Search
  • Follow NativePlanet
Share
» »తెలంగాణలో బోనాల జాతర !!

తెలంగాణలో బోనాల జాతర !!

బోనాలు - విందు సంబరాలు !

By Staff

ఈ జలపాతాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవుఈ జలపాతాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు

తెలంగాణలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం బోనాల పండగ. తెలంగాణ తెలుగు వారి పండుగగా దీనిని అభివర్ణిస్తారు. ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరంలో అయితే, ప్రతి కూడలిలో వెలసిన అమ్మవారి ఆలయాలు ఆకుపచ్చని తోరణాలతో, జిగెలుమనే విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా అలంకరించబడతాయి. బోనాలు అమ్మవారు ని పూజించే హిందువుల పండుగ. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జరుగుతున్న బోనాల పండగ విశిష్టత, అవి ఎలా జరుపుకుంటారు మొదలగు విషయాలను పరిశీలిస్తే ....

దేవికి నైవేద్యం

దేవికి నైవేద్యం

భోజనం అని అర్థం కలిగిన బోనం - దేవికి సమర్పించే నైవేద్యం అన్నమాట! మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని దేవి గుడికి వెళ్తారు.

Photo Courtesy: Narasimha Murthy

జాగ్రత్త

జాగ్రత్త

మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.

Photo Courtesy: Rajesh_India

ఆచారాలు

ఆచారాలు

ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.

Photo Courtesy: mbharathbhushan

బోనాల దేవి

బోనాల దేవి

పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను, మేకపోతులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.

Photo Courtesy: photoarvind

పూనాకం వచ్చిన మహిళ

పూనాకం వచ్చిన మహిళ

పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.

Photo Courtesy: arvind_kumar310

శాంతించు తల్లి

శాంతించు తల్లి

బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము; మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు.

Photo Courtesy: Rajesh_India

గోల్కొండలో మొదలు

గోల్కొండలో మొదలు

బోనాల పండుగ సందోహం గోల్కొండ కోట లోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదు లోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.

Photo Courtesy: Animesh Hazra

పోతురాజు

పోతురాజు

దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి బలశాలిగా ఉంటాడు. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు.

Photo Courtesy: Randhirreddy

కొరడా ఝులిపిస్తూ

కొరడా ఝులిపిస్తూ

పోతురాజు భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.

Photo Courtesy: Rajesh_India

విందు సంబరాలు - నోరూరించే నాన్ - వెజ్

విందు సంబరాలు - నోరూరించే నాన్ - వెజ్

బోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావడం చేత, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలౌతుంది.

Photo Courtesy: Vinay Kudithipudi

రంగం

రంగం

రంగం, లేక పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ విక్రుతమైన కొపాని తగ్గించెందుకు అక్కడవున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పొతరాజు తన దంతాలతో ఆ మేక పోతును కొరికి, తల, మోండెం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తరువాత జరుగుతుంది.

Photo Courtesy: Rajesh_India

క్యూ లో నిల్చున్న భక్తులు

క్యూ లో నిల్చున్న భక్తులు

బోనం అంటే భోజనం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంజ్యోతి వెలిగించి జాతర కన్నులపండువగా నిర్వహిస్తారు.

Photo Courtesy: Rajesh_India

అలంకరణాలతో మేకపోతు

అలంకరణాలతో మేకపోతు

మేకపోతు మెడలో వేపమండలుకట్టివ్యాధి నిరోధకశక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం.

Photo Courtesy: Swasti Verma

ఘటం

ఘటం

అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటి పై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు.

Photo Courtesy: Randhirreddy

అంబారి మీద ఉరేగింపు

అంబారి మీద ఉరేగింపు

ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది.

Photo Courtesy: Keerthi Kiran Bandru

డాడీ ... నన్నీ చూడనివ్వు !

డాడీ ... నన్నీ చూడనివ్వు !

లాల్‌ దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని రంగ రంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు.

Photo Courtesy: Akhil Tandulwadikar

హైదరాబాద్ ఎలా చేరుకోవాలి ?

హైదరాబాద్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం

రాష్ట్రం లో ని వివిధ ప్రాంతాలకి ఇంకా ఇతర పక్క రాష్ట్రాలకి హైదరాబాద్ నగరం రోడ్డు మార్గం ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. ఇక్కడ బస్సులు సౌకర్యంగా ఉండడమే కాకుండా ప్రైవేట్ వాహనాలు కూడా సేవలు అందిస్తున్నాయి.

రైలు మార్గం

రైళ్ళ స్ట్రింగ్ నెట్వర్క్ ల ద్వారా దేశం లో ని వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ నగరానికి దక్షిణ రైల్వే చక్కగా అనుసంధానమై ఉంది. దక్షిణ రైల్వే ల హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్ లో నే ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎన్నో రైళ్ళు బయలుదేరతాయి అలాగే ఎన్నో రైళ్లు ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి చేరుకుంటాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ నగరంలో ఉన్న ముఖ్యమైన రైల్వే స్టేషన్.

వాయు మార్గం

తరచూ హైదరాబాద్ విమానాశ్రయంలో జాతీయ, అంతర్జాతీయ విమానాలు తిరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ లో రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాలు నడుపబడే రాజీవ్ గాంధీ టెర్మినల్, స్వదేశీ విమానాలు తిరిగే ఎన్ టి రామారావు టెర్మినల్.

Photo Courtesy: nawaz khan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X