Search
  • Follow NativePlanet
Share
» »ఆవు పొదుగు నుంచి వచ్చిన రక్తంతో శివయ్యకు అభిషేకం?, నిజమే

ఆవు పొదుగు నుంచి వచ్చిన రక్తంతో శివయ్యకు అభిషేకం?, నిజమే

మదంబాకం లోని ధేనుపురేశ్వరార్ దేవాలయం గురించి కథనం.

పురాతన దేవాలయాల నిలయం భారత దేశం. ఇందులో కొన్ని దేవాలయాలు వెయ్యేళ్లకు పూర్వం నిర్మించినవి కావడం గమనార్హం. ఈ దేవాలయాల దర్శనం మనకు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని మిగులుస్తుంది. అటువంటి దేవాలయాల్లోని వాస్తు శైలి, శిల్ప విన్యాసం, కథావస్తువులు మనసును పులకింపజేస్తాయి. అలా వెయ్యేళ్లకు పూర్వం నిర్మించిన దేవాలయాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అందులో ఒక దేవాలయానికి సంబంధించిన కథనం మీ కోసం...

దేనుపురేశ్వర దేవాలయం

దేనుపురేశ్వర దేవాలయం

P.C: You Tube

తమిళనాడులోని తాంబరం దగ్గర మదంబాకం అనే గ్రామంలో ఒక శివుడి దేవాలయం ఉంది. ఈ దేవాలయం చెన్నై నుంచి కేవలం 30.3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే బెంగళూరు నుంచి ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి 334.2 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

పీరియడ్స్ సమయంలోనూ అమ్మవారికి పూజలు చేయవచ్చుపీరియడ్స్ సమయంలోనూ అమ్మవారికి పూజలు చేయవచ్చు

దేనుపురేశ్వర దేవాలయం

దేనుపురేశ్వర దేవాలయం

P.C: You Tube

అత్యంత పురాతనమైన ఈ దేవాలయానికి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. దానిని అనుసరించి కపిల మహర్షి శివుడిని నిత్యం పూజించేవాడు. ఒకరోజు అనుకోకుండా తన ఎడమ చేతిని శివుడికి పుష్పాభిషేకం చేశాడు.

దేనుపురేశ్వర దేవాలయం

దేనుపురేశ్వర దేవాలయం

P.C: You Tube

దీంతో కోపగించుకున్న శివుడు నీవు భూలోకంలో ఆవుగా జన్మించాలని శాపం పెడుతాడు. దీంతో కపిల మహర్షి ప్రస్తుతం మదంబాకం అనే గ్రామంలో ఆవుగా జన్మిస్తుంది. ఇక మేతకు వెళ్లినప్పుడు అక్కడికి దగ్గర్లో ఉన్న శివలింగానికి తన పొదుగు నుంచి నేరుగా పాలను ఇచ్చేది.

దేనుపురేశ్వర దేవాలయం

దేనుపురేశ్వర దేవాలయం

P.C: You Tube

తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకొన్నాక గోపాలుడు ఎంత ప్రయత్నించినా సదరు ఆవు నుంచి పాలు వచ్చేవి కావు. దీంతో ఒక రోజు కోపంతో గోపాలుడు ఆ ఆవును దొడ్డుకర్రతో బాదడం మొదలుపెట్టాడు.

దేనుపురేశ్వర దేవాలయం

దేనుపురేశ్వర దేవాలయం

P.C: You Tube

దెబ్బలకు తట్టుకోలేని ఆవు ఆ శివలింగం వద్దకు వెళ్లింది. అంతేకాకుండా తన పొదుగు నుంచి పాలను కూడా ఇచ్చింది. దీంతో కోపగించుకున్న గోపాలుడు తన కత్తి తీసి ఆ పొదుగును నరికాడు. ఎప్పుడైతే ఆవు రక్తం శివలింగం పై పడిందో ఆవుకు శాపవిముక్తి కలిగింది.

బ్రహ్మ మొదట యగం చేసినది ఇక్కడేబ్రహ్మ మొదట యగం చేసినది ఇక్కడే

దేనుపురేశ్వర దేవాలయం

దేనుపురేశ్వర దేవాలయం

P.C: You Tube

దీంతో ఆవు స్థానంలో కపిలమహర్షి ప్రత్యక్షమయ్యాడు. ధేనువు అంటే ఆవు అని కూడా అర్థం. అందువల్లే ఇక్కడ ఉన్న పరమేశ్వరుడిని ధేనుపురేశ్వరార్ అని అంటారు. ఇక్కడ వెలిసిన పార్వతీదేవిని ధేనుకాంబ పేరుతో కొలుస్తారు.

దేనుపురేశ్వర దేవాలయం

దేనుపురేశ్వర దేవాలయం

P.C: You Tube

ధేనుకాంబకు వేరుగా ఉపాలయం ఉండటం ఇక్కడ గమనార్హం. ధునుపురేశ్వరార్ తూర్పు ముఖంగా ఉంటే, ధేనుకాంబ దక్షిణాది ముఖంగా ఉండటం ఇక్కడ మరో విశేషం. ఈ దేవాలయం చోళుల కాలంలో నిర్మితమైనదని ఇక్కడ దొరికిన శిలా శాసనాల వల్ల తెలుస్తోంది.

దేనుపురేశ్వర దేవాలయం

దేనుపురేశ్వర దేవాలయం

P.C: You Tube

దేవాలయం ద్రవిడ వాస్తుశైలిని ప్రతిబింబిస్తుంది. పెద్ద పెద్ద స్తంభాలు వాటి పై అందమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఇక్కడ కపిల మహర్షి తన ఎడమచేతితో శివలింగాన్ని పూజిస్తున్న విగ్రహాన్ని కూడా చూడవచ్చు.

ఇక్కడ అస్సోం సొగసులు చూస్తారా?ఇక్కడ అస్సోం సొగసులు చూస్తారా?

దేనుపురేశ్వర దేవాలయం

దేనుపురేశ్వర దేవాలయం

P.C: You Tube

ప్రతి నిత్యం ఇక్కడ స్వామివారికి మూడు పూటలా పూజాధికార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా శివరాత్రి, నవరాత్రి తదితర విశేష పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తుల కోసం దేవాలయాన్ని ప్రతి నిత్యం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ అవకాశం ఉంటుంది.

మీ కోరికను వినాయకుడి చెవిలో చెప్పండి ఫలితం లభిస్తుందిమీ కోరికను వినాయకుడి చెవిలో చెప్పండి ఫలితం లభిస్తుంది

దేనుపురేశ్వర దేవాలయం

దేనుపురేశ్వర దేవాలయం

P.C: You Tube

అదే విధంగా సాయంత్రం 5 నుంచి 8.30 గంటల వరకూ అవకాశం కల్పిస్తుంది. జనావాసాలకు చాలా దూరంగా ఉన్న ఈ దేవాలయం ప్రశాంతతకు మారిపేరు. ఈ దేవాలయం తాంబరం-వాచేరి రోడ్డు మార్గంలో 3 కిలోమీటర్ల దూరంలో ఉంది.

చర్మవ్యాధులను నయం చేసే కొలను ఎక్కడ ఉందో తెలుసాచర్మవ్యాధులను నయం చేసే కొలను ఎక్కడ ఉందో తెలుసా

దేనుపురేశ్వర దేవాలయం

దేనుపురేశ్వర దేవాలయం

ఇక్కడి నుంచి దేవాలయానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి వెళ్లిన తర్వాత దేవాలయానికి దగ్గర్లో కళ్యాణ శ్రీనివాస పెరుమాల్ దేవాలయం, జూ పార్క్, వైలేశ్వర దేవాలయం, శివ దేవాలయం, శ్రీ అంగలమ్మ దేవాలయం తదితర పర్యాటక ప్రాంతాలకు చెందినది.

బల్కంపేట యల్లమ్మ రహస్యాలు మీ కోసంబల్కంపేట యల్లమ్మ రహస్యాలు మీ కోసం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X