Search
  • Follow NativePlanet
Share
» »దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

దెఒగర్హ్ పర్యటన లో పర్యాటకులు పురాతన స్మారకాలు, టెంపుల్స్ చూడవచ్చు తనివితీరా చూడవచ్చు. ఇక్కడున్న దశావాతార టెంపుల్ దేశంలోనే ప్రసిద్ధికెక్కింది.

By Venkatakarunasri

దెఒగర్హ్ పర్యటన లో పర్యాటకులు పురాతన స్మారకాలు, టెంపుల్స్ చూడవచ్చు తనివితీరా చూడవచ్చు. ఇక్కడున్న దశావాతార టెంపుల్ దేశంలోనే ప్రసిద్ధికెక్కింది. ఈ టెంపుల్ ప్రస్తుతం శిధిలావస్థ దశలో ఉన్నప్పటికీ అనేక దేవుళ్ళ విగ్రహాలు వుంటాయి. అలాగే ఇక్కడ దెఒగర్హ్ కోట మరొక ఆకర్షణగా నిలిచింది. దీనిని గతం లో కీర్తిగిరి దుర్గ కోట అనేవారు. కోటకు సమీపం లో అనేక జైన టెంపుల్స్ కలవు. ఇక్కడ కల దెఒగర్హ్ అర్కేయోలజికల్ మ్యూజియం కూడా ప్రత్యేకంగా చూడతగినదే. ఇలా ఎన్నో ఆకర్షణలున్న దెఒగర్హ్ లోని పర్యాటక ప్రదేశాలను గమనిస్తే ...

దెఒగర్హ్ పట్టణం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది. ఇది మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ నగరానికి సమీపంలో వుంటుంది. ఈ పట్టణం గుప్తుల కాలం నాటి స్మారకాలకు ప్రసిద్ధి చెందినది. దీని వెనుక కల బెట్వా నది, అక్కడి కోట, ఇంకా అనేక జైన, హిందూ క్షేత్రాలు ఈ పట్టణానికి మరింత వన్నె తెచ్చిపెట్టాయి.

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

ఘాట్‌లు, దెఒగర్హ్

దెఒగర్హ్ లోని బెట్వా నది ఒడ్డున మూడు ప్రధాన ఘాట్లు కలవు. అవి వరుసగా నహర్ ఘాట్, రాజ్ ఘాట్, సిద్ధి కి గుఫా మార్గం లోని ఘాట్.

చిత్ర కృప : byron aihara

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

సిద్ది కి గుఫా, దేవ్ ఘర్

సిద్ది కి గుఫా అంతా సాధారణంగా వుంటుంది. సిద్ధి కి గుహ లో ఋషులు వుండేవారు. ఈ గుహ ద్వారా మైదాన ప్రాంతం నుండి నదిని చేరుకోవచ్చు. ఈ గుహ వెలుపలి రాతి భాగం లో మహిషాసుర మర్దిని శిల్పం కూడా చెక్కబడి వుంటుంది. ఈ గుహ మార్గం గుండానే ఘాట్ కు వెళ్ళాలి.

చిత్ర కృప : byron aihara

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

నహార్ ఘాట్, దెఒగర్హ్

బెట్వా నది సమీపంలో నహార్ ఘాట్ కలదు. ఈ ప్రదేశంలో గుప్తుల కాలం నాటి శిల్పాలు, శాశనాలు అనేకం కనపడతాయి. మూడు ఘాట్‌లలోకి నహార్ ఘాట్ బాగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ అనేక దేవతా మూర్తులను, లింగాలను కూడా దర్శించవచ్చు.

చిత్ర కృప : Ed Sentner

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

రాజ్ ఘాట్, దెఒగర్హ్

రాజ్ ఘాట్, దేవ్ ఘర్ లో కల మూడు ఘాట్లలో ఒకటి. దీని గుండా వెళితే కూడా బెట్వా నది చేరవచ్చు. రాజ్ ఘాట్ హౌస్ లో అనేక శిల్పాలు గుప్త కాలం నాటివి చూడవచ్చు. ఈ ఘాట్లకు అర్కేయోలజికల్ ప్రాధాన్యత కలదు.

చిత్ర కృప : Malaiya

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

దెఒగర్హ్ ఆర్కియోలాజికల్ మ్యూజియం, దెఒగర్హ్

గుప్తుల కాలంలో దెఒగర్హ్ వైభవంగా ఉండేదని అక్కడికి వెళ్ళి తవ్వకాలు చేపట్టిన ఆర్కియోలాజికల్ అధికారులు ధృవీకరించారు. ఈ తవ్వకాలలో గుప్త రాజుల కాలం నాటి వైభవ చిహ్నాలు అనేకం బయటపడ్డాయి. వీటిని అన్నింటినీ అక్కడి మ్యూజియంలో భద్రపరచారు.

చిత్ర కృప : jess n

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

జైన దేవాలయాలు, దెఒగర్హ్

జైన దేవాలయాలు దెఒగర్హ్ కోట కి సమీపంలో, బెట్వా నదికి ఒడ్డున ఉన్నాయి. ఇక్కడ నిర్మించిన ఆలయాలన్నీ కూడా క్రీ.శ. 8 నుండి 9 వ శతాబ్దం నాటివని చెబుతారు. ఈ టెంపుల్ శిల్ప శైలి పురాతన భారత దేశ శిల్ప కాలాలకు నిదర్శనంగా వుంటుంది. టెంపుల్ గోడలపై అనేక మూర్తులను చెక్కి, ఎర్ర ఇసుక రాతితో నిర్మించారు.

చిత్ర కృప : Ed Sentner

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

కీర్తిగిరి దుర్గ కోట, దెఒగర్హ్

కీర్తి గిరి దుర్గ కోటను చండేలా రాజు కీర్తి వర్మన్ క్రీ.శ. 1057 లో నిర్మించాడు. కోట లోపల, బయట మధ్యయుగం నాటి అనేక జైన ఆలయాలు (31 జైన దేవాలయాలు) కనపడ్తాయి. కోటకు హాతి దర్వాజా, ఢిల్లీ దర్వాజా అని రెండు ప్రవేశాలు కూడా ఉన్నాయి.

చిత్ర కృప : telugu native planet

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

దశావతార ఆలయం, దెఒగర్హ్

దెఒగర్హ్ లో ఉన్న దశావతార ఆలయం దేశంలోనే పురాతనమైనదిగా చరిత్రకారులు భావిస్తారు. గుప్తుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం విష్ణుమూర్తిది. దీనిలో విష్ణుమూర్తి పది అవతారాలను, ప్రాంగణంలో గంగా, యమునా దేవతల చెక్కబడిన శిల్పాలను చూడవచ్చు. ఉత్తర భారత దేశంలో మొదటగా ఈ ఆలయానికే శిఖరం నిర్మించినారు.

చిత్ర కృప : telugu native planet

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

దశావతార ఆలయం ఎక్కడ ఉంది ?

దెఒగర్హ్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

దెఒగర్హ్ కి సమీపాన ఉన్న విమానాశ్రయం గ్వాలియర్ విమానాశ్రయం. ఈ ఏర్ పోర్ట్ దెఒగర్హ్ కి సుమారుగా 235 కిలోమీటర్ల దూరంలో ఉండి, దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడింది. ఇక్కడి నుండి క్యాబ్ లేదా ప్రవేట్ వాహనాల్లో ప్రయాణించి దేవ్ ఘర్ కి చేరుకోవచ్చు.

రైలు మార్గం

దెఒగర్హ్ ఈ సమీప రైల్వే స్టేషన్ లలిత్పూర్ రైల్వే స్టేషన్. ఢిల్లీ, పాట్నా, అలహాబాద్, ముంబై తదితర నగరాల నుండి రైళ్లు ఇక్కడికి నడుస్తుంటాయి.

రోడ్డు మార్గం

దెఒగర్హ్ కు చక్కటి రోడ్డు సదుపాయం కలదు. ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు సమీప ప్రాంతాల నుండి రెగ్యులర్ గా నడుస్తాయి.

చిత్ర కృప : Vishal Khare

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X