Search
  • Follow NativePlanet
Share
» »భూతల స్వర్గంలో లోబాల్ వ్యాలీ అందాలు చూద్దామా

భూతల స్వర్గంలో లోబాల్ వ్యాలీ అందాలు చూద్దామా

లోలాబ్ వ్యాలీ గురించి కథనం.

By Karthik Pavan

కనుచూపుమేర దట్టమైన మంచు కొండలు, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు, మొఘల్‌ రాజుల నిర్మించిన కట్టడాలు, ప్రాచీన దేవాలయాలు, మసీదులు, నులువెచ్చని సూర్యకిరణాలు తాకేవేళ అందాల దాల్‌ సరస్సు ఒడిలో బోట్‌ హౌస్‌ ప్రయాణం.. ఎత్తైన రోడ్డు మార్గాలు, మధురానుభూతులను పంచే రైలు ప్రయాణాలు. ఇలా చెప్పుకుంటూ పోతే మన కాశ్మీర్‌ గురించి ఎన్నో ఎన్నెన్నో..ఒక్కమాటలో భూలోక స్వర్గం కాశ్మీరం. అలాంటి కాశ్మీర్‌లో చూడటానికి లెక్కలేనన్ని పర్యాటక ప్రాంతాలు. ఇలాంటి ప్రాంతాల్లో ఒకటే లోలాబ్‌ వ్యాలీ. పచ్చని కొండ ప్రాంతాలతో ప్రకృతితో మమేకమవ్వడానికి ఇంతకంటే మంచి చోటు మరొకటి ఉండదు. పోట్నాయ్‌ వ్యాలీ, బ్రునాయ్‌ వ్యాలీ, కలారూస్‌ వ్యాలీలు కలిపి లోలాబ్‌ వ్యాలీగా వ్యవహరిస్తారు.

లోలాబ్‌ వ్యాలీని చూడటానికి సరైన సమయం

లోలాబ్‌ వ్యాలీని చూడటానికి సరైన సమయం

P.C: You Tube

ఏడాది పొడవునా లోలాబ్‌ వ్యాలీలో వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా అక్కడికి ట్రిప్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు. అయితే, చల్లని ప్రశాంత వాతావరణం ఉండటంతో ఎక్కువగా వేసవిలో వెళ్లడానికి పర్యాటకులు ఎక్కు ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యలో ఇక్కడ 10 నుంచి 30 డిగ్రీల మధ్యలో వాతావరణం ఉంటుంది. ఇక నవంబర్‌ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఉష్ణోగ్రత మైనస్‌ 8డిగ్రీల వరకూ చేరుకుంటుంది.

సరవి చెట్లు

సరవి చెట్లు

P.C: You Tube

కుప్వారా జిల్లాలో ఉన్న లోలాబ్‌ వ్యాలీలో ఎక్కడ చూసినా ఎత్తైన సరివిచెట్లు దర్శనమిస్తాయి. యాపిల్‌, వాల్నట్‌, చెర్రీలు విరివిగా దొరకడంతో లోలాబ్‌వ్యాలీని ఫ్రూట్‌బౌల్‌ ఆఫ్‌ జమ్మూకాశ్మీర్‌ అని కూడా పిలుస్తారు. కాశ్మీర్‌వ్యాలీ. నీలమ్‌వ్యాలీను విడదీస్తూ కొండలనుంచి జారిపడే లాహ్వాల్‌ నది ఆ ప్రాంతంలో మరో స్పెషల్‌ అట్రాక్షన్‌. స్ధానికులు ఈ ప్రాంతాన్ని "వాడి ఈ లోలాబ్‌" అని పిలుస్తారు. లోలాబ్‌వ్యాలీ హెడ్‌క్వార్టర్స్‌ సోగామ్‌.

అక్కడ ఏమేమి చెయ్యచ్చు?

అక్కడ ఏమేమి చెయ్యచ్చు?

P.C: You Tube

ప్రకృతికి దగ్గరగా ఉంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడంకంటే ఎవరికైనా కావాల్సింది ఏముంది? అలాంటి ప్రశాంతత లోలాబ్‌ వ్యాలీలో కావాల్సినంత దొరుకుతుంది. అయితే, ఒక టూరిస్ట్‌ స్పాట్‌గా చూడాలంటే మాత్రం లోలాబ్‌వ్యాలీలో లెక్కలేన్ని ఆకర్షణీయ ప్రాంతాలు ఉన్నాయి. జలపాతాల నుంచి కొండకోనల వరకూ.. పచ్చిక బయళ్ల నుంచి పంటపొలాల వరకూ ఎక్కడ చూసినా ప్రశాంత వాతావరణం ఉంటుంది. టెక్కింగ్ కూడా చేవచ్చు. లోలాబ్‌ను సందర్శించేవాళ్లు తప్పకుండా లాల్‌పూర్‌ అనే గ్రామానికి కిలోమీటర్‌ దూరంలో కశ్యప ముని తపస్సుచేసిన ప్రాంతాన్ని చూస్తారు చేస్తారు. అక్కడికి దగ్గర్లోనే లావ్‌నాగ్‌ అనే నీటికుండం ఉంది.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

P.C: You Tube

ఢిల్లీ నుంచి అటారీ వరకూ ఉన్న నేషనల్‌ హైవే 1లో కుప్వారా మార్గమధ్యంలో వస్తుంది. అయితే, శీతాకాలంలో మాత్రం మంచు ఎక్కువగా ఉంటే మాత్రం బోర్డర్‌రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ రోడ్డు మూసివేస్తుంది. విమానంలో లోలాబ్‌కు వెళ్లాలంటే దగ్గరి ఎయిర్‌పోర్ట్‌ శ్రీనగర్‌. అక్కడ్నుంచి కుప్వారా జిల్లాలోని లోలాబ్‌ వ్యాలీకి టాక్సీ లేదా బస్‌లో చేరుకోవచ్చు. శ్రీనగర్‌ నుంచి 70కిలోమీటర్ల ప్రయాణం. లోలాబ్‌వ్యాలీకి రైలులో వెళ్లాలన్నా శ్రీనగరే దగ్గరి స్టేషన్‌.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X