Search
  • Follow NativePlanet
Share
» »బుద్ధుని జీవిత ఘట్టాలు ... దృశ్యాలలో !

బుద్ధుని జీవిత ఘట్టాలు ... దృశ్యాలలో !

By Super Admin

భారతదేశంలో పచ్చదనంతో కూడిన పరిశుభ్రమైన పది పచ్చని నగరాలు ఏవేవో మీకు తెలుసా ?భారతదేశంలో పచ్చదనంతో కూడిన పరిశుభ్రమైన పది పచ్చని నగరాలు ఏవేవో మీకు తెలుసా ?

ఢిల్లీ లో ఉన్న నేషనల్ మ్యూజియం లో బుద్ధునికి సంబంధించిన జీవిత విశేషాలను (గాథలను) ఒక ఏనుగు దంతం పై అంతర్భాగాలలో చెక్కిన కళాకృతి చూపరులను, చరిత్ర కారులను ఇట్టే కట్టిపడేస్తుంది. దాదాపు 5 అడుగుల పొడవు ఉన్న ఈ ఏనుగు దంతపు కళాకృతి పైన బుద్ధుని జీవిత విశేషాలకు సంబంధించిన 43 అద్భుత ఘట్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇంకెందుకు ఆలస్యం ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలోకి వెళ్ళి గౌతముని జీవిత విశేషాలను మనమూ ఒకసారి చూసొద్దాం పదండి ..

కపిలవస్తు నగరం

కపిలవస్తు నగరం

రాజకుమారుడైన సిద్ధార్ధుడు జీవించిన కపిలవస్తు నగరం చిత్ర రూపంలో

Photo Courtesy: Nomu420

బుద్ధుని తండ్రి

బుద్ధుని తండ్రి

గౌతమ బుద్ధుని తండ్రి మహారాజు శుద్ధోధనుడు కూర్చున్న రూపం

Photo Courtesy: Nomu420

బుద్ధుని తల్లి

బుద్ధుని తల్లి

మహారాణి మాయాదేవి నిద్రిస్తూ కల కంటున్న చిత్ర రూపం

Photo Courtesy: Nomu420

తల్లితండ్రుల సందర్శనకై వెళుతూ ..

తల్లితండ్రుల సందర్శనకై వెళుతూ ..

మహారాణి మాయాదేవి ఆమె తల్లితండ్రుల సందర్శనకై రథం పై వెళుతున్న దృశ్యం

Photo Courtesy: Nomu420

మార్గ మధ్యలో

మార్గ మధ్యలో

తన తల్లి తండ్రులను చూడటానికి వెళుతున్న మాయాదేవి మార్గ మధ్యలో , లుంబిని అనే ప్రాంతంలో ఒక సాల వృక్షం కింద సిద్ధార్ధుడిని జన్మనిచ్చింది.

Photo Courtesy: Nomu420

నామకరణం

నామకరణం

తండ్రి శుద్దొధనుడు సిద్ధార్ధుని నామకరణం చేసి, అతని భవిష్యత్తు చెప్పమని, 8 మంది జ్యోతిష్యులను ఆహ్వానిస్తాడు. అందులో ఆసితుడనే ఋషి శుద్ధోధన మహారాజును సందర్శించడం.

Photo Courtesy: Nomu420

మాయాదేవి మరణం

మాయాదేవి మరణం

సిద్ధార్ధుడు జన్మించిన కొద్ది రోజులకే మాయాదేవి మరణం

Photo Courtesy: Nomu420

ఉద్యాన వనం

ఉద్యాన వనం

ఉద్యానవనం లో సిద్ధార్ధుడు కూర్చొని ఉన్న దృశ్యం

Photo Courtesy: Nomu420

సోదరుడు దేవదత్తుడు

సోదరుడు దేవదత్తుడు

దెబ్బతిన్న పక్షితో సిద్ధార్ధుడు మరియు వరసకు బుద్ధునికి సోదరుడు దేవదత్తుడు

Photo Courtesy: Nomu420

దెబ్బతిన్న పక్షి

దెబ్బతిన్న పక్షి

దెబ్బతిన్న పక్షిని కాపాడి, దానిని నయం చేస్తున్న సిద్ధార్ధుడు మరియు వరసకు బుద్ధునికి సోదరుడు దేవదత్తుడు

Photo Courtesy: Nomu420

స్వయంవరం

స్వయంవరం

యశోధర స్వయంవరంలో విల్లు ఎక్కు పెడుతున్న సిద్ధార్ధుడు

Photo Courtesy: Nomu420

యశోధర

యశోధర

స్వయంవరం లో గెలిచిన సిద్ధార్ధునికి పూల దండ వేస్తున్న యశోధర

Photo Courtesy: Nomu420

 ముసలి వ్యక్తి

ముసలి వ్యక్తి

ఒక ముసలి వాడిని కలిసిన సిద్ధార్ధుడు

Photo Courtesy: Nomu420

శవయాత్ర

శవయాత్ర

ఒక శవయాత్రను చూస్తున్న సిద్ధార్ధుడు

Photo Courtesy: Nomu420

ఋషి

ఋషి

తపస్సు లో ఉన్న యోగిని చూస్తున్న సిద్ధార్ధుడు

Photo Courtesy: Nomu420

నిష్క్రమణ

నిష్క్రమణ

నిద్రపోతున్న తన భార్యాబిడ్డ లను వదిలి వెళుతున్న సిద్ధార్ధుడు

Photo Courtesy: Nomu420

నిష్క్రమణ

నిష్క్రమణ

సహాయకుడు చండకుని తో పాటుగా రాజాగృహాన్ని వదిలి వెళుతున్న సిద్ధార్ధుడు

Photo Courtesy: Nomu420

సిద్ధుడు బుద్ధునిగా మారటం

సిద్ధుడు బుద్ధునిగా మారటం

రాజ దుస్తులు, నగలు తీసి వేసి జుట్టు కత్తిరించుకుంటున్న సిద్ధార్ధుడు

Photo Courtesy: Nomu420

 రాజగహలో భిక్షాటన

రాజగహలో భిక్షాటన

సిద్ధార్ధుడు ఒక స్త్రీ నుంచి బిక్ష స్వీకరించుకుంటున్న వైనం

Photo Courtesy: Nomu420

ధ్యానం

ధ్యానం

ధ్యానంలో ఉన్న సిద్ధార్ధుడు

Photo Courtesy: Nomu420

ధ్యానం

ధ్యానం

ధ్యానం లో ఉన్న సిద్ధార్ధుడినీ కలవడానికి వచ్చిన ఐదుగురు సన్యాసులు

Photo Courtesy: Nomu420

అభయ ముద్రలో

అభయ ముద్రలో

బుద్ధునిగా మారి అభయ ముద్రలో చెట్టు కింద కూర్చున్న సిద్ధార్ధుడు

Photo Courtesy: Nomu420

సుజాత

సుజాత

సుజాత అనే పల్లె పడుచు తెచ్చే కొద్ది అన్నాన్ని, పాలను ఆహారంగా తీసుకుంటున్న బుద్ధుడు

Photo Courtesy: Nomu420

మారుడు

మారుడు

మారుడు అనే రాక్షసుడు బుద్ధుని దృష్టి మరల్చాలని చూస్తున్న దృశ్యం

Photo Courtesy: Nomu420

పర్యటన

పర్యటన

దేశ పర్యటన చేస్తున్న బుద్ధుడు

Photo Courtesy: Sourindo Mohun Tagore

ధ్యానం

ధ్యానం

ధ్యాన ముద్రలో బుద్ధుడు

Photo Courtesy: Nomu420

పూర్వ స్నేహితులతో

పూర్వ స్నేహితులతో

బుద్ధుడు తన ఐదు గురు పూర్వ స్నేహితులను కలవడం. వీరే బుద్ధుని తొలి శిష్యులు అయ్యారు

Photo Courtesy: Nomu420

జటాధారి

జటాధారి

బుద్ధుడు అగ్ని పూజకుడైన జటాధారి కశ్యపున్ని ఓడించడం

Photo Courtesy: Nomu420

బుద్ధుని ప్రబోధాలు

బుద్ధుని ప్రబోధాలు

బుద్ధుడు జనబాహుళ్యాన్ని ఉద్దేశించి మాట్లాడటం

Photo Courtesy: Nomu420

పశువుల కాపరి

పశువుల కాపరి

పశువుల కాపరి తో పాటు బుద్ధుడు కూడా ఒక మేకపిల్లను పట్టుకొని నడుస్తున్న దృశ్యం

Photo Courtesy: Nomu420

మగధ రాజు

మగధ రాజు

బుద్ధుడి ని ఆహ్వానిస్తున్న మగధ రాజు

Photo Courtesy: Nomu420

బుద్ధుని శిష్యులు

బుద్ధుని శిష్యులు

శారిపుత్ర, మౌద్గల్యాయనులు బుద్ధుని శిష్యులు కావడం

Photo Courtesy: Nomu420

ఓదారుస్తున్న బుద్ధుడు

ఓదారుస్తున్న బుద్ధుడు

బిడ్డ మరణంతో శోక సముద్రం లో ఉన్న తల్లిని తేరుకోనేలా చేస్తున్న బుద్ధుడు

Photo Courtesy: Nomu420

కపిలవస్తు కి ఆహ్వానం

కపిలవస్తు కి ఆహ్వానం

శుద్ధోధనుడు బుద్ధుని తండ్రి తన రాజ్యం కపిలవస్తుకి బుద్ధుడి ని ఆహ్వానించడం

Photo Courtesy: Nomu420

భార్య, బిడ్డలతో

భార్య, బిడ్డలతో

భార్య యశోధార, కుమారుడు రాహులుడి తో బుద్ధుడు

Photo Courtesy: Nomu420

దీవెనలు

దీవెనలు

రాహులుడు తన తండ్రి బుద్ధుడి కాళ్ళకి పాదాభివందనం, బుద్ధుడు దీవించడం

Photo Courtesy: Nomu420

అమ్రాపాలి

అమ్రాపాలి

పేరుపొందిన వేశ్య అమ్రాపాలి బుద్ధునికి నమస్కారం చేయడం

Photo Courtesy: Nomu420

భోధనలు

భోధనలు

స్త్రీలు భవనాల మీద నుంచి బుద్ధుని భోధనలు చేయడం చూడటం

Photo Courtesy: Nomu420

నందుడు

నందుడు

బుద్ధుని ఎదుట నందుడు

Photo Courtesy: Nomu420

అడ్డుకోవడం

అడ్డుకోవడం

సంఘం నుంచి తప్పించుకోవాలనుకున్న నందుడిని బుద్ధుడు అడ్డుకోవడం

Photo Courtesy: Nomu420

పిచ్చి ఏనుగు

పిచ్చి ఏనుగు

మది సరిగా లేని పిచ్చి ఏనుగు బుద్ధుని వైపు పరుగులు తీయడం

Photo Courtesy: Nomu420

లొంగదీసుకోవడం

లొంగదీసుకోవడం

బుద్ధుడు ఆ ఏనుగును శాంతంగా లొంగదీసుకోవడం

Photo Courtesy: Nomu420

ప్రవచనాలు

ప్రవచనాలు

బుద్ధుడు గొప్ప సమూహాన్ని ప్రవచించడం

Photo Courtesy: Nomu420

నిర్వాణం

నిర్వాణం

బుద్ధుని మహాపరి నిర్వాణం

Photo Courtesy: Nomu420

ఢిల్లీ ఎలా చేరుకోవాలి ??

ఢిల్లీ ఎలా చేరుకోవాలి ??

విమాన సదుపాయం

ఢిల్లీ లోని అంతర్జాతీయ విబానాస్రయం స్థానిక మరియు అంతర్జాతీయ విమానాశ్రయం గా సేవలను అందిస్తుంది. బెంగుళూరు, పూణే, ముంబై, మొదలగు ప్రధాన నగరాల నుండి విమానాలు కలవు. ఈ ఎయిర్ పోర్ట్ ప్రపంచం లోని ప్రధాన ప్రదేశాలకు చక్కని విమాన సేవలను అందిస్తుంది.

రైలు సదుపాయం

రైలు ప్రయాణం లో దేశం లో కల ఎ ప్రాంతం నుండి అయినా సరే ఢిల్లీ కి తేలికగా చేరవచ్చు. ఢిల్లీ లోనే అనేక రైలు స్టేషన్ లు కలవు. లోకల్ గా ప్రయాణం చేయాలంటే, ఢిల్లీ మెట్రో స్టేషన్ లు అనుకూలం. బస్సు రవాణా కంటే కూడా చవకగా వుండి వేగంగా చేరుస్తాయి. ఢిల్లీ, న్యూ ఢిల్లీ, నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ , ఆనంద్ విహార్ రైల్వే టెర్మినల్ , ఓల్డ్ ఢిల్లీ మరియు సారాయి రోహిల్ల ప్రధాన రైలు స్టేషన్ లు.

రోడ్డు సదుపాయం

దేశం లోని ప్రతి రాష్ట్రం నుండి ఢిల్లీ కి చక్కటి రోడ్డు సదుపాయం ఉంది. దేశం లోని వివిధ భాగాలను కలుపుతూ ఢిల్లీ కి అయిదు జాతీయ రహదారులు కలవు. ఇవి నెం.1,2,8,10 మరియు 24 లు. కనుక దేశం లోని ఏ ప్రదేశం నుండి అయినా సరే, తేలికగా చేరవచ్చు.

Photo Courtesy: Superfast1111

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X