Search
  • Follow NativePlanet
Share
» »భారత దేశంలో ఏక శిలా నంది విగ్రహాలు చూశారా

భారత దేశంలో ఏక శిలా నంది విగ్రహాలు చూశారా

భారత దేశంలోని పెద్ద నంది విగ్రహాల గురించి కథనం.

హిందూ పురాణాల్లో, సంస్కతి సంప్రదాయాల్లో నంది లేదా ఎద్దుకు విశేష ప్రాధాన్యత కల్పించారు. శివపార్వతులు నివశించే కైలాస పర్వతానికి నంది ద్వారపాలకుడిగా ఉంటారని హిందూ పురాణాలు చెబుతాయి. ఆ దేవదేవుడి వాహనమైన నందికి కూడా పరమశివుడితో పాటు పూజలు నిర్వహించడం మన హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం. ఆ పరమశివుడు ప్రధాన దైవంగా ఉన్న దేవాలయాల్లో నంది సామాన్యంగా ఉంటాడు. నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని సందర్శిస్తే కోరిన కోర్కెలు త్వరగా నెరవేరుతాయని చెబుతారు. ఇదిలా ఉండగా భారత దేశంలో కొన్ని చోట్ల బృహదకారంలోని నంది విగ్రహాలను చూడవచ్చు. అటువంటి విగ్రహాలు ఉన్న కొన్ని పర్యాటక కేంద్రాల వివరాలు మీ కోసం...

లేపాక్షి

లేపాక్షి

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షిలో నంది విగ్రహం భారత దేశంలోని పెద్ద నంది విగ్రహాల్లో మొదటి స్థానంలో నిలుస్తుంది. దీని ఎత్తు 15 అడుగులు కాగా, వెడల్పు 27 అడుగులు.

మనసు అల్లకల్లోలాన్ని తగ్గించే ‘ఆల్మోరా'మనసు అల్లకల్లోలాన్ని తగ్గించే ‘ఆల్మోరా'

బృహదీశ్వర దేవాలయం

బృహదీశ్వర దేవాలయం


P.C: You Tube
తమిళనాడులోని తంజావూరు పట్టణంలో యునెస్కో గుర్తింపుపొందిన బృహదీశ్వర ఆలయంలో అతి పెద్దదైన నంది విగ్రహం ఉంది. దీని ఎత్తు 13 అడుగులు కాగా, వెడల్పు 16 అడుగులు.

చాముండి బెట్ట

చాముండి బెట్ట

P.C: You Tube
మైసూరులోని చాముండి బెట్ట పై ప్రఖ్యాత నంది విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎత్తు కూడా 15 అడుగులు కాగా వెడల్పు 24 అడుగులు. క్రీస్తుశకం 1664లో రాజ ఒడయార్ కాలంలో ఈ నంది విగ్రహాన్ని స్థాపించారు.

బసవన గుడి

బసవన గుడి

P.C: You Tube
ఐటీ నగరి బెంగళూరులో బసవన గుడిలో ప్రధాన దైవం నంది కావడం గమనార్హం. ఇక్కడ 15 అడుగుల ఎత్తైన నంది విగ్రహం ఉంది. 20 అండుగుల వెడల్పు కలిగిన ఈ విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రతి ఏడాది ఇక్కడ డిసెంబర్ లో జరిగే వేరుశెనగ పరుష చాలా ఉత్సాహంగా జరుగుతుంది.

హొయ్సలేశ్వర, శాంతలేశ్వర దేవాలయ

హొయ్సలేశ్వర, శాంతలేశ్వర దేవాలయ

P.C: You Tube
సుమారు 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయాల్లో రెండు పెద్ద నంది విగ్రహాలను చూడవచ్చు. గ్రానైట్ రాయితో ఏర్పాటు చేయబడిన ఈ నంది విగ్రహాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి.

విరూపాక్ష దేవాలయం

విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
యునెస్కో చేత గుర్తింపు పొందిన మరో శైవదేవాలయం హంపిలోని విరూపాక్ష దేవాలయం. విజయ నగర సామ్రాజ్య వైభవానికి ఈ దేవాలయం చిహ్నం. ఇక్కడ మనం పెద్ద నంది విగ్రహాన్ని చూడవచ్చు.

నంది దేవస్థానం.

నంది దేవస్థానం.

P.C: You Tube
మధ్యప్రదేశ్ లోని ఖజురహో దేవాలయాల సముదాయంలో ఈ నంది దేవాలయం ఉంది. శివుడు ప్రధాన దైవంగా పూజించే విశ్వనాథ దేవాలయానికి ఎదురుగానే ఈ ఈ నంది దేవాలయం ఉంటుంది. ఇక్కడ నంది చూడటానికి చాలా ఆకర్షనీయంగా కనిపిస్తుంది.

అ (హో) బిలంలో 'అనంత'సంపద ఉందా? రాబోయే తరం వారికి అది సొంతమా?అ (హో) బిలంలో 'అనంత'సంపద ఉందా? రాబోయే తరం వారికి అది సొంతమా?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X