Search
  • Follow NativePlanet
Share
» »శివుడికి నైవేద్యంగా పీతలను సమర్పించే దేవాలయం ఎక్కడో తెలుసా?

శివుడికి నైవేద్యంగా పీతలను సమర్పించే దేవాలయం ఎక్కడో తెలుసా?

శివుడికి నైవేద్యంగా పీతలను సమర్పించే దేవాలయం ఎక్కడో తెలుసా?ఉమ్రాలో రామ్‌నాథ్ శివ ఘేలా దేవాలయం ఉంది. ఇక్కడి మహాశివుడికి పీతలను సమర్పిస్తే చెవులు ఆరోగ్యంగా ఉంటాయనే నమ్మకం భక్తులకు ఉంది. అందుకే భక్తులు ప

మ‌న దేశం ఎన్నో చారిత్రక‌, పురాత‌న దేవాల‌యాల‌కు నిల‌యం. ఎన్నో శ‌తాబ్దాల కింద‌ట నిర్మించినా ఇప్ప‌టికీ చెక్కు చెద‌రని ఆల‌యాలు కొన్ని ఉంటే, ఇంకా కొన్ని ఆల‌య ప‌రంగా ఎంతో పురాణ విశిష్ట‌త‌ను క‌లిగి ఉన్నాయి. మరికొన్ని వాటి నిర్మాణం, ఆకృతి, ప్రాచీన‌త వంటి అంశాల కార‌ణంగా ప్రాచుర్యంలోకి వ‌చ్చాయి. అయితే గుజ‌రాత్ రాష్ట్రంలో ఉన్న ఆ శివాల‌యం మాత్రం వీట‌న్నింటికీ భిన్న‌మైంది. ఎందుకంటే ఈ ఆలయంలో శివుడికి నైవేద్యంగా భ్రతికి ఉన్న పీతలను నైవేద్యంగా సమర్పిస్తారు. మరి ఈ దేవాలయం ఎక్కడ ఉంది? అలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం...

 క్రీ.శ.9 వ శతాబ్దంలో మనుగడలోకి వచ్చిన సూరత్

క్రీ.శ.9 వ శతాబ్దంలో మనుగడలోకి వచ్చిన సూరత్

సూరత్ గుజరాత్ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ప్రపంచ స్థాయి వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. క్రీ.శ.9 వ శతాబ్దంలో మనుగడలోకి వచ్చిన సూరత్ ప్రపంచ వస్త్ర, వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి. సూరత్ ను క్రీ.శ.9 వ శతాబ్దంలో సూర్యపూర్ అని పిలిచేవారట. ఆతరువాత 12 వ శతాబ్దంలో పార్శీలు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. మొఘల్ వంశ రాజులు సూరత్ ను ఎన్నో విధాలుగా అభివృద్ధిపరిచారు. వారిలో అక్బర్, జహంగీర్, ఔరంగజేబు కొందరు.

Meghna chatterji

బ్రిటీష్ వారి కాలంలో సూరత్ వ్యాపారం ప్రపంచం నలుమూలలకు

బ్రిటీష్ వారి కాలంలో సూరత్ వ్యాపారం ప్రపంచం నలుమూలలకు

బ్రిటీష్ వారి కాలంలో సూరత్ వ్యాపారం ప్రపంచం నలుమూలలకు పాకింది. ముఖ్యంగా ఐరోపా దేశాలతో నేరుగా వ్యాపారం జరిపేవారు. ప్రపంచమార్కెట్ లోని అన్ని వజ్రాలు దాదాపు 90% కి పైగా ఇక్కడే కోసి మరగబెట్టుతారు. మన్నిక, నాణ్యమైన వజ్రాలకు సూరత్ పేరుగాంచినది.

Chinmaykapasia007

 ఆధ్యాత్మిక పరంగా కూడా సూరత్ చాలా ప్రసిద్ది చెందినది

ఆధ్యాత్మిక పరంగా కూడా సూరత్ చాలా ప్రసిద్ది చెందినది

ఆధ్యాత్మిక పరంగా కూడా సూరత్ చాలా ప్రసిద్ది చెందినది అందుకు నిదర్శనం గుజరాత్ సముద్రం తీరంలో ఉన్న శివాలయం. అలాగే ..

సూరత్ లో సబర్మతీ నదీ తీరంలోని గల్టేశ్వర్

సూరత్ లో సబర్మతీ నదీ తీరంలోని గల్టేశ్వర్

సూరత్ లో సబర్మతీ నదీ తీరంలోని గల్టేశ్వర్ లో ఉన్న పురాతన శివాలయం.. పిక్నిక్ స్పాట్ గా ప్రసిద్ధి చెందిన గల్టేశ్వర్, శివునికి అంకితం చేయబడిన ఆలయం.

PC:YOUTUBE

 భక్తుల కోరికలను తీర్చడంలో శివుడు ముందు ఉంటాడని

భక్తుల కోరికలను తీర్చడంలో శివుడు ముందు ఉంటాడని

భక్తుల కోరికలను తీర్చడంలో శివుడు ముందు ఉంటాడని చాలా మంది నమ్ముతారు. శివుడిని నమ్మకంతో ఆరాధిస్తే ఎలాంటి కోరికలనైనా తీర్చగలడని విశ్వసిస్తారు. సూరత్‌లోని శివ భక్తులు కూడా అలాగే నమ్ముతున్నారు.

PC:YOUTUBE

ఉమ్రాలో రామ్‌నాథ్ శివ ఘేలా దేవాలయం ఉంది

ఉమ్రాలో రామ్‌నాథ్ శివ ఘేలా దేవాలయం ఉంది

ఉమ్రాలో రామ్‌నాథ్ శివ ఘేలా దేవాలయం ఉంది. ఇక్కడి మహాశివుడికి పీతలను సమర్పిస్తే చెవులు ఆరోగ్యంగా ఉంటాయనే నమ్మకం భక్తులకు ఉంది. అందుకే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి, పీతలను శివునికి సమర్పిస్తున్నారు.

PC:YOUTUBE

ఇలా చేయడం వల్ల తమకు మేలు జరుగుతుందని

ఇలా చేయడం వల్ల తమకు మేలు జరుగుతుందని

ఇలా చేయడం వల్ల తమకు మేలు జరుగుతుందని చెప్తున్నారు. తమ చెవులకు వచ్చే అనారోగ్యాలు నయమవుతాయని చెప్తున్నారు. ఇక్కడికి శివరాత్రి సందర్భంలో యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

PC:YOUTUBE

సూరత్ ఎలా చేరుకోవాలి

సూరత్ ఎలా చేరుకోవాలి

బస్సు మార్గం : సూరత్ కు దేశం లోని వివిధ ప్రాంతాల నుండి బస్సు లు కలవు. అనేక రహదారులకు కలుపబడి వుంది. నగరం లో స్థానిక బస్సు లు సి ఎన్ గి గ్యాస్ పై నడుస్తాయి.
రైలు మార్గం : సూరత్ కు రైల్ స్టేషన్ కలదు. ఈ రైలు స్టేషన్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు కలవు.
విమాన మార్గం : సూరత్ కు 11 కి. మీ.ల దూరం లో మగ్దాల వద్ద ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడ నుండి దేశం లోని అన్ని ప్రదేశాలకూ విమాన ప్రయాణం చేయవచ్చు.

చిత్రకృప : Rahulogy

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X