Search
  • Follow NativePlanet
Share
» »చెక్కల వంతెనెతో, అడవి అందాలతో ఆకట్టుకొనే కోరింగ మన్యం..

చెక్కల వంతెనెతో, అడవి అందాలతో ఆకట్టుకొనే కోరింగ మన్యం..

దేశంలో ఉన్న అతి పెద్ద అడవుల్లో మూడవ అతి పెద్ద అడవి కాకినాడకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అడవులు గోదావరి నదీ ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. సముద్రతీరానికి అలి చేరువగా, అంతర్వాహినీ అయిన తుల్యభాగ నది సముద్రంలో సంగమించే ప్రదేశంలో విస్తరించి ఉన్నాయి.

సుముద్రతీరపు చిత్తడి నేలల్లో పెరిగే మడ అడవులలోనికి వెళ్లి చూడటం చాలా కష్టం. కానీ కోరింగలో ముఖద్వారాన్ని ఏర్పాటు చేసి అప్రోచ్ రోడ్ వేసి అడవి మధ్య నుండి ఒక కిలోమీటరు దూరం చెక్కల వంతెన నిర్మించి కష్టాన్ని ఇష్టంగా మార్చారు. ఇక్కడ ఉన్న వాచ్ టవర్ పైనుండి అడవి అందాలను వీక్షించవచ్చు. బ్యాక్ వాటర్స్ లో సముద్రం కలిసే చోటు వరకూ బోటు షికార్ చెయ్యవచ్చు. బ్రిటీష్ వాళ్ళ కాలంలో నిర్మించిన పురాతన లైట్ హౌస్ చూసి రావడానికి ప్రత్యేకంగా ప్యాకేజ్ టూర్ కూడా నిర్వహిస్తున్నారు.

ఈ అడవిలో వివిధ రకాల చెట్లు ముఖ్యంగా నల్లమడ, తెల్ల మడ

ఈ అడవిలో వివిధ రకాల చెట్లు ముఖ్యంగా నల్లమడ, తెల్ల మడ

ఈ అడవిలో వివిధ రకాల చెట్లు ముఖ్యంగా నల్లమడ, తెల్ల మడ, విల్వమడ, ఊరుడు, కలింగ, ఉప్పుపొన్న, గుగ్గిలం, గంగరావి వంటి ఎన్నో రకాలా చెట్లు మడ అడవుల్లో పెరుగుతాయి. కానీ విచిత్రం ఏమిటంటే ఉప్పునీటిలో పెరిగే వీటికి నిజానికి ఉప్పు ఏమాత్రం అవసరం లేదు. మంచినీటిలోనూ ఈ మొక్కలు బాగా పెరుగుతాయి.

భూమిలోనికి ఉండే వేర్లవల్ల ఈ చెట్లకి కావలసినంత ఆక్సిజన్‌ తీసుకొనే అవకాశం

భూమిలోనికి ఉండే వేర్లవల్ల ఈ చెట్లకి కావలసినంత ఆక్సిజన్‌ తీసుకొనే అవకాశం

భూమిలోనికి ఉండే వేర్లవల్ల ఈ చెట్లకి కావలసినంత ఆక్సిజన్‌ తీసుకొనే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడి నేలలు నిరంతరం నీటిలో మునిగి ఉంటాయి. వేర్ల ద్వారా గాలిపీల్చుకునే ఈ 'చిత్తడి అడవులు ' కేవలం నదీ సాగర సంగమ ప్రదేశంలో ఏర్పడ్డ చిత్తడి (బురద) నేలల్లోనే పెరరుగుతాయి.

సుందర వనాలు

సుందర వనాలు

గంగాతీర ప్రాంతం పశ్చిమ బెంగాల్లోని "సుందర వనాలు " మడ అడవుల తరువాతి స్థానం కోరంగి అభయారణ్యానిదే. అందంగా, గుబురుగా, దట్టంగా పెరిగే ఈ అడవులు సముద్రపు కోతనుంచి భూమిని రక్షించే పెట్టని కోటలుగా ఉన్నాయి.

మడ అడవులు వివిధ రకాల పక్షిజాతులకు ఆవాస ప్రాంతంగా

మడ అడవులు వివిధ రకాల పక్షిజాతులకు ఆవాస ప్రాంతంగా

మడ అడవులు వివిధ రకాల పక్షిజాతులకు ఆవాస ప్రాంతంగా ఉందని, ఉభయచరాలు, పక్షులు, క్షీరజాతులు మొత్తం 119రకాల జీవజాలం వీటిలో నివసిస్తున్నాయి.

ఇక్కడ చేపలు పట్టు పిల్లి, నీటికుక్క, నక్క వంటి జంతువులు ఉన్నాయి. ఇక్కడ సముద్రపు తాబేలు, ఉప్పునీటి మొసలిని చూడవచ్చు. పక్షులలో ఎక్కువగా కనిపించేవి నీటి కాకి, కొంగ, నారాయణ పక్షులు, ఉల్లం పిట్టలు, బాతులు, సముద్రపు చిలకలు.

వర్షాకాలం వెళ్ళిన తరువాత అక్టోబరు నుంచి మే వరకు కోరింగ అభయారణ్యాన్ని సందర్శించడానికి

వర్షాకాలం వెళ్ళిన తరువాత అక్టోబరు నుంచి మే వరకు కోరింగ అభయారణ్యాన్ని సందర్శించడానికి

వర్షాకాలం వెళ్ళిన తరువాత అక్టోబరు నుంచి మే వరకు కోరింగ అభయారణ్యాన్ని సందర్శించడానికి అనువైన సమయం. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు వలస పక్షులను చూడవచ్చు. జనవరి నుంచి మార్చి నెలల వరకు సముద్రపు తాబేళ్ళు, సముద్ర తీరాన గుడ్లు పెట్టడానికై వస్తాయి. సంవత్సరంలో 12 నెలలూ ఈ అభయారణ్యాన్ని దర్శించవచ్చు ఐతే దర్శించటానికి నవంబరు, డిసంబరు నెలలు అత్యుత్తమమైనవి.

 రంగురంగుల పడవలు, చిత్తడినేలలు

రంగురంగుల పడవలు, చిత్తడినేలలు

జీవవైవిధ్యాన్ని ప్రత్యక్షంగా చూపడానికి, విజ్ఞానాన్నీ, వినోదాన్నీ ఒకే చోట పొందడానికి ఎకో పర్యాటకం - మడ అడవుల సందర్శన ఎంతగానో ఉపయోగపడుతుంది. రంగురంగుల పడవలు, చిత్తడినేలలు, సముద్రపు గాలీ ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కాలువ గట్లు, పంట పొలాలు, పచ్చిటి చెట్లతో నిండిన ఆ రోడ్డులోంచి అభయారణ్యాలకు పయనం అవ్వడం ఒక మధురానుభూతి.

కోరింగ ఫోటో పాయింట్ లో ఫోటోలు తీసుకోవచ్చు

కోరింగ ఫోటో పాయింట్ లో ఫోటోలు తీసుకోవచ్చు

కోరింగ ఫోటో పాయింట్ లో ఫోటోలు తీసుకోవచ్చు. మడ ఆడవులలో దీపస్తంభం వెళ్ళలేని వారు పడవరేవు దగ్గర ఉన్న నాలుగు అంతస్తుల ఎత్తైన గోపురం (Watch Tower)పై నుంచి మొత్తం వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కోరింగి మడ అడవుల సౌందర్యాన్ని వీక్షించడం వల్ల మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అలాగే పర్యాటక శాఖవారు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన క్యాంటీన్ లు మినరల్ వాటర్ సదుపాయం, కట్టుదిట్టమైన భద్రత మడ అడవులను పరిశుభ్రంగా ఉంచాలనే నిర్ణయంతో పాటు తూర్పుగోదావరి ప్రజల మంచితనం, ఆదరాభిమానాలు మన ట్రిప్ ను మరింత మధురంగా మారుస్తాయి.వీలు చూసుకుని కుటుంబ సభ్యులతో లేదా ఫ్రెండ్స్ తో చూడదగిన ఒక అద్భుతమైన ప్రదేశం కోరింగ అభయరణ్యాలు..ప్రక్రుతి ప్రేమికులు మరీ ఎక్కువగా ఆస్వాదిస్తారు.

ఇక్కడ బోట్ రైడింగ్ కు చాలా ప్రత్యేకత ఉంది

ఇక్కడ బోట్ రైడింగ్ కు చాలా ప్రత్యేకత ఉంది

ఇక్కడ బోట్ రైడింగ్ కు చాలా ప్రత్యేకత ఉంది. కోరింగ అభయారణ్యాల అందమంతా ఈ ప్రదేశంలోనే ఉంటుంది. బోట్ రైడింగ్ ద్వారా నది సముద్రంలో సంగమించే ప్రదేశానికి అత్యంత చేరువగా తీసుకెళ్తారు. అలాగే పర్యాటకానికి నిషిద్దమైన రెండో కోరింగ దీవి వైపు కూడా తీసుకుని వెలుతారు.

 కోరంగి తాళ్ళ వంతెన

కోరంగి తాళ్ళ వంతెన

ఇంకా చూడవలసినవి చెక్కబాట (Boardwalk), కోరంగి తాళ్ళ వంతెన (Corangi Rope Bridge).చెక్క వంతెనల మీదుగా నీటితో నిండి ఉన్న మన్యంలో ప్రయాణించడం మనసుకు చాలా హాయినిస్తుంది.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

రైలు మార్గం : కాకినాడ రైల్వేస్టేషను నుండి 10 కి.మీ., రాజమండ్రి రైల్వే స్టేషను నుండి 70 కి.మీ.

విమానశ్రయం:

సమీప విమానాశ్రయం రాజమండ్రి.కాకినాడకు అతి సమీపంగా 65కిలోమీటర్ల దూరంలో రాజమహేంద్రవరం విమానాశ్రయం ఉంది. కాకినాడ నుంచి ఆటో లేక టాక్సీలో ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చును. ఇక్కడ తిరుగు ప్రయాణానికి వాహనాల లభ్యత తక్కువ కావున, అందుకు ముందుగానే వాహన ఏర్పాటు చేసుకోవాలి. లేనిచో కోరంగి బస్‌స్టాండ్ కు నడవాలి.

రోడ్డు మార్గం: కాకినాడ పట్టణం నుండి కోరింగ అభయారణ్యాలకు బస్సులు, ఆటోలు, ప్రైవేట్ టాక్సీలు ఉంటాయి. బస్సులు అయితే కోరంగి అభయారణ్య జంక్షన్ దగ్గరే ఆగిపోతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X