Search
  • Follow NativePlanet
Share
» »వింతగా మారిన చంద్రగిరి కోట రహస్యం..రాణి మహల్ రహస్యం ? అక్కడ గుర్రాలకోసం !

వింతగా మారిన చంద్రగిరి కోట రహస్యం..రాణి మహల్ రహస్యం ? అక్కడ గుర్రాలకోసం !

చంద్రగిరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన మండలము. 1640లో కట్టబడిన కోట ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములో వుండిన మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం చంద్రగిరి.

By Venkatakarunasri

చంద్రగిరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన మండలము. 1640లో కట్టబడిన కోట ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములో వుండిన మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం చంద్రగిరి. అర్ధ చంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో కోటను నిర్మించడం వలన దీనిని చంద్రగిరి దుర్గం అని పిలిచే వారు. ఇలా నిర్మించుట వలన కోట రక్షణ కొండ ప్రాంతమువైపుగా తగ్గగలదనీ కొండపైనుండి శత్రువుల కదలికలను దూరంనుండి గమనించుట సులభం కనుక కొండ ప్రక్కగా నిర్మించారనీ మ్యూజియంలో సమాచారముద్వారా తెలుస్తున్నది . కోట చుట్టూ దాదాపు కిలో మీటరు దృఢమైన గోడ కలదు. ఈ గోడ నిర్మించేందుకు వినియోగించిన రాళ్ళ పరిమాణం చాలా పెద్దది. దీనిని ఏనుగుల సహాయంతో నిర్మించారని తెలుస్తుంది. ఈ గోడ పొదల తుప్పల మధ్య ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈ గోడననుసరిస్తూ బయటి వైపుగా పెద్ద కందకము ఉంది. ప్రస్తుతము పూడిపోయిననూ అప్పటి కాలమందు ఇందులో మొసళ్ళను పెంచే వారట.

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

విజయ నగర రాజుల చరిత్రలో చంద్రగిరి ఓ ప్రముఖ స్థానం వహించింది. కృష్ణదేవరాయలు తిరుమలను దర్శించినప్పుడు ఇక్కడే విడిదిచేసేవారు. అచ్యుతదేవరాయలను ఇక్కడే గృహనిర్బంధములో ఉంచారు.

PC:youtube

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

క్రీ.శ.1585లో విజయనగర సామ్రాజ్యం పతనమై, విజయనగరాన్ని దక్కన్ ప్రాంత ముస్లింరాజుల సమాఖ్య పూర్తిగా నేలమట్టం చేసినాకా విజయనగర సామ్రాట్టులు తమ రాజ్యాన్ని కొన్నేళ్ళ పాటు పెనుకొండకు మార్చారు. పెనుకొండ తర్వాత ఇంకొన్నేళ్ళకు చంద్రగిరికి మారిపోయింది.

PC:youtube

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

చంద్రగిరి నుండి పాలించిన చిట్టచివరి విజయనగర రాజు పెద వేంకట రాయలు, తన సామంతుడు దామెర్ల చెన్నప్ప నాయకుడు ఆగస్టు 22, 1639లో బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీకి చందిన ఫ్రాన్సిస్ డేకి చెన్నపట్నంలో కోటను కట్టుకోవడానికి అనుమతిచ్చింది ఈ కోట నుండే. ఇప్పటికీ ఆనాటి దస్తావేజులను మ్యూజియంలో చూడవచ్చు.

PC:youtube

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

కొండ పై భాగమున ఒక సైనిక స్థావరము నిర్మించారు. వారి అవసరముల నిమిత్తము పై భాగమున రెండు చెరువులను నిర్మించి క్రింది నున్న పెద్ద చెరువు నుండి పైకి నీటిని పంపించేవారని కోటలో మ్యూజియంలోని సమాచారం ద్వారా తెలుస్తున్నది.

PC:youtube

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

ఇప్పటికీ కొండపైకి నీటిని పంపించుట అనేది పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. అప్పుడు పైకి పంపించేందుకు ఉపయోగించిన సాధనాలు పాడయిపోయినవి. అయితే పైన చెరువులు మరియు క్రింద చెరువు ఇప్పటికీ మంచి నీటితో కనిపిస్తాయి.

PC:youtube

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

రాణీ మహల్ రెండు అంతస్తులుగానూ రాజ మహల్ మూడు అంతస్తులుగానూ ఉంది. రాణీ మహల్ చాలా వరకు పాడయిపోయింది. రాణీ మహల్ పేరుకే రాణీమహల్ అని ఇప్పుడు పిలుస్తున్నారు కానీ దీని వాస్తునుబట్టి ఇది ఒక గుర్రపు శాల కావచ్చని అక్కడి బోర్డునందు వ్రాసి ఉంది.

PC:youtube

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

పురావస్తు శాఖ అధీనములోకొచ్చిన తరువాత కొంత వరకూ బాగు చేశారు. రాణీమహల్ వెనుక కొంచెం దూరంగా కోట నీటి అవసరాలకోసం ఒక దిగుడు బావికలదు. దీనినుండే అంతపుర అవసరాలకు నీటిని సరఫరా చేసే వారని తెలియ చేయబడింది. ఈ బావికి కొద్ది దూరములో మరణశిక్ష పడ్డ ఖైదీలను ఉరి తీసేందుకు ఆరు స్తంభాలు కలిగి ఉపరితలమునకు నాలుగు రింగులు ఉన్న చిన్న మండపము ఉన్నాయి.

PC:youtube

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

రాజమహలులో మొదటి అంతస్తును మ్యూజియంగా మార్చారు. ముస్లిం పాలకులు నాశనం చేయగా మిగిలిన శిల్పాలు, చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలు లాంటివి ఇందులో ఉన్నాయి. రెండవ అంతస్తులో సింహాసనాలతో కూడిన అప్పటి దర్బారు లేదా సభా దృశ్యాన్ని చూడచ్చు.

PC:youtube

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

మూడవ అంతస్తులో అప్పటి కోట నమూనా, ప్రజలజీవన విధానం లాంటివి ప్రదర్శన కొరకు ఉంచారు. ఇదే అంతస్తులో రాజప్రముఖుల గదులు ఉన్నాయి. చాలా వరకూ పాడైన దేవాలయాలు వదిలేసి కొంత బాగున్న రాణీమహల్ మరియు రాజమహలు, వీటివెనుక ఉన్న చెరువు మొదలయినవాటిని బాగుచేసి కొంత వరకూ తోట వేసి అన్ని చోట్లా మొక్కలు పెంచి సందర్శకులకు ఆహ్లాదంగా ఉండేలా మార్చారు.

PC:youtube

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

రాజమహలుకు వెనుక ఖాళీ ప్రదేశంలో పెద్ద ఓపెన్ దియేటర్ మాదిరిగా మార్చి, దృశ్య కాంతి శబ్ధ (సౌండ్,లైటింగ్ షో) ప్రదర్శనం చేస్తారు. ఈ ప్రదర్శనకు 45/- రూపాయలు సామాన్య రుసుము ఉంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఐదు కోట్ల రూపాయల మొత్తముతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు.

PC:youtube

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

ఈ ప్రదర్శన ద్వారా పెనుకొండ, చంద్రగిరి సంస్థానాలు ఎలా నాశనమయిపోయాయో కళ్ళకు కట్టినట్లుగా కాంతి, శబ్దాల ద్వారా వివరించబడుతుంది. ఈ ప్రదర్శన తెలుగు మరియు ఆంగ్ల భాషయందు ఉంది. ఆంగ్ల బాషలో వ్యాఖ్యానము అమితాబ్ బచ్చన్ స్వరంలో వినవచ్చు.

PC:youtube

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

చంద్రగిరి కోటలో రాణి మహల్ రహస్యం..! వీడని మిస్టరీ !

ఎలా వెళ్ళాలి

హైదరాబాద్ నుండి చంద్రగిరి కోట చేరుటకు కర్నూలు, కడప మీదుగా కారులో 10గంల 20ని ల సమయం పడుతుంది. విమానంద్వారా 1గంలో చేరవచ్చును. హైదరాబాద్ నుండి కావలి, నెల్లూరుమీదుగా 10గంటలు పడుతుంది.

PC: googlemaps

<strong>ఆదోని కోట లో చక్రవ్యూహం..12 కోటల మధ్యలో ఉన్న రహస్యం మీకు తెలిస్తే షాక్ అవుతారు !</strong>ఆదోని కోట లో చక్రవ్యూహం..12 కోటల మధ్యలో ఉన్న రహస్యం మీకు తెలిస్తే షాక్ అవుతారు !

<strong>తిరుమల వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?</strong>తిరుమల వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

<strong>ఈ లింగాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు సమస్త పీడలు నశిస్తాయి ! ఆదిశివలింగం ఎక్కడ ఉందో తెలుసా ?</strong>ఈ లింగాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు సమస్త పీడలు నశిస్తాయి ! ఆదిశివలింగం ఎక్కడ ఉందో తెలుసా ?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X