Search
  • Follow NativePlanet
Share
» »గయ - బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన ప్రదేశం !!

గయ - బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన ప్రదేశం !!

బుద్ధగయ బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన ప్రదేశం. మనం ఎప్పుడో చిన్నప్పుడు చదివే ఉంటాం కదా !! బుద్ధుడు బోధి చెట్టుక్రింద కూర్చొని జ్ఞానోదయం పొందాడు అని. ఆ చెట్టే ఇక్కడ ఉన్నది.

By Mohammad

గయ .. బౌద్ధమత పుణ్యక్షేత్రం. భారతదేశంలో ఉన్న అతిప్రాచీన మతాలలో బౌద్ధమతం ఒకటి. బౌద్ధులను సాధువులు గా చెప్పవచ్చు. వీరు వివాహబంధానికి దూరంగా ఆధ్యాత్మిక భావనలతో జీవిస్తుంటారు. దీని స్థాపకుడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధునితో ముడిపడి ఉన్న ప్రదేశాలు ఉత్తర భారతదేశంలోనే ఎక్కువ. దక్షిణ భారతదేశంలో ఆయన వచ్చినట్లు దాఖలాలు లేవు కానీ కొంతమంది వచ్చినట్లు చెబుతారు. ఆయన అమరావతిని కూడా సందర్శించునట్లు చెబుతారు.

గౌతమ బుద్ధుడు పుట్టింది నేపాల్ లో అయినా ఆయన ఎక్కువగా సంచరించింది ఇండియాలోనే. అప్పటి మగధ రాజ్యం (ప్రస్తుత బీహార్ రాష్ట్రం) లో అయన ఎక్కవకాలం బతికారు. అటువంటి ప్రదేశాలలో ముఖ్యమైనది గయ, మరియు గయకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుద్ధగయ.

ఇది కూడా చదవండి : మౌర్యులు కొండలను తొలిచి నిర్మించిన బరాబర్ గుహలు !

బుద్ధగయ బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన ప్రదేశం. మనం ఎప్పుడో చిన్నప్పుడు చదివే ఉంటాం కదా !! బుద్ధుడు బోధి చెట్టుక్రింద కూర్చొని జ్ఞానోదయం పొందాడు అని. ఆ చెట్టే ఇక్కడ ఉన్నది. అలాగే అక్కడి బోధి దేవాలయం కూడా తప్పక సందర్శించదగినది. బుద్ధగయ నిత్యం బౌద్ధ సన్యాసులతో ప్రశాంతంగా ఉంటుంది. బుద్ధగయ ప్రధాన ఆకర్షణలను ఒకసారి పరిశీలిస్తే ... !!

పవిత్ర ప్రదేశం

పవిత్ర ప్రదేశం

బుద్ధగయ హిందువులకు, బౌద్ధులకు పవిత్ర ప్రదేశం. ఫలగూ నదీతీరాన స్నానఘట్టాలు, ఆలయాలు బారులుతీరి ఉంటాయి. రావి చెట్లు, అక్షయవత్, మర్రిచెట్లు మొదలైన పవిత్ర వృక్షాలు కూడా బుద్ధగయ లో ఉన్నాయి.

చిత్రకృప : Hideyuki KAMON

మంగళగౌరి ఆలయం

మంగళగౌరి ఆలయం

బుద్ధగయ హిందువులకూ ప్రవిత్ర ప్రదేశం. శక్తిపీఠాలలో ఒకటిగా భావించే మంగళగౌరి దేవాలయం ఇక్కడ కలదు. శివుడు సతీదేవి దేహాన్ని తీసుకెళుతుంటే ఛాతీ భాగం ఇక్కడ పడిందని భక్తుల విశ్వాసం.

చిత్రకృప : BPG

విష్ణుపద్ ఆలయం

విష్ణుపద్ ఆలయం

విష్ణుపద్ ఆలయంలో విష్ణుపాద ముద్రలు ఉంటాయి. గయాసురుని చాతి మీద భగవానుడైన మహావిష్ణువు పాదము ఉంచిన ప్రదేశం ఇదే. దీనిని అహల్యా భాయ్ హోల్ కర్ నిర్మించింది. ఈ పాద ముద్రికలను బౌద్ధ మతం కూడా గౌరవిస్తుంది.

చిత్రకృప : Keymaker31

మోక్షప్రదాయకమైన నగరం

మోక్షప్రదాయకమైన నగరం

గయ హిందువులకు పితరులకు మోక్షప్రదాయకమైన నగరంగా విశ్వదించబడుతుంది. ఇక్కడ పితరులకు పిండప్రదానం చేస్తే పితరులకు మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. శ్రీరాముడు తనదేవేరి సీత మరియు సోదరుడైన లక్ష్మణునితో ఇక్కడకు వచ్చి పితరులకు పిండప్రదానం చేసినట్లు పురాణకథనాలు చెబుతున్నాయి.

చిత్రకృప : Gunjanarya

బ్రహ్మయోని కొండలు

బ్రహ్మయోని కొండలు

బౌద్ధులకు ఒక ప్రాముఖ్యమైన యాత్రాక్షేత్రం. ఈ బ్రహ్మయోని కొండల మీద బుద్ధుడు ఆదిత్య పర్యాయ సూత్రాలను బోధించాడని చెప్పబడుతుంది. ఈ సూత్రాలను విన్న వేలాది అగ్నిఆరాధకులు. జ్ఞానసిద్ధి పొందారని అందువలన ఈ కొండని గయాసిసా అని పిలిచేవారని చెప్పబడుతుంది.

చిత్రకృప : BPG

మహాబోధి ఆలయం

మహాబోధి ఆలయం

ఈ ప్రదేశంలోనే గౌతమబుద్ధుడు జ్ఞానాన్ని పొందాడని చెబుతారు. పడమరవైపున ఆయన జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం కూడా ఉన్నది. గుడికి అశోకుని కాలంలో బీజం పడినట్లు సీజెబుతారు. పూర్తిగా ఇటుకలతో నిర్మించిన ఏకైక బౌద్ధ దేవాలయం ఇదొక్కటే !!

చిత్రకృప : பா.ஜம்புலிங்கம்

దుంగేశ్వరి గుహాలయాలు

దుంగేశ్వరి గుహాలయాలు

పర్యాటకులు నిర్మలత్వానికి, ప్రశాంతతకు అన్వేషణలో దుంగేశ్వరి గుహాలయాలను సందర్శిస్తారు. గౌతముడు జ్ఞానాన్ని పొందిన తర్వాత బుద్ధగయలో దానిని అమలుపరిచేందుకు వెళ్ళేముందు ఇక్కడ తపస్సు చేసాడు.

చిత్రకృప : Tevaprapas

బారాబర్ గుహలు

బారాబర్ గుహలు

బారాబర్ గుహలు పురాతనమైనవి. ఇవి మౌర్యుల కాలం నాటివిగా చెప్పబడతాయి. బారాబర్ హుహాలు వాటి రతి కట్టడాలకు ప్రసిద్ధి. కొండలను తొలిచి అందంగా చెక్కారు. ఈ గుహల పరిసరాలలో ఆరామాలు, విహారాలు, చైతన్యాలు ఉన్నాయి.

చిత్రకృప : Artistically

జమ్మా మసీద్

జమ్మా మసీద్

గయలో ఉన్న జమ్మా మసీద్ బీహారులోనే అతిపెద్ద మసీదు. ముజాఫీరి రాజకుటుంబం 150 సంవత్సరాలక్రితం ఈ మసీదును నిర్మించారు. ఇక్కడ ఒకేసారి వేలమంది నమాజ్ చేసేవీలుంది. ప్రస్తుతం ఈ మసీదును చారిత్రక ప్రదేశంగా చూపుతున్నారు.

చిత్రకృప : Ianasaman

గయ ఆహారపు అలవాట్లు

గయ ఆహారపు అలవాట్లు

బౌద్ధ సన్యాసులు ఉండే ప్రదేశం కదా అని కారం, ఉప్పు లేని ఆహారాలు లభిస్తాయనుకుంటే మీరు పొరబడినట్లే! గయ ప్రజలు కారం కారంగా ఉండే చిరు తిండి అంటేనే ఇష్టపడుతారు.

చిత్రకృప : Neil Satyam

వసతి

వసతి

గయ లో వసతి సదుపాయాలు కలవు. లాడ్జీలు, హోటళ్ళు బస కు గదులను అద్దెకు ఇస్తుంటాయి. మఠాలు, ఆశ్రమాలు కూడా వసతిని అందిస్తాయి. బుద్ధగయ హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

చిత్రకృప : Andrew Moore

బుద్ధగయ ఎలా చేరుకోవాలి ?

బుద్ధగయ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : గయ సమీప ఎయిర్ పోర్ట్. ఇక్కడికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

రైలు మార్గం : గయ లో రైల్వే స్టేషన్ కలదు. ఇది దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో కనెక్ట్ చేయబడింది. స్టేషన్ బయట టాక్సీ అద్దెకు తీసుకొని బుద్ధగయ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం : గయ, పాట్నా మరియు దాని సమీప పట్టణాల నుండి బుద్ధగయ కు ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు కలవు.

చిత్రకృప : Anup Sadi

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X