Search
  • Follow NativePlanet
Share
» »డార్జిలింగ్ - పొగలు కక్కే టీ మరియు టాయ్ ట్రైన్ !

డార్జిలింగ్ - పొగలు కక్కే టీ మరియు టాయ్ ట్రైన్ !

డార్జిలింగ్ పేరు చెపితే చాలు మొదటగా మన మైండ్ కు ప్రతి రోజూ ప్రియంగా తాగే టీ గుర్తుకు వచ్చేస్తుంది. ఎంతో కాలంగా డార్జిలింగ్ పేరు మన ప్రియాతి ప్రియమైన తాజా ...తాజా...చాయ్ కి ముడిపడి పోయింది. దానికి కారణం డార్జిలింగ్ పట్టణం పుష్కలంగా వివిధ రకాల టీ ఉత్పత్తులు చేయడమే. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కలదు.

క్వీన్ అఫ్ హిల్స్ లేదా కొండలలో రాణి గా పిలువబడే ఈ డార్జిలింగ్ పట్టణం పర్యాటకులకు మంచు చే కప్పు బడిన అద్భుత హిమాలయ పర్వత శిఖరాలు చూపుతుంది.

ఆహ్లాదకర వాతావరణం అద్భుత ప్రకృతి దృశ్యాలు కల డార్జిలింగ్ కొత్త జంటలకు ఒక ప్రసిద్ధ హనీ మూన్ ప్రదేశం. అద్భుత దృశ్యాలే కాక ఈ ప్రదేశ సమీపం లో అనేక ఇతర ఆకర్షణీయ ప్రదేశాలు కూడా కలవు. ఇక్కడ కల తేయాకు తోటల గుండా కూడా డార్జీలింగ్ హిమాలయ రైల్వేటాయ్ ట్రైన్ లో చక్కగా ప్రయాణించి ఆనందించ వచ్చు. డార్జిలింగ్ లో టాయ్ ట్రైన్ లో ప్రయాణం ఎంతో ఆనందంగా వుంటుంది.

డార్జిలింగ్ - పొగలు కక్కే టీ మరియు టాయ్ ట్రైన్ !

మంచి రుచి కల డార్జిలింగ్ టీ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఈ టీ లలో బ్లాకు, గ్రీన్, వైట్ మరియు ఊలోంగ్ టీ రకాలు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. ఇండియా లో తేయాకు అధిక భాగం డార్జీలింగ్ లోనే ఉత్పత్తి అవుతుంది. ఈ టవున్ లో కల విశాల మైన టీ తోటలు, టీ ఎస్టేట్ లు ఎంతో అందంగా వుంటాయి. సందర్శకులు ఈ తేయాకు తోటలలో తేయాకు సువాసనలు ఆస్వాదిస్తూ పచ్చటి మొక్కల మధ్య నడక సాగించ వచ్చు. డార్జిలింగ్ వెళ్ళినపుడు అక్కడి తేయాకు తోటల సందర్సన మరువకండి.

ఇక్కడి టాయ్ ట్రైన్ ఇండియా లోని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా యునెస్కో చే గుర్తింపు పొందింది. టాయ్ ట్రైన్ లేదా డార్జిలింగ్ హిమాలయ రైల్వేస్ ఒక మంచి ఆకర్షణ. దీనిని 1800 సంవత్సరం లో ప్రారంభించారు. చారిత్రాత్మక మైన ఈ టాయ్ ట్రైన్ దేశంలోని ఒకే ఒక మినీ ట్రైన్ గా పేరు పొందింది. ఇది న్యూ జలపాయ గురి నుండి డార్జీలింగ్ కు, అదే మార్గంలో వెనుకకు ప్రయాణిస్తుంది. దీనిని రెండవ ప్రపంచ యుద్ధంలో మిలిటరీ బలగాల రవాణా కొరకు ఉపయొగిన్చారు. నేడు ఈ టాయ్ ట్రైన్ పర్యాటకులకు ఆనందకర విహారం అందిస్తోంది. ఈ మీ ప్రయాణంలో చూసే అందమైన తోటలు, ప్రకృతి దృశ్యాలు వర్ణించేందుకు మాటలు చాలవు. డార్జిలింగ్ వెళ్ళినపుడు, ఈ టాయ్ ట్రైన్ ఆనందించటం మరువకండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X