Search
  • Follow NativePlanet
Share
» » పంచకేశవాలయాల దర్శనంతో ముక్తి మీ వెంటే

పంచకేశవాలయాల దర్శనంతో ముక్తి మీ వెంటే

గోదావరి నదీ తీరం వెంబడి ఉన్న పంచ కేశవాలయాల గురించి కథనం.

పంచరామాలు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు, పశ్చిమ గోదావారిజిల్లాల్లో వేర్వేరు చోట్ల ఉన్న విషయం తెలిసిందే. ఈ పంచరామాలు శైవ క్షేత్రాలు. అదే విధంగా గోదావరి నదీ తీరం వెంబడి దగ్గర దగ్గరగా ఐదు కేశవ క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాలు ఈ కలియుగానికంటే పూర్వం నుంచి ఉన్నట్లు చెబుతారు. ఈ క్షేత్రాలు. అవి వరుసగా తణుకు, మండపాక, కొఠాలపర్రు, ర్యాలి, వాకతిప్ప. ఇందులో ర్యాలీ మాత్రమే దేశ వ్యాప్తంగా పేరొందిన పుణ్యక్షేత్రం. ఈ ర్యాలి క్షేత్రం హరి హర క్షేత్రం. కాగా, మిగిలిన ప్రాంతాలన్నీ పురాణ ప్రాధాన్యత కలిగిన అక్కడ దేవాలయాలు శిథిలావస్థలోనే ఉన్నాయి. అయినా స్థానికంగ ఉన్న హిందువులు పర్వదినాల్లో ఈ పంచ కేశవాలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఈ పంచ కేశవాలయాల ప్రస్తావన మనకు కొన్ని పురాణాల్లో కూడా కనిపిస్తుంది. ఆ క్షేత్రాల క్లుప్త సమాచారం మీ కోసం

తణుకు

తణుకు

P.C: You Tube

పురాణాల ప్రకారం తణుకు రాక్షసుల రాజైన తాకాసురిని రాజధాని. ఇక్కడ ఉన్న కేశవ ఆలయాన్ని ఆ తరకాసురుడే నిర్మించారని చెబుతారు. తరకాసురుడిని కుమారస్వామి సంహరించే ముందు ఇక్కడ కొలువై ఉన్న కేశవుడని పూజించినట్లు చెబుతారు.

కొఠాలపర్ర

కొఠాలపర్ర

P.C: You Tube

ఇక్కడ ఉన్న కేశవ మూర్తిని ప్రసన్న మహర్షి ప్రతిష్టించినట్లు చెబుతారు. కొన్ని రోజుల తర్వాత ఈ మూర్తి స్థానికంగా వచ్చిన వరదల్లో మునికి పోతుంది. అటు పై దాదాపు 250 ఏళ్లకు పాలకొల్లు ప్రాంతానికి సీతారామచార్యులు తహశిల్దారుగా వచ్చాడు. ఆయన భర్య లక్ష్మీనరసమ్మ కేశవ భక్తురాలు ఆమెకు కలలో ఈ కేశవుడు కనిపించి తను ఉన్న ప్రాంతాన్ని చెప్పాడు. ఆమె అక్కడ తవ్వించి స్వామి వారి విగ్రహాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మింపజేసిందని చెబుతారు.

ర్యాలి

ర్యాలి

P.C: You Tube

ర్యాలి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ప్రధాన ఆరాధ్య దైవం. ఇది హరిహర క్షేత్రం. అమ`తం పంచేసమయంలో మహావిష్ణువు అందమైన జగన్మోహిని రూపం ధరిస్తాడు. ఆమె అందానికి ముగ్దుడైన పరమశివుడు ఆ జగన్మోహిని చేయి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు.

ఒకే విగ్రహంలో

ఒకే విగ్రహంలో

P.C: You Tube

ఆ సమయంలో జగన్మోహిని కొప్పు నుంచి ఈ ర్యాలి ప్రాంతంలో ఒక పువ్వు జారి పడిపోతుంది. ఆ పువ్వు పడిన ప్రాంతంలోనే మహావిష్ణువు శ్రీ జగన్మోహిని కేశవుడిగా కొలువై ఉన్నాడు. ఇక్కడ విగ్రహంలో ముందుభాగంలో విష్ణువు నాలుగు చేతులతో ఉంటాడు. అదే విగ్రహం వెనుక భాగంలో జగన్మోహిని కొప్పుతో చూడటానికి పద్మినీ జాతి స్త్రీ వలే కనిపిస్తుంది.

వాకతిప్ప

వాకతిప్ప

P.C: You Tube

రామచంద్రాపురం, రావుల పాలెం గ్రామం మధ్యలో కేశవ మూర్తి ఆలయం ఉంది. పురాణ కాలంలో నారద మహర్షి ఇక్కడికి వచ్చి ప్రక`తి రమణీయతకు ముగ్దుడై ఇక్కడ కొంత కాలం పాటు ఉన్నట్లు చెబుతారు. ఆసమయంలో ఆయన కేశవుడి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X