Search
  • Follow NativePlanet
Share
» »పాపాలను కడిగే పావని నర్మదా నది ఒడ్డున ఎన్ని పుణ్యక్షేత్రాలో

పాపాలను కడిగే పావని నర్మదా నది ఒడ్డున ఎన్ని పుణ్యక్షేత్రాలో

నర్మదానదీ తీరంలో ఉన్న అనేక పుణ్యక్షేత్రాలకు సంబంధించిన కథనం.

By Karthik Pavan

నాగరికతలన్నీ నదీప్రసాదాలు. జీవజలాలు సమృద్ధిగా ఉన్న ప్రతీ చోటా ఒక అవాసప్రాంతంగా అవతరించి.. ప్రాచీన సామ్రాజ్యాలకి వేదికగా నిలిచింది. మన దేశం కూడా అందుకు భిన్నం కాదు. భారతదేశంలో నదీ తీరాల్లో ఏర్పడిన చారిత్రక నగరాలు అద్భుతాలకు వేదికలయ్యాయి. తమ చుట్టూ అనిర్వచనీయమైన ఆవాసాలకు నెలవుగా నిలిచాయి.

గంగ, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ.. ఇలా ప్రతీ నది ఒడ్డున ఏర్పడిన పట్టణాలు.. రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా పరిపుష్టిని సాధించాయి. నర్మదా నది కూడా వాటిలో ఒకటి. మిగతా వాటిలాగే నర్మదా నదికి కూడా ఎంతో చారిత్రక ప్రశస్త్యం ఉంది. హిందూ పురాణాల ప్రకారం.. ఈ నది జలాలు ఎంతో మహిమాన్వితమైనవి.

మధ్య ప్రదేశ్‌లోని అమర్‌కంఠక్ పర్వతాల్లో పుట్టి మొదటి 320 కిలోమీటర్లు సాత్పూరా శ్రేణుల పైన ఉన్న మాండ్ల కొండలలో మెలికలు తిరుగుతూ ప్రవహింస్తుంది. అటు పై జబల్‌పూర్ వద్ద పాలరాళ్ల గుండా ప్రవహిస్తూ వింధ్య మరియు సాత్పూరా శ్రేణుల మధ్యనున్న నర్మదా లోయలోకి అడుగు పెడుతుంది.

అక్కడి గుజరాత్ లోని బారూచ్ జిల్లాలో అరేబియా సముద్రములో కలుస్తుంది. మొత్తం 1289 కిలోమీటర్లు ప్రయాణించే నర్మద నది ఒడ్డున ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలతో పాటు పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాల సమహార కథనం మీ కోసం

అమర్‌కంఠక్‌

అమర్‌కంఠక్‌

P.C: You Tube

నర్మదానది జన్మస్థానం అమర్‌కంఠక్‌. సముద్రమట్టానికి 1060మీటర్ల ఎత్తులో మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌ జిల్లాలో ఉందీ ప్రాంతం. అక్కడి నుంచి నర్మదా నది దిగువకి ప్రవహిస్తూ చుట్టుపక్కల ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తుంది. ప్రాచీన , ఆధ్యాత్మిక కట్టడాలకు అమర్‌కంఠక్‌ నెలవు. ప్రతీ ఏటా ఇక్కడుండే దేవాలయాలను దర్శించడానికి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

జబల్‌పూర్‌

జబల్‌పూర్‌

P.C: You Tube

మధ్యప్రదేశ్‌లో మరో ప్రముఖ పర్యాటక ప్రాంతం జబల్‌పూర్‌. ధౌన్‌ధార్‌ వాటర్‌ఫాల్స్‌, నర్మదానది చుట్టుపక్కల ఆహ్లాదకర ప్రాంతాలతో పాటు పాలరాతి కట్టడాలకు నెలవు. ఎన్నో దర్శనియ ప్రాచీన కట్టడాలు ఉన్న జబల్‌పూర్‌ను హిందువులు పవిత్రప్రాంతంగా భావిస్తారు. చుట్టుపక్కలున్న హనుమంతల్‌ బడా జైన్‌మందిర్, మదన్‌ మహల్‌, దుమ్నా ప్రకృతి ఉద్యానవనం, రాణి దుర్గావతి మ్యూజియం ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలు.

హోషంగాబాద్‌

హోషంగాబాద్‌

P.C: You Tube

దక్షిణ ముఖంగా నర్మదా నది ప్రవహిస్తూ కొండకోనలతో పచ్చని ప్రకృతితో అలరారుతున్న మరో ప్రాంతం హోషంగాబాద్‌. మానసిక ప్రశాంతత కోరుకునేవాళ్లకు, ప్రకృతితే మమేకమవ్వాలనుకునేవాళ్లకు ఇది చక్కటి ప్రాంతం. మాల్వా రాజ్యాన్ని పరిపాలించిన హోషంగ్‌ షా పేరుమీదే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. సెథనీ ఘాట్‌, హోషంగ్‌ షా కోట, ఆదామ్‌గఢ్‌ కొండల్లో రాతికట్టడాలపై పెయింటింగ్స్‌ మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఓంకారేశ్వర్‌

ఓంకారేశ్వర్‌

P.C: You Tube

మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలోని చిన్న పట్టణం ఓంకారేశ్వర్‌. నర్మదానది, కావేరి సంగమ ప్రాంతంలో ఉన్న ఓంకారేశ్వర్‌.. శైవ పుణ్యక్షేత్రాలైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ ఆ పరమశివుడు ఓంకార రూపంలో దర్శనమిచ్చాడని చెప్తారు. అందుకే దీనిని ఎంతో పవిత్రక్షేత్రంగా భావిస్తారు.

మహేశ్వర్

మహేశ్వర్

P.C: You Tube

మధ్యప్రదేశ్‌లో నర్మద నది ఒడ్డున ఉన్న మరో పట్టణం మహేశ్వర్‌. ఖర్గోనే జిల్లాలో ఉన్న ఈ ప్రాంతంలో కూడా పురాతన ఆలయాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. అలనాటి రాజుల ప్యాలెస్‌లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఒకవేళ మహేశ్వర్‌ వెళ్లాలనుకుంటే మాత్రం నర్మద నది ఒడ్డున ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం తప్పకుండా చూడాల్సిందే. ఎంతో మంది పర్యాటకులు ధ్యానం చేయడానికి ఇక్కడకు వస్తుంటారు.

బారూచ్‌

బారూచ్‌

P.C: You Tube

గుజరాత్‌ రాష్ట్రంలో నర్మద నది ఒడ్డున ఉన్న మరో పట్టణం బారూచ్‌. వేల ఏళ్ల నాడే ఈ పట్టణం ఉండేదని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అందుకే.. ఈ ప్రాంతం చుట్టుపక్కల లెక్కలేనన్ని పురాతన కట్టడాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ భృగు మహర్షి దేవాలయాన్ని తప్పక చూడాలి. మధ్యప్రదేశ్‌ గుండా గుజరాత్‌లోకి ప్రవహించే నర్మదా నది ఇదే బారూచ్‌ జిల్లాలో అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X