Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలో రంగులు మారే శివ లింగాలు గల ప్రదేశాలు

భారతదేశంలో రంగులు మారే శివ లింగాలు గల ప్రదేశాలు

అచలేశ్వర్ మహాదేవ టెంపుల్ లో గల శివ లింగం ఉదయంపూట ఎర్ర రంగులో , మధ్యాహ్నసమయంలో కాషాయరంగులో మరియు సాయంకాలసమయంలో గోధుమ రంగులో కనిపిస్తుంది. మనం దేవస్థానాలలో తరచుగా నల్లరంగులో ఉండే శివలింగాలు చూసుంటాం లే

"రాజస్థాన్" మన దేశానికి నైబుతిలో ఉంది. రాజధాని "జైపూర్". ఇక్కడ ఎడారిని "థార్ ఎడారి" అని పిలుస్తారు. ఇక్కడ ప్రజలు మాట్లాడే భాష "రాజస్థానీ". ఇక్కడ సాంప్రదాయక వంటలు అంటే దాల్ బాతి, బెయిల్ గట్టే, రాబ్ది, బజరే కి రోటి లేదా మిల్లెట్ బ్రెడ్ మరియు లాషుం కి చట్నీ, మావా కచోరి మరియు బికనీర్ రసగుల్లాలు.

ఇక్కడ చూడదగిన ప్రదేశాలు: జైపూర్, జోధ్ పూర్, ఉదయపూర్ మరియు జైసల్మేర్.

రాజస్ధాని వంటకాలు: ఇక్కడ నీరు తక్కువగా ఉండటం మరియు తాజా కూరలు ఉండకపోవటం వల్ల కొంచెం పొడిగా ఉంటాయి. అయినప్పటికి అవి మీకు నోరూరిస్తాయి. సాంప్రదాయక వంటలు అంటే దాల్ బాతి, బెయిల్ గట్టే, రాబ్ది, బజరే కి రోటి లేదా మిల్లెట్ బ్రెడ్ మరియు లాషుం కి చట్నీ, మావా కచోరి మరియు బికనీర్ రసగుల్లాలు.

అంతేకాకుండా ఇక్కడ రత్నంబోర్ నేషనల్ పార్క్, సరిస్కా టైగర్ రిజర్వ్, దర్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు కుంభాల్ ఘర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, అనేక హిందు మరియు జైన దేవాలయాలు, ఇంకా ఇతర పవిత్ర ప్రదేశాలు కూడా కలవు.

మనం దేవస్థానాలలో తరచుగా నల్లరంగులో ఉండే శివలింగాలు చూసుంటాం లేదా అమరనాథ్ లో మాత్రమే కనిపించే మంచు శివలింగాలను చూసుంటాం. కానీ వివిధరకాల రంగులతో కూడిన శివలింగాన్ని చూసారా? ఈ దేవస్థానంలో ఈ కలర్ ఫుల్ శివలింగం గురించి ఉత్సాహపూరితమైన గాధలు మనం తెలుసుకోవచ్చు. మన భారతదేశంలో గల మిస్టీరియస్ శివ టెంపుల్స్ లో ఇది ఒకటి అని అనుటలో ఎలాంటి సందేహం లేదు.

రాజస్థాన్ కి ప్రయాణం చేస్తే శివలింగం యొక్క రంగు రోజుకు మూడుసార్లు ఎక్కడ మారుతుందో మనకు తెలుస్తుంది.

రంగులు మార్చే శివలింగం

Photo Courtesy: Jean-Pierre Dalbéra

శివలింగం రంగులు మార్చటం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ! అవునండీ, అచలేశ్వర్ మహాదేవ టెంపుల్ లో గల శివ లింగం ఉదయంపూట ఎర్ర రంగులో , మధ్యాహ్నసమయంలో కాషాయరంగులో మరియు సాయంకాలసమయంలో గోధుమ రంగులో కనిపిస్తుంది.

కొంతమంది పరిశోధకులు సూర్యకిరణాలు శివలింగం పైన పడటం వల్ల శివలింగం ఇలా రంగులు మారుతుంది అంటారు. ఎవరూ కూడా సరైన శాస్త్రీయ వివరణ ఇవ్వలేకపోతున్నారు. చాలామంది రాజస్థాన్ ధోల్ పూర్ లో అచలేశ్వర్ మహదేవ్ టెంపుల్ నందు గల ఆసక్తికరమైన దృశ్యం చూచుటకు ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే వేచియుండి ఆ దృశ్యం తిలకిస్తారు.

ఈ 2500 ఏళ్ల ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణగా నంది విగ్రహం చూడవచ్చు. ఈ బ్రాస్ నంది ఐదు రకాలైన లోహములతో తయారుచేయబడినది. ఆలయ దాడికి ప్రయత్నించిన ముస్లిం మత ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ఈ నంది విగ్రహం వారిపై దాడికి వేల తేనెటీగలను విడుదల చేసిందని ఇక్కడ స్థలపురాణం చెబుతుంది.

ఇక్కడ శివుడు స్వయంభు (స్వీయ వ్యక్తం) అని చెబుతారు. ఒకసారి కొంతమంది ఆసక్తితో లోతు తెలుసుకోవటానికి శివలింగము చుట్టూ త్రవ్వటం ప్రారంభించారు. తవ్వుతున్నకొద్దీ లోతు చాలా ఎక్కువయ్యేకొలది వారు చాలా ఆశ్చర్యానికి లోనై అంతటితో ఆ ప్రక్రియను నిలిపివేశారు. రికార్డులను బట్టి ఈ ఆలయం శివుని బొటనవేలు గీత చుట్టూ నిర్మించబడింది!

శివపురిలోని శివలింగం

రంగులు మార్చే శివలింగం

Photo Courtesy: Nagarjun Kandukuru

చాలామంది భక్తులకు వారి గమ్యస్థానాల నుండి "అచలేశ్వర్ టెంపుల్ " ఎక్కువ దూరంలో ఉండటం వల్ల సందర్శించలేకపోతున్నారు. ఏది ఏమైనా ఎవరైతే ఇక్కడికి వచ్చి ఈశ్వరుని దర్శించుకుంటారో వారియొక్క కోర్కెలన్నీ తప్పక తీరుతాయని భక్తుల బలమైన నమ్మకం. పెళ్ళికాని యువతీయువకులు ఇక్కడికి వచ్చి భక్తితో పూజలు చేస్తే వారి యొక్క కోర్కెలు తీరి, త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయని భక్తుల నమ్మకం.

భారతదేశంలో గల మనకు తెలియని శివాలయాలు:
"అచలేశ్వర్ టెంపుల్" ప్రకృతిలో దాగి వున్నఅద్భుతాలు చూపించడానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు! ఇంతేనా అనుకుంటున్నారా? కొంచెం వెయిట్ చేయండి, చెప్పవలసినది ఇంకా పూర్తి కాలేదు! ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో హాపూర్ లో గల రంగు మారే శివలింగము గురించి తెలుసుకుందాం. ఇక్కడ రోజుకు మూడుసార్లు రంగులు మారుతున్న శివలింగమును దర్శించవచ్చును. శివుడు స్వయంభూగా వెలసినాడు. దంతుల గ్రామ వాసులు ఈ దైవంను ఎంతో భక్తిగా పూజిస్తారు. ఎక్కువ మంది భక్తులు ఈశ్వరుని పూజించుటకు ఇక్కడకు వస్తారు.

ఈ ప్రదేశం ఢిల్లీ నుండి 60కి.మీ. మాత్రమే.

ధోల్ పూర్ కు ఎలా చేరుకోవాలి
అచలేశ్వర్ మహదేవ్ ఆలయంలో "చంబల్" నది ఒడ్డున గల "ధోల్పూర్" నగరంలో ఉంది. ధోల్పూర్ నగరం రాజస్థాన్ ఇతర భాగాలకు అనుసంధానించబడింది. ఇది జైపూర్ నుండి 280కి.మీ. ల దూరంలో ఉంది. ఆగ్రా నుండి ధోల్పూర్ కు 55కి.మీ. మాత్రమే.

బస్సు ప్రయాణం: ఇతర ప్రధాన నగరాల నుండి అనేక బస్సులు ధోల్పూర్ కు బయలుదేరుతుంది.
రైలు ప్రయాణం: పలు రైళ్ళు ధోల్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ కు బయలుదేరుతుంది.
విమాన ప్రయాణం: ధోల్పూర్ కు చాలా దగ్గరలో ఉన్న విమానాశ్రయం - ఆగ్రా విమానాశ్రయం (ఖెరియ విమానాశ్రయం స్టేషన్)

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X