Search
  • Follow NativePlanet
Share
» »కాశ్మీర స్వర్గం చట్పాల్

కాశ్మీర స్వర్గం చట్పాల్

చట్పాల్ దక్షిణ కాశ్మీర్‌లో ఉత్తమ పర్యాటక కేంద్రం. చట్పాల్ ట్రావెల్ గైడ్ మీ కోసం.

జమ్మూ, కాశ్మీర్ భారత దేశంలో అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశమన్నది ఎవరూ కాదనలేరు. ఇక్కడ మంచు పర్వతాలు మొదలుకొని పచ్చటి పర్వత, నదీ లోయలు వరకూ ఎన్నో ప్రాంతాలు భారత దేశంలోని పర్యాటకులనే కాకుండా వివిధ దేశాల్లోని పర్యాటకులను ఏడాది మొత్తం ఆకర్షిస్తుంటాయి. అటువంటి కాశ్మీర్‌లో చట్పాల్ అనే పర్యాటక కేంద్రానికి సంబంధించిన వివరాలు మీ కోసం...

చట్పాల్, జమ్ముకాశ్మీర్

చట్పాల్, జమ్ముకాశ్మీర్

P.C: You Tube

చట్పాల్ చుట్టూ మంచుపర్వతాల సౌదర్యాన్ని ఆస్వాధించవచ్చు. అంతేకాకుండా పూలతోటల ఘుమఘుమలతో మనసు పులకించిపోతుంది. అందుకే శీతాకాలంలో ఎక్కువ మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు.

చట్పాల్, జమ్ముకాశ్మీర్

చట్పాల్, జమ్ముకాశ్మీర్

P.C: You Tube

శ్రీనగర్ నుంచి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో చట్పాల్ ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. ఇక్కడి సందర్యాన్ని నేరుగా చూడాలే కాని వర్ణించడానికి మాటలు సరిపోవు. ఇక్కడ పైన్ చెట్లు మీకు స్వాగతం పలుకుతాయి.

చట్పాల్, జమ్ముకాశ్మీర్

చట్పాల్, జమ్ముకాశ్మీర్

P.C: You Tube

కశ్మీర్ అన్న తక్షణం మనకు గుల్మార్గ్, శ్రీనగర్ వంటి ప్రదేశాలే మదిలో మెదులుతాయి. అయితే అంతగా ప్రచారానికి నోచుకోని చట్పాల్ భౌగోళిక స్వరూపం కూడా పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. దీంతో ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా ప్రాచూర్యంలోకి తీసుకురావడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

చట్పాల్, జమ్ముకాశ్మీర్

చట్పాల్, జమ్ముకాశ్మీర్

P.C: You Tube


ఇక్కడి పర్వత, నదీలోయప్రాంతాలు చిన్నా, పెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. ముఖ్యంగా ట్రెక్కింగ్ నుంచి మొదలుకొని అనేక రకాల సహాస క్రీడలకు ఈ ప్రాంతం వేదికఅవుతోంది. అందుకే వీకెండ్ సమయంలో ఎక్కువ మంది ఈ చట్పాల్‌ను సందర్శిస్తుంటారు.

చట్పాల్, జమ్ముకాశ్మీర్

చట్పాల్, జమ్ముకాశ్మీర్

P.C: You Tube

ఏప్రిల్ నుంచి జూన్ మధ్య, అదేవిధంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య చట్పాల్ ను సందర్శించడానికి ఉత్తమ సమయం. ఇక్కడ ఆహ్లాకరమైన వాతావరణం ఉండటమే కారణం. చల్లని గాలులకు తట్టుకోవడానికి చేతకాని వారు అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ ప్రాంతాన్ని సందర్శించకపోవడమే మంచిది.

చట్పాల్, జమ్ముకాశ్మీర్

చట్పాల్, జమ్ముకాశ్మీర్

P.C: You Tube

ఇక్కడి కాశ్మీర్ ఛాయ్ చాలా ఫేమస్. రోడ్డు పక్కన బడ్డీ కొట్టు మొదలుకొని వివిధ రకాల రెస్టోరెంట్ల వరకూ అత్యంత రుచికరమైన టీని మనం తాగొచ్చు. అంతేకాకుండా స్థానిక సంప్రదాయాలన్నింటినీ తెలుసుకోవచ్చు.

చట్పాల్, జమ్ముకాశ్మీర్

చట్పాల్, జమ్ముకాశ్మీర్

P.C: You Tube

చట్పాల్‌కు శ్రీననగర్ విమానాశ్రయం అత్యంత దగ్గరగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య దూరం కేవలం 90 కిలోమీటర్లు మాత్రమే. అదేవిధంగా చట్పాల్ నుంచి 222 కిలోమీటర్ల దూరంలో జమ్ముతావి రైల్వేస్టేషన్ ఉంది. ఇండోర్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుంచి నేరుగా ఇక్కడికి చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X