Search
  • Follow NativePlanet
Share
» »800 ఏళ్ళ నాటి భీమకాళీ దేవాలయ విశేషం ఏంటో తెలుసా?

800 ఏళ్ళ నాటి భీమకాళీ దేవాలయ విశేషం ఏంటో తెలుసా?

800 ఏళ్ళ నాటి భీమకాళీ దేవాలయ విశేషం ఏంటో తెలుసా?

PC- John Hill

భీమకాళీ టెంపుల్ కాంప్లెక్స్ హిమాచల్ ప్రదేశ్ లోని సరహన్ లో నివాసముంటున్న హిందువులకి ఈ భీమకాళీ టెంపుల్ ప్రధానమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని భీమకాళీ దేవికి అంకింతం చేయబడినది. దాదాపు 800 ఏళ్ళ క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగిందని భావిస్తారు.

విలక్షణమైన భారతీయ హిందూ మరియు బౌద్ధుల నిర్మాణ శైలిల సమ్మేళనంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. దాని ప్రత్యేకమైన రూపకల్పనకు ప్రసిద్ది చెందింది. తెలవారు జామున ఇంకా సాయంత్రం 'హారతి' వేళల్లో మాత్రమే ఈ పురాతన ఆలయం భక్తుల సందర్శనార్ధం తెరచి ఉంటుంది.

భారత దేశంలోనే శక్తి పీఠాలలో అలాగే పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ భీమకాళీ ఆలయం

భారత దేశంలోనే శక్తి పీఠాలలో అలాగే పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ భీమకాళీ ఆలయం

ఈ ఆలయ ప్రాంగణం లోనే మరియొక చిన్న ఆలయం ఉంది. దీన్నీ 1943లో ఆలయ ప్రాంగణంలో నిర్మించారు. ఈ ఆలయంలో భీమకాళీ అమ్మవారిని కన్య స్త్రీగా వర్ణింపచేసే ప్రతిమని ప్రతిష్టించారు. ఈ కాంప్లెక్స్ లో ఉన్న మరో రెండు ఆలయాలు రఘునాథుని ఆలయం మరియు భైరోన్ యొక్క నర్సింగ్ ఆలయాలున్నాయి. భారత దేశంలోనే శక్తి పీఠాలలో అలాగే పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ భీమకాళీ ఆలయం పేరొందింది.

PC: Vivek.Joshi.us

సతీదేవి ఎడమ చెవి పడిన ప్రదేశం

సతీదేవి ఎడమ చెవి పడిన ప్రదేశం

ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం, వివాహ సౌఖ్యాలకి అలాగే దీర్ఘాయువుకి పూజింపబడే శివుడి భార్య అయిన సతీ దేవి ఎడమ చెవి ఇక్కడే పడిపోయింది అని పురాణాలూ చెబుతున్నాయి. అలాగే మరికొన్ని గాధలు, మహర్షి బ్రహ్మగిరి కమండలంలో భీమకాళీ అమ్మవారు మొట్ట మొదట దర్శనమిచ్చారని చెబుతున్నాయి . ఇక్కడ ప్రసిద్ద హిందూ ప్రధాన పండుగ అయిన దసరా పండుగని ఇక్కడ ఘనంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.

PC: Gerd Eichmann

ఇతర దేవాలయాలు

ఇతర దేవాలయాలు

శ్రీ భీమకాలీ దేవాలయంలో ప్రథాన దేవత విగ్రహం ఆలయం భవనం పైభాగంలో ఉంది. ఈ కాంప్లెక్స్ లో మరో మూడు దేవాలయాలున్నాయి. అందులో లార్డ్ రఘునాథ్, నరసింహ మత్తు పాతాళ భైరవ దేవాలయం ఈ కాంప్లెక్స్ లో కనిపించే ప్రధాన ఆలయాలు.

PC: Smathur910

మ్యూజియం

మ్యూజియం

బియాస్ నది ఒడ్డున ఉన్న భీమకాళి ఆలయం మండిలో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం. ఈ ఆలయ ప్రధాన దేవత భీమకాళి. ఈ ఆలయంలో హిందూ దేవతలు మరియు దేవతల ప్రత్యేక చిత్రాలను ప్రదర్శించే పెద్ద మ్యూజియం ఉంది. బానాసురుడు అనే రాక్షసుడికి మరియు కృష్ణుడికి మధ్య గొప్ప యుద్ధం ఇక్కడ జరిగిందని నమ్ముతారు. అంతే కాదు బానాసురుడి తల దేవాలయ ప్రవేశద్వారం ముందు ఖననం చేయబడిందని కూడా అంటారు.

PC: Sanyam Bahga

దేవాలయం వాస్తు

దేవాలయం వాస్తు

దేవాలయం యొక్క వాస్తు శిల్పం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ భవనం యొక్క నిర్మాణం హిందూ మతం మరియు బౌద్ధమతం యొక్క వివిధ వర్గాల గొప్ప మిశ్రమంగా ఉంది. ఆలయం యొక్క అద్భుతమైన నిర్మాణంగా మారిన భీమకాళి ఆలయం శిల్పాలతో అలంకరించబడి ఉంది. ఆలయ గోడలపై ప్రతి శిల్ప సౌందర్యం భీమకాళి కథను వర్ణిస్తుంది.

PC- Travelling Slacker

సరహన్ ఎలా చేరుకోవాలి

సరహన్ ఎలా చేరుకోవాలి

ప్రధాన రవాణా పద్దతులైన వాయు మార్గం, రైలు మార్గం మరియు రోడ్డు మార్గాలని ఉపయోగించి సరహన్ కి సులభంగా చేరుకోవచ్చు.

వాయు మార్గం
సరహన్ నుండి 175 కిలో మీటర్ల దూరం లో ఉన్న జుబ్బర్హట్టి విమానాశ్రయం ఈ ప్రాంతానికి సమీపం లో ఉన్న విమానాశ్రయం. కులూ, షిమ్లా, ఢిల్లీ మరియు ముంబై వంటి ప్రధాన పట్టణాలకి ఈ విమానాశ్రయం రెగ్యులర్ విమానాల ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. ఈ విమానాశ్రయ వెలుపల 2000 రూపాయల ధరలో టాక్సీ మరియు క్యాబ్ సదుపాయాలు సరహన్ కి కలవు.

రైలు మార్గం
సరహన్ కి సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్ కల్కా రైల్వే స్టేషన్. షిమ్లా రైల్వే స్టేషన్ నుండి సుమారు 84 కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన భారతీయ పట్టణాలకు చక్కగా అనుసంధానమై ఉంది. సరహన్ కి చేరుకోవడానికి ఈ రైల్వే స్టేషన్ వెలుపల క్యాబ్ మరియు టాక్సీ సేవలు లభిస్తాయి.

రోడ్డు మార్గం
సరహన్ ని సందర్శించాలనుకునే పర్యాటకులు రోడ్డు మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఢిల్లీ మరియు షిమ్లా ల కి రెగ్యులర్ బస్సు సేవలు అందుబాటులో కలవు. మనిషి కి 700 రూపాయలు ఛార్జ్ చేసే విలాసవంతమైన ఏ సి వోల్వో బస్సులు ఢిల్లీ నుండి సరహన్ కి కలవు. ఏ సి బస్సులు షిమ్లా నుండి సరహన్ కి చేర్చడానికి మనిషికి 275 రూపాయలు ఛార్జ్ చేస్తాయి. పొరుగు పట్టణాల నుండి హిమాచల్ ప్రదేశ్ కు హిమాచల్ ప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (HTDC) బస్సులు అందుబాటులో కలవు. టాక్సీ లు మరియు జీపులు ద్వారా కూడా షిమ్లా, చండి గర్హ్ మరియు ఢిల్లీ ల నుండి ఈ ప్రాంతానికి సందర్శకులు చేరుకోవచ్చు.
Photo Courtesy: Nikhil.Hirurkar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X