Search
  • Follow NativePlanet
Share
» »మహారాష్ట్ర లో దక్కన్ ఒడిస్సీ ప్రయాణం !!

మహారాష్ట్ర లో దక్కన్ ఒడిస్సీ ప్రయాణం !!

ప్రకృతి అందాలకు పరవశించి పోతారా ? వన్య జంతువులంటే అంతు లేని ప్రేమా ? అలాగయితే మీరు తప్పక మహారాష్ట్ర లోని అడవుల్లో ప్రయానిన్చాల్సిందే. ఎన్నో నేషనల్ పార్క్ లు, వైల్డ్ లైఫ్ సాన్క్చురి లు. ఈ నేషనల్ పార్క్ లలో వివిధ రకాల మొక్కలు, జంతువులు కను విందు కలిగిస్తాయి. మహారాష్ట్ర అడవుల ప్రయాణం దక్కన్ ఒడిస్సీ ట్రైన్ లో మొదటగా ముంబై లో మొదలవుతుంది.

నాజీరా వైల్డ్ లైఫ్ సాన్క్చురి, తడోబా టైగర్ రిసర్వ్ మొదలన వాటి గుండా ప్రయాణిస్తుంది. ఇంకనూ, అజంత కేవ్స్ మరియు ఎల్లోరా కేవ్స్ వంటి ప్రసిద్ధ యునెస్కో సంస్థ గుర్తింపు పొందిన హెరిటేజ్ సైట్ లు కూడా చూడవచ్చు. డెక్కన్ ఒడిస్సీ లక్సరీ ట్రైన్ మహారాష్ట్ర అంతా చూపుతూ, చివరకు గోవా కూడా తీసుకు వెళుతుంది.

మార్గంలో అనేక బీచ్ లు, చారిత్రక కోటలు, శిల్ప వైభవ ప్రదేశాలు కూడా చూస్తారు. రాత్రి అంతా ప్రయాణం. పగలు ప్రదేశ పర్యటన .

పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

 పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

దక్కన్ ఒడిస్సీ ప్రయాణం రాచరిక వైభవం కలదు. ప్రతి బోగీ కూడా కోటలు, ఇతర ఆసక్తి కర ప్రదేశాల అలంకరణ కలిగి వుంటుంది. మొత్తంగా 21 కోచ్ లు. వాటిలో 13 ప్రయాణికులకు. ఒక లక్సరీ హోటల్ వలే వుండి, స్పా, జిం, బిజినెస్స్ సౌకర్యాలు, సౌకర్యవంతమైన డైనింగ్, బార్ లు కలిగి వుంటుంది.

Pic Credit: Simon Pielow

 పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

దక్కన్ ఒడిస్సీ ప్రయాణ సమయం ఏడు రాత్రులు. ట్రైన్ బుధవారం సాయంత్రం బయలు దేరి తిరిగి ముంబై కి మరుసటి బుధ వారం ఉదయం చేరుతుంది.
Pic Credit: Simon Pielow

 పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

ఈ ట్రైన్ రిజర్వేషన్ మరియు ఇతర వివరాలకు వెబ్ సైట్ http://www.deccan-odyssey-india.com/ చూడవచ్చు
Pic Credit: Simon Pielow

 పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

ఈ జర్నీ లో మీరు మహారాష్ట్ర లోని వన్య జీవన మార్గాలు - ముంబై - అజంతా గుహలు - నగజీర - తడోబా - ఔరంగాబాద్ ప్రదేశాలు పర్యటించి మరల ముంబై చేరతారు.
Pic Credit: Simon Pielow

 పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

బుధవారం సాయంత్రం అంటే మొదటి రోజు చత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్ లో ట్రైన్ ఎక్కితే, అందమైన మరాటా భూమిలో అజంతా గుహల వైపుగా ట్రైన్ లో దూసుకుపోతూ, రాత్రి భోజనం ఆరగించేయవచ్చు.

Pic Credit: Simon Pielow

 పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

అజంత గుహలు
రెండవ రోజున జలగావ్ రైల్వే స్టేషన్ దిగి అజంత గుహలు చూడాలి. దీనికి గాను ఒక చిన్న బస్సు ప్రయాణం వుంటుంది. అదే రోజు సాయంత్రం మరల ట్రైన్ అటవీ మార్గాలు అయిన గొండియా వైపు ప్రయాణిస్తుంది.
Pic Credit: Sankarshan Mukhopadhyay

 పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

గొండియా చేరిన మీరు రోడ్డు ప్రయాన సమయంలో నగజీర వైల్డ్ లైఫ్ సంక్చురి చూడవచ్చు. మధ్యాహ్నం నేషనల్ పార్క్ లో ఒక సఫారి ఆనందించవచ్చు. రాత్రి డిన్నర్ మరియు వసతి కి ట్రైన్ చేరవచ్చు.
Pic Credit: Simon Pielow

 పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

నాలుగవ రోజున ఉదయం వేళ నగజీరా సంక్చురి చూసి, మధ్యాహ్నం మరల ట్రైన్ ఎక్కి ప్రసిద్ధ తడోబా వైల్డ్ లైఫ్ సంక్చురి కి ప్రయాణం అవుతారు. డిన్నర్ మరియు రాత్రి వసతి ట్రైన్ లోనే.

Pic Credit: Tambako The Jaguar

 పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

అయిదవ రోజు ఉదయం తడోబా టైగర్ రిసర్వ్ చేరతారు. ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం సఫారి లు చేయవచ్చు. ఈ టైగర్ రిసర్వ్ సుమారు 600 చ. కి. మీ. లలో విస్తరించి వుంది. రాత్రి డిన్నర్ మరియు వసతులకు ట్రైన్ చేరండి.
Pic Credit: Sander van der Wel

 పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

ఎల్లోరా గుహలు
ఆరవ రోజు ఉదయం ఎల్లోరా గుహలు పర్యటించాలి. వీటితో పాటు తాజ్ మహల్ పోలిన బీబీ - కా - మకబారా కూడా చూసి రాత్రి భోజనం, వసతులకు ట్రైన్ చేరవచ్చు.

Pic Credit:

 పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

ఔరంగాబాద్
ఏడవ రోజు ఉదయం ఔరంగాబాద్ లో సైట్ సీయింగ్ చేయండి. ఔరంగా బాద్ లోని హిమరూ దుస్తుల ఫాక్టరీ కూడా తప్పక చూడాలి. ఇది ఔరంగాబాద్ పురాతన పట్టణం లోని జఫ్ఫార్ గెట్ లో కలదు. ఈ పర్యటన అనంతరం తిరిగి సాయంత్రానికి ట్రైన్ చేరి ఇంటి ముఖం పట్టవచ్చు.
Pic Credit: Mark Hillary

 పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

పగలు ప్రయాణం - రాత్రి విశ్రాంతి!

ఎనిమిదవ రోజు ఉదయం ముంబై చేరండి. ట్రైన్ లోనే బ్రేక్ ఫాస్ట్ చేసి ముంబై చత్రపతి శివాజీ టెర్మినస్ స్టేషన్ లో ట్రైన్ దిగటంతో మీ జర్నీ పూర్తి అయినట్లే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X