Search
  • Follow NativePlanet
Share
» »శ్రీ కృష్ణుడి నిర్యాణం జరిగిన ప్రాంతం ఓ పెద్ద పుణ్యక్షేత్రం మీకు తెలుసా?

శ్రీ కృష్ణుడి నిర్యాణం జరిగిన ప్రాంతం ఓ పెద్ద పుణ్యక్షేత్రం మీకు తెలుసా?

శ్రీ కృష్ణుడి నిర్యాణం జరిగిన ప్రాంతానికి సంబంధించిన కథనం.

గుజరాత్ లోని సోమనాథ్ మందిరం దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది ఇదే. ఈ సోమనాథ్ మందిరం ఉన్న ప్రాంతాన్నే ప్రభాస్ క్షేత్రం అంటారు. ఇది కేవలం శైవులకు కాదు వైష్ణవులకు కూడా ఎంతో పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడికి దగ్గర్లోని భాల్కా తీర్థం వద్దే శ్రీ కృష్ణుడి నిర్యాణం జరిగిందని చెబుతారు. దీనికి వెనుక ఉన్న కథనంతో పాుట ఆ సోమనాథ్ క్షేత్రానికి సంబంధించిన వివరాలు క్లుప్తంగా మీ కోసం...

ఇక్కడ హనుమంతుడి కాలు కింద శనిమహాత్ముడుఇక్కడ హనుమంతుడి కాలు కింద శనిమహాత్ముడు

ఇక్కడ దేశంలోనే ఎక్కువ వివాహాలు ఎందుకు జరుగుతాయో తెలుసా?ఇక్కడ దేశంలోనే ఎక్కువ వివాహాలు ఎందుకు జరుగుతాయో తెలుసా?

నాలుగు నెలలు మాత్రమే భూమి పై కనిపించే విచిత్ర దేవాలయంలో స్వర్గానికి మెట్లునాలుగు నెలలు మాత్రమే భూమి పై కనిపించే విచిత్ర దేవాలయంలో స్వర్గానికి మెట్లు

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube

భాల్కా తీర్థం గుజరాత్ లోని సౌరాష్ట్రలో ఉన్న వీరవల్ దగ్గర్లోని ప్రభాస్ క్షేత్రంలో ఉంది. ఈ ప్రదేశంలోనే శ్రీ కృష్ణ నిర్యాణం జరిగిందని పురాణ గాథ.

సమాధుల మధ్య రెస్టోరెంట్...ఖైదీలు ఛెఫ్ లుగా పనిచేసే కెఫేసమాధుల మధ్య రెస్టోరెంట్...ఖైదీలు ఛెఫ్ లుగా పనిచేసే కెఫే

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
ఇక ఇక్కడి నుంచే శ్రీ కృష్ణుడి సహోదరుడైన బలరాముడు కూడా శేషనాగ రూపంలో గోకుల్ థామ్ కు ఇక్కడి నుంచి వెళ్లాడని చెబుతారు.

ఈ పంచ లింగాల దర్శనంతో పాపాలన్నీ పటాపంచలుఈ పంచ లింగాల దర్శనంతో పాపాలన్నీ పటాపంచలు

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
భల్కా తీర్థం గుజారాత్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సోమనాథ్ మందిరానికి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. సోమనాథ్ వెళ్లిన వారు ఇక్కడికి తప్పకుండా వెలుతూ ఉంటారు.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
మహాభారత కథనం ప్రకారం కురుక్షేత్రం జరుగుతున్న సమయంలో దుర్యోధనుడి మరణానికి ముందు రోజు రాత్రి శ్రీ కృష్ణుడు గాంధారీని పలకరించడానికి వెలుతాడు.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
అప్పటికే తన కుమారుల్లో చాలా మందిని కోల్పోయిన గాంధారి, కృష్ణుడి పై కోపంతో ఉంటుంది. యుద్ధాన్ని రాకుండా చేయగల శక్తి నీకు ఉన్నా ఎందుకు ఆ పనిని చేయలేకపోయావని తిడుతుంది.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
నీతో సహా యాదవ కులం మొత్తం రానున్న 36 ఏళ్లలో నాశనం అవుతుందని శపిస్తుంది. ఆ శాపం విని కృష్ణుడు నవ్వుకొంటాడు.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
ఇదంతా జరగాల్సిందేనని భావిస్తూ శ్రీ కృష్ణుడు అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోతాడు. అనుకొన్నట్లుగానే కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజుకు పట్టాభిషేకం జరుగుతుంది.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
35 ఏళ్లపాటు ధర్మరాజు ఆ రాజ్యాన్ని పాలిస్తారు. 36వ సంవత్సరంలో కొన్ని ఉత్పాతాలు జరుగుతాయి. దీంతో తను కూడా అవతారము చాలించవలసిన సమయం వచ్చిందని అనుకున్నాడు.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
తాను ఈ భూలోకములో ఏ కార్య నిర్వహణకు అవతరించాడో తలచుకొంటూ దిక్కుతోచకుండా తిరుగుతుంటాడు. అంతేకాకుండా తాను ఎలా ఈ శరీరము వదిలి పెట్టాలో అని అలోచించసాగాడు.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
శ్రీ కృష్ణుడికి గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తుకు వస్తుంది. ఒక సారి దుర్వాసుడు తన ఒంటికి పాయసము పూయమని కోరినప్పుడు తాను శరీరము అంతా పూసి అరికాలుకు పూయలేదు.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
అప్పుడు దుర్వాసుడు కృష్ణా నీ మరణము అరికాలులో ఉందని చెబుతారు. దీంతో శ్రీ కృష్ణుడికి ప్రాణాలు ఎలా వదిలి పెట్టాల్లో అర్థం అయ్యింది.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
శ్రీ కృష్ణుడు నేల మీద పడుకొని ఇంద్రియములను నిగ్రహించి యోగ సమాధిలోకి వెళ్లాడు. ఆ సమయంలో జర అనే బోయవాడు వేటాడుటకు అక్కడికి వస్తాడు.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
వేంటనే ఆ వేటగాడు పడుకొని ఉన్న శ్రీ కృష్ణుడి కాలుకు గురిపెట్టి ఒక బాణము వదిలాడు. ఆ బాణము పడుకొని ఉన్న శ్రీ కృష్ణుడి పాదములో గుచ్చుకొని బయటకకు పొడుచుకొని వచ్చింది.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
జింక చచ్చిందనుకొని దానిని తీసుకుపోవాలని అక్కడికి రాగా, అక్కడ శ్రీ కృష్ణుడు ఉంటాడు. దీంతో ఆ బోయవాడు శ్రీ కృష్ణుడి పాదాల పై పడి తన తప్పును మన్నించమని వేడుకొంటాడు.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
అప్పుడు శ్రీ క`ష్ణుడు జరాతో త్రేతాయుగంలో రామావతారంలో నేను ఉన్నప్పుడు నాచే చంపబడిన వాలివి నువ్వు. అప్పుడు నీకు ఇచ్చిన వరం వల్లే ఈ విధంగా జరిగిందని చెబుతారు.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
అటు పై శ్రీ కృష్ణుడు తన తనువును చాలిస్తాడు. పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడి అవతార సమాప్తంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం మొదలవుతుంది.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
ప్రస్తుత కాలమాన ప్రకారం క్రీస్తు పూర్వం 3102 ఏడాదిలో ఫిబ్రవరి 17 లేదా 18న శ్రీ కృష్ణుడ నార్యానం జరిగి ఉండవచ్చునని ఒక అంచనా వేస్తున్నారు.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
కాగా సోమనాథ్ దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. దీనిని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. అరేబియా సముద్ర తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రం సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్లతో నిర్మించిన మట్టం మీద ఈ ఆలయాన్ని నిర్మించారు.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
ఈ ఆలయంలోని గర్భగుడిలో 4 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ దేవాలయాన్ని మొదట చంద్రుడు బంగారంతో నిర్మించాడని చెబుతారు. ఆ తరువాత రావణుడు వెండితో నిర్మించడాని చెబుతారు.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
శ్రీ కృష్ణుడు కొయ్యతో, అటు పై భీముడు రాతితో పున:నిర్మించాడని చెబుతారు. ఇక చరిత్రను అనుసరించి అనేక సార్లు దండయాత్రలకు గురైన ఈ దేవాలయం ఆరుసార్లు పున: నిర్మించారని తెలుస్తోంది.

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

శ్రీ కృష్ణుడి నిర్యాణం, భల్కా తీర్థం

P.C: You Tube
చివరి సారిగా భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950లో సర్ధార్ వల్లభాయి పటేల్ ఈ సోమనాథ్ మందిరాన్ని తిరిగి పున:నిర్మించారని చెబుతారు.

హైదరాబాద్ టెక్కీలూ... మీకు దగ్గర్లోని ఈ ట్రెక్కింగ్ స్పాట్స్ పై ఈ వీకెండ్ లుక్కేయండి...హైదరాబాద్ టెక్కీలూ... మీకు దగ్గర్లోని ఈ ట్రెక్కింగ్ స్పాట్స్ పై ఈ వీకెండ్ లుక్కేయండి...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X