Search
  • Follow NativePlanet
Share
» »హల్దీరాం ఆలూ భుజియా ఎక్కడ పుట్టిందో తెలుసా ?

హల్దీరాం ఆలూ భుజియా ఎక్కడ పుట్టిందో తెలుసా ?

బికనేర్ రంగురంగుల పండుగలకు, రాజపుత్ర సంస్కృతికి, అద్భుత భవనాలకు, శిల్పసంపదకు, ఇసుకరాయితో నిర్మించిన కోట బురుజులకు, రుచికరమైన భుజియా వంటకాలకు ప్రసిద్ధి చెందినది.

By Mohammad

రాజపుత్రుల వంటకం భుజియా. భుజియా వంటకాన్ని రాజపుత్రులు ఎంతో ఇష్టంగా ఆరగించేవారు. ఈ భుజియా వంటకాన్ని తయారుచేయటానికి వారు ఒక భారీ పరిశ్రమనే స్థాపించారంటే వారికి ఇదంటే ఎంతిష్టమో అర్థమువుతుంది. దాని బీజమే ఇప్పుడు మనం చూస్తున్న హల్దీరాం..!

థార్ ఎడారి లో ఏమేమి చూడాలి ?

హల్దీరాం పుట్టుక థార్ ఎడారి మధ్యలో ఉన్న 5 ప్రధాన నగరాలలో ఒకటైన బికనేర్ లో స్థాపించబడింది. బికనేర్ రంగురంగుల పండుగలకు, రాజపుత్ర సంస్కృతికి, అద్భుత భవనాలకు, శిల్పసంపదకు, ఇసుకరాయితో నిర్మించిన కోట బురుజులకు, రుచికరమైన భుజియా వంటకాలకు ప్రసిద్ధి చెందినది. దుంగర్ సింగ్ మహారాజు మొట్టమొదటసారిగా భుజియా వంటకాన్ని అతిథులకు తయారుచేయించి వడ్డించారు.

బికనేర్ నోరూరించే వంటకాలకే కాక పర్యాటక ప్రదేశాలకు కూడా ప్రసిద్ధికెక్కింది. లాల్ ఘర్, గజ్నేర్ భవనం, దేవాలయాలు, వన్యమృగ అభయారణ్యాలు, మ్యూజియాలు, ఒంటెల పెంపక కేంద్రాలు మొదలగునవి ఇక్కడ చూడవచ్చు.

మెహ్రాన్ ఘర్ ఫోర్ట్ : ఒక రాయల్ టూర్ !

గజ్నేర్ భవనం

గజ్నేర్ భవనం

గజ్నేర్ భవనం బికనేర్ లో కలదు. ఈ భవనాన్ని రాజులు వేటకు వచ్చేటప్పుడు, ఏకాంతాన్ని గడిపేటప్పుడు విడిదిగా వినియోగించేవారు. సంక్లిష్టంగా చెక్కిన చెక్కిళ్ళ స్తంభాలు, కిటికీలు, తెరలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. కిటికీ నుండి బయట అడవి జంతువులను చూడవచ్చు.

చిత్రకృప : Daniel Villafruela

జునాఘర్ ఫోర్ట్

జునాఘర్ ఫోర్ట్

దుర్భేద్యమైన ఈ కోటను 1593 లో రాయ్ సింగ్ మహారాజు నిర్మించారు. ఈ కోట చుట్టూ కందకంతో పాటు, అనూప్ మహల్, గంగా నివాస్, రాంగ్ మహల్, చంద్ర మహల్, ఫూల్ మహల్, కరణ్ మహల్, షీష్ మహల్ వంటి అనేక అందమైన భవనాలు ఉన్నాయి. ఈ భవనాలను దుల్మెరా అనే ఎరుపు ఇసుక రాయి తో నిర్మించారు. కోటకు 986 పొడవైన గోడలు, 37 బురుజులు, రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి.

చిత్రకృప : nevil zaveri

కర్ణిమాత దేవాలయం

కర్ణిమాత దేవాలయం

కర్ణిమాత దేవాలయాన్ని ఎలుకల దేవాలయం అని కూడా అంటారు. డెష్నోక్ లో పర్యాటకులకు ఇది ప్రధాన ఆకర్షణ. ఇది బికనేర్ కు 30 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ దేవాలయంలో దుర్గా దేవత అవతారమైన కర్ణి మాత పూజించబడుతుంది. ఎలుక కనపడితే శుభసూచికంగా భావిస్తారు.

చిత్రకృప : Jean-Pierre Dalbéra

లాల్ ఘర్ ప్యాలెస్

లాల్ ఘర్ ప్యాలెస్

లాల్ ఘర్ పాలెస్ 1902 లో గంగ సింగ్ రాజు ఎర్ర రాయిని ఉపయోగించి నిర్మించారు. ఈ అందమైన భవనం అతని తండ్రి లాల్ సింగ్ మహారాజు జ్ఞాపకార్ధం కట్టింది. ఈ భవనపు నిర్మాణంలో మొఘలుల, రాజపుత్రుల, యురోపియన్ల మిళితమైన నిర్మాణ శైలితో భవన నమూనాను అద్భుతంగా చిత్రీకరించారు.

చిత్రకృప : tjollans

సాదుల్ సింగ్ మ్యూజియం

సాదుల్ సింగ్ మ్యూజియం

సాదుల్ సింగ్ మ్యూజియం, లాల్ ఘర్ భవన మొదటి అంతస్తులో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. పురాతన ఛాయాచిత్రాలు, వేట విజయ చిహ్నాలు, అద్భుతమైన చిత్రలు, కళాకృతులు వంటి అనేకం ఇక్కడ ప్రదర్శిస్తుంటారు. ఈ మ్యూజియం సందర్శకుల కోసం సోమవారం నుండి శనివారం వరకు (ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు) తెరిచి ఉంచుతారు.

చిత్రకృప : Schwiki

భందసేర్ జైన దేవాలయం

భందసేర్ జైన దేవాలయం

భందసేర్ జైన దేవాలయం బికనేర్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన దేవాలయం. 15 వ శతాబ్దపు ఈ దేవాలయం జైనుల 5 వ తీర్థంకరుడు సుమతినాథ్ కోసం నిర్మించారు. పర్యాటకులు మంత్రముగ్ధ౦ చేసే అద్దాల పని, కుడ్య చిత్రాలు, గోడలపై బంగారపు ఆకు చిత్రాలను చూడవచ్చు.

చిత్రకృప : Himanshu Yogi

గజ్నేర్ అభయారణ్యం

గజ్నేర్ అభయారణ్యం

బికనేర్ సందర్సించే వన్యప్రాణి ఔత్సాహికులకు ఒక ప్రసిద్ధ ఆకర్షణ ఈ అభయారణ్యం. చింకారాలు, కృష్ణ జింక, నిలగైలు, ఎడారి నక్కలు, అడవి పందులను ఇక్కడ పెద్ద సంఖ్యలో చూడవచ్చు. ఇసుక వలస బాతు, నీటి కోళ్ళు వంటి పక్షులను పెద్ద సంఖ్యలో ఈ అభయారణ్యంలో చూడవచ్చు. గతంలో ఈ అభయారన్యాన్ని బికనేర్ రాజులు రాజరిక వేట ప్రాంతంగా ఉపయోగించేవారు.

చిత్రకృప : Archit Ratan

గంగా గోల్డెన్ జూబ్లీ మ్యూజియం

గంగా గోల్డెన్ జూబ్లీ మ్యూజియం

గంగా గోల్డెన్ జూబ్లీ మ్యూజియం, బికనేర్ లోని లాల్ గర్ పాలెస్ సమీపంలో ఉంది. 1937 సంవత్సరంలో స్థాపించిన ఈ మ్యూజియం ప్రస్తుతం రాజస్తాన్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో టెర్రకోట సామాను, ఆయుధాలూ, చిత్రాలూ, శిల్పాలు, నాణాల భారీ సేకరణను ప్రదర్శిస్తారు.

చిత్రకృప : Schwiki

కాళీబంగన్

కాళీబంగన్

కాళీబంగన్, బికనేర్ లో ఎంతో చారిత్రిక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం. పురావస్తు శాస్త్రవేత్తల ప్రయత్నాల వల్ల కాలిబంగన్ వద్ద సింధు నాగరికత అనేక విజయాల అవశేషాలను చూడవచ్చు. తవ్వకాలలో శ్మశాన వాటిక, దున్నిన పొలం, రోజూ ఉపయోగించే అనేక వస్తువులు బయటపడ్డాయి.

చిత్రకృప : Kk himalaya

కర్ణిమాత జాతర

కర్ణిమాత జాతర

డెష్నోక్ లో కర్ణిమాత జాతర ప్రసిద్ధి చెందిన పండుగ. ఈ పండుగను ఏటా రెండు సార్లు అంటే మార్చి - ఏప్రిల్ మరియు సెప్టెంబర్ - అక్టోబర్ లలో ఒక్కొక్కసారి పది రోజులపాటు నిర్వహిస్తారు.

చిత్రకృప : Vberger

కొలయాట్ మందిరం

కొలయాట్ మందిరం

కొలయాట్ దేవాలయం, బికనేర్ కు 15 కిలోమీటర్ల దూరంలో కొలయాట్లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. కొలయాట్, వేదకాలపు ఋషి కపిలుడు తన శరీరాన్నిఒక మర్రి చెట్టు కింద త్యజించిన స్థలంగా విశ్వసిస్తారు. కార్తీక మాసంలో ప్రతిఏటా పెద్దఎత్తున ఉత్సవం జరుగుతుంది.

చిత్రకృప : Avid Hills

హల్దీరాం

హల్దీరాం

హల్దీరాం భుజియా వంటానికి ప్రసిద్ధి. క్రీ.శ 1877 లో బికనేర్ లో మొట్టమొదటి భుజియా పరిశ్రమను నెలకొల్పారు. ఆతరువాత దీని బీజం గంగా భిసేన్ అగర్వాల్ చేత 1937 లో హల్దీరాం గా స్థాపించబడింది.

కరకరలాడే భుజియా వంటకాన్ని శనగ పిండి, మాసాల, పెసరపప్పు, వంట నూనె, ఉప్పు, కారం, మిరియాలు, యాలకులు, లవంగాలు వాడి తయారుచేస్తారు.

చిత్రకృప : Prateek Karandikar

ఆట పాటలు

ఆట పాటలు

ఏటా బికనేర్ లో ఒంటెల పండుగను నిర్వహిస్తారు స్థానికులు. పండుగల సమయంలో ఒంటెలను అందంగా ముస్తాబు చేసి రంగురంగుల దుస్తులతో, ఆభరణాలతో అలంకరిస్తారు.

ఆటలు : ఒంటెల విన్యాసాలు, ఒంటెల నుండి పాలు పిండటం, ఒంటె పందేలు మొదలుగునవి.

చిత్రకృప : Camelot

వసతి

వసతి

బికనేర్ లో వసతి కై రాజభవనాలు, అందంగా అలంకరించబడిన ప్యాలెస్ లు ఉన్నాయి. ఏసీ, నాన్ - ఏసీ తరగతులతో పాటు లగ్జరీ, విలాసవంతమైన గదులు బడ్జెట్ ధరలలో దొరుకుతాయి.

బికనేర్ హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

చిత్రకృప : Niyam Bhushan

బికనేర్ ఇలా చేరుకోవచ్చు ?

బికనేర్ ఇలా చేరుకోవచ్చు ?

విమాన మార్గం : సమీపాన 251 KM ల దూరంలో జోద్పూర్ విమానాశ్రయం కలదు. పర్యాటకులు క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి బికనేర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : బికనేర్ లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి జైపూర్, జోద్పూర్, ఢిల్లీ, ఆగ్రా, అజ్మీర్ మొదలగు ప్రాంతాల నుండి రైళ్ళు వస్తుంటాయి.

బస్సు / రోడ్డు మార్గం : ఢిల్లీ, జైపూర్, ఆగ్రా, జోద్పూర్, అహ్మదాబాద్, జైసల్మీర్, ఉదయపూర్ ప్రాంతాల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులలో బికనేర్ చేరుకోవచ్చు.

చిత్రకృప : indian railinfo

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X