషా శ్రీరామకళ్యాణంలో ముత్యాలతలంబ్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణంలో సమర్పించే తలంబ్రాలు తన తర్వాతకూడా పాలనను చేపట్టిన రాజులు అధికారులచేతితో సమర్పించాలి అనే శాననాన్ని కూడా చేసారు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

అందుకే ఇప్పటికీ మన రాష్ట్రప్రభుత్వాలు కూడా తలంబ్రాలను స్వామివారికి సమర్పించేఆచారం కొనసాగుతూవస్తూవుంది. రాములవారి కళ్యాణోత్సవంలో వాడే మంగళసూత్రాలను 16వ శతాబ్దంలో భక్తరామదాసు చేయించాడు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

అప్పుడు భక్తరామదాసు చేయించిన మంగళసూత్రాలని,ఇతర ఆభరణాలని ఇప్పటికి అమ్మవారికీ శ్రీరామచంద్రునికి అలంకరిస్తారు. మరి ప్రపంచంలో ఏ ఆలయం ఐనా భక్తులచేనిర్మించబడిభక్తులే సమర్పిస్తారు.కాని భద్రాద్రిలో శ్రీరామచంద్రమూర్తికి ఆలయంలో మాత్రం సీతారాముల యొక్క నగలు స్వామివారే మూల్యాన్ని చెల్లించారు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

రామదాసు రాజ్యపు ఖజానాడబ్బుతో స్వామికి నగలు చేయించినందుకు తానీషాను జైల్లో బంధిస్తాడు.మరి భక్తుడైన రామదాసును విడిపించటానికి శ్రీరామచంద్రమూర్తి మారువేషంలో వచ్చి ఆ కాలంలోని బంగారునాణేలను అంటే ఇప్పుడు 6లక్షలరూపాయలను చెల్లించారు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

అందుకే ఈ ఆలయనిర్మాణం మరియు ఆభరణాలు స్వామివారే చేయించుకున్నట్టు అవుతుంది.ఇప్పటికీ ఆ కాలంయొక్క నాణేలు గుడియొక్క మ్యూజియంలో వున్నాయి. రాములవారి గర్భగుడిపై వున్న చక్రాన్నిఎవరూ తయారుచేయలేదట.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

ఆ ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో భక్తరామదాసు గోదావరిలో స్నానంఆచరిస్తూవుండగా నదీప్రవాహంలో స్వామి వారి చక్రం అనేది రామదాసుకి దొరికిందట.దానిని శ్రీరాములవారే ప్రసాదించారని భావించి ఆ చక్రాన్ని గర్భగుడిగోపురంపై ప్రతిష్టించారు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

మరి రామదాసుయొక్క చరిత్రకథ కాదని, అది నిజంగా జరిగిందని నిరూపించటానికి సాక్ష్యాలు గోల్కొండలోని రామదాసుని బంధించిన చెరసాల. అక్కడ తాను స్వయంగా చెక్కిన శ్రీరాముడు,ఇతర శిల్పాలు మరియు బద్రాద్రిలో నిర్మించిన శ్రీరాములవారి ఆలయం సజీవసాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

ఆలయంలోవున్న శిఖరాన్ని ఏకశిలపై చెక్కారు. మరి దీని బరువు 36టన్నులు. మరి అంతటి బరువుగలిగిన రాయిని ఏవిధమైన టెక్నాలజి లేని ఆ రోజుల్లో గుడిగోపురం పైన ఎలా అమర్చారనేది ఇప్పటికీ మిస్టరీగానే వుంది.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

రామదాసు ఇప్పుడువున్న ఆలయాన్ని కట్టించకపూర్వమే బోయవారు అక్కడ శ్రీరామచంద్రులవిగ్రహమూర్తులను ఆరాధించేవారు. ఆదిశంకరాచార్యులకాలంలో ఆలయాన్ని దర్శించిన శంకరాచార్యులవారు సాక్ష్యాత్తూ ఆ వైకుంఠంలోని విష్ణుమూర్తిని దర్శించిన అలౌకికఆనందాన్ని పొందానని చెప్పాడు.అందుకే ఆయన భద్రాద్రిరాముణ్ణి వైకుంఠరామునిగా కొలిచాడు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

ఆలయంలో గర్భగుడి ప్రక్కనే ఒక చిన్న బండరాయి వుంటుంది.దీనినే భద్రుని బండఅని అంటారు.రాయికి చెవి ఆనించి వింటే రామరామ అనే తారక నామం విన్పిస్తుంది.అందుకే భక్తులు కోదండరాముడు, అయోధ్యరాముడు, లోకాభిరాముడు అని ఆర్తితో పిలుచుకుంటూవుంటారు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

శ్రీ మహావిష్ణువు అయిన శ్రీరామచంద్రుడు మానవుడిగా పుణ్యభూమియందు నడయాడిన ప్రాంతంగా భద్రాద్రిని ధర్మంకోసం, ప్రజలకోసం, తండ్రిఇచ్చిన మాటకోసం సొంతసుఖాలను త్యాగం చేసిన త్యాగమూర్తిగా శ్రీరామచంద్రుడు అందరికీ ఆదర్శ ప్రాయుడుగా నిలిచాడు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

ఉత్తమ సీజన్

భద్రాచలం సందర్శనకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకూ బాగుంటుంది. ఈ సమయం లో టెంపరేచర్ లు తక్కువగా వుంది ఆహ్లాదం గా వుంటుంది. సాయంకాలాలు చల్లటి గాలులు వీస్తాయి. చాలామంది పర్యాటకులు ఈ సమయం లో భద్రాచలం సందర్శిస్తారు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

ఇక్కడ సందర్శించవలసిన ఇతర ప్రదేశాలు

భద్రాచల రామ దేవాలయం, భద్రాచలం

భద్రాచల రామ దేవాలయంలో రాముడు, సీతా దేవి విగ్రహాలే కాక ఆలయం లోని వివిధ ప్రదేశాలలో ఇంకా ఇతర దైవాలు అంటే, విష్ణు, నరసింహ, శివ మొదలైన దేముళ్ళ విగ్రహాలు కూడా వుంటాయి. ఈ దేవాలయం భద్రాచలం టవున్ కు సుమారు 35 కి. మీ.ల దూరంలో వుంటుంది. రాముడి భక్తులు ప్రతి సంవత్సరం వేలాది సంఖ్యా లో ఇక్కడకు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ శ్రీ రామ నవమి ఉత్సవాలు అతి వైభవం గా జరుగుతాయి. ఈ గుడి లో దసరా పండుగ అతి అట్టహాసంగా చేస్తారు. పది రోజుల పాటు జరిగే ఈ దసరా ఉత్సవాలకు దెస వ్యాప్తంగా భక్తులు వచ్చి ఆనందిస్తారు. రావణుడి గడ్డి బొమ్మలను తగుల బేడతారు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

జటాయు పాక, భద్రాచలం

జటాయు పాక ప్రదేశాన్ని ఏట పాక అని కూడా అంటారు, ఇది భద్రాచలానికి రెండు కి. మీ.ల దూరం లో కలదు. సీతాపహరణ సమయం లో ఆమె కేకలు విన్న జటాయువు రావణుడి తో ఈ ప్రదేశం లో యుద్ధం చేసాడని ఇక్కడే తన ప్రాణాలు కోల్పోయాడని, అయితే, తన ఒక రెక్క మాత్రం విరిగి ఎగిరి వెళ్లి ఇక్కడకు 55 కి. మీ. ల దూరం లో కల రెక్కపల్లి లో పడిందని చెపుతారు. తర్వాత రాముడు జటాయువు ద్వారా సీతాపహరణను తెలుసుకున్నాడని చెపుతారు. ఈ ప్రదేశం వేలాది భక్తులను ఆకర్షిస్తుంది.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

పర్ణ శాల, భద్రాచలం

పర్ణశాల భద్రాచలం నుండి 32 కి.మీ.లు కలదు. ఈ గ్రామం దుమ్ముగూడెం మండలమ్ కిందకు వస్తుంది. రోడ్ లేదా బోటు లో ఇక్కడకు చేరవచ్చు. తన 14 సంవత్సారాల వనవాస కాలం లో రాముడు తన భార్య సీతా మరియు సోదరుడు లక్ష్మణుడు తో కలిసి ఈ ప్రదేశం లో కొంత కాలం నివసించాడు. ఇక్కడ రాముడు ఒక గుడిసె ని నిర్మించాడు. ఈ ప్రదేశానికి సమీపంగా ఒక ప్రవాహం కలదు. సీతా మాత ఈ ప్రవాహం లో స్నానాలు చేసి తన దుస్తులు సుభ్ర పరుచుకున్న దని చెపుతారు. ఇప్పటికి ఇక్కడ కొన్ని ఆధారాలు చూపుతారు.

PC:youtube

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

ఎలా చేరాలి?

రోడ్ ప్రయాణం

అనేక ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు, టాక్సీ లు భద్రాచలం కు కలవు. రాష్ట్రం లోని ప్రధాన నగరాలనుండి భద్రాచలం కు అనేక మంది ప్రైవేటు బస్సు లు నడుపుతారు. హైదరాబాద్, ఖమ్మం లకు రెగ్యులర్ బస్సు లు కలవు. ఖమ్మం నుండి రోడ్ మార్గం లో రెండున్నర గంటలలో భద్రాచలం చేరుకోవచ్చు.

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

రైలు ప్రయాణం

భద్రాచలానికి రైలు స్టేషన్ కోతగూడెం లో కలదు. దీనినే భద్రాచలం రోడ్ స్టేషన్ అంటారు. ఇది టవున్ కు సుమారు 40 కి. మీ.ల దూరం లో కలదు. ఇక్కడ నుండి దేశం లోని అన్ని ప్రాంతాలకు రైళ్ళు కలవు. స్టేషన్ నుండి పర్యాటకులు టాక్సీ లో భద్రాచలం చేరవచ్చు.

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

భద్రాచలం గురించి నమ్మలేని నిజాలు !

విమాన ప్రయాణం

భద్రాచలానికి ఎయిర్ పోర్ట్ లేదు. సమీపంలోని రాజమండ్రి లో స్థానిక విమానాశ్రయం కలదు. అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో 300 కి. మీ. ల దూరం లో కలదు. చెన్నై అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కూడా సుమారు అదే దూరంలో వుంటుంది. విమానాశ్రాయాల నుండి భద్రాచలం టవున్ కు టాక్సీల్లో చేరవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X