Search
  • Follow NativePlanet
Share
» »బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

బౌద్ధులకే కాదు హిందువులకు పవిత్రమైన స్థలం గయ. బీహార్‌లో గయ ఒక ముఖ్యపట్టణం. ఈ ప్రాంతాన్ని జ్ఞానభాండాగరమని కూడా అంటారు. క్రీ.శ 1810లో గయ రెండు భాగాలుగా ఉండేది. ఒక భాగం పూజారులు నివసించే భాగం.

By Venkatakarunasri

బౌద్ధులకే కాదు హిందువులకు పవిత్రమైన స్థలం గయ. బీహార్‌లో గయ ఒక ముఖ్యపట్టణం. ఈ ప్రాంతాన్ని జ్ఞానభాండాగరమని కూడా అంటారు. క్రీ.శ 1810లో గయ రెండు భాగాలుగా ఉండేది. ఒక భాగం పూజారులు నివసించే భాగం. ఈ భాగాన్ని గయ అనేవారు. రెండవ భాగంలో న్యాయవాదులు, వ్యాపారులు ఉండేవారు. ఇప్పుడు బుద్ధగయ గడిచిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. వెనకటి సందడి లేకపోయినా ప్రశాంతతతో కూడిన గంభీర వాతావరణం ఊరంతా అలుముకుని ఉంటుంది. పర్యాటకులు, బౌద్ధమతస్థులు సందడి తప్ప. ఊరంతా ప్రశాంతంగా, అసలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరా? అన్నట్లు ఉంటుంది. ఇక్కడ శార్ద విధులను నిర్వర్తించి పిండ ప్రదానం చేస్తే పితృ ఋణాన్ని తీర్చుకుని ఇహపర సాధనలో మోక్ష ప్రదమైన పవిత్ర స్థలంగా భావిస్తారు. ఒక్క క్షణం దారిలో ఉన్న ఆసక్తికరమైన స్థల సందర్శనం చేసికొంటూ వెళదాం. బుద్ధగయ చిన్న ఊరే అయినప్పటికీ యాత్రీకులు బస చేయడానికి అనేక మఠాలు, ఆశ్రమాలున్నాయి. టూరిస్టు లాడ్జి, హోటళ్లు ఉన్నాయి.

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

బోధి వృక్షం

ఇక్కడకొచ్చిన సందర్శకులు ముందుగా చూడాలనుకునేది బోధి వృక్షాన్నే. దీని కింద కూర్చుని ధ్యానించే సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు. అయితే అప్పటి బోధివృక్షం ఇప్పుడు లేదు. దాని తాలూకు మొలకే పెరిగి పెద్దదయి ఇప్పుడు సందర్శకులకు కనువిందు చేస్తుంది. తల్లిచెట్టును మరపిస్తోంది. బోధివృక్షానికి చెందిన ఓ మొలకను అప్పట్లో అశోకచక్రవర్తి శ్రీలంకకు పంపాడు. బౌద్ధమత ప్రచారానికై అశోకుని కుమారుడు మహేంద్ర శ్రీలంక వెళ్లినప్పుడు, బోధివృక్షం తాలూకు ఒక అంటును కూడా తనతో తీసుకెళ్లాడట. దీన్ని శ్రీలంకలోని అనూరాధాపురలో నాటారు. ఈ మొలకే ఇప్పుడు మహావృక్షమైంది. బుద్ధగయ లోని బోధివృక్షం తల్లిచెట్టు కాల గమనంలో అంతరించిపోతే, అనూరాధాపురలోని పిల్ల చెట్టునుండి మరో అంటును తీసుకొచ్చి బుద్ధగయలో నాటారు. ప్రస్తుతం బుద్ధగయలోని బోధివృక్షం అదే. అసలు వృక్షం నుండి వచ్చింది కాబట్టి దీన్ని కూడా భక్తి శ్రద్ధలతోనే తిలకిస్తూ వుంటారు సందర్శకులు.

Photo Courtesy: Ineb-2553

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

వజ్రాసనం

బోధివృక్షం కిందే 'వజ్రాసనం' ఉంది. ఎర్రరాతితో నిర్మించిన ఈ ఆసనంపై కూర్చుని సిద్ధార్థుడు ధ్యానసమాధిలో మునిగిపోయాడట. వజ్రాసనాన్ని చూస్తుంటే మనస్సులో ధ్యాననిష్టుడయిన గౌతముడు మెదులుతాడు. మసస్సు తన్మయత్వం చెందుతుంది.

Photo Courtesy: Christopher J. Fynn

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

నిరంజానా నది

బుద్ధ గయకు కొద్ది దూరంలో ఉంది నిరంజానా నది. జ్ఞానసిద్ధి కలిగిన తర్వాత బుద్ధుడు సరాసరి నిరంజనా నది దగ్గరకు వచ్చి ఇందులో స్నానం చేశాడట. చుట్టూ చిన్న చిన్న కొండలతో, నిర్మలంగా ఉన్న నీటితో, ఎటువంటి శబ్ధం లేకుండా గంభీరంగా ప్రవహిస్తుంది ఈ నది. ఇక్కడికొచ్చిన వాళ్లు నిరంజనా నదిని చూడకుండారారు. కొంతమంది భక్తులు నిరంజనలో స్నానం చేసి సంతోషిస్తారు కూడా.

Photo Courtesy: Hemant Shesh

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

మహాబోధి ఆలయం

బుద్ధ గయలో ఉన్న ప్రధాన దర్శనీయ స్థలం మహాబోధి ఆలయం. ఈ ఆలయాన్ని అశోకచక్రవర్తి క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దిలో నిర్మించినట్లుగా చరిత్రకారుల కథనం. అశోకుడు నిర్మించిన ఆ ఆలయం కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ, అదే స్థలంలో పునర్నిర్మాణం జరిపించిందే ఇప్పుడున్న ఆలయం. దీన్ని రెండుసార్లు పునర్నిర్మించారు. 11వ శతాబ్దిలో ఒకసారి, 1882లో రెండోసారి నిర్మించడం జరిగింది. ఎన్ని సార్లు పునర్నిర్మాణం జరిగినా అసలు ఆలయం పద్ధతులలోనే తిరిగి నెలకొల్పారట.యాభై మీటర్ల ఎత్తున్న పెద్ద గోపురంతో ఉండే ఈ ఆలయం యాత్రీకులను బాగా ఆకర్షిస్తుంది. తూర్పు ద్వారం ద్వారా భక్తులు ఆలయ ప్రవేశం చేస్తుంటారు. బౌద్ధశిల్పకళకు ప్రతీకగా తోరణద్వారాలు ఈ ఆలయంలో ఉంటాయి. ఆలయం లోపల బంగారు మలామా చేయబడిన బుద్ధదేవుని విగ్రహం కూడా ఉంది. ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 635వ సంవత్సరంలో చైనా యాత్రీకుడు హుయాన్‌ త్సాంగ్‌ ఈ ఆలయాన్ని సందర్శించినట్లు ఆయన రాసుకున్న గ్రంథాలవల్ల తెలుస్తోంది. అప్పట్లోనే మహాబోధి ఆలయం బౌద్ధుల్ని విశేషంగా ఆకర్షించింది. భారతదేశం నుంచే కాక చైనా, జపాన్‌, మలేషియా వంటి విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చేవారని హుయాన్‌ త్సాంగ్‌ రచనవల్ల తెలుస్తోంది. ఈనాటికీ ఈ బౌద్ధ పుణ్యక్షేత్రం విదేశీ స్వదేశీ భక్తులందర్నీ తన దగ్గరకు రప్పించుకుంటుంది. సందర్శించు సమయం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.

Photo Courtesy: Bpilgrim

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

చంక్రమణ చైత్యం

బుద్ధగయలో మహాబోధి ఆలయం చుట్టూ అనేక చైత్యాలు, స్థూపాలు వున్నాయి. టిబెట్‌, జపాన్‌వారు నడుపుతున్న అనేక మఠాలు, ఆశ్రమాలు వున్నాయి. ఇక్కడున్న చైత్యాలలో అనిమిషలోచన చైత్యం అతి ముఖ్యమైంది. బుద్ధునకు జ్ఞానసిద్ధి కలిగిన తర్వాత కొద్దిసేపు అనిమిషలోచనుడై ఈ ప్రదేశంలోనే నిలిచిపోయాడని చెప్తారు. తనకు జ్ఞానం లభింపజేసినందుకు కృతజ్ఞతా సూచికగా కొద్దిసేపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడట బుద్ధుడు. అప్పట్నుంచి అది అనిమిషలోచన చైత్యంగా ప్రసిద్ధికెక్కింది. చంక్రమణ అనే పేరు గల అరుగులాంటి కట్టడాన్ని కూడా భక్తులు పవిత్రంగా భావించి దర్శిస్తుంటారు. మహాబోధి ఆలయం సమీపంలోనే రత్నగిర్‌ అనే పేరుగల చిన్న చైత్యం ఉంది. ఈ ప్రదేశంలోనే బుద్ధుడు ఓ వారం రోజుల పాటు ధ్యానంలో గడిపాడంటారు. బుద్ధగయ వెళ్లినవాళ్లు ఈ చైత్యాన్ని కూడా తప్పకుండా దర్శిస్తారు.

Photo Courtesy: juicyrai

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

జమ్మా మసీద్‌

గయలో ఉన్న జమ్మా మసీద్‌ బీహారులోనే అతిపెద్ద మసీదు. ముజాఫీరి రాజకుటుంబం 150 సంవత్సరాక్రితం ఈ మసీదును నిర్మించారు. ఇక్కడ ఒకేసారి వేలమంది నమాజ్‌ చేసే వీలుంది. ప్రస్థుతం ఈ మసీదును చారిత్రక ప్రదేశంగా చూపుతున్నారు.

Photo Courtesy: Chanchal Rungta

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

బరాబర్ గుహలు

మౌర్య రాజుల కాలానికి చెందిన బరాబర్ గుహలు, దేశంలోని అతి పురాతన రాతి కట్టడం. బరాబర్ వద్ద ఉన్న ఎక్కువ గుహలు ఎక్కువగా మెరుగుపెట్టిన అంతర్గత ఉపరితలం, ప్రతిధ్వని ప్రభావంతో, పూర్తిగా గ్రానైట్ తో మలచబడి, రెండు విభాగాలను కలిగి ఉంటాయి. పురాతన కాలంలో చాలా అరుదైన ఉత్తమ వంపులు కలిగిన గుహలలో కరణ్ చౌపర్, లోమస్ రిషి, సుదామ, విశ్వ జోప్రి అనే నాలుగు గుహలు ఉన్నాయి. ఈ గుహలు రాతి కట్టడాల నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ.

Photo Courtesy: Photo Dharma

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

దు౦గేశ్వరి గుహ ఆలయాలు

మహాకాల గుహలు అనికూడా పిలువబడే మంత్రముగ్ధమైన దు౦గేశ్వరి గుహ ఆలయాలు, ఎంతో పూజించబడే, భావనలతో నిండిన ప్రదేశం. పర్యాటకులు నిర్మలత్వానికి, ప్రశాంతతకు అన్వేషణలో దు౦గేశ్వరి ఆలయానికి వస్తారు. ఈ గుహ ఆలయాలు గౌతమ బుద్ధుడు ఎట్టకేలకు జ్ఞానాన్ని పొందిన బుద్ధగయలో దానిని అమలు చేయడానికి వెళ్లేముందు, ఇక్కడే తపస్సు చేసాడు. ఇది హిందూ, బౌద్ధ విగ్రహాల మూడు ప్రధాన గుహలను కలిగి ఉంది.

Photo Courtesy: Chanchal Rungta

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

సీజన్‌

అక్టోబర్‌ నుంచి మార్చి వరకు యాత్రీకుల సీజన్‌ అని చెప్పుకోవచ్చు. ఈ కాలంలోనే ఎక్కువ మంది యాత్రీకులు బుద్ధగయను సందర్శిస్తుంటారు. మే నెలలో యాత్రీకుల రద్దీ పెరుగుతుంది. బుద్ధపూర్ణిమ నాటికి బుద్ధగయ భక్తులతో కిటకిటలాడిపోతుంది. త్రిపిటకములతోఊరు మారుమోగుతుంది.మే నెల తొమ్మిదో తేదీ బుద్ధుడి జన్మదినం. ఈ రోజు కోసం భక్తులంతా ఆతురతతో ఎదురుచూస్తుంటారు. ఆనాటికి బుద్ధగయ చేరుకోవాలని వారంతా ఆరాటపడుతుంటారు.

Photo Courtesy: Wonderlane

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం !

ఎలా వెళ్ళాలి?

విమాన మార్గం

బుద్ధ గయ కి దగ్గరలో ఉన్న విమానాశ్రయం గయ విమానాశ్రయం. ఇది 7 కి. మీ. దూరంలో ఉన్నది. అట్లాగే పాట్నా వద్ద మరొక ఏర్‌పోర్ట్ ఉంది ఇక్కడి నుంచి బుద్ధ గయ కి సుమారుగా 135 కి. మీ. దూరం ఉంటుంది. ఇండియన్ ఏర్‌లైన్స్ మరియు సహారా ఏర్‌లైన్స్ విమానాలు కలకత్తా, రాంచీ, లక్నో, ముంబై, ఢిల్లీ తో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విమానాలు నడుపుతుంటారు.

రైలు మార్గం

గయ రైల్వే స్టేషన్ బుద్ధ గయకి దగ్గరలో ఉన్నది. ఇది సుమారుగా 17 కి. మీ. దూరంలో ఉంది. గయ స్టేషన్ కు పాట్నా, కలకత్తా, రాంచీ తదితర ప్రాంతాల నుండి రైళ్లు వస్తుంటాయి.

రోడ్డు మార్గం

బుద్ధ గయకి రోడ్డు వసతి బాగానే ఉంది. ఇక్కడి నుంచి గయ 17 కి. మీ. , నలంద 101 కి. మీ. , రజ్గిర్ 78 కి. మీ. ,పాట్నా 135 కి .మీ. వారణాసి 252 కి. మీ. కలకత్తా 495 కి. మీ. దూరంలో ఉన్నాయి. లోకల్ ట్రాన్స్‌పోర్ట్ ఒకవేళ బుద్ధ గయ చేరుకుంటే ఎలా ప్రయాణించాలనుకుంటే ??ఊళ్లో వివిధ ప్రదేశాలు సందర్శించడానికి టూరిస్టు కార్లు, టాంగాలు, రిక్షాలు దొరుకుతాయి. గైడ్లు కూడా ఉంటారు. బస్సు సదుపాయం ప్రతీరోజు గయ , పాట్నా, నలంద, వారణాసి,రాజ్గీర్ నుండి బస్సులు నడుపుతారు. బీహార్ టూరిజం వాళ్ళు కూడా రోజుకి రెండుసార్లు పాట్నా నుండి బుద్ధ గయకి బస్సులు నడుపుతారు.

Photo Courtesy: Hideyuki KAMON

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X