Search
  • Follow NativePlanet
Share
» »గోవా ప్రాణానికే ప్రమాదం

గోవా ప్రాణానికే ప్రమాదం

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవా లో పర్యాటకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన కథనం.

By Beldaru Sajjendrakishore

గోవా అత్యంత అందమైన ప్రదేశం.భారతదేశంలో అనేకమంది యువకులు ఎక్కువగా గోవాకి వెళ్ళటానికి ఇష్టపడతారు.ఈ గోవాకి హాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ అనేక సినిమాలు వచ్చాయి.ఈ ప్రదేశం అత్యంత అద్భుతంగా వుంటుంది.దాని యొక్క రమణీయమైన పరిసరాలచే పర్యాటకులను మైమరపిస్తుంది.ఈ గోవాకి రాజధాని పనాజి.గోవాలో అతి పెద్దదైన నగరం వాస్కోడిగామా. ఇది మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అతిచిన్న (25 వ రాష్ట్ర) రాష్ట్రం ఇది. ఇక్కడ ఎక్కువగా కొంకిణీ,కన్నడభాషను కూడా మాట్లాడతారు.ఈ గోవా మన పశ్చిమతీరంలోని అరేబియాసముద్రతీరానికి సరిహద్దులోవుంది.ఈ ప్రదేశాన్ని కొంకిణీతీరం అని కూడా పిలుస్తారు. ఈ గోవాకి వుత్తరదిక్కున మహారాష్ట్ర, తూర్పు-దక్షిణ దిక్కున కర్ణాటకరాష్ట్రం కలదు.ఈ గోవా దేశంలోనే విశాలమైన 2వ అతిచిన్న రాష్ట్రం. ఇక్కడ సరైన జాగ్రత్తలు పాటించక పోతే ప్రాణానికే ప్రమాదం కలుగవచ్చు.

గోవా ప్రాణానికే ప్రమాదం

గోవా ప్రాణానికే ప్రమాదం

1. జాగ్రత్త

Image source:

గోవా బీచ్ లు అనేకమంది గోవాను సందర్శించుటకు వెళ్తారు.అక్కడ అలాంటిఇలాంటి ఎంజాయ్ మెంట్ దొరకదు.భారతదేశంవారు ఇంత ఎంజాయ్ చేస్తూవుంటే, విదేశీయులు వూరికే వుంటారా?గోవాకి అతి ఎక్కువ పర్యాటకులు అంటే అది విదేశీయులే.అనేక విదేశాలనుంచి పర్యాటకులు ఈ స్థలాన్ని సందర్శిస్తారు.గోవా అంటే ఆ క్షణమే మొదటగా గుర్తొచ్చే బీచ్ లు. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి.

గోవా ప్రాణానికే ప్రమాదం

గోవా ప్రాణానికే ప్రమాదం

2. ఫొటోలు తీయకూడదు


Image source:

విదేశీయులు ఆ బీచ్ లో కేవలం భారతీయులే విదేశీయులు కూడా ఎంజాయ్ చేస్తారు.అయితే మీకు తెలుసా?భారతీయులు విదేశీయులడ్రెస్ లు చూసి ఫోటోలు తీసుకోవటం విదేశీయులకు ఇష్టంలేదు.మీకు తెలుసా?కొన్ని బీచ్ లలో భారతీయులకు నో ఎంట్రీ.అదే విధంగా విదేశీయులకు అంగీకారంలేకపోతే ఫోటోలను తీయకూడదు.ఆవిధంగా తీస్తే మీమీద చర్యలు తీసుకోవటానికి అవకాశాలువుంటాయి.

గోవా ప్రాణానికే ప్రమాదం

గోవా ప్రాణానికే ప్రమాదం

3. అంటువ్యాదులు వస్తాయి

Image source:

ట్యాటూ గోవాలో ట్యాటూలను వేసేవారు ఎక్కువగా వుంటారు.చిన్నచిన్నచెట్లదగ్గర, బీచ్ దగ్గర అనేకమంది ట్యాటూలను వేసేవారు ఎక్కువగా వుంటారు.వీరు ట్యాటూ వేయటంలో నిపుణులు కాదు. గోవాలో ట్యాటూ వేయించుకునేతీరాలంటే కొంచెం డబ్బుఖర్చైనా కూడా మంచి స్థలంలో వేయించుకోండి. లేకపోతే కొన్ని అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉన్నాయి. అందువల్ల ఇక్కడ టాటూలు వేయించుకోకపోవడమే ఉత్తమం.

గోవా ప్రాణానికే ప్రమాదం

గోవా ప్రాణానికే ప్రమాదం

4.చీప్ తాగొద్దు

Image source:

మద్యపానం భారతదేశంలో అత్యంత తక్కువ ధరలో మద్యపానం దొరికే స్థాలమేదంటే అది గోవా.విదేశీయ బ్రాండ్ కూడా అక్కడ అత్యంత ధరలో దొరుకుతాయి.గోవాకి వెళ్ళేవారు కొందరు అత్యంత తక్కువ ధరలో మద్యపానం దొరుకుతుంది అని ఎక్కువగా తాగుతారు. మీరు త్రాగి అక్కడ పడితే అప్పుడు ఎవరూ మీకు సహాయం చేయరు. కారణమేమంటే గోవాలోని ప్రజలు అత్యంత బిజీలైఫ్ ని అనుసరిస్తారు.

గోవా ప్రాణానికే ప్రమాదం

గోవా ప్రాణానికే ప్రమాదం

5. రాత్రి సమయంలో

Image source:


రాత్రి సమయం గోవాలో రాత్రిసమయంలో ఒంటరిగా ఎక్కడా తిరగకూడదు.మీరు గోవాకు వెళ్ళినప్పుడు, మీకు తెలియని స్థలాలకు వెళ్ళకూడదు.అందులోనూ ముఖ్యంగా రాత్రిసమయంలో .ఎందుకంటే ఆ సమయంలో దొంగలు ఎక్కువగా వుండటంవల్ల మీ ప్రాణాలను తీయటానికి కూడా వెనుకాడరు. అందువల్ల రాత్రి సమయంలో వీలయినంత వరకూ బీచ్ లకు దూరంగా ఉండండి. లేదా కనీసం ముగ్గురు, నలుగురు కలిసి వెళ్లండి.

గోవా ప్రాణానికే ప్రమాదం

గోవా ప్రాణానికే ప్రమాదం

6. అక్కడ నిద్రించవద్దు


Image source:


వాతావరణం గోవాలో వాతావరణం అత్యంత అందమైనది అందులోనూ రాత్రిసమయంలో చల్లనిగాలిలో బీచ్లో నిద్రించరాదు.ఎందుకంటే ఆ సమయంలో ఎక్కువగా ఎండ్ర కాయలు, కుక్కలు వుంటాయి.అందువలన రాత్రిసమయంలో బీచ్ లలో పర్యాటకులు నిద్రించరాదు. ఖచ్చితంగా గోవా కు వెళ్లడానికి ముందే ఎక్కడ మనం ఉండాలన్న విషయం పై ఒక నిర్థారణకు వచ్చి అక్కడే ఉండండి.

గోవా ప్రాణానికే ప్రమాదం

గోవా ప్రాణానికే ప్రమాదం

7. వాటర్ గేమ్స్


Image source:

వాటర్ గేమ్స్ గోవాలోని బీచ్ లలో స్విమ్మింగ్, బోట్ సెయిలింగ్ వంటి వాటర్ గేమ్స్ చాలా ఉన్నాయి.మీరు గుంపులో వెళితే అక్కడ ట్రైనింగ్ ఇచ్చే కోచ్ లు వుంటారు. వారి అనుమతి తీసుకున్నతర్వాతే బీచ్ లో వెళ్ళటం మంచిది. అదీ పడవలో వెళ్ళటం మంచి ఆలోచన. బదులుగా సముద్రంలోకి ఒంటరిగా వెళ్ళటం, ఈతకొట్టడం ప్రమాదం.

గోవా ప్రాణానికే ప్రమాదం

గోవా ప్రాణానికే ప్రమాదం

8. ప్యాకేజీ చూసుకొండి


Image source:


టూర్ ప్యాకేజీ అనేకమంది గోవాకి వెళ్ళినప్పుడు టూరు ప్యాకేజి బుక్ చేసుకుంటారు.3స్టార్ లేదా 5స్టార్ హోటళ్ళను బుక్ చేసుకుంటారు. గోవాలో 5స్టార్ హోటళ్లు ఉన్నాయి. కుటీరాలు ఉన్నాయి. కుటీరాలు అత్యంత తక్కువధరకే దొరుకుతాయి. 5స్టార్ హోటళ్ళు అదేవిధంగా ఈ కుటీరాలు ఒకే వ్యవస్థను కలిగి ఉంటాయి. ధర కొంచెం ఎక్కువైనా మంచి హోటల్స్ ను ఎన్నుకోండి.

గోవా ప్రాణానికే ప్రమాదం

గోవా ప్రాణానికే ప్రమాదం

9. అపరిచిత స్నేహం మంచిది కాదు

Image source:

ఎలాంటి కారణానికైనా గోవాకివెళితే అపరిచితులను పరిచయం చేసుకుని ఎంతమాత్రం స్నేహం చేయకూడదు. ఇక్కడికి వచ్చే అనేక మంది ఆడవారిని మోసంచేయటానికి వస్తూంటారు. అలాగే, మీరు గతంలో బుక్ చేసిన క్యాబ్లను ఎక్కువగా ఉపయోగించాలి.గోవాకి ఎక్కువగా ఆదాయం వచ్చేదే బీచ్ ల ద్వారా, అవి గోవా యొక్క ముఖ్య పర్యాటకప్రదేశం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X