Search
  • Follow NativePlanet
Share
» »క్యాపిటల్ కాంప్లెక్స్ : ఇండియా కొత్త వారసత్వ ప్రదేశం !

క్యాపిటల్ కాంప్లెక్స్ : ఇండియా కొత్త వారసత్వ ప్రదేశం !

By Mohammad

చండీఘడ్ లోని క్యాపిటల్ కాంప్లెక్స్ ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకుంది. యునెస్కో ప్రకటించే జాబితాలో కొత్తగా ప్రకటించిన 21 హెరిటేజ్ సైట్ లలో క్యాపిటల్ కాంప్లెక్స్ ఒకటి.

చండీఘడ్ యొక్క ప్రధాన ల్యాండ్ మార్క్ మరియు అద్భుత కట్టడం క్యాపిటల్ కాంప్లెక్స్. ఇందులో మూడు ప్రధాన భవంతులు ఉంటాయి. అవి సెక్రెటేరియట్, అసెంబ్లీ మరియు హైకోర్ట్. ఈ మూడు గంభీరమైన నిర్మాణాలను చండీఘడ్ యొక్క కీర్తి ప్రతిష్టలుగా చెప్పవచ్చు.

ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్

ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్

చిత్ర కృప : Ravjot Singh

ప్రపంచ వారసత్వ సైట్ ల జాబితాలో చోటు సంపాదించుకున్న క్యాపిటల్ కాంప్లెక్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు :

ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్

ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్ చండీగఢ్ లోని ఇండియన్ యూనియన్ టెరిటరీ ఉన్న ఒక సింబాలిక్ నిర్మాణం. ఇది ప్రముఖ ఆర్కిటెక్ట్ లే క్రోబూసియర్ ద్వారా రూపొందించబడింది. ఇది చండీగఢ్ ప్రభుత్వం యొక్క చిహ్నం. ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్ శాంతి, శ్రేయస్సు మరియ మానవజాతి యొక్క ఐక్యతను సూచిస్తుంది.

ఇది కూడా చదవండి : ఇండియాలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు !

లే క్రోబూసియర్ యొక్క అనేక ఓపెన్ హ్యాండ్ శిల్పాలలో ఇది అతిపెద్దది. ఇది 46 అడుగుల ఎత్తులో ఉంది. లోహంతో తయారుచేసిన ఈ నిర్మాణం 50 టన్నుల బరువుతో గాలి లో తిరిగే విధంగా రూపొందించబడింది.

site-2

చిత్ర కృప : telugu native planet

సింబాలిజం

ఓపెన్ హ్యాండ్ లే క్రోబూసియర్ ప్రధాన శిల్పం. శాంతి మరియు సయోధ్య చిహ్నంగా దీనిని భావించాడు. ఇచ్చి పుచ్చకోవడానికి ప్రతీకగా దీనిన అభివర్ణించాడు. "సెకండ్ మెషిన్ యుగం" యొక్క పునరావృత ఆలోచనతో లే క్రోబూసియర్ దీనిని నిర్మించాడు.

నిర్మించిన ప్రదేశం

ఓపెన్ హ్యాండ్ శివాలిక్ పర్వతాల హిమాలయ పర్వత శ్రేణుల నేపథ్యంలో, చండీగఢ్ కాపిటల్ కాంప్లెక్స్ లోని 1వ సెక్టార్ లో ఉంది. ఓపెన్ హ్యాండ్ ఉన్న చోటికి రోడ్డు, రైలు మరియు వాయు సేవలు కూడా అనుసంధానం చేయబడివున్నాయి. NH 22 (అంబాలా - కల్కా - సిమ్లా - ఖబ్, కిన్నౌర్) మరియు NH 21 (చండీగఢ్ - మనాలి) లు ఈ నగరంమీదుగానే ఉన్నాయి.

ప్యాలెస్ ఆఫ్ అసెంబ్లీ

ప్యాలెస్ ఆఫ్ అసెంబ్లీ

చిత్ర కృప : duncid

ప్యాలెస్ ఆఫ్ అసెంబ్లీ

శాశనసభను 'ప్యాలెస్ ఆఫ్ అసెంబ్లీ' పిలుస్తారు. దీనిని లే క్రోబూసియర్ నిర్మించాడు. ఇది చండీఘడ్ లో లే క్రోబూసియర్ నిర్మించిన అనేక కట్టడాలలో ఆసక్తికరంగా ఉంటుంది. భారత ప్రప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ ఆర్కిటెక్ట్ ను ను నియమించాడు.

ప్యాలెస్ ఆఫ్ జస్టిస్

ప్యాలెస్ ఆఫ్ జస్టిస్

చిత్ర కృప : Sanyam Bahga

ప్యాలెస్ ఆఫ్ జస్టిస్

పంజాబ్ మరియు హర్యానా రాష్టాలకు ఉమ్మడి గా ఇక్కడి హై కోర్ట్ సేవలు అందిస్తున్నది. ఈ కోర్ట్ భవంతిని 'ప్యాలెస్ ఆఫ్ జస్టిస్' అని పిలుస్తారు. దీనిని కూడా లే క్రోబూసియర్ నిర్మించాడు.

రాక్ గార్డెన్

రాక్ గార్డెన్, క్యాపిటల్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 1 లో కలదు. దీనిని 40 సంవత్సరాల క్రితం నెక్ చంద్ రూపొందించాడు. అందమైన గదులు, జలపాతాలు, నీటి కొలనులు, ఊహించని మెలికలు తిరిగే మార్గాలు మొదలైనవి గార్డెన్ లో చూడవచ్చు.

మాన నిర్మిత జలపాతం, రాక్ గార్డెన్

మాన నిర్మిత జలపాతం, రాక్ గార్డెన్

చిత్ర కృప : telugu native planet

40 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ రాక్ గార్డెన్ లో విరిగిన గాజులు, పింగాణి సామాను మొదలైన వాటితో తయారు చేసిన శిల్పాలు ప్రదర్శనలో ఉంటాయి. పాలరాయి మరియు టెర్రకోట కుండలతో తయారు చేసిన భవనాలు, మానవ మరియు జంతువుల వివిధ రూపాలు తోట లోపల ప్రదర్శించబడతాయి. ప్రతిరోజూ ఈ అద్భుతమైన తోట ఉదయం 9 గంటల నుండి తెరిచి ఉంటుంది.

ఈ క్యాపిటల్ కాంప్లెక్స్ లో రేఖాగణిత కొండ మరియు టవర్ల యొక్క నీడలు అదనపు ఆకర్షణలుగా ఉన్నాయి.

ఈ క్యాపిటల్ కాంప్లెక్స్ దేశంలో ఉన్న ఇతర హెరిటేజ్ సైట్లైన హంపి, ఖజురహో, తాజ్ మహల్ ,సాంచి, ఎల్లోరా, అజంతా గుహలు, ఎర్రకోట మొదలైన వాటితో ఒకటి గా నిలిచింది.

మీ విలువైన సలహాలు, సూచనలు దిగువన ఉన్న బాక్స్ లో తెలుపగలరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X