Search
  • Follow NativePlanet
Share
» »రామాలయంలో ఖజురహో శిల్పసంపద...మన తెలంగాణలోనే

రామాలయంలో ఖజురహో శిల్పసంపద...మన తెలంగాణలోనే

దక్షిణభారత దేశ ఖజురహోగా పిలువబడే డిచ్ పల్లి రామాలయం గురించి కథనం.

భారతదేశంలో ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత. అటువంటి కోవకు చెందినదే దక్షిణభారత దేశ ఖజురహోగా పేరుగాంచిన ఓ దేవాలయం. ఈ దేవాలయంలోని శిల్పాల్లో కొన్ని ఖజురహోతో పోలి ఉంటాయి. అందువల్లే ఈ ప్రదేశం పర్యాటకులను ఆకర్షిస్తోంది. మన తెలంగాణలోనే అటువంటి దేవాలయం ఉంది. అయితే ఈ దేవాలయానికి కొంత ప్రాచూర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అటువంటి దేవాలయానికి సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

P.C: You Tube

డిచ్ పల్లి తెలంగాణలోని నిజమాబాద్ జిల్లాలోని పర్యాటక స్థలం. అయితే సరైన ప్రచారం లేక ఈ ప్రాంతం అంతగా వెలుగులోకి రాలేకపోతోంది. ప్రస్తుతం ఈ దేవాలయ ప్రాచుర్యానికి ఎంతగానో ప్రయత్నిస్తోంది.

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

P.C: You Tube
ఈ డిచ్ పల్లిలో క్రీస్తుశకం 14వ శతబ్దంలో నిర్మించిన రామ దేవాలయం ఉంది. ఈ డిచ్ పల్లిలోని రామదేవాలయానికి మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ గురువైన సమర్థరామదాసు పునాది వేయగా కాకతీయులు ఈ దేవాలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది.

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

P.C: You Tube
అయితే ఈ ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు. ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి చిన్న మెట్ల దారి కూడా ఉంది. మొత్తం మెట్ల సంఖ్య 108. డిచ్ పల్లిని దక్షిణ భారత దేశ ఖజురహో అని కూడా పిలుస్తారు.

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

P.C: You Tube
ఇందుకు ఈ దేవాలయం రాతి స్తంభాల పై ఉన్న శిల్పా సందర్యమే ప్రధాన కారణమని చరిత్రకారులు చెబుతారు. అత్యంత మనోహరంగా ఉన్న ఈ శిల్పాలు భారతీయ శిల్పకళకు అద్దం పడుతాయి.

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

P.C: You Tube
మధ్య ప్రదేశ్ లోని ఖజురహో దేవాలయాల సముదాయం పై ఉన్న శిల్పాలకు ఇక్కడి శిల్పాలకు చాలా పోలికలు ఉండటం వల్లే దీనికి ఆ పేరు వచ్చినట్లు చెబుతారు.

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

P.C: You Tube
అదేవిధంగా దీనిని ఇందూరు ఖజురహో అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం ఆనాటి భారతీయ ముఖ్యంగా కాకతీయ వాస్తుశైలికి అద్దం పడుతుంది.

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

P.C: You Tube
అయితే ఈ దేవాలయం నిర్మించే సమయంలో మహ్మదీయులు దాడి చేయడం వల్ల కొన్ని శిల్పాలు ధ్వంసమయ్యాయి. అందువల్లే ఈ దేవాలయ నిర్మాణం పూర్తి కాలేదు.

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

P.C: You Tube
అయినా కూడా ఈ దేవాలయం చూడటానికి చాలా బాగుంటుంది. నల్లటి రాయిని వినియోగించి చెక్కిన ఈ దేవాలయంలోని శిల్పాలు పర్యాటకుల మనసును ఇట్టే దోస్తాయి.

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

P.C: You Tube
అందువల్లే ఇక్కడకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ దేవాలయం లోని గర్భగుడి దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఇలా ఓ రామాలయం దక్షిణాభిముఖంగా ఉండటం చాలా అరుదైన విషయం.

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

P.C: You Tube
ఇక్కడ ఉన్న శిల్పాల్లో ఎక్కువ భాగం రతి రహస్యాలను తెలియజెప్పేవే. శ`ంగారకతను చాటి చెప్పే ఈ దేవాలయంలోని శిల్పాలను చూస్తూ సమయాన్ని ఇట్టే గడిపేయవచ్చు.

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

P.C: You Tube
చిన్న గుట్ట పైన ఉన్న ఈ దేవాలయాన్ని ఖిల్లా రామాలయం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయన్ని కొంత వరకూ కాకతీయులు అభివ`ద్ధి చేసినా ఎందుకనో అసంపూర్తిగానే ముగించేశారు.

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

P.C: You Tube
క్రీస్తుశకం 1949లో గజవాడ చిన్నయ్య గుప్త అనే అతను జైపూర్ నుంచి సీతారాముల పాలరాతి విగ్రహాలను తెప్పించి ఇక్కడ ప్రతిష్టింపజేసాడు. శ్రీరామనవమికి, మాఘ శుద్ధ ఏకాదశి నుంచి ఏడు రోజులు ఇక్కడ బ్రహోత్సవాలు జరుగుతాయి.

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

P.C: You Tube
అదేవిధంగా రథోత్సవం కూడా నిర్వహిస్తారు. ఈ దేవాలయంతో పాటు ఈ డిజ్ పల్లి చుట్టు పక్కల అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ శ్రీ కంఠేశ్వర దేవాలయం ఉంది.

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

P.C: You Tube
ఈ దేవలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ దేవాలయన్ని రెండవ శాతకర్ణి నిర్మించాడని ఇక్కడ దొరికిన శాసనాల వల్ల తెలుస్తోంది.

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

P.C: You Tube
డిజ్ పల్లి నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఆర్మూర్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ ఉన్న గుహాలయాన్ని నవనాథ సిద్దేశ్వర గుహాలయం అని పిలుస్తారు.

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

P.C: You Tube
ఈ గుహాలయాన్ని చేరుకోవడానికి మెట్ల దారి కూడా ఉంది. సద్దుల మల్లికార్జున స్వామి దేవాలయం, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు కూడా ఈ డిచ్ పల్లి సమీపంలో ఉన్నవే.

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

దక్షిణ భారత ఖజురహో, ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

P.C: You Tube
నిజామాబాద్ నుంచి దాదాపు 27 కిలోమీటర్ల దూరంలో ఖిల్లా రామాలయం ఉంటుంది. హైదరాబాద్ నుంచి సుమారు 167 కిలోమీటర్ల దూరంలో ఈ దక్షిణ ఖజురహోగా పేర్కొనే రామాలయం ఉంటుంది.

వివాహ సమస్యల నుంచి దూరం చేసే అఘోర మూర్తి ఇక్కడే...వివాహ సమస్యల నుంచి దూరం చేసే అఘోర మూర్తి ఇక్కడే...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X