Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలోని ఏకైక వేంకట దశావతరా విగ్రహ రూప శిల్పి ఇతనే

ప్రపంచంలోని ఏకైక వేంకట దశావతరా విగ్రహ రూప శిల్పి ఇతనే

అమరావతిలోని దశావతార వేంకటేశ్వర దేవాలయం గురించి కథనం.

కలియుగ దైవమైన వేంకటేశ్వరుడి విగ్రహంలో శ్రీమన్నారాయణుడి పది అవతారాలు కొలువై ఉన్నాయి. ఆ అరుదైన విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉంది. ఇటువంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఆగమశాస్త్ర నిర్మితమైన ఆ విగ్రహం పొడవు 11 అడుగులు. కాళ్ల నుంచి నడుము వరకూ వరాహ, మత్య్స, కూర్మ రూపంలో ఉన్న విగ్రహంలో మిగిలిన ఏడు అవతారాలు కూడా చక్కగా ఒదిగిపోయాయి. ఇంతటి విశిష్టమైన విగ్రహాన్ని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు ఆవిష్కరించారు. ఇదిలా ఉండగా ఈ ఆలయ నిర్మాణంతో పాటు ఈ విగ్రహ రూపకల్ప శిల్పి తదితర వివరాలన్నీ మీ కోసం ఈ కథనంలో....

ఒకే విగ్రహంలో దశావతారాలు

ఒకే విగ్రహంలో దశావతారాలు

P.C: You Tube

ప్రపంచంలో మరెక్కడా మనకు ఇటువంటి మంగళ స్వరూపం కనిపించదు. అందువల్లే ఈ విగ్రహం నవ్యాంధ్ర రాజధాని అమరావతికే తలమానికం అని అంటారు.

ఒకే విగ్రహంలో దశావతారాలు

ఒకే విగ్రహంలో దశావతారాలు

P.C: You Tube

అదే శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి విగ్రహం. కలియుగ ప్రత్యక్షదైవంగా పిలువబడే శ్రీనివాసుడు ఇక్కడ దశావతారాల రూపంలో కొలువై ఉన్నాడు.

ఒకే విగ్రహంలో దశావతారాలు

ఒకే విగ్రహంలో దశావతారాలు

P.C: You Tube

ఒకే విగ్రహంలో ఆ శ్రీమన్నారాయణుడి పది అవతారాలు కలిగి ఉండటడం అన్నది ఇక్కడ విశేషం. ఇలాంటి విగ్రహం భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరెక్కడా ఉండదు.

ఒకే విగ్రహంలో దశావతారాలు

ఒకే విగ్రహంలో దశావతారాలు

P.C: You Tube

విజయవాడ, గుంటూరు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా సువిశాల మైదానంలో ఈ స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు.

ఒకే విగ్రహంలో దశావతారాలు

ఒకే విగ్రహంలో దశావతారాలు

P.C: You Tube

ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నంబూరు పంచాయతీ పరిధిలోని లింగమనేని ఎస్టేట్స్ లో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి నాలుగు ఉపాలయాలు కూడా ఉన్నాయి.

ఒకే విగ్రహంలో దశావతారాలు

ఒకే విగ్రహంలో దశావతారాలు

P.C: You Tube

అవి మహాలక్ష్మి, గణపతి, గరుడ ఆళ్వార్, విష్వక్సేనుడు. అందువల్లే ఈ క్షేత్రాన్ని దశావతరార శ్రీనివాస క్షేత్రంగా కూడా పిలుస్తారు.

ఒకే విగ్రహంలో దశావతారాలు

ఒకే విగ్రహంలో దశావతారాలు

P.C: You Tube

ఆలయ నిర్మాణం మొత్తం ఆగమ శాస్త్ర ప్రకారమే జరిగింది. విగ్రహాలను మలిచే స్థపతి, ఆలయాన్ని నిర్మించే శిల్పి ఇలా ప్రతి ఒక్కరూ ఆగమశాస్త్ర ప్రకారం విధులు నిర్వర్తించారు.

ఒకే విగ్రహంలో దశావతారాలు

ఒకే విగ్రహంలో దశావతారాలు

P.C: You Tube

శిల్పి రమణ దశావతార వేంకటేశ్వరుడి విగ్రహాన్ని మొదట చిత్రం గీసుకున్నాడు. దీనిని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన శిల్పి వి. సుబ్రహ్మణ్య ఆచార్యులు రాతితో ఈ ఆలయాన్ని నిర్మించాడు.

ఒకే విగ్రహంలో దశావతారాలు

ఒకే విగ్రహంలో దశావతారాలు

P.C: You Tube

ఇక తమిళనాడులోని కొయంబత్తూర్ కు సమీపంలోని తిరుమురుగన్ పూండిలో వాస్తవ్యుడైన స్థపతి ఎస్. కనకరత్నం, భూసమేత దశావతార వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ దేవి, గణపతి, విష్వక్సేనుడు, హయగ్రీవాచార్యుల విగ్రహాలను అద్భుతంగా మలిచాడు.

ఒకే విగ్రహంలో దశావతారాలు

ఒకే విగ్రహంలో దశావతారాలు

P.C: You Tube

వేంకటేశ్వర స్వామికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం సమీపంలో గరుడాళ్వార్, గణపతి ఉపాలయం సమీపంలోని విష్వక్సేనాళ్వార్ విగ్రహాలు రమణీయంగా కనిపిస్తాయి.

ఒకే విగ్రహంలో దశావతారాలు

ఒకే విగ్రహంలో దశావతారాలు

P.C: You Tube

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా అంగర గ్రామానికి చెందిన వీరభాబు సప్తదళ రాజగోపురానని, 60 అడుగుల 9 అంగుళాల ఎత్తైన ధ్వజస్తంభాన్ని శాస్త్రోక్తంగా నిర్మించారు.

ఒకే విగ్రహంలో దశావతారాలు

ఒకే విగ్రహంలో దశావతారాలు

P.C: You Tube

దేవాలయానికి దిగువ భఆగంలో స్వామీజీ ప్రవచనాల కోసం వేదికతో కూడిన విశాలమైన మండపం కూడా మనం చూడవచ్చు. చుట్టూ పచ్చదనంతో దేవాలయ ఆవరణం హాయిగొల్పుతుంది.

ఒకే విగ్రహంలో దశావతారాలు

ఒకే విగ్రహంలో దశావతారాలు

P.C: You Tube

ఇక ఈ విగ్రహం ఎత్తు 11 అడుగులు. ఈ ఒక్క విగ్రహంలోనే శ్రీమన్నారాయణుడి 10 అవతారాలను దర్శించుకోవచ్చు. ఇంతటి ఎతైన విగ్రహం చూడటానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి.

ఒకే విగ్రహంలో దశావతారాలు

ఒకే విగ్రహంలో దశావతారాలు

P.C: You Tube

శ్రీ వేంకటేశ్వర, నరసింహ, వరాహ ముఖాలతో, వామన, పరుశురామ, రామ, బలరామ, కల్కి అవతారాలు ఆయుధాలుగా మత్స్య, కూర్మ అవతారాలు దేహంగా దాల్చిన విలక్షణమైన ఏక శిలా విగ్రహం ఈ శ్రీ దశావతార వేంకటేశ్వర విగ్రహం.

ఒకే విగ్రహంలో దశావతారాలు

ఒకే విగ్రహంలో దశావతారాలు

P.C: You Tube

ఈ ఆలయాన్ని స్థానిక వ్యాపారకుటుంబీకులు ఎల్ఈపీఎల్ ప్రజెక్టు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ లింగమనేని రమేష్ కుటుంబీకుల కలల సౌధం ఈ దేవాలయం.

ఒకే విగ్రహంలో దశావతారాలు

ఒకే విగ్రహంలో దశావతారాలు

P.C: You Tube

తిరుమల శ్రీవారి భక్తుడైన రమేశ్ ప్రపంచంలోనే ప్రత్యేకత ప్రతిబింబించేలా ఈ దేవాలయాన్ని నిర్మించాడు. దాదాపు 18 ఏళ్ల క్రితం వారి ఊహ ఇటీవల వాస్తవ రూపం దాల్చింది.

ఒకే విగ్రహంలో దశావతారాలు

ఒకే విగ్రహంలో దశావతారాలు

P.C: You Tube

అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆధ్వర్యంలో ఈ దేవాలయం నిర్మాణంతో పాటు విగ్రహ రూపకల్పన జరిగింది. ఇప్పుడిప్పుడే ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X