Search
  • Follow NativePlanet
Share
» »దేశంలో పాండవులను, ద్రౌపతిని పూజించే ఏకైక దేవాలయం చూశారా?

దేశంలో పాండవులను, ద్రౌపతిని పూజించే ఏకైక దేవాలయం చూశారా?

బెంగళూరులోని ధర్మరాయ స్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

By Deepthi T A S

భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో,ప్రతీ వీధిలో వేలాది ఆలయాలు కన్పిస్తాయి. కొన్ని విష్ణుమూర్తికి చెందినవైతే, ఇంకొన్ని పరమశివుడికి, మరికొన్ని బ్రహ్మదేవుడికి చెందినవి అయి వుంటాయి. కాని కొన్ని దేవాలయాల్లో మాత్రమే పాండవులను దేవుళ్లుగా పూజిస్తారు. అటువంటి దేవాలయమే బెంగుళూరులోని ధర్మరాయ స్వామి ఆలయం. ప్రతీ ఏడాది ఇక్కడకు వేలాదిమంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. ఈ అసాధారణ ఆలయం, దాని మత ప్రాముఖ్యత గురించి మరింత సమాచారం కోసం కింద చదవండి. అంతే కాకుండా ఈ దేవాలయంలో జరిగే కరగ ఉత్సవానికి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ ఉత్సవాన్ని చూడటానికి దేశం నలుమూలల నుంచి ఇక్కడకు వస్తుంటారు.

నగరం నడిబొడ్డున

నగరం నడిబొడ్డున

P.C: You Tube

బెంగళూరు నగరంలోని నడిబొడ్డున ఈ ధర్మరాయ దేవాలయం ఉంది. దేశంలో ధర్మరాయ స్వామి ఆలయం ఒక్కచోట మాత్రమే. ప్రతీ ఏడాది వేలాదిమంది హిందూ భక్తులు దర్శనానికి వెలుతుంటారు. ముఖ్యంగా బెంగుళూరు కరగ పండగప్పుడు ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ పండగ రాష్ట్రంలోని పురాతన పండగల్లో ఒకటిగా నమ్ముతారు. పాండవులకి చెందిన ఈ గుడిలో పాండవులు కొలువుదీరి ఉంటారు. పాండవులను, వారి పట్టపురాణి ద్రౌపదిని పూజిస్తారు.

ధర్మరాయ స్వామి ఆలయం చరిత్ర

ధర్మరాయ స్వామి ఆలయం చరిత్ర

P.C: You Tube

కెంపేగౌడ బెంగళూరు నగరాన్ని నిర్మించడానికి ముందే తిగల వంశానికి చెందిన వారు ఈ ధర్మరాయ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు. బెంగళూరు నగం 16వ శతాబ్దంలో నిర్మించి ఉంటే ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. అసలు ఈ దేవాలయం చుట్టూనే నగరం నిర్మించారని కూడా చెబుతారు. అప్పటినుంచి ధర్మరాయ స్వామి ఆలయం రాష్ట్రంలోనే పుణ్యక్షేత్రంగా మారింది.

కరగ పెద్ద పండుగ

కరగ పెద్ద పండుగ

P.C: You Tube

ఇక్కడ జరిగే పెద్ద పండుగ బెంగుళూరు కరగ. నగరంలోని ఈ ప్రఖ్యాత పండగనుకూడా తిగలాస్ యే మొదలుపెట్టారని నమ్ముతారు. దీన్ని పాండవుల పట్టపురాణి ద్రౌపదికి గౌరవసూచకంగా, స్త్రీ శక్తికి ప్రతీకగా జరుపుకుంటారు. ధర్మరాయ స్వామి ఆలయానికి ఏడాది పొడవునా ఎప్పుడైనా వెళ్ళవచ్చు. అయితే కరగ పండగ దగ్గరలో ఉండే మార్చి, ఏప్రిల్ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు.

ఎలా చేరుకోవచ్చు

ఎలా చేరుకోవచ్చు

P.C: You Tube

విమానం ద్వారా - బెంగుళూరుతో అన్ని పెద్ద నగరాలకి రవాణా సౌకర్యం ఉంది కాబట్టి, బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కి నేరుగా విమానం ఉంటుంది. ఎయిర్ పోర్ట్ నుంది మీరు ధర్మరాయ స్వామి ఆలయానికి నేరుగా కాబ్ లో వెళ్లవచ్చు. గుడి నుంచి ఎయిర్ పోర్ట్ కి మధ్య దూరం 36 కిలోమీటర్లు.

రైలు ద్వారా -అన్ని పెద్ద నగరాలు, పట్టణాల నుంచి బెంగుళూరుకి రైలు మార్గం,నేరుగా రైళ్ళు కూడా ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుండి మీరు తిగలార్ పేట్ లో ఉన్న గుడికి టాక్సీలో వెళ్లవచ్చు.

రోడ్డు ద్వారా - ధర్మరాయ స్వామి గుడికి నేరుగా బస్సు ఎక్కవచ్చు లేదా మీరే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. బెంగుళూరుకి అన్ని నగరాలకి,పట్టణాలకి రోడ్డు ద్వారా మంచి రవాణా సౌకర్యం ఉన్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X