Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడికి వెళితే మీ తలరాత మారిపోవడం ఖచ్చితం

ఇక్కడికి వెళితే మీ తలరాత మారిపోవడం ఖచ్చితం

బ్రహ్మీశ్వర దేవాలయం చరిత్ర గురించి కథనం.

భారత దేశంలోని ప్రజలు కర్మసిద్దాంతాన్ని నమ్ముతారు. తాము ఎలా పెరగాలి? ఎంత చదవాలి? ఎంత ధనం సంపాదించాలి? తదితర విషయాలన్నీ మనం పుట్టే సమయంలోనే ఆ బ్రహ్మ తమ నుదిటి పై రాసి ఉంటాడని విశ్వసిస్తారు. అందువల్లే ఏదైనా జరిగినప్పుడు అంతా విధి రాత అని పెదవి విరుస్తాము. ఇక చిన్నచిన్న విషయాల్లో పరిహారం కోసం దేవాలయాల చుట్టూ తిరుతుతూ ఉంటాము. అయితే భారత దేశంలోని ఒకే ఒక దేవాలయంలోని దైవాన్ని దర్శించుకొంటే మన తల రాత మారిపోయి దురదష్టం నుంచి అదష్ట జాతకులుగా మారుతామని చెబుతారు. ఇంతకూ ఆ దేవాలయం ఎక్కడ ఉంది. అక్కడికి ఎలా వెళ్లాలి తదితర విషయాలన్నీ మీ కోసం...

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

P.C: You Tube

ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడికి తానే ఈ లోకాన్ని స`ష్టిస్తున్నందు వల్ల తనకంటే మించిన వారు ఈ లోకంలో ఎవరూ లేరనే గర్వం తలకెక్కుతుంది.

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

P.C: You Tube
ఈ విషయం తెలుసుకొన్న పరమశివుడు తన అంశతో జన్మించిన వీరభద్రుడి ద్వారా ఆ బ్రహ్మ ఐదవ తలను ఖండింపజేస్తాడు.

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

P.C: You Tube
అంతేకాకుండా బ్రహ్మ దేవుడికి ఉన్న లోకాన్ని స`ష్టించే గుణానాన్ని తొలగించేలా శాపం పెడుతాడు. దీంతో గర్వం నశించిన బ్రహ్మదేవుడు ప్రస్తుతం దేవాలయం ఉన్న చోట 12 శివలింగాలను ప్రతిష్టింపజేసి అక్కడ శివుడిని పూజిస్తాడు.

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

P.C: You Tube
అందువల్లే ఈ దేవాలయం ఉన్న చోటును బ్రహ్మపురి అని అంటారు. ఇక బ్రహ్మదేవుడి పూజకు మెచ్చి, శాంతించిన పరమశివుడు ఆ బ్రహ్మకు పార్వతి దేవితో సహా దర్శనమిస్తాడు.

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

P.C: You Tube
అంతేకాకుండా బ్రహ్మకు స`ష్టించే శక్తిని మరలా ఇస్తాడు. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని సందర్శించి తనతో పాటు నీకు కూడా పూజలు చేసినవారి తలరాతను మార్చి రాయాలని చెబుతాడు.

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

P.C: You Tube
ఇక పై వారు సుఖసంతోషాలతో జీవించేలా ఆ రాత ఉండాలని పరమశివుడు బ్రహ్మను ఆదేశిస్తాడు. ఇందుకు ఒప్పుకొన్న బ్రహ్మ ఇక్కడ కొలువై ఉండిపోతాడు.

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

P.C: You Tube
అందువల్లే ఇక్కడ బ్రహ్మ విగ్రహానికి పూజలు కూడా చేస్తారు. అంతేకాకుండా ఆ పరమశివుడు ఇక్కడ స్వయంభువుగా వెలుస్తాడు. దీంతో ఇక్కడ పరమశివుడికి కూడా పూజలు జరుగుతాయి.

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

P.C: You Tube
అంతే కాకుండా ఈ దేవలయంలో బ్రహ్మ ప్రతిష్టించిన 12 శివలింగాలను కూడా దర్శించుకోవచ్చు.. ఈ దేవాలయ ప్రాంగణంలో పతంజలి మహర్షి జీవ సమాధిని కూడా మనం చూడవచ్చు..

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

P.C: You Tube
పతంజలి మహర్షి యోగ సూత్రాలను, ఆయుర్వేద వేద్య శాస్త్రంలో గొప్ప పండితుడన్న విషయం తెలిసిందే. ఈ దేవాలయం తమిళనాడు లోని తిరుచ్చీ సమీపంలోని తిరుపట్టూరులో ఉంది.

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

P.C: You Tube
ప్రతి ఏడాది తమిళ పంగునీ మాసంలో మూడు రోజుల పాటు సూర్య కిరణాలు ఇక్కడి బ్రహ్మను నేరుగా తాకుతాయి. ఇందుకు ఏడు ద్వారాలను దాటి గర్బగుడిలోకి ప్రవేశిస్తాయి.

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

P.C: You Tube
ఇది ఆలయ విశిష్ట వాస్తు శైలికి నిదర్శనమని చెబుతారు. ఇక్కడ బ్రహ్మ దేవాలయం పక్కనే గౌరీ దేవాలయం కూడా ఉంది. ఇక ఇక్కడ బ్రహ్మ ఒక తామర పువ్వు పై కూర్చొని ఉంటారు.

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

P.C: You Tube
బ్రహ్మ విగ్రహం 6 అడుగులు. ఎల్లప్పుడు బ్రహ్మ విగ్రహాన్ని కుంకుమతో అలంకరణ చేసి ఉండటం ఇక్కడ గమనార్హం. ఇక్కడ సోమవారంతో పాటు గురువారం ప్రత్యేక పూజలు జరుగుతాయి.

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

P.C: You Tube
మహాశివరాత్రి, వినాయక చతుర్ధశి ఉత్సవాలు బాగా జరుగుతాయి. బెంగళూరు నుంచి ఈ దేవాలయం సుమారు 357 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దేవాలయానికి దగ్గర్లో తిరుచ్చీ విమానాశ్రయం ఉంది.

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

బ్రహ్మ దేవాలయం, తిరుచ్చి

P.C: You Tube
ఈ రెండింటి మధ్య దూరం 38 కిలోమీటర్లు. ఇక ఈ దేవాలయంలోని దేవుడిని ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకూ భక్తుల సందర్శన కోసం అనుమతిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X