Search
  • Follow NativePlanet
Share
» »దయ్యాలను వదలగొట్టే తాంత్రిక శక్తి దేవాలయాలు ! మీకు తెలుసా ?

దయ్యాలను వదలగొట్టే తాంత్రిక శక్తి దేవాలయాలు ! మీకు తెలుసా ?

హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. వీటినే అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

By Venkata Karunasri Nalluru

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని సతీదేవి యాగానికి వెళ్ళింది గాని, అక్కడ ఆమెకు అవమానం జరిగింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.

సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.

1. కామాఖ్యాదేవి ఆలయం

1. కామాఖ్యాదేవి ఆలయం

51 శక్తి పీఠాలలో అతి ప్రాచీన దేవాలయం కామాఖ్యాదేవి ఆలయం. ఇది భారతదేశంలో అస్సాం రాష్ట్రంలో గౌహతి నగర పశ్చిమ భాగంలో నీలాచల్ కొండల యందు కొలువై వున్నది. కాళీ, తార, శోదషి, భువనేశ్వరి, బైరవి, చిన్నమస్తా, ధుమవతి, బగలముఖి, మాతంగి మరియు కమల మొదలైన పది దేవాలయాలు పది మహావిద్యలు కొలువై వున్నాయి. ఇది హిందువులకు మరియు తాంత్రిక భక్తులకు ప్రధాన దేవాలయం. నవరాత్రి సమయంలో దుర్గా పూజను కూడా కామాఖ్య ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు.
PC : chandrashekharbasumatary

2. కాళీఘాట్ ఆలయం

2. కాళీఘాట్ ఆలయం

కాళీఘాట్ ఆలయం పశ్చిమబెంగాల్ లోని కోలకతాలో ఉంది. ఏడాది పొడవునా సందర్శించే తాంత్రిక పుణ్యక్షేత్రాల్లో చాలా ముఖ్యమైన ఆలయంగా చెప్పవచ్చును. ఒక పురాణం ప్రకారం శివుని యొక్క భార్యయైన సతీదేవి శరీరం ముక్కలైనప్పుడు ఆమె వేలు ఈ ప్రదేశంపై పడి ఇక్కడ కాళీఘాట్ ఆలయం ఉద్భవించినదని చెప్తారు. ఈ ఆలయంలో ఉత్సవాల సమయంలో మేకలను కాళికాదేవికి బలి ఇస్తారు. ఈ తాంత్రిక దేవత కాళి దేవికి వందలాది భక్తులు ఇక్కడ ప్రార్ధనలు జరుపుతారు.
PC :kalighattemple

3. హిమాచలప్రదేశ్ లోని బైద్యనాథ్‌ ఆలయం

3. హిమాచలప్రదేశ్ లోని బైద్యనాథ్‌ ఆలయం

హిమాచలప్రదేశ్ లోని బైద్యనాథ్‌ ఆలయం దేశంలో మరో ముఖ్యమైన తాంత్రిక దేవాలయం. ఆలయం లోపల శివుని లేదా బైద్యనాథ్‌ యొక్క ప్రసిద్ధ 'లింగం' ఉంది. దేశం నలుమూలల నుంచి యాత్రికులు ప్రార్థనలు జరుపుటకు ఈ పురాతన ఆలయంను సందర్శిస్తారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ప్రవహించే నీటికి విశేషమైన జీర్ణశక్తిని వృద్ధి చేసే లక్షణాలు కలిగి వుంది.
PC :Sankhyan kumar

4. వైతల్ ఆలయం

4. వైతల్ ఆలయం

వైతల్ ఆలయం భువనేశ్వర్ లోని 8 వ శతాబ్దపు ఒక శక్తివంతమైన తాంత్రిక దేవాలయం. ఆలయం లోపల ఆమె పుర్రెల దండ ధరించివున్న శక్తివంతమైన చాముండి (కాళి) దేవిగా దర్శనమిస్తుంది.
PC :Jngupta

5. ఏక్లింగి ఆలయం

5. ఏక్లింగి ఆలయం

నల్లరాయితో చెక్కిన అసాధారణమైన నాలుగు ముఖాలు కలిగిన శివుని రూపాన్ని ఉదయపూర్ సమీపంలోని రాజస్థాన్లో ఏక్లింగి శివాలయం వద్ద చూడవచ్చు.
PC :Jaiambey

6. సాలాసర్ బాలాజీ ఆలయం

6. సాలాసర్ బాలాజీ ఆలయం

అత్యంత ఆసక్తికరమైన మరియు ప్రసిద్ధమైన తాంత్రిక దేవాలయాలలో ఒకటిగా జైపూర్-ఆగ్రా హైవే పై గల భరత్పూర్ సమీపంలోని సాలాసర్ బాలాజీ ఆలయం వుంది. ఇక్కడ భూతవైద్యాలు "ఆత్మలు ఆవహించినట్లు" వుండే వాళ్లకి వాటిని వదలగొట్టటం చేస్తారు. ఇక్కడకు సమీపంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో బాలాజీ ఆలయానికి వస్తారు.
PC :Dausaanoop

7. ఖజురహో ఆలయం

7. ఖజురహో ఆలయం

మధ్యప్రదేశ్ లోని ఖజురహో ఆలయం అందమైన ఆలయం. ఇక్కడ శృంగార శిల్పాలు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటుంది. ఖజురహో దేవాలయాలను ఏడాది పొడవునా ప్రజలు సందర్శిస్తారు.
PC :Deepa Chandran2014

8. కాలభైరన్ దేవాలయం

8. కాలభైరన్ దేవాలయం

ఉజ్జయినీ కాలభైరన్ దేవాలయం తాంత్రిక శక్తి గల దేవాలయం. ఈ పురాతన ఆలయం చేరుకోవడానికి ఒక పల్లె ద్వారా ఒక గంట సేపు పడుతుంది. తాంత్రికులు, తత్వవేత్తలు, పాము మంత్రము మరియు "సిద్ధి" మొదలైన వారు ఇక్కడ వున్నారు.
PC :Ummidsh

9.మహాకాళేశ్వర ఆలయం

9.మహాకాళేశ్వర ఆలయం

మహాకాళేశ్వర ఆలయం ఉజ్జయినీలో గల తాంత్రిక శక్తి గల దేవాలయం. పగటిపూట అనేకమైన ఆకట్టుకునే వేడుకలు ఇక్కడ జరుగుతాయి. తాంత్రిక శక్తుల కోసం ఇక్కడ బూడిదను ఉపయోగిస్తారు.
PC :Pdhang

10.జ్వాలాముఖి దేవాలయం

10.జ్వాలాముఖి దేవాలయం

ఇక్కడకు సంవత్సరం పొడుగునా భక్తులు వస్తారు. ఈ ఆలయం కూడా హిమాచలప్రదేశ్ లో వున్నది. గర్భ సంబంధమైన వ్యాధులున్న వారు అమ్మవారిని దర్శించి ఆ వ్యాధిని దూరం చేసుకొంటారు. ఇక్కడి జ్వాలాముఖీ అమ్మవారిని దర్శిస్తే అన్ని రకాల వ్యాధులు నయమై పోతాయని భక్తుల అచంచల విశ్వాసం . సతీదేవి శరీర భాగమైన "నాలుక"పడిన ప్రదేశం ఇది యాభై ఒక్క శక్తి పీఠాలలో ఇదొకటి.

ధ్యాగూ" అనే భక్తుడు తన శిరస్సును నరికి పళ్ళెంలో పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టిన పవిత్ర స్థలమిదే. పంచోపచార, దశోపచార, షోడశోపచారాలతో అమ్మవారు నిత్యం పూజింపబడుతుంది.
PC :Nswn03

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X