Search
  • Follow NativePlanet
Share
» »బేలూరు చెన్నకేశవ దేవాలయ అద్భుత కట్టడం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు

బేలూరు చెన్నకేశవ దేవాలయ అద్భుత కట్టడం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు

Photo Courtesy: Papa November

దేశంలో దేవుళ్లు స్వయంభువుగా వెలిసిన ఎన్నో ప్రాచీన ఆలయాలతోపాటు రాజవంశస్థులు నిర్మించిన మరెన్నో దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి వున్నాయి. అయితే.. మరికొందరు రాజులు మాత్రం చరిత్రలో తమ పేరుప్రతిష్టలు చిరకాలంగా నిలిచిపోయేలా కొన్ని ఆలయాలను గుర్తుగా నిర్మించుకున్నవారున్నారు. అటువంటి ఆలయాల్లో 'చెన్నకేశవ ఆలయం'ను ఒకటిగా చెప్పుకోవచ్చు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని హోయసలుల రాజవంశస్థులు నిర్మించినట్లు చారిత్రక నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో వుంది.

బేలూర్ కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రదేశము . అనేక ఆలయాలకు నెలవైన ఈ పట్టణం హసన్ జిల్లా లో బెంగుళూర్ నుండి కేవలం 220 కి. మీ. ల దూరంలో ఉంది. ఇది యగాచి నది ఒడ్డున కలదు , దీని ప్రాచీనమైన, విశిష్టమైన దేవాలయల వలన దీనిని అందరు దక్షిణ కాశి అంటారు.

చారిత్రకంగా బేలూర్ విశిష్టమైనది

చారిత్రకంగా బేలూర్ విశిష్టమైనది

బేలూర్ హొయసల సామ్రాజ్య రాజధానిగా ఉంది కనుక చారిత్రకంగా బేలూర్ విశిష్టమైనది. ఇక్కడికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హలేబిడ్ కూడా హొయసల రాజధానిగా ఉంది ఇది పురాతన నగరం.

PC:Dineshkannambadi

ఈ రెండు నగరాలు

ఈ రెండు నగరాలు

ఈ రెండు నగరాలు హొయసల నిర్మాణ ప్రతిభకు ప్రసిద్ధ ఉదాహరణలు - తరచుగా యాత్రికులు ఈ రెండు నగరాలను ఒకే సారి దర్శిస్తూ ఉంటారు.

PC:i10ian Follow

 విష్ణు భగవానుడి కోసం నిర్మించిన ఈ ఆలయం గాలిగోపురం ఎత్తు ఎంతొ ప్రసిద్ధి

విష్ణు భగవానుడి కోసం నిర్మించిన ఈ ఆలయం గాలిగోపురం ఎత్తు ఎంతొ ప్రసిద్ధి

బేలూర్ లో అన్నిటికన్నా గొప్ప ఆలయ సముదాయం నిస్సందేహంగా చెన్నకేశవ ఆలయం. విష్ణు భగవానుడి కోసం నిర్మించిన ఈ ఆలయం గాలిగోపురం ఎత్తు ఎంతొ ప్రసిద్ధి చెందినది . ఈ ఆలయం లోని రక రకాల శిల్పాలు ఎంతొ సజీవంగా ఉన్నాయా అన్నంత బాగుంటాయి.

PC:Philip Larson

అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం

అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం

బేలూర్ లోని అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం తప్పక సందర్శించదగినడి. ఈ దేవాలయం మృదువైన సున్నపురాయిని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆలయము, విష్ణువు యొక్క ఒక అవతారము ఐన చెన్నకేశవ స్వామికి అంకితం చేయబడినది.

PC: Mashalti

యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు

యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు

పర్యాటకులు పురాణాల్లోని అనేక గాధలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను చూడవచ్చును. వీటితో పాటు, వివిధ రంగులలో చెక్కిన నవ యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి.

PC: Ashlyak

ఇంకా వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు

ఇంకా వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు

ఇంకా వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు, ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. అందులో ముఖ్యంగా దర్పణ సుందరి, భస్మ మోహిని అనేవి చెప్పుకోదగిన ఆకర్షణీయ శిల్పాలలో కొన్ని!

PC:Philip Larson

ప్రవేశద్వారం వద్ద ఒక పుష్కరణి

ప్రవేశద్వారం వద్ద ఒక పుష్కరణి

పర్యాటకులు ఆలయం యొక్క ప్రవేశద్వారం వద్ద ఒక పుష్కరణిని (మెట్లబావి) కూడా చూడవచ్చు.

PC:uday28ms Follow

ఆలయం యొక్క అంతర్భాగంలో

ఆలయం యొక్క అంతర్భాగంలో

విజయనగర సామ్రాజ్యం రోజులలో ఈ ఆలయం యొక్క రాజగోపురాలు నిర్మించబడ్డాయి. ఆలయం యొక్క అంతర్భాగంలోనే కప్పే చేన్నిగరాయ ఆలయం, మరియు లక్ష్మి దేవీకి అంకితం చేసిన ఒక చిన్న కట్టడము కూడా ఉన్నాయి.

బేలూర్ - గ్రావిటీ పిల్లర్

బేలూర్ - గ్రావిటీ పిల్లర్

ఈ ఆలయానికి బయట 42 అడుగుల ధ్వజస్తంభం ఉంది. మహాస్తంభం లేదా కార్తిక దీపోత్సవ స్తంభం అని పిలవబడే ఈ 42 అడుగుల ఈ స్తంభం చెన్నకేశవ ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటి.

Photo Courtesy: Madhav Pai

దీని విశేషమేమిటంటే ఈ స్తంభం ఓక వైపు

దీని విశేషమేమిటంటే ఈ స్తంభం ఓక వైపు

దీని విశేషమేమిటంటే ఈ స్తంభం ఓక వైపు ఆధారం నేలను తాకి ఉండదు. మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది. హొయసల శైలి శిల్పకళకు నిలువుటద్దంగా ఈ దేవాలయం వుంటుంది.

PC: Quib

బేలూర్ చేరుకోవడం ఎలా?

బేలూర్ చేరుకోవడం ఎలా?

రోడ్డు మార్గం

బేలూర్ హళేబీడు లకు మీరు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. హస్సన్ నుండి బస్సు ద్వారా గాని లేకుంటే మీకు సొంత వాహనం ఉంటే మీరే సొంతంగా డ్రైవ్ చేసుకొని రావచ్చు. హస్సన్ రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల నుంచి, వివిధ నగరాలనుంచి బెంగళూరు, మైసూరు నుంచి కూడా బస్సులు వస్తుంటాయి.

రైలు మార్గం

హస్సన్ రైల్వే స్టేషన్ కు బెంగళూరు, మైసూరు, మంగళూరు ప్రాంతాలనుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

వాయు మార్గం

దేనికి చేరువలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది సుమారుగా 223 కి. మీ .దూరంలో ఉన్నది. ఈ విమానాశ్రయం కి దేశంలోని ప్రధాన నగరాలనుంచే కాక, వివిధ దేశాల నుంచి కూడా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

Photo Courtesy: Surajram Kumaravel

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X