Search
  • Follow NativePlanet
Share
» »ఆ తడి బట్టలతో ఇక్కడ 32 ప్రదక్షణలతో మీ కడపున కాయ, స్వయంగా చెప్పిన నరసింహుడు

ఆ తడి బట్టలతో ఇక్కడ 32 ప్రదక్షణలతో మీ కడపున కాయ, స్వయంగా చెప్పిన నరసింహుడు

మట్టపల్లి నరసింహ స్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

ఈ పుణ్యక్షేత్రం నారసింహుడి క్షేత్రాల్లోకెల్లా విశిష్టమైనదని చెబుతారు. ఎందుకంటే ఆయన ఇక్కడ స్వయంభువుడు. అంతేకాకుండా తనకు తానుగా భక్తుల కోరికలను తీరుస్తానని చెప్పాడు. అందువల్లే ఈ క్షేత్ర సందర్శనంలో భాగంగా అక్కడికి దగ్గర్లో ఉన్న కృష్ణానదీలో స్నానం చేసి స్వామివారిని సందర్శించుకొంటే ఫలితం ఉంటుందని చెబుతారు.

ముఖ్యంగా సంతానం లేనివారు తడి బట్టలతో స్వామివారిని సందర్శించి అక్కడ ఉన్న ఓ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే వెంటనే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతారు. అందువల్లే సంతాన లేమితో బాధపడే స్థానిక ప్రజలే కాకుండా దక్షిణాధి రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు.

ఈ క్షేత్రంలో యమధర్మరాజు స్వయంగా స్వామివారిని సేవించినట్లు పురాణ కథనం. అందువల్లే ఈ క్షేత్రానికి యమ సమ్మెహిత క్షేత్రమని పేరు. ఈ నేపథ్యంలో ఈ క్షేత్రం యొక్క మరికొన్ని ముఖ్యమైన వివరాలు మీ కోసం....

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

కృష్ణానదీ తీరంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో కూడా ఐదు ప్రముఖ నరసంహ క్షేత్రాలు ఉన్నాయి. వీటిని పంచ నారసింహ క్షేత్రాలు అని అంటారు. వీటిలో చాలా చాలా వరకూ పురాణ ప్రాధన్యం కలిగినవి.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

అవి వరుసగా మట్టపల్లి, వాడపల్లి, మంగళగిరి, వేదాద్రి, కేతవరం. వీటిలో వాడపల్లి, మట్టపల్లి క్షేత్రాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నయి. మిగిలిన మూడు ఆంధ్రప్రదేశ్ భూ భాగంలో ఉన్నాయి.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

ఇందులో మట్టపల్లి పుణ్యక్షేత్రం చలా విశిష్టమైనది. నల్గొండ జిల్లా, హుజూర్ నగర్ తాలూకాలో వెలసిన క్షేత్రమే మట్టపల్లి నారసింహ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఆలయ నిర్మాణం దాదాపు వెయ్యి ఐదు వందల ఏళ్లకు పూర్వం జరిగింది.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

ఇక్కడ నరసింహుుడ స్వయంభువుడు. సప్త బుుషుల్లో ఒకరైన భరద్వాజ మహర్షి ఇక్కడ గుహలో ఉన్న స్వామిని చాలా కాలం పూజించారు. భదర్వాజుడితో పాటు ఎంతో మంది బుుషులు కూడా ఈ స్వామివారిని సేవించారు.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

ఇప్పటికీ రాత్రి సమయంలో భరద్వాజ మహర్షితో పాటు చాలా మంది బుుషి పుంగవులు ఈ స్వామిని సేవించటానికి వస్తారని నమ్ముతారు. అందుకు నిదర్శనంగా ఈ క్షేత్రంలో రాత్రి సమయంలో సుగంధ పరిమళాల వాసన వస్తుందని చెబుతారు.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

పదకొండు వందల ఏళ్లకు పూర్వం ఈ క్షేత్రానికి దగ్గరగా ఉన్న తంగెడ గ్రామంలో మాచిరెడ్డి అనే ఓ రైతు ఉండేవాడు. ఒక రోజు రాత్రి అతనికి శ్రీ నారసింహుడు దర్శనమిచ్చాడు. తాను ఇక్కడికి దగ్గర్లోని అరణ్యంలో తాను స్వయంభువుగా వెలిశానని చెప్పాడు.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

తాను అరణ్యప్రాంతంలో తాను ఉండటం వల్ల ఇప్పటి వరకూ భరద్వాజ మహర్షి, కొంతమంది బుుషుల మాత్రమే మాత్రమే తనను సేవించాడని చెప్పాడు.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

అయితే ఇక పై తాను సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండి వారి కోరికలను నెరవేర్చాలనుకొంటున్నాని చెప్పాడు. అందువల్ల తనకు అక్కడే ఒక దేవాలయం నిర్మించాలని ఆదేశించాడు.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

మరుసటి రోజు ఈ విషయాన్ని మాచిరెడ్డి ఊరిపెద్దలకు తెలియజేసి వారి సహకారంతో ఓ గుహలో స్వామివారి విగ్రహాన్ని కనుగొన్నాడు. అప్పుడు నరసింహుడు శంఖ, చక్రాలు, గద, అభయముద్రలతో ఉన్నాడు.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

అంతేకాకుండా చతుర్భుజుడై, శేషుడు గొడు పట్టగా దక్షిణావర్త శంఖముతో తులసీదళమాలతో, భక్త ప్రహ్లాదునితో మాచిరెడ్డితో పాటు ఆయనకు తోడుగా వచ్చిన వారికి దర్శనమిచ్చాడు.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

దీంతో ఆనందభరితుడైన మాచిరెడ్డి స్వామివారికి ఆలయం నిర్మింపజేసి నిత్య ధూప, దీపారాదన కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. అప్పటి నుంచి ఈ క్షేత్రం అభివ`ద్ధి చెందుతూ వస్తోంది.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

ఇదిలా ఉండగా మట్టపల్లిలోని ఆలయానికి ఆనుకొనే కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మట్టపల్లి క్షేత్రానికి వచ్చిన భక్తులు ఈ కృష్ణానదిలో స్నానం చేసి, స్వామి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ఆరెచెట్టు, ధ్వజ స్తంభం, ఆంజనేయస్వామి చుట్టూ 32 ప్రదక్షిణలు చేస్తారు.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

అటు పై తమ కోరికలను స్వామివారికి నివేదిస్తారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ విధమైన ప్రదక్షిణలు చేయాలని నరసింహుడే స్వయంగా మాచిరెడ్డికి చెప్పినట్లు స్థలపురాణ కథనం.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

ముఖ్యంగా అనారోగ్య బాధలు, దుష్ట గ్రహ బాధలు, బుుణ బాధలు ఉన్నవారు వరుసగా 11 రోజుల పాటు మూడు పూటలా కృష్ణా నదిలో స్నానం చేసి ఆ తడి బట్టలతో 32 ప్రదక్షిణలు చేస్తుంటారు.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

ఇలా చేయడం వల్ల స్థానికంగా ఎంతో మందికి ప్రయోజనం చేకూరిందని ఇక్కడికి తరుచుగా వచ్చే భక్తులు చెబుతుంటారు. అందువల్లే ఇప్పుడిప్పుడే ఈ మట్లపల్లి క్షేత్రానికి సంతాన లేమితో బాధపడే వారు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

ఈ క్షేత్రం మహిమలు తెలిసి యమధర్మరాజు స్వయంగా వచ్చి ఇక్కడ ప్రదక్షణలు చేసి సాంత్వన పొందినట్లు చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రానికి యమ మోహిత క్షేత్రమని కూడా పేరు.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

ఆలయంలోని స్వామివారికి ఎదురుగా ఉన్న ఆంజనేయ విగ్రహం కూడా ఈ కృష్ణా నదీ జలాలలోనే దొరికింది. దీనిని ప్రసన్న ఆంజనేయస్వామిగా అర్చిస్తారు. స్వామివారితో ఈయన చుట్టూ కూడా భక్తులు ప్రదక్షిణలు చేస్తారు.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

గర్భగుడిలో స్వామివారికి ఎడమ పక్కన ఒక గుహద్వారం ఉంది. అక్కడి నుంచి సప్త బుుషులు, ఇతర మునులు కృష్ణా నదిలో స్నానం చేసి స్వామివారికి దర్శనానికి వస్తారని చెబుతారు. స్వామివారిక కుడివైపు ద్వారం భక్తుల సౌకర్యార్థం ఇటీవల కట్టించారు.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

సాధారణంగా విష్ణుమూర్తితో పాటు నారసింహుడికి తులసీ దళములు ప్రీతి పాత్రమైనవి. అయితే ఇక్కడ నారసింహుడికి మాత్రం అరె పత్రిని అర్చన కోసం వినియోగిస్తారు. ఇక్కడ రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మిలను కూడా సందర్శించవచ్చు.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి....మట్టపల్లి

P.C: You Tube

ఇక్కడ కుల ప్రాతిపాదికన సత్రాలు ఉన్నాయి. ఉచిత భోజన సదుపాయం కూడా ఉంది. ఈ క్షేత్రంలో అన్నదానం చేయడం వల్ల స్వామివారు ఎక్కువ సంతోషిస్తారని చెబుతారు. అందువల్లే భక్తులు ఎక్కువగా ఇక్కడ అన్నదానం చేస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X