Search
  • Follow NativePlanet
Share
» »ఈ గణపతికి కోర్కెలను ఎలా విన్నవిస్తారో తెలుసా?

ఈ గణపతికి కోర్కెలను ఎలా విన్నవిస్తారో తెలుసా?

బిక్కబోలు లక్ష్మీ గణపతి దేవాలయం గురించిన కథనం

భారత దేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ముక్కోటి దేవతలు ఉన్న ఈ దేశంలో మొదటి పూజ మాత్రం ఆ వినాయకుడికే చేస్తారు. అటువంటి వినాయకుడు కొలువై ఉన్న ఓ దేవాలయం మాత్రం ప్రపంచ దష్టిని ఆకర్షిస్తోంది. దేశ విదేశాల నుంచి ఇక్కడకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అందుకు కారణం ఆ ఆది దేవుడి చెవిలో మన కోరికలను నేరుగా చెప్పుకోవడానికి వీలు ఉండటమే. దేశంలో మరెక్కడా ఇలా వినాయకుడి చెవిలో కోరికలను చెప్పుకోవడానికి వీలు కాదు. మరి అలాంటి దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

P.C: You Tube

విశిష్టమైన ఈ గణపతి దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా బిక్కబోలు అనే గ్రామంలో ఉంది. అత్యంత శక్తిమంతుడిగా పేరొందించిన ఈ వినయకుడు స్వయంభువుడు. అంటే భూమి నుంచి తనంత తానుగా జన్మించినవాడని అర్థం.

దేవి పాదపద్మాల నుంచి జాలవారే జలపాతంలో స్నానం చేస్తే మోక్షమేదేవి పాదపద్మాల నుంచి జాలవారే జలపాతంలో స్నానం చేస్తే మోక్షమే

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

P.C: You Tube

ఈ వినాయకుడి మహిమలు తెలిసి క్రీస్తుశకం 840లో చాలుక్యులు ఈ వినాయకుడికి సుందరమైన దేవాలయాన్ని నిర్మించారని స్థానిక రాతిశాసనాలు స్పష్టం చేస్తున్నాయి. స్థానిక కథనాన్ని అనుసరించి ఈ దేవాలయం మొదట్లో భూమిలోకి కూరుకుపోయి ఉండేదని చెబుతారు.

ఈ గుహలను ఏలియన్స్ నిర్మించాయా,ఈ గుహలను ఏలియన్స్ నిర్మించాయా,

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

P.C: You Tube

ఒకరోజు స్వామివారు నేరుగా ఒక భక్తుల కలలోకి వచ్చి తాను ఉన్న చోటును వివరించాడు. అటు పై ఆ భక్తుడు ఈ విషయాన్ని తన స్నేహితుల ద్వారా భక్తులకు తెలియజేశాడు. దీంతో గ్రామస్తులంతా కలిసి ఈ విగ్రహాన్ని వెలికి తీసినట్లు చెబుతారు.

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

P.C: You Tube

ఇక భూమి నుంచి బయటికి వచ్చిన ఈ దేవాలయం రోజురోజుకు పరిమాణంలో పెరుగుతూ ఉండేది. ఇప్పటికీ ఈ పెరుగుదలను మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ దేవాలయంలో వినాయక విగ్రహానికి ఉన్న తొండం కుడివైపునకు ఉంటుంది.

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

P.C: You Tube

ఇది చాలా అరుదైన విషయం. ముఖ్యంగా ఈ దేవాలయానికి వచ్చే భక్తులు తమ కోర్కెలను స్వామి వారి చెవిలో చెబుతారు. అటు పై ముడుపులు కట్టుకొంటాడు. ఇలా చేయడం వల్ల చాలా కాలంగా నెరవేరని తమ కోర్కెలు నెరవేరుగాయని భక్తుల నమ్మకం. ఇందుకు సంబంధించిన అనేక నిదర్శనాలను చూపిస్తారు.

నవకైలాస క్షేత్రాలు చూశారా?నవకైలాస క్షేత్రాలు చూశారా?

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

P.C: You Tube

అదే విధంగా ఇక్కడ ఉన్న నంది, భూలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకొంటే అన్ని పాపాలు హరించి పోతాయని భక్తుల నమ్మకం. ఈ బిక్కవోలు గ్రామంలో తూర్పు చాళుక్యులు నిర్మించిన అనేక దేవాలయాలు ఉన్నాయి.

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

P.C: You Tube

క్రీస్తుశకం 849 నుంచి 892 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చాళుక్యరాజు 3వ గుణ విజయాదిత్య పేరు పై ఈ గ్రామానికి ఆ పేరు వచ్చినట్లు చెబుతారు. ఆయన కాలంలో నిర్మించిన అనేక దేవాలయాల్లో శ్రీ రాజ రాజేశ్వరీ దేవాలయం, శ్రీ చంద్రశేఖర స్వామి దేవాలయం ముఖ్యమైనవి.

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

P.C: You Tube

రాజరాజేశ్వరీ దేవాలయంలోనికి ప్రవేశించిన వెంటనే దివ్యమైన అనుభూతి కలుగుతుంది. అదే విధంగా ఈ దేవాలయంలో విరభద్ర స్వామి, సుబ్రహ్మణ్యస్వామి తదితర దేవుళ్లకు కూడా దేవాలయాలు ఉన్నాయి.

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

P.C: You Tube

గణపతి ఉత్సవాల సమయంలో సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవాలు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఇక్కడ గణపతి హోమం నిర్వహించడం వల్ల ఇంటిలో ఎటువంటి అశుభాలు జరగవని చెబుతారు.

మీరు మీ కుంటుంబ చూడదగ్గ పర్యాటక కేంద్రాలుమీరు మీ కుంటుంబ చూడదగ్గ పర్యాటక కేంద్రాలు

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

P.C: You Tube

అందుకే ఇక్కడ గణపతి హోమం జరిపించడానికి భక్తులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇందుకోసం నెల ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకొంటారు. ఇక ఇక్కడ ప్రాచీన జైన దేవాలయాలు కూడా ఉన్నాయి.

కాళరాత్రి ప్రతి రూపం ఈ అమ్మవారుకాళరాత్రి ప్రతి రూపం ఈ అమ్మవారు

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

P.C: You Tube

ఈ జైన దేవాలయాల శిల్ప సంపదకు ఎటువంటి వారైనా ఆకర్షితులు కావాల్సిందే. అదే విధంగా ఈ బిక్కవోలు లో గోలి లింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయం గర్భగుడిలో ఉన్న 33 రాతి శాసనాలు ఉన్నాయి.

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

P.C: You Tube

ఇవన్నీ ఈ బిక్కవోలుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తాయి. అదే విధంగా ఈ దేవాలయం ముఖమంటపంలో శివపార్వతులు కౌగలించుకొన్న స్థితిలో ఉన్న విగ్రహాన్ని చూసి ఎటువంటి వారైనా మై మరిచిపోవాల్సిందే.

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

P.C: You Tube

ఈ బిక్కవోలు లో ఉన్న గణపతి దేవాలయాన్ని చేరుకోవాలంటే మొదట రాజమండ్రి చేరుకోవాలి. అక్కడి నుంచి బిక్కవోలు 30 కిలోమీటర్ల దూరం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పట్టణమైన కాకినాడకు 31 కిలోమీటర్ల దూరంలో బిక్కవోలు ఉంటుంది.

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

P.C: You Tube

రాజమండ్రి, కాకినాడ నుంచి బిక్కవోలుకు నేరుగా బస్సులు ఉన్నాయి. రైలు మార్గం కూడా ఉంది. బిక్కవోలుకు 10 కిలోమీటర్ల దూరంలో సామర్లకోట రైల్వే స్టేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి నేరుగా రైలు సౌకర్యం ఉంది.

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

P.C: You Tube

అదేవిధంగా బిక్కవోలుకు సమీపంలో మధురపూడిలో ఎయిర్ పోర్ట్ ఉంది. మధుపూడి నుంచి బిక్కవోలుకు 35 కిలోమీటర్లు. ట్యాక్సీలు బస్సులు అందుబాటులో ఉంటాయి. రాజమండ్రి, కాకినాడ పర్యాటకానికి వెళ్లినవారు బిక్కవోలుకు తప్పకుండా వెలుతారు.

చనిపోయే విషయాన్ని ముందుగా తెలియజేసే దేవాలయం ఇదే?చనిపోయే విషయాన్ని ముందుగా తెలియజేసే దేవాలయం ఇదే?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X