Search
  • Follow NativePlanet
Share
» »మిని వారణాసిని చూశారా?

మిని వారణాసిని చూశారా?

మిని వారణాసిగా పేరుగాంచిన మహేశ్వర్ పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం.

By Gayatri Devupalli

మహేశ్వర్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదా నది ఒడ్డున ఉన్న ఒక పట్టణం. ఒకప్పుడు ఇది మరాఠా హోల్కర్ రాజవంశస్థుల పాలనలో అద్భుతమైన రాజధాని నగరంగా పేరు ప్రఖ్యాతలు గాంచింది.
మహేశ్వర్ అనే పేరు హిందువుల ఆరాధ్య దైవం అయిన పరమశివుని వలన పెట్టారు. రాణి అహిల్య దేవి హోల్కర్ పాలనలో ఈ పట్టణం బహుముఖాభివృద్ధి చెందింది. ఆమె నది తీరంలో అనేక దేవాలయాలు, భవనాలు మరియు ఘాట్లను నిర్మించారు.హోల్కర్ రాజవంశ పాలనలో ఇక్కడ ప్రారంభమయిన చేనేత పరిశ్రమ, ఇప్పటికీ అదే ప్రఖ్యాతిని కొనసాగిస్తూ వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ అనేక సినిమా, సీరియల్స్ ను కూడా చిత్రీకరించారు.

పురాణ ప్రాధాన్యత

పురాణ ప్రాధాన్యత

P.C: You Tube

మహేశ్వర్ పట్టణం యొక్క చరిత్ర పురాణ పట్టణమైన మాహిష్మతితో ముడిపడి ఉంది. ఒకసారి సహస్రార్జునుడనే రాజు తన 500 మంది భార్యలతో వనవిహారం కొరకు ఇక్కడకు వచ్చాడు. తన భార్యలు కేళివిలాసాల కొరకు కొంత స్థలాన్ని ఏర్పాటు చేయడానికి, నర్మదా నదిని తనకున్న వేల చేతులతో పట్టి ఉంచాడు. ఇంతలో, రావణ ఎండిపోయిన నది ఉన్న ప్రదేశాన్ని చూసి, అక్కడ తన ప్రార్ధనలను చేసుకోవటానికి వీలుగా ఒక లింగాన్ని ప్రతిష్టించాడు.

రావణుడు ఖైదు చేయబడిన ప్రాంతం

రావణుడు ఖైదు చేయబడిన ప్రాంతం

P.C: You Tube

అదే సమయంలో, రాజు యొక్క భార్యలు తమ విహారాన్ని ముగించుకుని వేణు దిరగడానికి సన్నద్ధం అయినందున, రాజు నర్మదా నదిని మరలా వదిలిపెట్టాడు. ఆ నీటి ప్రవాహంలో, రావణుడు ప్రార్థిస్తున్న విగ్రహం చెదిరిపోయింది. కోపోద్రిక్తుడైన రావణుడు ఆ రాజు ఎవరో కనుక్కుని అతనిపై దండయాత్ర చేసాడు అప్పుడు జరిగిన యుద్ధంలో గెలిచిన సహస్రార్జునుడు, రావణుని సుదీర్ఘకాలం పాటు ఖైదు చేసాడు.

అనేక పర్యాటక స్థలాలు

అనేక పర్యాటక స్థలాలు

P.C: You Tube

మహేశ్వర్ పట్టణం మధ్య ప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లాలో ఉంది. ఇది మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరానికి 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. నర్మదా నదీ తీరాన ఈ నగరం ఉంది. మహేశ్వర్ లోని సందర్శనీయ స్థలాలు: మహేశ్వర్ లో అనేక వారసత్వ ప్రదేశాలు మరియు ఆలయాలు ఉన్నాయి. వాటిలో అహిల్య ఫోర్ట్, నర్మదా నది తీరాన ఉన్న ఘాట్లు, మహేశ్వర్ ప్యాలెస్ (హెరిటేజ్ హోటల్) ఇక్కడ కొన్ని ప్రధాన పర్యాటక ప్రాంతాలు.

సహస్రార్జున ఆలయం

సహస్రార్జున ఆలయం

P.C: You Tube

మహేశ్వర్ పట్టణం, దేవాలయాలు మరియు ఘాట్లు కారణంగా చిన్నదైన కాశీ మహానగరం వలె ఉంటుంది. సహస్రార్జున ఆలయం, అహిల్య మాత యొక్క ఛత్రీ, గోబర్ గణేష్ ఆలయం, కాశీ విశ్వనాథ ఆలయం, ఏకముఖ దత్త ఆలయం మరియు వింధ్యవాసిని ఆలయం, మహేశ్వర్ లోని కొన్ని ముఖ్యమైన ఆలయాలు. ఇక్కడ చేనేత పరిశ్రమ 5 వ శతాబ్దం నుండి ఉనికిలో ఉందని అంటారు. అహిల్య దేవి మార్గదర్శకంలో ఏర్పడిన రేవా సొసైటీ ద్వారా ఇది ఒక పెద్ద పరిశ్రమగా అభివృద్ధి చెందింది. నేడు, మహేశ్వర్ దేశంలోని ప్రధాన చేనేత కేంద్రాలలో ఒకటి. ప్రత్యేకమైన నమూనాలో తయారయ్యే మహేశ్వరి కాటన్ చీరలు బహుళ ప్రసిద్ధి గాంచాయి.

చలనచిత్రాల షూటింగ్ ప్రదేశం:

చలనచిత్రాల షూటింగ్ ప్రదేశం:

P.C: You Tube

మహేశ్వర్ పట్టణం అందమైన ప్రదేశాలతో పురాతన కాలం నాటి ఆకర్షణను కలిగి ఉంటుంది. ఇక్కడ చాలా తమిళ సినిమాలు, హిందీ టీవీ ధారావాహికలు మరియు సినిమాల చిత్రీకరణ జరిగింది. తమిళ్ చలన చిత్రం 'ఆరంభం'లో ఒక పాట, హిందీ ధారావాహిక 'ఝాన్సీ కి రాణి' మరియు హిందీ చలన చిత్రం 'యమలా పగ్లా దీవానా' ఇక్కడే చిత్రీకరించబడ్డాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X