Search
  • Follow NativePlanet
Share
» » ఈ స్వామిని దర్శిస్తే పెళ్లి త్వరగా అవుతుంది, వివాహ సమస్యలన్నీ దూరం ఎందుకంటే

ఈ స్వామిని దర్శిస్తే పెళ్లి త్వరగా అవుతుంది, వివాహ సమస్యలన్నీ దూరం ఎందుకంటే

కుంభకోణంలోని ఆది వరహాస్వామి దేవాలయానికి సంబంధించిన కథనం

భారత దేశంలో ఉన్నన్ని ఆలయాలు మరే దేశంలో ఉండవు. అయినా ఒక ఆలయానికి, మరో ఆలయానికి పోలికే ఉండదు. ఏదో ఒక విషయంలో విభిన్నంగా ఉంటాయి. అంతేకాకుండా ఆ దేవాలయాలకు పురాణ ప్రాధాన్యత కూడా ఉంటుంది. పురాణాలన్నీ ప్రళయం ముగిసిన తర్వాత ఉద్భవించినవే.

అయితే ఆ పురాణాలు పుట్టడానికి ముందే ఈ భూ మండలం పై ఒక ఆలయం వెలిసిందని చెబుతారు. అటువంటి ఆలయం కాశీ తర్వాత ఒకే ఒక చోట ఉంది. ఈ దేవాలయంలోని మూలవిరాట్టును సందర్శిస్తే వివాహం కాని వారిని త్వరగా పెళ్లి అవుతుందని నమ్ముతారు.

అదేవిధంగా ఇంటి సంబంధ కేసులు కూడా త్వరగా సమిసి పోతాయని చాలా కాలంగా నమ్ముతున్నారు. అందువల్లే ఈ దేవాలయ సందర్శన కోసం దేశ విదేశాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ ఈ కథనంలో మీ కోసం...

కుంభకోణం

కుంభకోణం

P.C: You Tube

ప్రళయం తర్వాత సృష్టి ఆగిపోతుందేమోనన్న భయంతో బ్రహ్మదేవుడు జీవ బీజాలను ఒక కుంభంలో దాచి పెట్టి దానిని భూమి పైకి వదిలాడు. ఆ కుంభం మొదట భూమిని తాకిన చోటే ప్రస్తుత తమిళనాడులోని కుంభకోణం.

 కుంభం పగిలిపోయి

కుంభం పగిలిపోయి

P.C: You Tube

ప్రళయం తర్వాత పరమేశ్వరుడు ఆ కుంభాన్ని ఒక బాణంతో కొట్టగా ఆకుంభం పగిలిపోయి అందులోని జీవ బీజాలతో పాటు ఆకులు, తీగలు తదితరాలన్నీ ఈ కుంభకోణం చుట్టు పక్కల పడిపోయాయి. అలా పడిపోయిన ప్రాంతాల్లోనే వివిధ ఆలయాలు వెలిశాయి.

ప్రళయానికి ముందే

ప్రళయానికి ముందే

P.C: You Tube

అయితే ఆ ఆలయాలకన్నింటి కంటే ముందే ఒక ఆలయం ఆ కుంభకోణంలో ఉంది. అదే ఆది వరాహ స్వామి దేవాలయం. పురాణాలను అనుసరించి హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూ దేవిని చెరపట్టి పాతాళంలోకి తీసుకు వెళుతాడు.

భూదేవిని రక్షించిన

భూదేవిని రక్షించిన

P.C: You Tube

ఆవిడ ప్రార్థనను విన్న వహా విష్ణువు బీకరమైన వరాహ రూపాన్ని ధరించి హిరణ్యక్షుడిని వధించి భూ దేవిని రక్షిస్తాడు. అటు పై ఆమెను నీటి నుంచి భూమి పైకి తీసుకువస్తాడు. అయితే ఆ సమయంలో మునిపుంగవులు వేడుకోవడంతో భూ దేవితో సహా కుంభకోణంలో ఉండిపోతాడు.

కూర్చొన్న భంగిమలో

కూర్చొన్న భంగిమలో

P.C: You Tube

అదే ఆది వరహా మూర్తి ఆలయం. ఆలయం చిన్నదిగా ఉన్న రంగురంగు గోపురాలతో ఉండటం వల్ల అందంగా కనిపిస్తుంది. గర్భగుడిలో స్వామి కూర్చొన్న భంగిమలో ఉంటాడు. స్వామి ఎడమ కాలు పై భూ దేవి కూడా ఉంటుంది.

ఆది శేషుని మీద

ఆది శేషుని మీద

P.C: You Tube

తల్లి స్వామి వైపు చూస్తూ ఆయన్ని స్మరిస్తున్నట్లు ఉంటుంది. ఎడమకాలు ఆది శేషుని మీద పెట్టి ఉంటుంది. ఇటువంటి విగ్రహం మనకు భారత దేశంలో ఎక్కడా మనకు కనిపించదు. వరాహ సాలగ్రామం, శంకు చక్రాలతో మూల విరాట్టుకు ముందు ఉంటుంది.

తులసి కోట

తులసి కోట

P.C: You Tube

నిత్యం అభిషేకం సాలిగ్రామానికే జరుగుతుంది. ఇక ఉత్సవ విగ్రహం కూడా వరాహ రూపమే. ఆలయ మంటపంలో విష్వక్సేనుడు, వైష్ణవ ఆచార్యులు తదితరులు ఉంటారు. ఇక్కడ నాగేంద్రుడు తులసి కోట కింద ప్రతిష్టించబడ్డాడు.

రాహుకేతు దోషాలు

రాహుకేతు దోషాలు

P.C: You Tube

అందువల్ల ఈ తులసి కోట చాలా విశిష్టమైనదని చెబుతారు. రాహుకేతు దోషాలు ఉన్నవారు ఇక్కడ దీపాలను వెలిగిస్తే ప్రయోజనం ఉంటుందని చెబుతారు. ఇక్కడ స్వామి వారికి నివేదించే నైవేద్యం విభిన్నంగా తయారు చేస్తారు.

మెక్క వేళ్లకు

మెక్క వేళ్లకు

P.C: You Tube

ఇక్కడ వరాహ స్వామి భూదేవిని పాతాళం నుంచి రక్షించారు కదా అందుకోసం భూమి అడుగున పేరిగే మొక్క వేళ్ల చిన్నగా చూర్ణం చేసి దానిలో బెల్లం, నెయ్యి కలిపి పెడుతారు. తదుపరి రోజు భక్తులకు దీనిని ప్రసాదంగా ఇస్తారు. తరతరాలుగా ఈ పక్రియ కొనసాగుతూనే ఉంది.

మహామహం

మహామహం

P.C: You Tube

మహామహం ఉత్సవాలతో సంబంధం ఉన్న కుంభకోణంలోని ఐదు వైష్ణవ దేవాలయాల్లో ఇది ఆది వరహాస్వామి దేవాలయం కూడా ఒకటి సారంగపాణి, చక్రపాని, వరదరాజస్వామి, రాజగోపాల స్వామి దేవాలయం మిగిలిన నాలుగు దేవాలయాలు.

ఐదు దేవాలయాల్లోని ఉత్సవ విగ్రహాలు

ఐదు దేవాలయాల్లోని ఉత్సవ విగ్రహాలు

P.C: You Tube

ఇక ఈ ఐదు దేవాలయాల్లోని ఉత్సవ మూర్తులను మహామహం రోజున పుష్కరిణి వరకూ ఊరేగింపుగా తీసుకువెలుతారు. ఇక్కడ ఉన్న మరో విశేషం చైత్రమాసంలో 7వ రోజు ఈ ఆది వరహా స్వామిని దర్శించుకోవడానికి సారంగపాణి, చక్రపాణి వస్తారని చెబుతారు.

అవివాహితులు

అవివాహితులు

P.C: You Tube

ఆ రోజున ఆలయంలో పెద్ద ఉత్సవం జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు భూదేవిని రక్షించి ఇక్కడే భూమి పైకి తీసుకురావడం వల్ల అవివాహితులు స్వామివారిని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపితే వెంటనే వివాహితులవుతారని స్థినక భక్తులు నమ్మకం.

ఇంటికి సంబంధించిన

ఇంటికి సంబంధించిన

P.C: You Tube

అదే విధంగా స్వామివారిని ప్రార్థిస్తే భూమి, ఇంటికి సంబంధించిన వివాదాలు వెంటనే పరిష్కారమవుతుందని కూడా చెబుతారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకూ తిరిగి 5 గంటల నుంచి 8 గంటల వరకూ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X