Search
  • Follow NativePlanet
Share
» »ఏడాదికొక్కసారే ఆలయాన్ని తెరుస్తారు, వెంటనే అక్కడి అడవి ఏమవుతుందో తెలుసా

ఏడాదికొక్కసారే ఆలయాన్ని తెరుస్తారు, వెంటనే అక్కడి అడవి ఏమవుతుందో తెలుసా

మధురైకు దగ్గరగా ఉన్న అలగర్ దేవాలయం గురించి.

తమిళనాడు ఆలయాల నిలయమన్న విషయం తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఉన్నన్ని దేవాలయాలు మనకు ఎక్కడా కనిపించవంటే అతిశయోక్తి కాదు. ఒక్కొక్క ఆలయాలనికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. అవన్నీ లిఖిత పూర్వకంగా శాసనాల రూపంలో లేదా తళపత్ర గ్రంథాల రూపంలో ఉంటాయి.

ఈ దేవాలయాలు పురాణ కథనాలకు ప్రతీకలు. ఇక మరికొన్ని ఆలయాలు ఆ కాలంలో సదరు ప్రాంతాన్ని పాలించిన రాజుల జీవన విధానాలను మనకు కన్నెదుట నిలుపుతాయి. ఇవి చరిత్రకు సాక్షాలు. ఇక మరికొన్ని ఆలయాలు అటు పురాణ ప్రాధాన్యత కలిగి ఉండటమే కాకుండా చరిత్రకు కూడా ఆలవాలంగా నిలుస్తాయి.

అంటువంటి ఆలయం గురించే ఇక్కడ మనం తెలుసుకొందాం. దీంతో పాటు శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని ఆలయానికి సంబంధించిన ఓ విచిత్ర ఘటన నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం...

మధురైకు దగ్గర

మధురైకు దగ్గర

P.C: You Tube

మధురైకు వెళ్లిన చాలా మంది అక్కడి మీనాక్షి దేవాలయాన్ని సందర్శించి వెనుతిరుగుతారు. అయితే కొంతమంది మాత్రమే ఈ దేవాలయానికి దగ్గరగా ప్రక`తిలో మమేకమైన అళగర్ కోవిల్ అంటే అళగర్ దేవాలయాన్ని తప్పక సందర్శిస్తూ ఉంటారు.

అక్కడ వింత

అక్కడ వింత

P.C: You Tube

ఈ ఆలయానికి ఉన్న విశిష్టతతో పాటు శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రహస్యాల నిధి ఈ దేవాలయం. ఈ దేవాలయం 108 విశిష్ట వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ అళగర్ దేవాలయాలనికి దాదాపు రెండువేల ఏళ్ల చరిత్ర ఉంది.

దట్టమైన అడవిలో

దట్టమైన అడవిలో

P.C: You Tube

మధురైకు సుమారు 21 కిలోమీటర్ల దూరంలో దట్టమైన చెట్ల మధ్య పచ్చటి తివాచిపరిచినట్లు ఉన్న కొండపక్కన ఉన్న దేవాలయమే. అళగర్ దేవాలయం. ఇందులో ప్రధాన దైవాన్ని తిరుమాళ్ అని పిలుస్తారు.

అందమైనవాడు కాబట్టే ఆ పేరు

అందమైనవాడు కాబట్టే ఆ పేరు

P.C: You Tube

ఆయన చాలా అందంగా ఉంటాడు కాబట్టే ఈ దైవాన్ని అళగర్ అని పిలుస్తూ వచ్చాడు. తమిళంలో అళగర్ అంటే అందమైన వాడని అర్థం. అందువల్లే ఈ దేవాలయానికి అళగర్ దేవాలయం అని పేరువ చ్చింది.

తమిళ సాహిత్యం

తమిళ సాహిత్యం

P.C: You Tube

తమిళ సాహిత్యంలో అడుగడుగునా ఈ దేవాలయం ప్రాధాన్యత కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళ ప్రాచీన గ్రంథం శిలప్పదికారంలో ఈ దేవాలయం గురించి, ఇక్కడి దేవుడి గురించి ఎంతగానో వర్ణించారు. ఇక్కడ ఉన్న ప్రక`తి సంపద వల్ల ఈ దేవాలయాన్ని దక్షిణ తిరుపతిగా కూడా పిలుస్తుంటారు.

మీనాక్షి అమ్మవారి సోదరుడు

మీనాక్షి అమ్మవారి సోదరుడు

P.C: You Tube

ఈ దేవాలయంలోని అళగర్ మధురలోని మీనాక్షి అమ్మవారికి సోదరుడని భావిస్తారు. అందువల్లే మధురై మీనాక్షి కళ్యాణోత్సవం సమయంలో ఈ దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహం అక్కడకు తప్పక వెలుతుంది. ఆ ఆచారం కొన్ని వేల ఏళ్లుగా అనుసరిస్తున్నారని ఇక్కడి వారు చెబుతారు.

మనసులోని కోరికలు

మనసులోని కోరికలు

P.C: You Tube

ఈ అళగర్ స్వామిని సందర్శిస్తే మనసులోని కోరికలు తప్పక తీరుతాయని భక్తులు నమ్ముతారు. అందువల్లే మహాభారత కాలంలో ధర్మరాజు, అర్జునులు సైతం ఈ దేవాలయానని సందర్శించినట్లు తెలుస్తుంది. ఇక భారత దేశాన్ని ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను పాలించ రాజులు ఎంతో మంది ఈ ఆలయం అభివ`ద్ధికి క`షి చేశారు.

రాజకీయ నాయకులు

రాజకీయ నాయకులు

P.C: You Tube

ముఖ్యంగా శ్రీ క`ష్ణ దేవరాయులు మొదలుకొని విశ్వనాథ నాయకుని వరకూ చాలా మంది ఈ దేవాలయాన్ని సందర్శించారు. ఇక ఇప్పటికీ ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ దేవాలయాన్ని సందర్శించి తమ కోరిక తీరాలను మొక్కులు చెల్లించుకొంటూ ఉంటారు.

తమిళ జానపథ కథలు

తమిళ జానపథ కథలు

P.C: You Tube

ఈ దేవాలయంతోపాటు మూలవిరాట్లుకు సంబంధించిన అనేక కథలు పురాణాలతో పాటు తమిళ జానపథ కథల రూపంలో ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా పాండ్యరాజుల్లో రెండవ రాజైన మలయధ్వజపాండ్యన్ కు స్వామి దర్శనమిచ్చినట్లు చెబుతారు.

కొండను నందీశ్వరుడిగా

కొండను నందీశ్వరుడిగా

P.C: You Tube

అదేవిధంగా రామానుజాచార్యుల ముఖ్యశిష్యుల్లో ఒకరైన కరుదాళ్వార్ కు ఈ స్వమి మహిమతోనే కంటి చూపు తిరిగి వచ్చినట్లు చెబుతారు. ఈ ఆలయం పక్కన ఉన్న కొండను సాక్షాత్తు ఆ నందీశ్వరుడి అవతారంగా చెప్పడమే కాకుండా దనికి పూజలు కూడా నిర్వహిస్తారు.

108 అడుగుల వీమాన గోపురం

108 అడుగుల వీమాన గోపురం

P.C: You Tube

దాదాపు 180 అడుగుల ఎత్తులో ఉండే ఆలయ విమాన గోపురం పై సుందర పాండ్యన్ అనే తమిళరాజు 13 శతాబ్దంలోనే లక్షల రుపాయలు ఖర్చుచేసి బంగారు పోత పోయించాడు. ఈ బంగారం పై సూర్య కిరణాలు పడి పరావర్తనం చెంది ఒక వింతైన వర్ణాన్ని ఏర్పాటు చేస్తుంది.

సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో

సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో

P.C: You Tube

దీనిని చూడటానికి సందర్శకులు ఇష్టపడుతారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఈ అద్భుతం చాలా బాగా కనబడుతుంది. అదే విధంగా అళగర్ దేవాలయంలోని ఉత్సవ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది.

18 మంది దుండగులు

18 మంది దుండగులు

P.C: You Tube

ఈ విగ్రహాన్ని దొంగలించేందుకు 18 దుండగులు ఒకే సారి ఈ ఆలయం పై దాడిచేయగా ఆ సమయంలోని పూజారులు తమ ప్రాణాలను పనంగా పెట్టి ఈ విగ్రహాన్ని కాపాడుకొన్నారు. ఆ సమయంలో ఇక్కడి దైవం కరుప్పుస్వామి అనే కావలి రూపంలో కనిపించి ఈ క్షేత్రాన్ని ఇక పై తానే సంరక్షిస్తుంటానని మాట ఇచ్చినట్లు కథనం.

కరుప్పుస్వామి

కరుప్పుస్వామి

P.C: You Tube

ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఈ దేవాలయం పై ఎటువంటి దాడులు జరగలేదు. ఈ కరుప్పుస్వామికి కూడా ప్రధాన ఆలయం వెలుపల ఒక చిన్న ఉపాలయం ఉంది. అయితే ఈ స్వామి ఉగ్రరూపాన్ని చూసి సాధారణ ప్రజలు తట్టుకోలేరని చెబుతారు.

ఆ సమయంలో

ఆ సమయంలో

P.C: You Tube

అందుకే ప్రత్యేక పూజలు నిర్వహించి ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దేవాలయం తలుపులు తెరుస్తారు. ఆ సమయంలో స్థానికంగా ఉన్న పశుపక్షాదులు, కీటకాలతో పాటు అటవీ ప్రాంతంలో చీమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దం ఏర్పడుతుంది. అంతేకాకుండా అక్కడి వాతావరణం కూడా కొంత వేడెక్కుతుంది.

 కారణం ఏమిటన్నది తెలియదు

కారణం ఏమిటన్నది తెలియదు

P.C: You Tube

ఇందుకు గల కారణాలను మాత్రం శాస్త్రవేత్తలు ఇప్పటికీ కనుగొనలేక పోయారు. ఈ రెండు దేవాలయాలతో పాటు ఇక్కడ స్వామివారి సతీమణి సుందరవల్లి తాయార్ ఆలయం కూడా చూడదగింది. వివాహం కాని వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వెంటనే వారికి కళ్యాణ యోగం కలిసి వస్తుందని స్థానిక భక్తులు నమ్ముతారు.

వామన అవతారం

వామన అవతారం

P.C: You Tube

ఈ ఆలయం సమీపంలో రూపుర గంగత తీర్థం ఉంది. విష్ణుమూర్తి వామన అవతారం ఎత్తినప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా ఆయనకు పాదపూజ చేశాడని పురాణాలు చెబుతాయి. అలా వామనుడి పాదాన్ని తాకిన జలం ఇక్కడ తీర్థంగా ఏర్పడిందని చెబుతారు. ఈ తీర్థంలోని నీరు తాకితే సర్వరోగాలు సమసిపోతాయని భక్తులు భావిస్తారు.

భారతీయ శిల్పకళకు

భారతీయ శిల్పకళకు

P.C: You Tube

ఈ ఆలయాల్లోని మండపాలు భారతీయ శిల్పకళకు అద్దం పడుతాయి. ముఖ్యంగా రథమంటపం, కళ్యాణ మంటపం, వసంత మంటపం చూడదగినవి. ఇక ఆలయం దగ్గర వేల ఏళ్లుగా నివశిస్తున్న గ్రామ వాసుల కుటుంబాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఇక్కడ శిథిలమైన కోటగోడలు అలనాటి చరిత్రకు నిలువుటద్దాలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X