» »హైదరాబాద్ గురించి దిమ్మతిరిగే నిజాలు !

హైదరాబాద్ గురించి దిమ్మతిరిగే నిజాలు !

Written By: Venkatakarunasri

హైదరాబాద్ నగరం భారతదేశ సుప్రసిద్ధ నగరాలలో ఒకటి. కుతుబ్ షా రాజవంశీయులలో ఒకరైన మహమ్మద్ కులీ కుతుబ్ షా క్రీ.శ.1591 లో ఈ నగరాన్ని నిర్మించాడు. స్థానిక కథనం మేరకు, ఆస్థాన నర్తకి భాగమతి తో ప్రేమలో పడిన సుల్తాన్, వారి ప్రేమకు గుర్తుగా ఈ నగరానికి 'భాగ్యనగరం' గా పేరు పెట్టాడు. పెళ్లైన తర్వాత భాగమతి ఇస్లాం మతాన్ని స్వీకరించి, హైదర్ మహల్ గా మార్చుకుంది. దానిని అనుసరించే 'హైదరాబాద్' గా రూపాంతరం చెందినది. ఇదిచరిత్ర మరి ప్రస్తుతం హైదరాబాద్ ఎలా ఉంది ?

భారతదేశంలోని అతిపెద్ద నగరాలలో ఐదవది హైదరాబాద్. పక్కనున్న చిన్న చిన్న మునిసిపాలిటీలు కలుపుకొని 'గ్రేటర్ హైదరాబాద్' గా ప్రపంచపటంలో గుర్తింపు సంపాదించుకొంది. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, చరిత్రకు, కట్టడాలకు, మసీదులకు దేవాలయాలకు, కళలకు, హస్తకళలకు మరియు నాట్యానికి, సినీ రంగానికి ప్రసిద్ధి. గడిచిన దశాబ్ద నుంచి సాఫ్ట్ వేర్ రంగంలో కూడా ప్రఖ్యాతలు సంపాదిస్తున్నది.

హైదరాబాద్ లో చార్మినార్ ఎంత ఫెమసో బిర్యానీ, చాయ్, సమోస అంతే ఫెమస్. హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టిన ప్రతి పర్యాటకుడు బిర్యాని రుచి చూడకుండా వెనుతిరగడు. అసలు బిర్యాని తినకపోతే హైదరాబాద్ పర్యటన సంతృప్తి కాదంటే అతిశయోక్తి కాదా మరి ! కేవలం ఇవేకాదు యాత్రికులను కట్టిపడేసే హైదరాబాద్ గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు చరిత్రపుటల్లో దాగివున్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా .. !!

కృతిమ సరస్సులు

కృతిమ సరస్సులు

హైదరాబాద్ సరస్సుల నగరం. దీని చుట్టూ ఉన్న కృతిమ సరస్సులు పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తాయి. హైదరాబాద్ శివార్లలో 140 సరస్సులు కలిసే చోట ఒక పెద్ద ఆనకట్ట నిర్మించారు. ఇసి చూడటానికి అద్భుతంగా ఉంటుంది. హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లు వాటిలో కొన్ని.

PC: Randhirreddy

అతిపెద్ద ఫిలిం సిటీ

అతిపెద్ద ఫిలిం సిటీ

ప్రపంచములోనే అతి పెద్ద ఫిలిం సిటీ లలో ఒకటైన రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ నగరం నుండి విజయవాడ కు వెళ్లే మార్గంలో ఉన్నది. ఇది సుమారు 2000 ఎకరాలలో విస్తరించి ఉంది. హాలివూడ్, బాలీవుడ్ తో పాటు అన్ని చిత్రపరిశ్రమల సినిమాలు, సీరియల్ షూటింగ్ లు తరచూ ఇక్కడ చిత్రీకరిస్తుంటారు. ప్రతిరోజూ సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

PC: Pratish Khedekar

కోహినూరు

కోహినూరు

కోహినూరు వజ్రం ను ప్రపంచంలో అతి ఖరీదైన, పెద్దయిన వజ్రం గా పరిగణిస్తారు. ప్రస్తుతం ఇది బ్రిటన్ రాణి కిరీటంలో ప్రధాన వజ్రంగా ఉన్నది. తెలుగునాట కృష్ణా నది తీరంలో ఈ వజ్రం లభించినది. హైదరాబాద్ నగర చరిత్రలో ఈ వజ్రానికి ప్రత్యేక స్థానం కలదు. దీని ఖరీదు 10-12 బిలియన్ డాలర్లు.

PC: wikipedia

ప్రసాద్ ఐమాక్స్

ప్రసాద్ ఐమాక్స్

ప్రపంచములో రెండవ అతిపెద్ద 3డి ఐమాక్స్ తెర హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో కలదు. 235000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది ఈ ఏసీ మల్టిప్లెక్స్. ఫుడ్ కోర్ట్, గేమ్స్ జోన్, షాపింగ్ మాల్స్ ఈ కాంప్లెక్స్ లో ఉన్నాయి. స్క్రీన్ : 72 అడుగుల ఎత్తు, 95 అడుగుల పొడవు, 1200 వాట్ సౌండ్ సిస్టం, 635 సీట్లు కలిగి ఉన్నది.

PC: wikipedia

భారతదేశ ఐటీ కేంద్రం

భారతదేశ ఐటీ కేంద్రం

19 వ శతాబ్దం చివరి దశకంలో హైదరాబాద్ ఐటీ వైపు అడుగులేసి, నేడు బెంగళూరు తర్వాత రెండవ సిలికాన్ సిటీగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. నేడు ఎన్నో బహుళ జాతి సంస్థలకు, పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రబిందువుగా నిలిచింది. ప్రపంచములో పేరెన్నికగల MNC కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నాయి.

PC: Veera.sj

 టాలీవూడ్

టాలీవూడ్

మద్రాస్ నుంచి విడిపోయాక తెలుగు సినిమా పరిశ్రమకు స్వస్థలం హైదరాబాద్. టాలీవూడ్ అంతా ఇక్కడే ఉంది. టాలీవూడ్ ఇండియాలో నే రెండవ అతిపెద్ద చిత్ర పరిశ్రమ. మొదటి స్థానంలో బాలీవూడ్ ఉంది.

PC: Mohan Krishnan

కన్వెన్షన్ సెంటర్

కన్వెన్షన్ సెంటర్

ఆసియా ఖండంలో కెల్లా అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ హైదరాబాద్ లో కలదు. ఒకేసారి 5000 మంది కూర్చొనే విశాలమైన స్థలం కలిగి ఉంది. 291000 చ. అ. విస్తీర్ణంలో ఈ కన్వెన్షన్ సెంటర్ ను ఏర్పాటుచేశారు.

PC:wikipedia

ముత్యాల నగరం

ముత్యాల నగరం

హైదరాబాద్ నగరం ముత్యాల నగరంగా ప్రసిద్ధి చెందినది. పాతబస్తీ లోని మోతీగల్లి ముత్యాల వర్తకానికి ప్రధాన స్థావరం. నిజాం కాలంలో పర్షియన్లు ముత్యాలు సరఫరా చేసేవారు. ముత్యాలను పాలిష్ పెట్టె కర్మాగారాలు నేడు నగరంలో అనేకం ఉన్నాయి.

PC: Abhinaba Basu

బుద్ధవిగ్రహం

బుద్ధవిగ్రహం

ప్రపంచములో నిలబడి ఉన్న బుద్ధుని అతి పెద్ద ఏకశిలా విగ్రహం హైదరాబాద్ లో కలదు. దీనిని హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో ఉంచారు. దీని ఎత్తు 17. 5 అడుగులు, బరువు 350 టన్నులు. హైదరాబాద్ కు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావటంలో బుద్ధవిగ్రహం ప్రముఖపాత్ర వహిస్తున్నది.

PC: TripodStories- AB

హైదరాబాద్ బిర్యాని

హైదరాబాద్ బిర్యాని

ప్రపంచములో ఎక్కడ తిన్నా ఇది మన బిర్యానీ అనిపించేదిగా ఉంటుంది హైదరాబాద్ బిర్యానీ. ఏ దేశ, విదేశీ ప్రముఖులు హైదరాబాద్ వచ్చినా ముందుగా టెస్ట్ చేసేది హైదరాబాద్ బిర్యానీనే. అమెరికా వైట్ హౌస్ లో కూడా బిర్యాని వడ్డిస్తారంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదూ ! హైదరాబాద్ బిర్యానీయా ! మజాకా ..!

PC: FoodPlate

చార్మినార్

చార్మినార్

చార్మినార్ హైదరాబాద్ చిహ్నం. పాతబస్తీ ఏరియాలో ఉంటుంది. నగరానికి ప్రముఖ ఆకర్షణ ఇది. నగరంలో ప్లేగు వ్యాధి వ్యాపించకుండా నిర్మూలించిన దైవశక్తులకు కృతజ్ఞతా భావంతో ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు పూర్వీకులు.

PC:Naveen Durgam

బిర్లామందిర్

బిర్లామందిర్

బిర్లా మందిర్, నౌబత్ పహాడ్ అనబడే చిన్న కొండ పై రాజస్థాన్ నుండి తెప్పించిన తెల్లని పాలరాతి చలువ రాళ్లతో నిర్మించారు. ఇది కట్టడానికి 10 సంవత్సరాలు పట్టింది. ప్రధాన దైవం వెనకటేశ్వర స్వామి. ప్రశాంతతకు భంగం కలగకూడదని గంటలు కూడా ఏర్పాటుచేయలేదు.

PC: ambrett

సీతారాం బాగ్ ఆలయం

సీతారాం బాగ్ ఆలయం

ఈ దేవాలయం 25 ఎకరాలలో విస్తరించబడి ఉంది. దేవాలయంలో శిల్పకళల సమ్మేళనం అద్భుతంగా ఉంటుంది. గుడి రాజస్థానీ, మొఘల్ మరియు యూరోపియన్ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది.

PC: wikipedia

మక్కామసీదు

మక్కామసీదు

మక్కా మసీద్ చార్మినార్ పక్కనే కలదు. ఇది ముస్లింల ప్రార్థనా స్థలం. ముస్లిం ల పవిత్ర స్థలం మక్కా నుండి ఇటుకలను తెప్పించి మసీదు ను నిర్మించారని చెబుతారు. హాలు 75 అడుగుల ఎత్తు, 220 అడుగుల వెడల్పు, 180 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. మసీదులో మహమ్మద్ ప్రవక్త పవిత్ర కేశం భద్రపరిచారు.

PC: Pranav Yaddanapudi

గోల్కొండ కోట

గోల్కొండ కోట

గోల్కొండ కోట హైదరాబాద్ నగరం నుండి 11 కి.మీ ల దూరంలో కలదు. దీనిని 120 మీ. ఎత్తైన ఒక నల్లరాతి గుట్ట పై నిర్మించారు. కోటలోని ఉద్యానవనాలు, చిన్న చిన్న కట్టడాలు ఆకర్షణలుగా నిలిచాయి. చప్పట్లు కొడితే 91 మీ. ఎత్తున్న రాణి మహల్ వద్ద ఆ శబ్దం వినిపించడం, గోడ వద్ద మాట్లాడితే మరో గొడవ వద్ద వినిపించడం కోటలో ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు.

PC: RamBiswal

ఉబెర్ టాక్సీ

ఉబెర్ టాక్సీ

యూఎస్ తర్వాత ప్రపంచంలో ఉబెర్ టాక్సీ సౌకర్యాన్ని హైదరాబాద్ ఎక్కువగా వినియోగించుకుంటుంది. హైదరాబాద్ రెండవ స్థానంలో కలదు.

PC: b k

ఆస్తమా రోగులకు

ఆస్తమా రోగులకు

169 సవత్సరాల చరిత్ర కలిగిన చేపమందు భాగ్యనగరం సొంతం. చేప మందు లేదా చేప ప్రసాదం ను ప్రతిఏటా మృగశిర కార్తె రోజున ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో లేదా ఏదైనా పెద్ద మైదానంలో బత్తిని సోదరులు పంపిణీ చేస్తారు. ఇది ఉబ్బసం వ్యాధిని నివారిస్తుంది అని కొందరి భావన.

PC: oneindia telugu

అతిపొడవైన ఫ్లై ఓవర్

అతిపొడవైన ఫ్లై ఓవర్

భారతదేశంలోనే అతిపొడవైన ఫ్లై ఓవర్ "పీవీ ఎక్స్ ప్రెస్ వే" హైదరాబాద్ లో కలదు. నగరంలో సరోజినీ కంటి ఆసుపత్రి వద్ద మొదలై రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ముగుస్తుంది. పొడవు : 11.6 కి. మీ.ఇండియాలో ఇదే అతిపొడవైన ఫ్లై ఓవర్.

PC: Vitor Pamplona

స్నో థీమ్ పార్క్

స్నో థీమ్ పార్క్

ప్రపంచలోనే అతిపెద్ద స్నో థీమ్ పార్క్ హైదరాబాద్ లో కలదు. సుమారు ఎనిమిది వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. స్నో వరల్డ్ గా పిలువబడే ఈ థీమ్ పార్క్ వివిధ వినోద క్రీడలను అందిస్తున్నది.

PC: Bssasidhar

ఇరానీ చాయ్

ఇరానీ చాయ్

ఇండియాలో ఇరానీ చాయ్ మొదట హైదరాబాద్ లోనే ప్రారంభమైనది. ఇరానీ చాయ్ పర్షియన్ బ్రాండ్. అయినా హైదరాబాద్ లో ఇరానీ చాయ్ కేఫ్ లు 25 వరకు ఉన్నాయి. వాటిలో కొన్ని : హోటల్ ఇక్బల్, సర్వి బేకర్స్, నిమ్రాహ్ కేఫ్ మొదలైనవి.

PC:అహ్మద్ నిసార్

ఇంజనీర్ లు

ఇంజనీర్ లు

దేశానికి అత్యధిక ఇంజనీర్లను అందించే సత్తా హైదరాబాద్ కు తప్ప దేశంలో మరే ఇతర నగరానికి లేదు. ఒక్క హైదరాబాద్ చుట్టూ 350 పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఏటా 50 వేల మందికి పైగా విద్యార్థులు బయటికి వస్తున్నారు. బిట్స్ పిలానీ, ఉస్మానియా, జే ఎన్ టి యు, ఐఐటీ హైదరాబాద్ మొదలుగున విద్యాసంస్థలు వాటిలో కొన్ని.

PC:Prasanth Inturi

రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్

రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్

ప్రపంచ విమానాశ్రయాలలో అధిక విశేష లక్షణాలున్న విమానాశ్రయంగా అగ్రభాగాన నిలిచింది శంషాబాద్ ఎయిర్ పోర్ట్. ఏటా 40 మిలియన్ ప్రయాణీకులకు సేవలందించే విధంగా దీని నిర్మాణం కలదు. ఈ ఎయిర్ పోర్ట్ 5500 ఎకరాలలో నిర్మితమైనది.

PC:SridharSaraf

నిజాం నవాబ్

నిజాం నవాబ్

ప్రపంచములో అత్యంత ధనవంతుడిగా (1937) వెలుగొందిన నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్. ఈయన ఒకసారి వేసిన దుస్తులు వెయ్యరట. ఒకసారి వాడిన చెప్పులు, బూట్లు వాడరట. కర్నూలు, అనంతపురం నుండి రెండు సార్లు పార్లమెంట్ కు ఎన్నికయ్యారు.

PC: S N Barid

సాలార్ జంగ్

సాలార్ జంగ్

సాలార్ జంగ్ మ్యూజియం దక్షిణా భారతదేశంలోని ఉత్తమ మ్యూజియాలలో ఒకటి. ఈ మ్యూజియంలో ప్రపంచం మొత్తం మీద నుంచి తెప్పించిన 40 వేలకు పైగా వస్తువులు ప్రదర్శిస్తున్నారు.

PC: Neeresh.kr

కనెక్టెడ్ సిటీ

కనెక్టెడ్ సిటీ

భారతదేశంలో ఉన్న 97 కోట్ల టెలికాం సబ్ స్క్రైబర్స్ లో హైదరాబాద్ దే అగ్రతాంబూలం.

PC:oneindia

క్రీడానగరం

క్రీడానగరం

ప్రపంచ క్రీడాకారులైన పుల్లెల గోపీచంద్, కోనేరు హంపి, సానియా మీర్జా, సైనా నెహ్వాల్, పి వి సిందూ లను అందించిన ఘనత హైదరాబాద్ సొంతం.

PC: Cephas 405

4 వ స్థానం

4 వ స్థానం

దేశంలో జనాభా పరంగా 4 వ స్థానంలో ఉంది హైదరాబాద్. హైదరాబాద్ నగర జనాభా 6.8 మిలియన్లు (68 లక్షలు).

PC: Julia Gross

షాపింగ్

షాపింగ్

షాపింగ్ లకు స్వర్గ ధామం హైదరాబాద్. ప్రపంచంలో పెరిన్నిక గల అన్ని బ్రాండెడ్ వస్తువుల నుంచి లోకల్ వస్తువుల దాకా అన్నీ దొరుకుతాయి. రిటైలర్ వ్యాపారాలకు ఈ ప్రదేశం చక్కటి ఉదాహరణ. జీవీకే మాల్, హైదరాబాద్ సెంట్రల్, అబిడ్స్, బిగ్ బజార్ మొదలుగునవి.

PC: Karthikkumar68

ఉద్యానవనాలు

ఉద్యానవనాలు

హైదరాబాద్ నగరం మొత్తం మీద సుమారు 25కు పైగా గార్డెన్ లు ఉన్నాయి. ఉదయం, సాయంత్రం వేళ వాకింగ్ లకు, విశ్రాంతి తీసుకోవటానికి ఇవి ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఎన్టీఆర్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్స్, ఇందిరా పార్క్ మొదలుగునవి నగరంలోని ఉద్యానవనాలు.

PC:Rk20july

ఎగ్జిబిషన్

ఎగ్జిబిషన్

ఇండియాలోనే ఉత్తమ మరియు అతిపెద్ద ఎగ్జిబిషన్ సెంటర్ హైటెక్స్. ఇక్కడ ప్రముఖుల పెళ్లిళ్లు, సమావేశాలు జరుగుతుంటాయి.

PC: Malyadri