» »మనుషులను శిలలుగా మార్చే దేవాలయం...

మనుషులను శిలలుగా మార్చే దేవాలయం...

Posted By: Venkatakarunasri

LATEST : సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళిన గుహ రహస్యం తెలుసా ?

మన భారతదేశ దేవాలయాల్లో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగివున్నాయి. అందులో కొన్ని విషయాలని అంత త్వరగా నమ్మలేము కూడా,అలా అని పూర్తిగా కొట్టి పారేయలేం. అలాగే కొన్ని దేవాలయాల్లో తెలీని మిస్టరీలు కూడా ఎన్నో వున్నాయి.

అలాంటి వింతే ఒకటి ఈ కిరాడు దేవాలయం. ఆ గుడిలో దాగివున్న మిస్టరీ గురించి వింటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. చీకటి పడిన తరువాత ఆ గుడిలోనికి గాన వెళితే ఇక తిరిగి రారట. శిలలుగా మారిపోతారట. ఇంతకీ ఎక్కడుంది ఆ గుడి.

ఇది కూడా చదవండి: భాంగర్ కోటలో నిజంగానే దెయ్యం ఉందా ?

ఆ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులను చీకటి పడకముందే అక్కడినుండి వెళ్ళిపొమ్మని తొందర చేస్తారట స్థానికులు. ఆ ప్రాంతమంతా చూద్దామన్న ఉత్సాహంతో స్థానికులను తోడు రమ్మంటే, సాయంత్రం వరకు మాత్రమే మనకు తోడుగా ఉంటారు.

ఇది కూడా చదవండి: విరాట్ నగర్ - మహాభారతం జరిగిన చోటు !!

సాయం సంధ్య అయిం తరువాత ఎంతగా అడిగినా ఒక్క క్షణం కూడా మనకు తోడుగా ఉండరు. స్థానికులను అంత భయపెట్టిందా గుడి. నిజానికి మనం ఎలాంటి కష్టనష్టాలు లేకుండా బతకడానికి భగవంతుడ్ని వేడుకుంటాం. భగవంతుడు మనకు ఎల్లవేళలా సాయపడతాడని నమ్ముతాం. మరి అలాంటి భగవంతుడు కొలువుతీరిన ప్రాంతంలో మనుషులు అంతగా భయపడటమేంటి? అంతగా భయపెడుతున్నాడంటే ఆ గుడిలో ఉన్నది దేవుడేనా...? ఇంకెవరైనానా? ఏముందా గుడిలో..? అసలింతకీ ఎక్కడుందా గుడి?

థార్ ఎడారి లో ఏమేమి చూడాలి ?

వింతలకు, విశేషాలకు ఆలవాలమయిన రాజస్థాన్ బర్మార్ జిల్లా కేంద్రానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో, జైసల్మేర్ కి 157 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాత్మ గ్రామంలో ఉంది కిరాడు గుడి.నిజానికి ఇది ఒక గుడి కాదు అయిదు ఆలయాల సమూహమైన సోమేశ్వరగుడి. ఈ ఐదింటిలో ప్రస్తుతం విష్ణుమూర్తికి అంకితమిచ్చిన గుడిని మాత్రం చూడడానికి వీలవుతుంది. మిగిలినవి శివదేవునికి అంకితం చేయబడినవి. వేల సంవత్సరాల పురాతన ఆలయం. నిజానికి ఒక మరుగునపడిన దేవాలయం ఇది. కాని దీనికున్న అసాధారణమైన మిస్టరీ కారణంగ ప్రస్తుతం ఒక పర్యాటకస్థలంగా ప్రసిద్ధి చెందింది.

కిరాడు... ఓ అద్భుతం! ఓ వింత! ఓ మిస్టిరియస్ ప్లేస్!

టాప్ ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. హాత్మ గ్రామం

1. హాత్మ గ్రామం

రాజస్థాన్ బర్మార్ జిల్లా కేంద్రానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో, జైసల్మేర్ కి 157 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాత్మ గ్రామంలో ఉంది కిరాడు గుడి.

pc:youtube

2. సోమేశ్వరగుడి

2. సోమేశ్వరగుడి

నిజానికి ఇది ఒక గుడి కాదు అయిదు ఆలయాల సమూహమైన సోమేశ్వరగుడి.

pc:youtube

3. విష్ణుమూర్తికి అంకితమిచ్చిన గుడి

3. విష్ణుమూర్తికి అంకితమిచ్చిన గుడి

ఈ ఐదింటిలో ప్రస్తుతం విష్ణుమూర్తికి అంకితమిచ్చిన గుడిని మాత్రం చూడడానికి వీలవుతుంది.

pc:youtube

4. శివదేవుడు

4. శివదేవుడు

మిగిలినవి శివదేవునికి అంకితం చేయబడినవి.

pc:youtube

5. వేల సంవత్సరాల పురాతన ఆలయం

5. వేల సంవత్సరాల పురాతన ఆలయం

వేల సంవత్సరాల పురాతన ఆలయం. నిజానికి ఒక మరుగునపడిన దేవాలయం ఇది.

అమర్ కోటలోని శిలా దేవి ఆలయం !

pc:youtube

6. పర్యాటకస్థలం

6. పర్యాటకస్థలం

కాని దీనికున్న అసాధారణమైన మిస్టరీ కారణంగ ప్రస్తుతం ఒక పర్యాటకస్థలంగా ప్రసిద్ధి చెందింది.

pc:youtube

7. మనుషులు రాళ్లుగా

7. మనుషులు రాళ్లుగా

ఆ ఆలయంలో సూర్యాస్తమయం అయిన తరువాత ఉంటే మనుషులు రాళ్లుగా మారిపోతారట.

pc:youtube

8. ఆశక్తికరమైన కధ

8. ఆశక్తికరమైన కధ

అయితే ఈ మిస్టరీ వెనక ఆశక్తికరమైన కధ వుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఋషి తన శిష్యులతో కలసి ఈ ఆలయానికి వచ్చాడట.

కుంభాల్ ఘర్ లో అద్భుతాల కోట !

pc:youtube

9. శిష్యులు

9. శిష్యులు

తన శిష్యుల్ని ఆలయంలోనే వుండమని స్థానికంగా వున్న ప్రదేశాలని చూసి వస్తానని బయలుదేరాడట.

pc:youtube

10. చుట్టుపక్కల ప్రదేశాలు

10. చుట్టుపక్కల ప్రదేశాలు

అలా బయలుదేరిన ఋషి కొంతకాలంపాటు చుట్టుపక్కల ప్రదేశాలు సంచరిస్తూ అలాగే వుండిపోయాడట.

pc:youtube

11. గుడి

11. గుడి

అయితే ఈ లోగా గుడిలో వున్న తన శిష్యులకు ఆరోగ్యం పాడైపోడంతో రోగాల బారిన పడ్డారట.

హోలీ వేడుకలను జరుపుకొనే ప్రదేశాలు !

pc:youtube

12. స్థానికులు

12. స్థానికులు

అయితే వారు అంత రోగాలలో వున్నాసరే స్థానికులెవరూ వారికి సహకరించలేదట.

pc:youtube

13. ఋషి

13. ఋషి

కొంతకాలానికి తిరిగి వచ్చిన ఆ ఋషి శిష్యులకు పట్టిన గతి గురించి తెలుసుకుని స్థానికులపై కోపంతో వారిని ఈ విధంగా శపించాడట.

ఎన్నో వింతల అద్భుత ఆలయం !

pc:youtube

14. రాతి మనుష్యులలా

14. రాతి మనుష్యులలా

నా శిష్యులు బాధపడుతున్నా స్పందించకుండా కఠిన హృదయంతో రాతి మనుష్యులలా వున్న మీరు నిజంగానే శిలలుగా మారిపోవాలని శపించాడట.

రాజస్థాన్ లోని అల్వార్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !!

pc:youtube

15. వెనక్కితిరక్కుండా వెళ్ళిపోతే

15. వెనక్కితిరక్కుండా వెళ్ళిపోతే

అయితే అందులో ఒక స్త్రీ తన శిష్యులకు సాయం చేసిందని తెలుసుకుని నువ్వు వెనక్కితిరక్కుండా వెళ్ళిపోతే నీకీశాపం వర్తించదు అని చెప్పాడట.

pc:youtube

16. సహజ ఉత్సుకతతో

16. సహజ ఉత్సుకతతో

అయితే ఆ స్త్రీ కొంతదూరం వెళ్లి మానవులకున్న సహజ ఉత్సుకతతో వెనక్కి తిరిగి చూడ్డం వల్ల ఆమె కూడా శిలగా మారిపోయిందట.

pc:youtube

17. స్థానికులు

17. స్థానికులు

ఆ శిలను కూడా ఇప్పుడు మనం గ్రామంలో చూడవచ్చని స్థానికులు చెప్తూ వుంటారు.

pc:youtube

18. సూర్యాస్తమయం

18. సూర్యాస్తమయం

అప్పటినుంచీ సూర్యాస్తమయం అయినతర్వాత గుడిలోనికి ప్రవేశించారని చెబుతున్నారు స్థానికులు.

విరాట్ నగర్ - విరాటుడు కనుగొన్న పట్టణం!!

pc:youtube

Please Wait while comments are loading...