Search
  • Follow NativePlanet
Share
» » కూడల సంగమేశ్వరం జాతి మతాలకు అతీతమైన పుణ్యక్షేత్రం

కూడల సంగమేశ్వరం జాతి మతాలకు అతీతమైన పుణ్యక్షేత్రం

కర్నాటకలోని కూడల సంగమేశ్వరాలయం గురించి కథనం.

నదులు సముద్రాలతో కలిసే ప్రాంతాన్ని అత్యంత పవిత్రమైన ప్రాంతాలుగా భావించడం హిందూ ధర్మంలో ఎప్పటి నుంచో ఉంది. ఈ నదులు, సముద్రం కలిసే ప్రాంతాన్ని సంగమం అంటారు. ఇందుకు సంబంధించిన ప్రస్తావన మన పురాణాల్లో కూడా కనిపిస్తోంది. ఇక చరిత్ర కాలానికి వస్తే ఈ సంగమ ప్రదేశంలో అనేక ఆలయాలు నిర్మించారు. మరోవైపు కేవలం నదులు సముద్రాలు కలిసే ప్రదేశాల్లోనే కాకుండా ఉప నదులు, నదులతో కలిసే ప్రాంతంలో కూడా దేవాలయాలు నిర్మించే సంప్రదాయం బాదామీ చాళుక్యుల కాలంలో ప్రారంభమయ్యింది. అందులో కర్నాటకలోని కూడలి సంగమేశ్వరాలయం ఒకటి. ఈ క్షేత్రానికి సంబంధించిన వివరాలు మీ కోసం...

నదులు, ఉప నదులు కలిసే ప్రాంతం

నదులు, ఉప నదులు కలిసే ప్రాంతం

P.C: You Tube

నదీ, సముద్రం కలిసే ప్రాంతాన్ని కూడా సంగమ స్థలంగానే పరిగణిస్తారు. ఈ నదీ సంగమ ప్రదేశాల్లో పూజలు, జపాలు,స్నానాలు చేస్తే విశేష ఫలితాలను అందిస్తాయని హిందువులు నమ్ముతారు. అందువల్లే చాళుక్యులు ఇటువంటి ప్రాదేశాల్లో వేలాదిగా శివాలయాలు నిర్మించారు. కర్నాటకలోని ఘటప్రభకృష్ణానదితో కలిసే ప్రదేశమే కూడల సంగమం. ఇక్కడే సంగమేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం కూడల సంగమేశ్వర ఆలయంగానే ప్రాచూర్యం చెందింది.

సంగమేశ్వరుడు

సంగమేశ్వరుడు

P.C: You Tube

ఆలయంలో కొలువైన ఈశ్వరుడిని సంగమనాథ అని కూడా పిలుస్తారు. కర్నాటకలోని బాగల్ కోట జిల్లాలో ఆల్మట్టికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైనది. మలప్రభ ఇక్కడ క`ష్ణానదితో కలిసి తూర్పు దిశగా శ్రీశైలం వైపు ప్రయాణం చేస్తాయి. సంగమేశ్వరాలయానికి ఎదురుగా ఐక్య మంటపం నదిలో ఉంది. ఇక్కడే స్వయంభువుగా వెలిసిన పరమేశ్వరుడు లింగ రూపంలో ఉంటాడు.

దిగుడు బావిలా

దిగుడు బావిలా

P.C: You Tube

నది నీరు ఈ శివలింగాన్ని తాకకుండా వీటు చుట్టూ పటిష్టమైన దిగుడు బావి లాగా నిర్మించారు. భక్తులు ఈ మెట్ల ద్వారా కిందికి వెళ్లి ఈశ్వరుడిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కూడల సంగమానికి ప్రముఖ సామాజిక వేత్త లింగాయత్ ధర్మాన్ని స్థాపించిన బసవేశ్వరుడికి అవినాభావ సంబంధం ఉంది. హిందూ ధర్మంలోని కర్మకాండం పై విశ్వాసం లేని ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులను వదిలి ఈ కూడల సంమాన్ని చేరుకొన్నాడు.

బసవేశ్వరుడు

బసవేశ్వరుడు

P.C: You Tube

ఇక్కడ సంగమేశ్వరుడిని నిష్టతో పూజించి ఆయన మెప్పును పొందుతాడు. శివుడి ఆదేశాలను అనుసరించి 12వ శతాబ్దంలో బిజ్జలుని కొలువులో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అటు రాజ్యభారం మోస్తూనే సమాజంలోని కులమతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేస్తూ ఎన్నో రచనలు చేశాడు. అవి బసవన్న వచన సాహిత్యం పేరుతో ప్రఖ్యాతి గాంచాయి. ఇవి మొత్తం 64 లక్షలు కాగా ప్రస్తుతం అందులో కొన్ని వేలు మాత్రమే లభిస్తున్నాయి.

లింగాయత్ సమాజానికి

లింగాయత్ సమాజానికి

P.C: You Tube

సమాజంలో మార్పు కోసం ఆ కాలంలోనే వర్ణాంతర వివాహం చేస్తాడు. అయితే ఈ వివాహం అప్పటి సంప్రదాయ వాదులకు నచ్చక ఆ కొత్త దంపతులను హత్య చేస్తారు. దీంతో చలించిపోయిన బసవేశ్వరుడు
తిరిగి కూడల సంగమేశ్వరానికి చేరుకొని తన శేష జీవితాన్ని గడిపి అక్కడే శివుడిలో ఐక్యమైపోతాడు. ఆ బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో లింగాయత్ ధర్మంగా స్థిరపడింది. అందవుల్లే ఈ కూడాల సంగమం లింగాయత్ వర్గానికి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా మారింది. కేవలం లింగాయత్ లు , హిందువులే కాకుండా అన్ని మతాల వారు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X