Search
  • Follow NativePlanet
Share
» »ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆంజనేయస్వామి అంటే అత్యంత బలశాలి మరియు స్వామిభక్తికి నిదర్శనం. అతని యొక్క స్వామి భక్తి మరియు నిష్ఠ అందరికీ ఎంతో మార్గదర్శకమైనది. ఆ శ్రీరాముని భక్తుడైన హనుమంతుని అనేక పేర్లతో పిలుస్తారు.

By Venkatakarunasri

ఆంజనేయస్వామి అంటే అత్యంత బలశాలి మరియు స్వామిభక్తికి నిదర్శనం. అతని యొక్క స్వామి భక్తి మరియు నిష్ఠ అందరికీ ఎంతో మార్గదర్శకమైనది. ఆ శ్రీరాముని భక్తుడైన హనుమంతుని అనేక పేర్లతో పిలుస్తారు. ప్రతి ఒక్క జీవిలో దైవం అనేది వుంటుందనేది మన హిందూధర్మంలోనే చెప్పబడినది. ఆంజనేయస్వామి దుష్టులను శిక్షించే శిష్టులను రక్షించే మహాబలశాలియైన అంజనాదేవి కుమారుడు.

ఏ దేవుడినయినా మనం భక్తితో ఆరాధిస్తాం. కాని కారణం లేకుండా దేవుడు శిక్ష అనేది విధించడు. దేవుడు మానవులు చేసిన తప్పులకు అనేక శిక్షలను విధిస్తాడు. అయితే అటువంటి భగవంతుడికే శిక్షను విధించటం అనేది మీరు ఎక్కడైనా విన్నారా? అయితే రండి ప్రస్తుత వ్యాసంలో ఆంజనేయస్వామిని సంకెళ్ళతో ఎందుకు బంధించారు? అసలు అలా బంధించటానికి కారణం ఏమిటి? అనే అనేక ప్రశ్నలకు సమాధానంగా ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకోండి.

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

అసలు ఈ వింత దేవాలయం ఒడిశాలో వుండేది. మొదటగా ఒడిశా రాష్టంలో వున్న ఆంజనేయ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఒడిశాలో వున్న జగన్నాథుని పూరీ క్షేత్రం కూడా అపారమైన ధార్మికత కలిగిన క్షేత్రం.

I, G-u-t

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రాలలో జగన్నాథదేవాలయం కూడా ఒకటి. ఈ క్షేత్రంలో ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్నే దరియా మహావీర దేవాలయం అని కూడా పిలుస్తారు.

Bpkp

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

పూరీలో జరిగే జగన్నాథుని రథయాత్ర అత్యంత విశేషంగా మరియు ఎంతో మహత్యం కలది. ఆషాఢ శుక్ల విదియనాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి 'మనిమా' (జగన్నాథా...) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని 'పహండీ' అంటారు. ఆ దశలో కులమత భేదాలకు తావుండదు. గుండిచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా... 'ఇలపై నడిచే విష్ణువు'గా గౌరవాభిమానాల్ని అందుకునే పూరీ రాజు పల్లకీలో అక్కడికి చేరుకోవడంతో సంరంభాలు మిన్నంటుతాయి. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే 'చెరా పహారా' అంటారు.

Radeeh

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఇక్కడ జరిగే పండుగ ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో జరుగుతుంది. ఉత్సవం. అంటే ఈ అద్భుతమైన ఉత్సవాన్ని జులై నెలలో సందర్శించవచ్చును.

I, G-u-t

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఈ విధంగా జగన్నాథునికి జరిగే యాత్రని 'బహుదాయాత్ర' అని పిలుస్తారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తుల ఈ అద్భుతాన్ని దర్శించి పునీతులౌతారు.

Ilya Mauter

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

పూరీలో వున్న చక్రనారాయణ దేవాలయానికి పశ్చిమాన వున్న సుభాష్ బోస్ అనే రోడ్డును కలిపే చక్రతీర్థ రోడ్డుకి ఎడమవైపున ఒక రోడ్డు మధ్యలో ఒక దరియా మహావీరుని దేవాలయం వుంది. సాధారణంగా దరియా అంటే సముద్రం అని అర్థం.

Indi Samarajiva

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

అంటే మహావీరుడైన హనుమంతుడు సముద్రం నుండి ఆ నగరాన్ని కాపాడుతున్న మహానుభావుడు అని అక్కడ వున్న ప్రజల నమ్మకం. అంతేకాకుండా ఈ స్వామిని దరియా మహావీరదేవాలయం అని కూడా పిలుస్తారు.

J'ram DJ

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆంజనేయస్వామి సంకెళ్ళతో బంధించాడనటానికి ఇక్కడి స్థలపురాణమేమంటే,ఒకప్పుడు జగన్నాథుడు ఈ పుణ్య క్షేత్రంలో వెలసిన అనంతరం అతని దర్శనం కోరి సముద్రదేవుడు ఈ దేవాలయాన్ని సందర్శించెను.

vimal_kalyan

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆ సమయంలో సముద్రంలోని నీరు ఈ ప్రదేశమంతా వ్యాపించి అపారహాని జరిగింది. ప్రజలు దీని గురించి జగన్నాథుడిని ప్రార్ధించారు. జగన్నాథుడు రక్షకుడైన ఆంజనేయుడు గురించి విచారించినప్పుడు హనుమంతుడు తన అనుమతి లేకుండా అయోధ్య వెళ్ళినట్లు తెలుసుకున్నాడు.

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

దీని వలన ఆగ్రహించిన జగన్నాథుడు, ఈ క్షేత్రాన్ని పగలు-రాత్రి కాపలా కాచే బాధ్యతను మరిచిపోయాడని భావించి ఆంజనేయస్వామి యొక్క కాళ్ళుచేతులను పగ్గంతో కట్టి వేసి ఇకముందు ఇక్కడే సదా వెలసివుండు, ఈ క్షేత్రానికి సముద్రపు నీరు దరిచేరకుండా కాపలాకాయాలని చెప్పెను.

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఈ విధంగా హనుమంతుణ్ణి "బేడి హనుమంతుడు" అని పిలుస్తారు.స్థలపురాణం ప్రకారం ఈ స్థలం సముద్రతీరం దగ్గర వుంటే కూడా ఎటువంటి తుఫాను సంభవించినా కూడా సముద్రపు నీరు దరిచేరలేదని చెప్పవచ్చును

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

రెండవది ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధిచెందిన తిరుమల వేంకటేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో బేడి ఆంజనేయస్వామి సన్నిధిని దర్శించుకోవచ్చును.దీనిని కూడా "బేడి ఆంజనేయ స్వామి దేవాలయం" అని పిలుస్తారు.

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

వేంకటేశ్వరస్వామి మరియు వరాహ స్వామి తర్వాత ఈ దేవాలయం ఎక్కువ గుర్తింపు పొందింది. ఆ 2 దేవాలయాలలో నైవేద్యం అర్పించిన అనంతరం దానిని ఈ దేవాలయానికి తరలిస్తారు.

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

వేంకటేశ్వరస్వామి సమీపంలో వున్న హనుమంతునికి బేడీలు వేసిన కారణం ఏమంటే హనుమంతుడు చిన్న వయస్సులో ఉన్నప్పుడు, అతను ఒక ఒంటెను వెతకటానికి తిరుమల ను వదిలి వెళ్ళటానికి సిద్ధమయ్యెను.

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

అతని గలాటా సహించలేని తల్లి అంజనాదేవి అతన్ని చేతులను గొలుసులతో బంధించి తను వచ్చే వరకు ఎక్కడికీ కదలకూడదు అని ఆదేశించి ఆకాశగంగను తెచ్చుటకు వెళ్ళెను.

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

ఈ విధంగా విడిచి వెళ్ళిన అంజనా దేవి మళ్ళీ తిరిగి రాలేదని నమ్ముతారు. అందువల్ల ఆంజనేయ స్వామి ఇంకా సంకెళ్ళతో బంధించబడి వున్నాడు. ఆ విధంగా తన తల్లి రాక కోసం ఎదురుచూస్తున్నాడని చెప్పబడింది.

ఇది కూడా చదవండి:

<strong>ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!</strong>ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

<strong>పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !</strong>పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

<strong>సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!</strong>సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X