Search
  • Follow NativePlanet
Share
» »ఈ శివలింగం నెయ్యిని వెన్నగా మారుస్తుంది. దీనిని ఒంటికి రాసుకొంటే

ఈ శివలింగం నెయ్యిని వెన్నగా మారుస్తుంది. దీనిని ఒంటికి రాసుకొంటే

బెంగళూరుకు దగ్గరగా ఉన్న శివగంగ పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం.

మనం సాంకేతికంగా ఎంతో ఎత్తుకు వెళ్లి ఉండవచ్చు. అయితే కొన్నింటి విషయాల్లో ఆ సాంకేతికత మనకు అక్కరకు రాదు. ఇందుకు భారతదేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరుకు దగ్గరగా ఉన్న శివగంగా ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ పుణ్యక్షేత్రం అనేక రహస్యాలకు నిలయం. ఇక పర్వత శిఖరం పై ఉన్న ఈ దేవాలయంలోని ఆ రహస్యాల ఛేదనకు ఎన్నో వందల ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా కూడా విఫలమవుతున్నారు. ఇక ధార్మిక వేత్తలు మాత్రం ఇదంతా ఆ దేవుడి దయ అని చెబుతున్నారు. ఏది ఏమైనా సాంకేతికంగా మనం దూసుకుపోతూ ఇతర గ్రహాలను సైతం అందుకొంటున్న ఈ పరిస్థితుల్లో శతాబ్దాల నాటి ఆ రహస్యాన్ని ఛేదించక పోవడం మాత్రం విశేషంగానే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆ శివగంగా పుణ్యక్షేత్రంలోని రహస్యం ఏమిటన్న విషయానికి సంబంధించిన కథనం నేటివ్ పాఠకులైన మీ కోసం...

శివగంగా

శివగంగా

P.C: You Tube

బెంగళూరు నుంచి దాదాపు 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివగంగ హిందువుల పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. పర్వత శిఖరం శివలింగం ఆకారంలో ఉండటం. పర్వత శిఖరం పై నుంచి కిందికి జలపాతం పాడటం వల్ల ఈ పర్వత శిఖరాన్ని శివగంగ అనే పేరుతో పిలుస్తున్నారు.

శివగంగా

శివగంగా

P.C: You Tube

ఈ పర్వత శిఖరం ఎత్తు 804.8 మీటర్లు. అంటే 2640 అడుగులు. దీనిని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. ఈ పర్వత శిఖరం పై భాగంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అందులో గంగాధరేశ్వర దేవాలయం,హున్నమదేవి దేవాలయం, నంది విగ్రహం, పాతాళగంగా తదితర ఎన్నో దేవాలయాలు ఈ పర్వత శిఖరం పై భాగంలో మనం చూడవచ్చు.

శివగంగా

శివగంగా

P.C: You Tube

అదే విధంగా ఈ పర్వత శిఖరం పై భాగంలో ఉన్న శారదాంబ దేవాలయం చుట్టూ ఎన్నో పవిత్ర సరస్సులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ శారదాంబ దేవాలయం చుట్టూ ఉన్నా అగస్త్య తీర్థ, కన్వా తీర్థ, కపిల తీర్థ, పాతళగంగ తదితర సరస్సులోని నీటిని తల పై చల్లుకోవడం వల్ల పుణ్యం వస్తుందని నమ్ముతారు.

శివగంగా

శివగంగా

P.C: You Tube

ఇక్కడ ఉన్నటువంటి హున్నమ దేవి దేవాలయం ఒక గుహాలయం. అదే విధంగా గవి గంగాధరేశ్వర దేవాలయం కూడా ఒక గుహాలయం. ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి గంగాధరేశ్వర, హొన్నమదేవికి వివాహ మహోత్సవం జరిపిస్తారు.

శివగంగా

శివగంగా

P.C: You Tube

ఈ ఉత్సవాన్ని చూడటానికి కర్నాటక నుంచే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. చరిత్ర పరంగా చూస్తే ఈ శివగంగ ప్రాంతం హొయ్సళ రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ రాజ్య రాజైన విష్ణువర్థనుడి భార్య శాంతల ఈ పర్వత శిఖరం పై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకొందని చెబుతారు.

శివగంగా

శివగంగా

P.C: You Tube

అందువల్లే ఈ ప్రాంతాన్ని శాంతలా డ్రాప్ అని పిలుస్తారు. ఇక ఇక్కడ జరిగే ఒక విచిత్రాన్ని చూడటానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ పర్వత శిఖరం పై ఉన్న గంగాధరేశ్వర శివలింగానికి నెయ్యిని రాస్తే అది వెన్నగా మారిపోతుంది.

శివగంగా

శివగంగా

P.C: You Tube

ఇందుకు గల కారణాల పై ఎన్ని పరిశోధనలు జరిగినా సమస్య మాత్రం దొరకడం లేదు. ఇదిలా ఉండగా ఈ వెన్నను ఒంటికి పూసుకొంటే అనేక రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. ఇక వీకెండ్ సమయంలో బెంగళూరు వాసులు ఎక్కువ మంది ట్రెక్కింగ్ చేయడానికి ఇక్కడికి వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X