Search
  • Follow NativePlanet
Share
» »పక్షి రెక్కలతో పాటు విహరిద్దాం

పక్షి రెక్కలతో పాటు విహరిద్దాం

రాష్ర్టంలోని ఉత్తమమైన పక్షి సంరక్షణ కేంద్రాల పై కథనం.

By Beldaru Sajjendrakishore

ప్రకృతి రమణీయతకు, వేలాది జాతుల జంతు, వృక్ష సంపదకు కర్ణాటక నిలయం. రాష్ర్టంలో దాదాపు పదిహేను వరకూ అభయారణ్యాలు, పక్షి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. రానున్న వేసవి సందర్భంలో పర్యాటకానికి వెళ్లాలనుకునే వారికి ఈ ప్రాంతాలు రా...రమ్మని ఆహ్వనం పలుకుతున్నాయి. అంతేకాకుండా ఈ కాంక్రీట్ జంగిల్ నుంచి దూరంగా రెండు రోజుల పాటు సేదదీరాలని మనసు కోరుకుటోందా? ఇలాంటి వారి కోసమే ఈ కథనం. రాష్ర్టంలో ఉత్తమమైన పక్షి సంరక్షణ కేంద్రాలు అవి ఎక్కడ ఉన్నాయి, ఏ సమయంలో వాటిని చూడటానికి వెళ్లడం ఉత్తమం తదితర వివరాలన్నీ నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం తీసుకువస్తున్నాం.

1.రంగన తిట్టు

1.రంగన తిట్టు

Image source

ఈ పక్షి సంరక్షణ కేంద్రం శ్రీరంగపట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో మైసూరుకు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. కావేరి నదిలో ఓ 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. చూడటానికి ఒక ద్విపం వలే కనిపిస్తుంది. సైబీరియా, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి కూడా వివిధ జాతుల పక్షులు ఇక్కడకు సంతానోత్పత్తి కోసం వలసవస్తుంటాయి. డిసెంబర్ నుంచి ఆగస్టులో ఈ పక్షి సంరక్షణ కేంద్రాన్ని చూడటానికి అనువైన సమయం.

2.అత్తివేరి

2.అత్తివేరి

image source

రాష్ర్టంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ముద్గాడ్ తాలూకాలో అత్తివేరి పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. హుబ్లీ పట్టణానికి 43 కిలోమీటర్ల దూరంలో 2.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఏడాదిలో ఏ సమయంలోనైనా ఈ అత్తివేరి పక్షి సంరక్షణ కేంద్రాన్ని మనం చూడటానికి బాగుంటుంది. ఈ పక్షి సంరక్షణ కేంద్రానికి దగ్గర్లో అత్తివీరి రిజర్వాయర్ ఉంది.

3.బంకాపుర

3.బంకాపుర

image source

హావేరి జిల్లాలోని బంకాపుర అటవీ ప్రాంతంలో ఈ పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. రాష్ర్టంలోని రెండు నెమలి సంరక్షణ కేంద్రాల్లో ఇది ఒకటి. దీనిని నెమలి సంరక్షణ కేంద్రంగా భారత దేశం 2006 జూన్ 9న ప్రకటించింది. ఇది 139 ఎకరాల్లో విస్తరించి ఉంది. దాదాపు రెండు వేల నెమళ్లను మనం ఇక్కడ చూడవచ్చు. కేవలం నెమళ్లే కాకుండా ఇండియన్ రాబిన్, కింగ్ ఫిషర్ తదితర పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తాయి.

4.బోనాల్ బర్డ్

4.బోనాల్ బర్డ్

image source

యాదగిరి జిల్లాలోని సోరాపుర తాలూకాలో బోనాల్ అనే గ్రామం వద్ద ఈ పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. రాష్ర్టంలో అతి విస్తీర్ణమైన పక్షి సంరక్షణ కేంద్రాల్లో రంగనతిట్టు తర్వాత బోనాల్ రెండోస్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ పక్షి సంరక్షణ కేంద్రానికి వెలితే దాదాపు 21 జాతుల పక్షలను ఒకే చోట మనం చూడవచ్చు.

5.ఘటప్రభ

5.ఘటప్రభ

image source

బెల్గాం జిల్లా కోకాక్ తాలూకాలో ఘటప్రభ పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. 29.78 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ పక్షి సంరక్షణ కేంద్రంలో వేల పక్షులను ఒకే చోట చూడవచ్చు. నవంబర్ నుంచి మార్ఛ్ మధ్య కాలంలో ఇక్కడకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడికి వెళితే ఘటప్రభ నదీజలాల అందాలను కూడా వీక్షించడానికి వీలవుతుంది.

6.గుడవి

6.గుడవి

image source

శివమొగ్గ జిల్లా సొరబు తాలూకాలో గుడవి పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. సొరబు పట్టణానికి ఇది 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 0.74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మీర ఇది విస్తరించి ఉంది. 217 జాతులకు చెందిన పక్షులను ఇక్కడ గమనించవచ్చు. గుడవి సరస్సు ఒడ్డున ఉన్న ఈ పక్షి సంరక్షణ కేంద్రాన్ని చూడటానికి వర్షాకాలం ఉత్తమమైనది.

7.మాగడి

7.మాగడి

image source

గదగ్ జిల్లాలోని శిరహట్టి తాలూకాలోని మాగడి గ్రామం సమీపంలో ఈ పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. గదక్ కు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పక్షి కేంద్రాన్ని చలికాలంలో చూడటానికి అనుకూలంగా ఉంటుంది.

8.దండేలి

8.దండేలి

image source

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో 834.16 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కర్ణాటకలోని అతి విస్తీర్ణమైన అభయారణ్యాల్లో ఇది మొదటి వరుసలో ఉంటుంది. ఈ అభయారణ్యం ఎన్నో రంగుల రంగుల పక్షులకు నిలయం. నవంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో ఈ పక్షి సంరక్షణ కేంద్రాన్ని చూడటానికి ఎక్కువ గా వస్తుంటారు. ఈ అభయారణ్యంలోనే మచ్చల మరియు ఎలుక జింక, స్లాత్ ఎలుగుబంటి, చిరుతపులి, పులి, గౌర్, ఏనుగు, అడవి కుక్క, అడవి పిల్లి, బైసన్, జాకాల్, లంగూర్ మరియు ఎగిరే ఉడుతలకు సురక్షితమైన ఆశ్రయం. ఇక్కడ కేవలం సఫారీనే కాకుండా ర్యాఫ్టింగ్ వంటి సాహస జల క్రీడలకు కూడా అవకాశం ఉంది.

9.ఆదిచుంచునగిరి

9.ఆదిచుంచునగిరి

image source

సముద్ర మట్టానికి దాదాపు 700 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పక్షి సంరక్షణ కేంద్రం కర్ణాటకలోని రెండో నెమలి సంరక్షణ కేంద్రం. ఇక్కడ వివిధ రకాల జాతులకు చెందిన సీతాకోక చిలుకలను కూడా మనం చూడవచ్చు. మండ్యాకు దగ్గరగా ఉన్న ఈ పక్షి సంరక్షణ కేంద్రాన్ని దేశంలో ఎప్పుడైనా విజిట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

10.రామ్ నగర

10.రామ్ నగర

image source

రాబందుల సంరక్షణ కేంద్రం ఇదొక్కటే. బెంగళూరుకు దగ్గరగా రామదేవర బెట్టలో ఈ పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. కర్ణాటక ప్రభుత్వం 2012 జనవరి 30న దీనిని అధికారికంగా రాబందుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. ఇక్కడే షోలే చిత్రాన్ని కూడా గతంలో చిత్రీకరించారు.

11. మరింత సమాచారం కోసం

11. మరింత సమాచారం కోసం

image source

అభయారణ్యాల్లో వాతావరణం తరుచుగా మారుతూ ఉంటుంది. అంతే కాకుండా సఫారీకి కొన్ని సందర్భాల్లో ముందస్తు అనుమతి తప్పనిసరి. అందు కోసం కర్ణాటక ప్రభుత్వం ఈ జంగిల్ టూరిజానికి సంబంధించి పర్యాటక శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎప్పటి కప్పుడు పర్యాటకులకు అవసరమైన సమాచారం, సదుపాయాలను కల్పిస్తోంది. వాటి వినియోగం కోసం ఈ చిరునామాల్లో సంప్రదించవచ్చు.

కార్పోరేట్ ఆఫీస్
జంగిల్ లాడ్జ్ అండ్ రిసార్ట్ లిమిటెడ్
గ్రౌండ్ ఫ్లోర్, వెస్ట్ ఎంట్రెన్స్
ఖనిజభవన్, రేస్ కోర్స్ రోడ్
బెంగళూరు 560001
080 40554055
Email: [email protected]

లేదా
సమాచార కేంద్రం
పర్యాటక శాఖ
2, జేఎల్బీ రోడ్, మెట్రో పోల్ సర్కిల్, మైసూర్ 570005
91- 821- 2422096 / 9449599759 / 9449597870
Email: [email protected]

Read more about: karnataka tour travel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X