Search
  • Follow NativePlanet
Share
» »చెన్నై నుంచి కన్యాకుమారికి షి‘కారు’

చెన్నై నుంచి కన్యాకుమారికి షి‘కారు’

చెన్నై నుంచి కన్యాకుమారికి కారులో ప్రయాణం.

By Gayatri Devupalli

భారతదేశం యొక్క దక్షిణ దిగంతం వద్ద, మూడు సముద్రాల సంగమస్థలి సందర్శనార్థమై సాగే పయనాన్ని తలచుకుంటేనే వొళ్ళు పులకరిస్తుంది. కంటికి కనిపించేదాని కన్నా, ఈ ప్రదేశం గురించి తెలుసుకోవలసిన సమాచారం చాలా ఉంది.

చెన్నై నుండి కన్యాకుమారి వెళ్ళటానికి ఉన్న మార్గాలు మరియు మార్గమధ్యంలో సందర్శించదగిన ప్రదేశాలు గురించి ఈ వ్యాసం ద్వారా మరింత తెలుసుకోండి.మొదటి మార్గం: ఎన్. హెచ్ 32 - ఎన్. హెచ్ 38 మరియు చెన్నై - విల్లుపురం - త్రిచి - కన్యాకుమారి రోడ్ - కన్యాకుమారిలో ఎన్. హెచ్ 44 (10 గంటల 49 నిమిషాలు; 708 కిలో మీటర్లు)

రెండవ మార్గం: చెన్నై - కాంచీపురం - ఎన్. హెచ్ 48 - కృష్ణగిరి - కొళినిజిప్పట్టి టోల్ ప్లాజా - దిండిగల్ - మదురై - తిరునెల్వేలి - కన్యాకుమారి (12 గంటల 42 నిమిషాలు; 829 కిమీ) చాలామంది రెండవ మార్గంలోనే ప్రయాణిస్తారు. మేము కూడా మొదటి మార్గానికి బదులుగా రెండవ మార్గాన్ని ఎంచుకున్నాము. ఈ మార్గంలో శ్రీపెరంబుదూర్, కాంచీపురం, మధురై, కృష్ణగిరి, తిరునల్వేలి, దిండిగల్, వెల్లూర్ మొదలైన ప్రదేశాలు ఉన్నాయి.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

మొదటి రోజు: మేము ఉదయం 5 గంటలకు చెన్నై నుండి మెరిసే కళ్ళతో, ఉరిమి ఉత్సాహంతో, మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము. ఈ మార్గంలో ముందుగా శ్రీపెరంబుదూర్ వచ్చింది. బయలుదేరిన కాసేపటికే రావడం వలన తిరుగు ప్రయానంలో , మేము ఈ ప్రదేశంను చూడటానికి నిర్ణయించుకున్నాము.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

రోడ్డు మార్గం గతుకులు లేకుండా, విశాలంగా ప్రయాణించడానికి అనుకూలంగా ఉన్నందున, ఈ ప్రయాణం మరింత ప్రత్యేకంగా మరియు తక్కువ అలసటగా అనిపించింది. దాదాపు 2 గంటల ప్రయాణం తర్వాత, వేయి ఆలయాల నగరమైన కాంచీపురంకు చేరుకున్నాం. ఆగరొత్తుల ఘుమఘుమలు మమ్మల్ని ఆధ్యాత్మిక వాతావరణంలోనికి ఆహ్వానం పలికాయి.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

మేము ముందుగా స్పష్టమైన ప్రణాళిక వేసుకున్నప్పటికీ, ఆలయంలోని నిర్మితమైన రాతి శిల్పాల సౌందర్యం మమ్మల్ని అడుగు ముందుకు వేయనివ్వలేదు. మా ప్రణాళికలు ఫలించలేదు. ముందుగా, కంచి కామాక్షి దేవాలయం వైపుగా దారితీసాము. ఇది పార్వతి దేవి అవతారం అయిన కామాక్షి దేవి ప్రధాన దేవతగా ఉన్న ఆలయం.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

ఇక్కడి దేవాలయంలోని రాతి స్తంభాలపై అద్భుతమైన శిల్ప నైపుణ్యం కనిపిస్తుంది.దీని తరువాత, మేము పరమ శివుని యొక్క పంచాభూతాల స్థలిగా పేరుగాంచిన ఎకంబరేశ్వర లేదా ఏకాంబరనాథ ఆలయానికి వెళ్ళాము. ఈ గుడికి ఆ పేరు 'ఏక ఆమ్ర నాథ' (అనగా ఒక మామిడి చెట్టు యొక్క దేవుడు) అనే పదం నుండి వచ్చింది.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

ఇక్కడ , 4 వేదాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 4 శాఖలతో, 3500 ఏళ్ల వయస్సు ఉన్న మామిడి చెట్టు ఉంది.మీ కాంచీపుర పర్యటన, పట్టుచీరల కొనుగోలు చేయనిదే పూర్తికాదు. భారతీయ మహిళల తన వద్ద కంచిపట్టు చీర ఉండటాన్ని గర్వంగా భావిస్తుంది. కాంచీపురం చేనేత పట్టుచీరలకు ప్రసిద్ధి చెందింది.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

వీటిని మల్బరీ పట్టు ఉపయోగించి, జరితో కలిపి నేస్తారు. వీటికి ప్రపంచవ్యాప్త మహిళల ప్రత్యేక ఆదరణ ఉంది. షాపింగ్ పూర్తయిన తరువాత, మేము కృష్ణగిరికి వెళ్ళాము. కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నందున, మేము హోటళ్ళ కోసం వెతకడం ప్రారంభించాము.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

ఇంతలో మాకు శరవణ భవన్ ఎదురయింది. నెయ్యి గుప్పించి వేసిన దోశలు, వేడి వేడి కేసరిబాత్ మరియు ఇతర దక్షిణ భారతీయ వంటకాలు ఇక్కడ సరసమైన ధరలలో అందుబాటులో ఉన్నాయి. అంతకన్నా మాకు కావలసినది ఇంక ఏముంది!. అడయార్ ఆనంద్ భవన్, శ్రీ మురుగన్ ఫుడ్ కోర్ట్, మెక్ డోనాల్డ్స్ మరియు శ్రీ కృష్ణ ఇన్ వంటి ఇతర ప్రదేశాలుకూడా సమీపంలో ఉన్నాయి.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

ఆకలి తీరిన తరువాత, ఆ నాటి మా మజిలీ అయిన మధురై వైపుగా దూసుకుపోయాము. సాయంత్ర సమయానికి మేము మధురై చేరుకున్నాము. శతాబ్దాలుగా, మధురై విద్య మరియు యాత్రా కేంద్రంగా ప్రసిద్ధమైనది. మధురై మీనాక్షి ఆలయం తప్పక చూడవలసిన ప్రదేశం.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

ఇక్కడ ఉన్న వేయి స్తంభాల మండపం యొక్క నిర్మాణ శైలి అద్భుతంగా ఉంటుంది. మేము రాత్రికి, దక్షిణ భారతదేశ యొక్క ప్రామాణిక రుచికరమైన పదార్థాలు దొరికే, శ్రీ శబరీస్ వద్ద భోజనం చేసి, హోటల్ గదికి చేరుకున్నాం. ఇక్కడితో మా తొలి రోజు యాత్ర ముగిసింది.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

రెండవ రోజు : మేము ఇప్పుడు మా తుది గమ్యం అయిన కన్యాకుమారి చేరుకోవడానికి సిద్ధం అవుతున్నాం. బయలుదేరిన తరువాత సమయం వృధా కాకూడదని, ముందుగానే మురుగన్ ఇడ్లీ షాప్ లో అల్పాహారం ముగించాలని నిర్ణయించుకున్నాము.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

దానికున్న ప్రజాదరణను గురించి తెలుసుకుని అక్కడకు వెళ్లిన, మా అంచనాలను మించి అక్కడి పదార్థాల రుచి ఉంది.కొన్ని గంటలలో, మేము హిందూమతంలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన కన్యాకుమారి పట్టణానికి చేరుకున్నాము.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

పార్వతి దేవి యొక్క అవతార స్వరూపమైన, దేవి కన్య పేరుమీదుగా ఈ పట్టణానికి ఆ పేరు వచ్చింది. ఈ పట్టణంలో మేము కాలు మోపింది మొదలు, మంచి సముద్రతీర రమణీయ దృశ్యాన్ని అందించే హోటళ్ళ కోసం కంగారుగా వెతికాము.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

చివరగా, మేము సముద్ర అభిముఖంగా ఉన్న , ఈస్ట్ కార్ స్ట్రీట్లో ఉన్న హోటళ్ళ వైపుగా వచ్చాము. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి హోటల్ వాళ్ళు "సముద్ర అభిముఖంగా" రూములు ఉంటాయని చెప్పుకొచ్చినప్పటికి, వాటిలో అన్ని అలా ఉండవు. వివేకానంద కేంద్రంలో అయితే మనకు మంచి వసతి మరియు సముద్ర తీర వీక్షణ దొరుకుతాయి.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

అయినప్పటికీ, మీరు హోటల్ యొక్క బాల్కనీ నుండి సూర్యాస్తమయం / సూర్యోదయం చూడాలనుకుంటే, ఈస్ట్ కార్ స్ట్రీట్లో ఉండే హోటళ్ళు ఎన్నుకోవాలి. తరువాత, మేము హోటల్ చుట్టుపక్కల ఉన్న వీధుల్లో తిరిగి, ఇంటి దగ్గరలో ఉండే స్నేహితులు మరియు బంధువులకు ఇవ్వడానికి చిన్న చిన్న బహుమతులు కొనుగోలు చేశాము.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

తరువాత మేము కన్యా కుమారి అమ్మవారి ఆశీర్వాదాన్ని అందుకోవడానికి, దేవాలయానికి చేరుకున్నాం. దేవి ఒంటి చేతితో రాక్షస సంహారం కావించి, ప్రజల స్వాతంత్రాన్ని కాపాదిందని పురాణాలు చెబుతున్నాయి.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

అక్కడి నుండి మేము గాంధీ మెమోరియల్ కు వెళ్ళాము. ఇది 1956 లో గాంధీని గౌరవార్ధం నిర్మించబడింది. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే, అతని శరీరానికి అంత్యక్రియలు జరిపి, అతని చితాభస్మాన్ని ఇక్కడి సముద్ర జలాలలో నిమజ్జనం చేసారు. నిమర్జనకు ముందు, అతని చితాభస్మాన్ని ఇక్కడి స్మారకంలో భద్రపరిచారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు, సూర్యుని కిరణాలు అతని చితాభస్మాన్ని భద్రపరిచిన ప్రదేశాన్ని తాకే విధంగా, ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

వివేకానంద స్మారకచిహ్నం - సముద్ర తీరానికి, కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో జంట శిలలు ఉన్నాయి. స్వామి వివేకానంద ప్రపంచ మత సదస్సులో పాల్గొనడానికి చికాగోకు వెళ్లేముందు 1892 లో, ఇక్కడకు చేరుకుని, ఈ శిలపై ధ్యానం చేసాడని చెప్తారు. ఈ ప్రదేశం చేరుకోవడానికి మేము ఫెర్రీపై ప్రయాణం చేసాము.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

ఇక్కడ ఉన్న ఇంకొక ఆకర్షణ, తిరువల్లువార్ విగ్రహం. ఇది 38 అడుగుల ఎత్తు కలిగిన రాతిపై ఉన్న133 అడుగుల ఎత్తు కలిగిన విగ్రహం. 38, కవి అయిన తిరువల్లువార్ రాసిన 'కురల్' లోని 38 అధ్యాయాలను సూచిస్తుంది మరియు 133 'తిరుక్కురల్' యొక్క 133 అధ్యాయాలు సూచిస్తుంది. ఈ విగ్రహాన్ని 21 వ శతాబ్దం యొక్క అద్భుతం అం8 చెప్పవచ్చు. దీనిని జనవరి 1, 2000 తేదీన ఆవిష్కరించారు.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

ఈ ప్రధాన పర్యాటక స్థలాలను సందర్శించిన తరువాత, సూర్యాస్తమయాన్ని వీక్షించేందుకు పరుగులు తీసాము. సూర్యాస్తమయ దృశ్యం కన్నులపండువగా, ప్రపంచంలో దీనికి సాటి రాగల రమణీయ దృశ్యం ఇంకేమి ఉండదు అనేట్లుగా ఉంది.

చెన్నై నుంచి కన్యాకుమారికి

చెన్నై నుంచి కన్యాకుమారికి

P.C: You Tube

మూడవ మరియు ఆఖరి రోజు: మరుసటి రోజు ఉదయం, మేము ఈ ప్రదేశంలో ఆవిష్కరింపబడే మరొక అద్భుతమైన ప్రకృతి సౌందర్య చిత్రమైన 'సూర్యోదయాన్ని' కనులారా గాంచడానికి మేమున్న గదుల దౌడు తీసాము. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, అది చూసే మన హృదయాలు ఆనంద డోలికల్లో మునిగి తేలుతాయి. ఇక్కడి నుండి తిరిగి ఇంటికి వెళ్లాలన్న ఆలోచన కూడా మనస్సుకు బాధగా అనిపిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X