Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు ఈ ప్రపంచంలోనే అత్యంత చీపెస్ట్ సిటీ అంటా..?అవునా..?

బెంగళూరు ఈ ప్రపంచంలోనే అత్యంత చీపెస్ట్ సిటీ అంటా..?అవునా..?

మన ఇండియాలో చీపెస్ట్ సిటీగా బెంగళూరా?అవునా..నిజమా..?

మన దేశంలో నివసించటానికి చౌకైన నగరం ఏమిటని మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తే, ఏ చిన్న నగరం పేరో చెబుతారు, అయితే ప్రస్తుతం ఈ సంత్సరం సర్వేలో బెంగళూరు సిటీ ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యానికి గురుకాకతప్పదు. ఎలాగంటారా? మొన్న ఈ మద్యనే జరిపిన ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సర్వే నిర్వహించింది. లండన్ కు చెందిన ఈ సంస్థ నిర్వహించిన వార్షిక సర్వేలో అత్యంత ఖరీదైన నగరాల జాబితో ప్యారిస్, హాంగ్ కాంగ్ , సింగపూర్ నగరాలు మొదటి స్థానంలో నిలిచాయి.

ప్రపంచతవ్యాప్తంగా 133 నగరాల్లోని ధరలపై అధ్యయం చేశారు. గత 30ఏళ్ల సర్వే చరిత్రలో మూడు నగరాలు అగ్రస్థానంలో నిలవడం ఇదే మొదటి సారి. ప్రపంచంలోనే కాస్ట్ ఆఫ్ లివింగ్ (నివాసయోగ్యానికి )అనుకూలమైన నగరాల టాప్ టెన్ జాబితాలో నాలుగు భారత్ నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఈ ప్రపంచం మొత్తంలో మోస్ట్ చీపెస్ట్ సిటీగా జింబాబ్వే లోని లుసాకా నగరం నిలిచింది.

ఇండియా టెక్నాలజీ కేంద్రంగా పిలుచుకునే కర్ణాటక లోని బెంగళూరు నగరం భారత్ నుంచి తొలిస్థానం సాధించగా, ఓవరాల్ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ముంబై మూడో స్థానం, చెన్నై ఆరో స్థానం, న్యూఢిల్లీ ఎనిమిదో స్థానాల్లో నిలిచాయి. 160 రకాల ప్రొడక్ట్స్ సర్వీసులు, 400 రకాల వస్తువుల ధరలను పోల్చిచూసి ఫార్ట్యూన్. కామ్ ఈ వివరాల వెల్లడించింది.

గృహావసరాలు, వ్యక్తిగత శ్రద్ధ,

గృహావసరాలు, వ్యక్తిగత శ్రద్ధ,

''గృహావసరాలు, వ్యక్తిగత శ్రద్ధ, విహార, వినోద రంగాలు ఐరోపా దేశాల్లో చాలా ఖరీదైనవి. ఈ అంశాల్లో ప్యారిస్ కాస్త మెరుగ్గా ఉంది. బహుశా ప్యారిస్‌లోని పర్యటకరంగం నుంచి ఆదాయం ఎక్కువ ఉండటం కూడా కారణం కావచ్చు'' అని రోక్సానా స్లవ్జోవా అన్నారు.

'జీవన వ్యయం' ఖరీదైన నగరాల జాబితాలో

'జీవన వ్యయం' ఖరీదైన నగరాల జాబితాలో

ద్రవ్యోల్బణం, అస్థిరమైన ద్రవ్యవిలువల కారణంగా ఈ సంవత్సరం జాబితాలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. 'జీవన వ్యయం' ఖరీదైన నగరాల జాబితాలో బ్రెజిల్, టర్కీ, వెనెజ్వెలా దేశాలు.. కిందకు వెళ్లాయి.

వెనెజ్వెలాలోని కరాకస్ నగరంలో ద్రవ్యోల్బణం దాదాపు 10,00,000%కు చేరుకుంది. దీంతో వెనెజ్వెలా ప్రభుత్వం కొత్త కరెన్సీ అమల్లోకి తెచ్చింది. ఈ పరిణామాలతో జీవన వ్యయం అత్యంత చౌకగా ఉన్న దేశంగా ఈసారి వెనెజ్వెలా నిలిచింది.

ప్రపంచంలో అత్యంత చవకైన నగరాల్లో రెండో స్థానంలో

ప్రపంచంలో అత్యంత చవకైన నగరాల్లో రెండో స్థానంలో

వెనెజ్వెలా రాజధాని కరాకస్ నగరంలో, గత డిసెంబర్ నెలలో.. ఒక వారం రోజుల్లో ఒక కప్పు కాఫీ రెట్టింపై, 42 రూపాయలకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ వెబ్‌సైట్ తెలిపింది.

సిరియాలోని డమాస్కస్ నగరం.. ప్రపంచంలో అత్యంత చవకైన నగరాల్లో రెండో స్థానంలో నిలిచింది. జీవన వ్యయం తగ్గుతున్న ప్రాంతాల సంఖ్య పెరుగుతోంది. ఇందుకు ఆర్థిక, రాజకీయ రంగాలే కారణం అని 'ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్' పేర్కొంది.

SunRise from KalyanNagar Flyover, Bangalore

ఈ లిస్ట్ లో చీపెస్ట్ సిటీస్ లో టాప్ టెన్ లిస్ట్ :

మొదటి స్థానంలో లుసాకా, బెంగళూరు, ముంబై, అలమాటి, అల్జీమర్స్, చెన్నై, కరాచీ, న్యూఢిల్లీ, డమాస్కస్ , కరాకస్ .

India - Chennai - Diwali 2009 - 07

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాలు

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముచ్చటగా మూడో సారి సింగపూర్ నగరం తన స్థానాన్ని పదిలం చేసుకుంది, జ్యూరిచ్, హాంకాంగ్, జెనీవా, ప్యారిస్ నగరాలు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. అయితే గతేడాది 22 స్థానంలో ఉన్న న్యూయార్క్ నగరం మాత్రం ఈ ఏడాది ఏడో స్థానానికి ఎగబాకి మొదటి పది నగరాల్లో చోటు సంపాదించింది.

హైకాస్ట్ సిటీస్ టాప్ టెస్ లిస్ట్ లో


సింగపూర్, జ్యూరిచ్, హాంకాంగ్, జెనీవా, ప్యారిస్, లండన్, న్యూయార్క్, కోపెన్ హాగెస్, సియోల్ , లాస్ ఏంజెల్స్

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X