Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ అలా ఎందుకు జరుగుతోందో తెలియక వారు జుట్టు పీక్కొంటున్నారు

ఇక్కడ అలా ఎందుకు జరుగుతోందో తెలియక వారు జుట్టు పీక్కొంటున్నారు

భైరవకోనకు సంబంధించిన కథనం.

By Kishore

ఇన్ని లక్షల కోట్ల రుపాయలు ఇక్కడ ఏమి చేస్తున్నారు? అవి నాకే దొరికితేఇన్ని లక్షల కోట్ల రుపాయలు ఇక్కడ ఏమి చేస్తున్నారు? అవి నాకే దొరికితే

మీ చర్మం చూసి ఎవరైనా 'ఛీ'అంటుంటే ఇక్కడికి వెళ్లి వస్తే వారికి 'గుణపాఠం'చెప్పొచ్చుమీ చర్మం చూసి ఎవరైనా 'ఛీ'అంటుంటే ఇక్కడికి వెళ్లి వస్తే వారికి 'గుణపాఠం'చెప్పొచ్చు

ఈ విశాల భారత దేశంలో అనేక ఎన్నో ప్రాంతాలు అనేక రహస్యాలను తనలో ఇముడ్చుకొన్నాయి. వాటిలో భైరవ కోన ఒకటి. ఈ రసస్యాల్లో కొన్నింటికి సమాధానాలను చాలా కాలం పాటు పరిశోధించి కనుగొన్నారు. మరొకొన్నింటికి పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పరిశోధనలు చేసి చేసి విసిగిపోయారు. ఈ రహస్యాల వెనుక ఉన్న మర్మమేమిటో ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. ఇక ముందేచెప్పిన బైరవ కోన ఈ రకానికి చెందినదే. ఇందులో ఒకటి కాదు అనేక రహస్యాలు దాగున్నాయి. వాటి రహస్యాలను కనుగొనలేక శాస్త్రవేత్తలే చేతులు పైకి ఎత్తేశారు. అటువంటి మర్మాల పుట్ట అయిన ఈ భైరవ కోన మరెక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. ఆ భైరవకోన కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యావరణ ప్రేమికులను కూడా ఆహ్వనిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ భైరవకోనకు సంబంధించిన వివరాలు మీ కోసం

1.రెండు జిల్లాల్లో

1.రెండు జిల్లాల్లో

Image Source:

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించిన తూర్పుకనుమల్లో ఈ భైరవకోన విస్తరించి ఉంది. ఇది బ్రహ్మ, విష్ణు, రుద్ర అనే పేర్లు కలిగిన మూడు పర్వతాల మధ్యన ఈ భైరవ కోన ఉంటుంది.

2.గుహాలయాలు

2.గుహాలయాలు

Image Source:

కనుచూపు మేర పచ్చదనంతో, గలగల పారే సెలయేర్లతో ఈ ప్రాంతం నిత్యం పర్యాటకులను ఎక్కవ సంఖ్యలో ఆకర్షిస్తుంటుంది ఈ క్షేత్రంలోని ఆలయాన్ని తొమ్మిదో శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ కోనలోని ఆలయాలు గుహాలయాలు.

3.ఎనిమిది దేవాలయాలు

3.ఎనిమిది దేవాలయాలు

Image Source:

అంటే కొండను తొలిచి ఎనిమిది ఆలయాలను నిర్మించారు. ఈ అష్ట ఆలయాల్లో శివుడు ఎనిమిది విభిన్న రూపాల్లో కనిపిస్తాడు. ఏడు తూర్పు ముఖాన్ని కలిగి ఉంటే ఒకటి మాత్రం పడమర ముఖాన్ని కలిగి ఉంది.

4.ఆ లింగాలు ఇవే

4.ఆ లింగాలు ఇవే

Image Source:

అవి శశినాగలింగం, రుద్రలింగం, విశ్వేశ్వర లింగం, నాగేశ్వర లింగం, భార్గేశ్వర లింగం, మల్లికార్జున లింగం, పక్షిమాలిక లింగం.ఈ క్షేత్రంలోని శశి నాగలింగాన్ని దర్శిస్తే నాగ దోషం తొలిగి పోతుంది.

5.మూడు ముఖాలు కలిగిన మాత

5.మూడు ముఖాలు కలిగిన మాత

Image Source:

ఈ ఎనిమిది ఆలయాల మధ్య దుర్గాదేవి దేవాలయం ఉంటుంది. ఈ ఆలయంలో దుర్గాదేవి మూడు ముఖాలు కలిగి ఉంటుంది. ఈ దేవాలయం కొద్దిగా ముందుభాగంలో సెలఏరు పారుతూ ఉంటుంది.

6.ఏమిటి సెలయేరు రహస్యం

6.ఏమిటి సెలయేరు రహస్యం

Image Source:

ఈ సెలఏరు ఎండిపోవడం ఇప్పటి వరకూ ఎవరూ చూడలేరు. ఎండాకాలంలో కూడా ఈ సెలయేరులో నీరు పారుతూనే ఉంటుంది. ఈ సెలయేరు ఎక్కడ పుట్టి ఎక్కడకు ప్రవహిస్తోందన్న విషయం పై సరైన సమాధానం లేదు.

7.చంద్రుని కిరణాలు

7.చంద్రుని కిరణాలు

Image Source:

ఇక ఎంత పెద్ద వర్షం వచ్చినా ఈ సెలఏరులో నీటి వేగం పెరుగుతుంది తప్పిస్తే నీటి మట్టం పెరగకపోవడం ఇక్కడ విశేషం. అదే విధంగా ఈ క్షేత్రంలోకార్తిక పౌర్ణమి రోజున చంద్రుని కిరణాలు ఇక్కడి దుర్గా మాత పై పడుతాయి.

8.కారణం ఎమిటి

8.కారణం ఎమిటి

Image Source:

రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ఈ అద్భుతం జరుగుతుంది. మిగిలిన పౌర్ణిమ రోజుల్లో ఇలా జరగకపోవడం విశేషం. ఈ విషయం పై ఎన్ని పరిశోధనలు జరిగినా సమాధానం మాత్రం ఇప్పటి వరకూ కనుగొనలేకపోయారు.

9. గాడిదలు, గద్దలు

9. గాడిదలు, గద్దలు

Image Source:

అదే విధంగా ఇక్కడి ఎనిమిది దిక్కులను భైరవుడు, రుద్రుడు, వాల, పాతాళ, భేతాళ, త్రికాళ, దుర్గ, కలభైరవులు రక్షిస్తుంటారని చెబుతారు. అదే విధంగా ఇక్కడ ఒక ముని శాపం వల్ల ఈ క్షేత్రం చుట్టు పక్కల గాడిద, గద్ద సంచారం మనకు కనిపించదు.

10.కాకి, వేప చెట్లు ఎందుకు కనిపించదు

10.కాకి, వేప చెట్లు ఎందుకు కనిపించదు

Image Source:

అదే విధంగా భైరవకోనలో మనకు కాకి కూడా కనిపించదు. దాదాపు 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భైరవ కోనలో కొన్ని వేల జాతుల చెట్లు ఉంటాయి. అయినా ఈ క్షేత్రంలో వేప చెట్టు అసలు కనిపించదు.

11.భైరవుడు క్షేత్ర పాలకుడు

11.భైరవుడు క్షేత్ర పాలకుడు

Image Source:

మూడు కొండల మధ్య ఉన్న అటవీ ప్రాంతమే భైరవకోన. ఈ క్షేత్రానికి బాల భైరవుడు క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. బాలభైరవుడు క్షేత్ర పాలకుడిగా ఉండటం వల్ల ఈ క్షేత్రానికి వచ్చే భక్తులను ఇక్కడి విష, సర్పాలు ఏమి చేయకుండా ఉన్నాయని చెబుతారు.

12.101 శివలింగాలు, కోనేరులు

12.101 శివలింగాలు, కోనేరులు

Image Source:

ఈ కోన చుట్టుపక్కల ఉన్న మూడు కొండల్లో మొత్తం 101 శివలింగాలు, 101 కోనేరులు ఉన్నట్లు స్థానికులు చెబుతారు.ఈ భైరవకోనలో ఉండే జలపాతంలో స్నానం చేస్తే సర్వ రోగాలునశించిపోతాయని చెబుతారు.

13.శాస్త్రీయ కారణం ఇదే

13.శాస్త్రీయ కారణం ఇదే

Image Source:

ఇందుకు శాస్త్రీయ కోణం కూడా ఉంది. ఈ నీరు చుట్టు పక్కల ఉండే కొండ, కోనల్లో పెరిగే ఔషద గుణాలున్న మొక్కల పై ప్రవహించి ఇక్కడకు వచ్చి చేరుతుందని అందువల్లే ఈ జలపాతంలోని నీటికి ఔషద గుణాలు వచ్చాయని వివరిస్తారు.

15.ఎలా వెళ్లాలి

15.ఎలా వెళ్లాలి

Image Source:

బైరవకోనకు చేరుకోవడానికి రెండు మార్గాల్లో బస్సలు ఉన్నాయి.

ఒంగోలు, కందకూరు, పామూరు, సీ.ఎస్ పురం మీదుగా భైరవకోన చేరుకోవచ్చు.

ఒంగోలు, కనిగిరి, సీ.ఎస్ పురం, భైరవకోన

ఒంగోలు నుంచి భైరవకోనకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X