» »భాంగర్ కోటలో నిజంగానే దెయ్యం ఉందా ?

భాంగర్ కోటలో నిజంగానే దెయ్యం ఉందా ?

Written By: Venkatakarunasri

LATEST: ఆలయాల రహస్యం ... అంతా గప్చుప్

మన హైదరాబాద్ లో గోల్కొండ ఎంత ఫేమస్సో, రాజస్థాన్ లో కూడా భాంగర్ ఫోర్ట్ అంతే ఫేమస్. ఈ భాంగర్ ఫోర్ట్ టాప్ 5 టూరిస్ట్ ప్లేసెస్ గా అలాగే టాప్ సెకండ్ హాంటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియాగా ఒక మంచి పేరుంది. ఈ భాంగర్ ఫోర్ట్ 17 వ శతాబ్దంలో మాన్సింగ్ తనకిష్టమైన సోదరుడైన మధూసింగ్ కోసం కట్టించాడు. ఈ కోటను కేవలం ఇటుకలతోను, రాళ్ళతోనూ కట్టించారు. ఒక మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగా మనకొక హనుమాన్ టెంపుల్ కన్పిస్తుంది.

ఆ తరువాత ముందుముందుకెళ్తున్న కొద్దీ మనకు గోపీనాథ్ టెంపుల్, కేశవరాయ్ టెంపుల్, మంగళ్ దేవి టెంపుల్, సోమేశ్వర్ నాథ్ టెంపుల్ కనిపిస్తుంది. ఈ భాంగర్ ఫోర్ట్ ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్ లో వుంది. అర్కియాలజిస్ట్ ఆఫ్ ఇండియా దీనిని విజిట్ చేయటానికి ఒక టైమింగ్ ఇచ్చింది.

Latest:అచలేశ్వర్ లో నరకానికి ద్వారం !

దీనిని ఉదయం 8 గంటలకు తెరిచి షార్ప్ గా సాయంత్రం 5 గంటలకు మోసివేయాలి. 5 గంటల తర్వాత అక్కడ అనుమతి లేదు. భాంగర్ ఫోర్ట్ వన్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కావున దానిని ఎవరైనా మిస్ యూజ్ కానీ డామేజ్ కానీ చేయాలని చూసినా వారికి కఠిన శిక్షలున్నాయని అర్కియాలజిస్ట్ ఆఫ్ ఇండియా తెలిపింది.

భాంగర్ కోటలో నిజంగానే దెయ్యం ఉందా ?

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

నేచురల్ బ్యూటీ

నేచురల్ బ్యూటీ

దీని యొక్క చరిత్ర మరియు నేచురల్ బ్యూటీ వల్ల భారతదేశం యొక్క వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా మారింది. ఇది టాప్ సెకండ్ హంటడ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా కావటం వల్ల ఇక్కడ 5 తర్వాత ఎవ్వరికీ కూడా అనుమతి లేదు.

PC:Navjot Singh

భాంగర్ ఫోర్ట్

భాంగర్ ఫోర్ట్

ఈ భాంగర్ ఫోర్ట్ ఇలా టాప్ హంటడ్ ప్లేస్ గా మారటానికి గల కారణం ఏమిటంటే భాంగర్ ఫోర్ట్ దగ్గర ఒక సాధువు వుండేవాడు. అతను బ్లాక్ మ్యాజిక్ చేయటంలో చాలా ఫేమస్. ఒకసారి అతను ఈ భాంగర్ ఫోర్ట్ లో నివశించే రత్నావతి అనే యువరాణిని చూసాడు.

PC:Shahnawaz Sid

రత్నావతి

రత్నావతి

ఎలాగైనా ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఒకసారి యువరాణి అయిన రత్నావతి తన స్నేహితులతో కొండల మధ్య వున్న దుకాణానికి బయలుదేరింది. ఇదంతా గమనించిన ఆ మాంత్రికుడు ఎలాగైనా ఆ యువరాణిని ఈసారి తన వశం చేసుకోవాలని ఒక అత్తరులో మత్తుమందు కలిపాడు.

PC:Oltmblog

యువరాణి రత్నావతి

యువరాణి రత్నావతి

ఇదంతా గమనించిన యువరాణి రత్నావతి తనకు అత్తరు ఇచ్చినప్పుడు దానిని తీసుకోకుండా రాళ్ళ మధ్యలో విసిరికొట్టింది. ఆమె అలా విసిరి కొట్టిన వెంటనే ఒక పెద్ద బండరాయి కిందికి జారుకుంటూ రావటం మొదలుపెట్టింది.

PC:Tushmit

మొఘల్ రాజులు

మొఘల్ రాజులు

ఆ బండరాయి నేరుగా ఆ మాంత్రికుడు మీద పడటం వలన అక్కడే చనిపోయాడు. తాను చనిపోతూ ఆ భాంగర్ ఫోర్ట్ లో నివశించే యువరాణి మరియు ప్రజలు చనిపోతారని ఒక శాపం పెట్టాడు. ఇలా అయిన కొద్ది రోజుల తర్వాత ఆ భాంగర్ ఫోర్ట్ మీద మొఘల్ రాజులు దాడిచేశారు.

PC:Tushmit

యువరాణి యొక్క ఆత్మ

యువరాణి యొక్క ఆత్మ

దీనితో యువరాణితో పాటు 10,000 మంది ప్రజలు చనిపోయారు. అప్పటినుండి ఆ మాంత్రికుని యొక్క ఆత్మ అలాగే యువరాణి యొక్క ఆత్మ ఆ భాంగర్ ఫోర్ట్ లో 5 గంటల తర్వాత తిరుగుతుంటాయని ఆ వూరి ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ఆ భాంగర్ ఫోర్ట్ వద్ద ఎంతో మంది చనిపోవటానికి వస్తూ వుంటారు.

PC:Tushmit

సైంటిస్ట్ లు

సైంటిస్ట్ లు

ఇక్కడ నిజంగా దెయ్యాలు, భూతాలూ తిరుగుతాయా అని టెస్ట్ చేయటానికి సైంటిస్ట్ లు అక్కడకు 3 నెగటివ్ ఎనర్జీ రేడియేషన్ ని కేచ్ చేసే 3 మిషన్ ల్ని తెచ్చారు. వాళ్ళు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తెచ్చుకుని 6 గంటల తర్వాత అక్కడ వారు టెస్ట్ చేయటానికి అనుమతి పొందారు.

PC:Lavya srivastava

నెగటివ్ ఎనర్జీజ్

నెగటివ్ ఎనర్జీజ్

అక్కడ వాళ్ళు మెయిన్ గా 3 ప్లేసెస్ లో నెగటివ్ ఎనర్జీజ్ చాలావున్నాయని తెలుసుకున్నారు. ఆ 3 ప్లేసెస్ ఏంటంటే మొదటిది ఆ భాంగర్ ఫోర్ట్ యొక్క మెయిన్ హాల్, రెండవది యువరాణి నివశించినటువంటి గది, మొదవ ప్లేస్ ఏంటంటే ఆ యువరాణి స్నానం చేసేటటువంటి గది.

PC:Debjyoti Banerjee

వూరి ప్రజలు

వూరి ప్రజలు

ఇదంతా ఆ వూరి ప్రజలకు చెప్పినా వారి ఇంకా నమ్మట్లేదు. వారేమంటున్నారంటే ఆ భాంగర్ ఫోర్ట్ మొత్తం నెగటివ్ ఎనర్జీస్ యే ఉన్నాయంటున్నారు.

PC:Manmohan17

ఇండియాలో టాప్ సెకండ్ హాంటెడ్ ప్లేస్

ఇండియాలో టాప్ సెకండ్ హాంటెడ్ ప్లేస్

ఆ భాంగర్ ఫోర్ట్ వద్ద నివశించే ప్రజలు ఇంకా ఏమంటున్నారంటే సాయంత్రం 5 గంటల తర్వాత వెళ్తే వారికి వింత శబ్దాలు వినిపిస్తాయని, అలాగే వారి గొంతు పట్టుకుని పిసుకుతాయని ఇంకా నమ్ముతున్నారు. దీనివల్ల భాంగర్ ఫోర్ట్ మన ఇండియాలో టాప్ సెకండ్ హాంటెడ్ ప్లేస్ గా పేరుగాంచింది.

PC:Manmohan17