Search
  • Follow NativePlanet
Share
» » కొత్త దంపతులు ఆ కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయంటా

కొత్త దంపతులు ఆ కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయంటా

బెంగళూరుకు దగ్గర్లో ఉన్న భోగ నందీశ్వర దేవాలయానికి సంబంధించిన కథనం.

రానున్నవి దసరా సెలవులు. ఈ సెలవుల్లో ఎక్కడెక్కడికి వెళ్లాలని అలోచిస్తున్నారా? మీ కోసమే ఈ కథనం. సాధారణంగా బెంగళూరుకు దగ్గర్లో ఉన్న వీకెండ్ స్పాట్స్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది నంది బెట్ట. అయితే ఆ నందిబెట్టకు పట్టుమని 10 మైళ్ల దూరంలోనే భోగ నందీశ్వర దేవాలయం అనే అద్భుతమైన దేవాలయం ఉంది. ఇక్కడి శిల్పకళను ఎంత వర్ణించినా తక్కువే. ముఖ్యంగా ఇక్కడ నంది కొమ్ముల నుంచి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకొంటే కొత్త దంపతులకు త్వరగా సంతాన యోగం కలుగుతుందని స్థానికులు నమ్మకం. అందువల్లే సుదూర ప్రాంతాల నుంచి కూడా కొత్త దంపతులు ఇక్కడికి వచ్చి దైవ దర్శనం చేసుకొని వెలుతుంటారు.

భోగనందీశ్వర దేవాలయం

భోగనందీశ్వర దేవాలయం

P.C: You Tube

ఈ అద్భుతమైన భోగ నందీశ్వర దేవాలయం చిక్కబళాపుర జిల్లాలో ఉంది. నంది బెట్టకు వెళ్లే దారిలోనే ఈ దేవాలయం ఉంది.

సులభంగా చేరుకోవచ్చు

సులభంగా చేరుకోవచ్చు

P.C: You Tube

అందువల్ల సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. బెంగళూరు రైల్వేస్టేషన్ నుంచి ఇక్కడికి కేవలం 54 కిలోమీటర్లు కాగా , చిక్కబళాపురం నుంచి 6.5 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది.

నంది బెట్ట నుంచి

నంది బెట్ట నుంచి

P.C: You Tube

ఇక నంది బెట్ట నుంచి 9.5 కిలోమీటర్లదూనరంలో ఈ భోగ నందీశ్వర దేవాలయం ఉంది. ఈ పవిత్రమైన హిందూ దేవాలయంలో పరమశివుడిని లింగ రూపంలో ఆరాధిస్తారు.

దక్షిణ భారత శైలి

దక్షిణ భారత శైలి

P.C: You Tube

దక్షిణ భారత శైలి వాస్తు ప్రకారం ఈ దేవాలయాన్ని నిర్మించారు. బెంగళూరుకు అత్యంత దగ్గరగా ఉన్న ఈ దేవాలయాన్ని ఒక రోజులోపు చూసిరావడానికి వీలవుతుంది.

అత్యంత పురాతన దేవాలయం

అత్యంత పురాతన దేవాలయం

P.C: You Tube

అత్యంత పురాతన దేవాలయమైన ఈ భోగనందీశ్వర దేవాలయాన్ని క్రీస్తు శకం 9వ శతబ్దంలో నోలంబ వంశానికి చెందిన రాజులు నిర్మించారు.

అనేక మంది రాజులు

అనేక మంది రాజులు

P.C: You Tube

ఇక్కడ విశేషం ఏమిటంటే గంగా, చోళ, రాష్ట్రకూటులు, హొయ్సళ, విజయనగర రాజులు ఈ దేవాలయ అభివ`ద్ధికి అనేక కానులకులు అందజేశారు.

అనేక ఉపాలయాలు

అనేక ఉపాలయాలు

P.C: You Tube

ఈ దేవాలయంలోని శిల్ప సంపదను ఎంత వర్ణించినా తక్కువే. ఈ దేవాలయం అవారణంలో అరుణాచలేశ్వర, ఉమా మహేశ్వర, భోగనందీశ్వర పేరుతో మూడు ఉపాలయాలు ఉన్నాయి.

నయన మనోహరంగా

నయన మనోహరంగా

P.C: You Tube

ఈ మూడు ఉపాలయాలే కాకుండా ఈ దేవాలయంలో అనేక చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అందమైన కళాక`తులతో చెక్కిన అనేక రాతి స్తంభాలతో కూడిన మంటపాలు నయన మనోహరంగా మనకు కనిపిస్తాయి.

దేవతా విగ్రహాలు

దేవతా విగ్రహాలు

P.C: You Tube

ఈ రాతి స్తంభాల పై దేవతా విగ్రహాలు, పౌరాణిక పురుషులు, అనేక జంతువులు, పక్షులను అందంగా చెక్కారు. అందువల్లే అన్ని వందల రాతి స్తంభాలు ఉన్నా కూడా ఏ ఒక్కటి మరొక రాతి స్తంభం వలే కనిపించదు.

ఆనంద మంటపం

ఆనంద మంటపం

P.C: You Tube

ముఖ్యంగా ఈ దేవాలయంలో ఆనంద మంటపాన్ని చూసి తీరాల్సిందే. ఈ మంటపం అర్థనారీశ్వర దేవాలయం ముందు భాగంలో నిర్మించారు.

హెయ్సళ కాలం

హెయ్సళ కాలం

P.C: You Tube

ముఖ్యంగా హొయ్సళ కాలం నాటి కళ్యాణ మంటపంలో అనేక సూక్ష్మ రాతి విగ్రహాలను మనం చూడవచ్చు. ఈ దేవాలయంలో శివుడు, పార్వతి, విష్ణు, మహాలక్ష్మి, బ్రహ్మ, సరస్వతి, సూర్య తదితరుల చిత్రాలను, శిల్పాలను మనం ఇతర మంటపాల్లో చూడవచ్చు.

మరింత సొబగు

మరింత సొబగు

P.C: You Tube

దేవలయం బయట ఉన్న గోడల పై కూడా అనేక చిత్రాలను మనం చూడవచ్చు. ముఖ్యంగా దేవాలయం బయటి గోడ పైఉన్న సప్తరుబుుషుల విగ్రహాలు దేవాలయానికి మరింత సొబగును తీసుకువస్తున్నాయి.

భోగ నందీశ్వరుడు

భోగ నందీశ్వరుడు

P.C: You Tube

ఈ దేవాయంలో ముఖ్యంగా చూడదగినది భోగ నందీశ్వర దేవాలయం. దీనికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహానికి కూడా చిన్న మంటపాన్ని నిర్మించడం విశేషం.

భోగ నందీశ్వరుడు

భోగ నందీశ్వరుడు

P.C: You Tube

ఈ దేవాయంలో ముఖ్యంగా చూడదగినది భోగ నందీశ్వర దేవాలయం. దీనికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహానికి కూడా చిన్న మంటపాన్ని నిర్మించడం విశేషం.

కొమ్ముల మధ్య నుంచి

కొమ్ముల మధ్య నుంచి

P.C: You Tube

ఈ నంది విగ్రహం కొమ్మల మధ్య నుంచి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకొంటే మోక్షం తథ్యమని చెబుతారు. కొత్తగా పెళ్లైన వారు ఈ దేవాలయంలోని భోగనందీశ్వర, అర్థనారీశ్వరుడిని దర్శనం చేసుకొంటే వారి కాపురం బాగుండటమే కాకుండా మంచి సంతానం కలుగుతుందని నమ్ముతారు.

సభా మంటపం

సభా మంటపం

P.C: You Tube

విజయనాగర సామ్రజ్య కాలంలో ఈ భోగ నందీశ్వర దేవలయంలో సభ మంటపాన్ని నిర్మించారు. అదే విధంగా విజయ నగర కాలంలోనే ఈ దేవాలయం మధ్య ఒక కొలను కూడా నిర్మించారు.

వీండో ఆర్ట్

వీండో ఆర్ట్

P.C: You Tube

దీనికి ఆ శ్రీ క`ష్ణ దేవరాయుల పేరు పెట్టారు. ఇక ఈ భోగనందీశ్వర దేవాలయంలో విండో ఆర్ట్ ఎంతో ప్రఖ్యాతి గాంచినది. దీని పై అధ్యయనం చేయడానికి విదేశీలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

శిల్ప కళా వైభవం

శిల్ప కళా వైభవం

P.C: You Tube

ఈ విండోఅర్ట్ తో పాటు వసంత మంటపాన్ని శ్రీ క`ష్ణ దేవరాయుల కాలంలో నిర్మించారు. ఈ శిల్పాలను చూస్తే ఉంటే ఆనాటి శిల్పకళా వైభవం గుర్తుకు రావడం మనక పోదు.

ఇక్కడ మాత్రమే

ఇక్కడ మాత్రమే

P.C: You Tube

ముఖ్యంత అతి సూక్ష్మంగా చెక్కిన లతలు, పక్షులు, జంతువులతో కూడిన స్తంభాలు చూపరులను ముగ్దులను చేస్తుంది. ఇలాంటి స్తంభాలను మనం ఇక్కడ తప్ప మరెక్కడా చూడలేము.

పార్వతీ దేవికి కూడా

పార్వతీ దేవికి కూడా

P.C: You Tube

ఇక్కడ పార్వతీ దేవికి కూడా వేరుగా చిన్న ఉపాలయం ఉంది. ఇర ఉమా మహేశ్వర దేవాలయం, వసంతమంటపం, అరుణాచలేశ్వర దేవాలయం లోని శిల్పాలను చూసి తీరాల్సిందే.

భారత దేశంలో ఏక శిలా నంది విగ్రహాలు చూశారాభారత దేశంలో ఏక శిలా నంది విగ్రహాలు చూశారా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X