Search
  • Follow NativePlanet
Share
» »ఉత్తరభారత దేశ ‘గోకర్ణ’ను సందర్శిస్తే కైలాసాన్ని చూసినట్లే

ఉత్తరభారత దేశ ‘గోకర్ణ’ను సందర్శిస్తే కైలాసాన్ని చూసినట్లే

గోలగోకర్ణకు సంబంధించిన కథనం.

రావణుడు, ఆత్మలింగం, వినాయకుడు అన్న తక్షణం భారత పురాణాల పై కొంచెం పట్టు ఉన్నవారికి వెంటనే గుర్తుకు వచ్చేది కర్నాటకలోని గోకర్ణ. అక్కడ శివుడి ఆత్మలింగాన్ని భక్తులు ఇప్పటికీ సందర్శించుకొంటూ ఉంటారు.

అయితే ఇటువంటి గోకర్ణ ఉత్తర భారత దేశంలో కూడా ఉంది. దీనిని చోటీ కాశీ అని కూడా పిలుస్తారు. ఒకసారి ఈ చోటీ కాశీగా పిలిచే ఉత్తర ప్రదేశ్ గోకర్ణను సందర్శిస్తే కైలాసాన్ని సందర్శించినంత పుణ్యం వస్తుందని అక్కడి వారి నమ్మకం. అసలు కర్నాటకలోని గోకర్ణకు ఉత్తర భారత దేశంలోని గోకర్ణకు ఉన్న సంబంధం ఏమిటి? అక్కడ చూడదగిన మరికొన్ని ప్రాంతాలకు సంబంధించిన వివరాలు మీ కోసం....

గోల గోకర్ణ

గోల గోకర్ణ

P.C: You Tube

ఉత్తరప్రదేశ్ లోని లఖింపూరీ ఖేరీకి దగ్గర్లో ఉన్న చిన్న పట్టణమే గోల గోకర్ణనాథ్ పట్టణం. ఇక్కడ ఉన్న శివాలయం ఉత్తర భారత దేశంలో ఎంతగానో ప్రాచూర్యం పొందింది. ఈ శివాలయాన్ని సందర్శించడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.

గోల గోకర్ణ

గోల గోకర్ణ

P.C: You Tube

ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథ దాదాపు కర్నాటక లోని గోకర్ణ క్షేత్రాన్ని పోలి ఉంటుంది. తల్లి కోరికను తీర్చడానికి రావణుడు శివుడి గురించి హిమాలయాల్లో ఘెర తపస్సు చేస్తాడు. రావణుడి తపస్సుకు మెచ్చిన శివుడు తన ఆత్మలింగాన్ని ఆయనకు ఇచ్చి లంకను చేరేంత వరకూ ఈ ఆత్మలింగాన్ని భూమికి తాకించవవద్దని చెబుతాడు.

గోల గోకర్ణ

గోల గోకర్ణ

P.C: You Tube

అయితే రావణుడు గోల గోకర్నాథ్ ను చేరేసరికి సంధ్యావందనం చేయాల్సి వస్తుంది. దీంతో అక్కడ పశువులు మేపుతున్న ఓ బాలుడికి కొన్ని బంగారు నాణ్యాలు ఇచ్చి ఆత్మలింగాన్ని ఆ బాలుడి నెత్తి పైన పెడుతాడు. తాను వచ్చేంత వరకూ ఈ ఆత్మలింగాన్ని భూమి పై పెట్టకూడదని చెబుతాడు.

గోల గోకర్ణ

గోల గోకర్ణ

P.C: You Tube

అయితే రావణుడు కొంత దూరం వెళ్లగానే బాలుడి వేశంలో ఉన్న గోపాల బాలుడు శివలింగాన్ని భూమి పై పెట్టేస్తాడు. దీంతో రావణుడు ఆ ఆత్మలింగాన్ని పెకిలించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తాడు. అయినా ఆ ఆత్మలింగం చేతికి రాదు. దీంతో కోపంతో ఆ శివలింగం పై గట్టిగా మోదుతాడు.

గోల గోకర్ణ

గోల గోకర్ణ

P.C: You Tube

దీంతో ఆ శివలింగం భూమిలోకి వెళ్లి పోతుంది. అంతే కాకుండా ఆ శివలింగం పై భాగంలో గోళాకారం ఏర్పడుతుంది. అందువల్లే ఈ ప్రాంతానికి గోల గోకర్న అనే పేరు వచ్చినట్లు చెబుతారు. చైత్ర మాసంలో ఆలయంలో చేతి మేళా పేరుతో ఒక నెల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో ఉత్తర భారత దేశంలో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు.

గోల గోకర్ణ

గోల గోకర్ణ

P.C: You Tube

ఈ గోల గోర్నాథ్ కు దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఒక అరుదైన దేవాలయం ఉంది. అదే కప్ప ఆకారంలో ఉన్న దేవాలయం. ఇక్కడ తాంత్రిక పూజలు నిర్వహించేవారని చెబుతారు. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 1860 -1870 మధ్యలో ఒయోల్ రాజు నిర్మించారని చెబుతారు.

గోల గోకర్ణ

గోల గోకర్ణ

P.C: You Tube

ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ ఆలయం అష్టదళ తామర ఆకారంలో నిర్మించారు. వారణాసి నుంచి తీసుకువచ్చిన శివలింగాన్ని ఈ దేవాలయంలో ప్రతిష్టించి పూజించారు. ఆలయ ప్రధాన ద్వారం తూర్పు ముఖంగా ఉంటుంది. మరో ద్వారం దక్షిణ దిశలో ఉంటుంది.

గోల గోకర్ణ

గోల గోకర్ణ

P.C: You Tube

ఇక దీనికి దగ్గరగా దేవాకాళి ఆలయం ఉంది. దేవకాళి బ్రహ్మదేవుని కుమార్తే. ఆమె ఇక్కడే తపస్సు చేసింది కాబట్టి ఈ ఆలయానికి దేవకాళి ఆలయమని పేరు. ఇక ఇక్కడే పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడు సర్పయాగం చేసినట్లు చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X